Ezekiel - యెహెఙ్కేలు 30 | View All

1. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

1. The LORD said:

2. నరపుత్రుడా, సమాచార మెత్తి ప్రవచింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చు నదేమనగా ఆహా శ్రమదినము వచ్చెనే, అంగలార్చుడి, శ్రమ దినము వచ్చెనే,

2. Ezekiel, son of man, tell the people of Egypt that I am saying: Cry out in despair,

3. యెహోవా దినము వచ్చెను, అది దుర్దినము, అన్యజనులు శిక్షనొందు దినము.

3. because you will soon be punished! That will be a time of darkness and doom for all nations.

4. ఖడ్గము ఐగుప్తు దేశముమీద పడును, ఐగుప్తీయులలో హతులు కూలగా కూషుదేశస్థులు వ్యాకులపడుదురు, శత్రువులు ఐగుప్తీయుల ఆస్తిని పట్టుకొని దేశపు పునాదులను పడగొట్టు దురు.

4. Your own nation of Egypt will be attacked, and Ethiopia will suffer. You will be killed in battle, and your land will be robbed and left in ruins.

5. కూషీయులును పూతీయులును లూదీయులును కూబీయులును నిబంధన దేశపువారును మిశ్రిత జనులంద రును ఖడ్గముచేత కూలుదురు.

5. Soldiers hired from Ethiopia, Libya, Lydia, Arabia, Kub, as well as from Israel, will die in that battle.

6. యెహోవా సెలవిచ్చునదేమనగా ఐగుప్తును ఉద్ధరించు వారు కూలుదురు, దాని బలగర్వము అణగిపోవును, మిగ్దోలు మొదలుకొని సెవేనేవరకు జనులు ఖడ్గముచేత కూలుదురు.

6. All of your allies will be killed, and your proud strength will crumble. People will die from Migdol in the north to Aswan in the south. I, the LORD, have spoken.

7. పాడైపోయిన దేశముల మధ్య ఐగుప్తీయులు దిక్కులేనివారుగా నుందురు, నలుదిక్కుల పాడైపోయిన పట్టణములమధ్య వారి పట్టణము లుండును.

7. Your nation of Egypt will be the most deserted place on earth, and its cities will lie in complete ruin.

8. ఐగుప్తుదేశములో అగ్ని రగులబెట్టి నేను దానికి సహాయకులు లేకుండ చేయగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

8. I will set fire to your land, and anyone who defended your nation will die. Then you will know that I am the LORD.

9. ఆ దినమందు దూతలు నా యెదుట నుండి బయలుదేరి ఓడలెక్కి నిర్విచారులైన కూషీయులను భయపెట్టుదురు, ఐగుప్తునకు విమర్శకలిగిన దినమున జరిగి నట్టు వారికి భయభ్రాంతులు పుట్టును, అదిగో అది వచ్చే యున్నది.

9. On the same day I destroy Egypt, I will send messengers to the Ethiopians to announce their coming destruction. They think they are safe, but they will be terrified.

10. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఐగుప్తీయులు చేయు అల్లరి బబులోను రాజైన నెబుకద్రెజరుచేత నేను మాన్పించెదను.

10. Your Egyptian army is very strong, but I will send King Nebuchadnezzar of Babylonia to completely defeat that army.

11. జనములలో భయంకరులగు తన జనులను తోడుకొని ఆ దేశమును లయపరుచుటకు అతడు వచ్చును, ఐగుప్తీయులను చంపుటకై వారు తమ ఖడ్గములను ఒరదీసి హతమైన వారితో దేశమును నింపెదరు.

11. He and his cruel troops will invade and destroy your land and leave your dead bodies piled everywhere.

12. నైలునదిని ఎండిపోజేసి నేనా దేశమును దుర్జనులకు అమ్మి వేసెదను, పరదేశులచేత నేను ఆ దేశమును దానిలోనున్న సమస్తమును పాడుచేయించెదను, యెహోవానైన నేను మాట యిచ్చియున్నాను

12. I will dry up the Nile River, then sell the land to evil buyers. I will send foreigners to turn your entire nation into a barren desert. I, the LORD, have spoken.

13. యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు విగ్రహములను నిర్మూలముచేసి, నొపులో ఒక బొమ్మలేకుండ చేసెదను, ఇక ఐగుప్తుదేశములో అధిపతిగా ఉండుట కెవడును లేకపోవును, ఐగుప్తుదేశములో భయము పుట్టించెదను.

13. All the idols and images you Egyptians worship in the city of Memphis will be smashed. No one will be left to rule your nation, and terror will fill the land.

14. పత్రోసును పాడుచేసెదను. సోయనులో అగ్నియుంచెదను, నోలో తీర్పులు చేసెదను.

14. The city of Pathros will be left in ruins, and Zoan will be burned to the ground. Thebes, your capital city, will also be destroyed!

15. ఐగుప్తునకు కోటగా నున్న సీనుమీద నా క్రోధము కుమ్మరించెదను, నోలోని జనసమూహమును నిర్మూలము చేసెదను

15. The fortress city of Pelusium will feel my fierce anger, and all the troops stationed at Thebes will be slaughtered.

16. ఐగుప్తుదేశములో నేను అగ్నియుంచగా సీనునకు మెండుగ నొప్పిపట్టును, నోపురము పడగొట్టబడును, పగటివేళ శత్రువులు వచ్చి నొపుమీద పడుదురు.

16. I will set fire to your nation of Egypt! The city of Pelusium will be in anguish. Thebes will fall, and the people of Memphis will live in constant fear.

17. ఓనువారిలోను పిబేసెతు వారిలోను ¸యౌవనులు ఖడ్గము చేత కూలుదురు. ఆ పట్టణస్థులు చెరలోనికి పోవుదురు.

17. The young soldiers in the cities of Heliopolis and Bubastis will die in battle, and the rest of the people will be taken prisoner.

18. ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తహపనేసులో విరుచు దినమున చీకటికమ్మును, ఐగుప్తీయుల బలగర్వము అణచబడును, మబ్బు ఐగుప్తును కమ్మును, దాని కుమార్తెలు చెర లోనికి పోవుదురు.

18. You were so proud of your nation's power, but when I crush that power and kill that pride, darkness will fall over the city of Tahpanhes. A dark, gloomy cloud will cover the land as you are being led away into captivity.

19. నేను ఐగుప్తీయులకు శిక్ష విధింపగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

19. When I'm through punishing Egypt, you will know that I am the LORD.

20. పదకొండవ సంవత్సరము మొదటి నెల యేడవ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

20. Eleven years after King Jehoiachin and the rest of us had been led away as prisoners to Babylonia, the LORD spoke to me on the seventh day of the first month. He said:

21. నరపుత్రుడా, నేను ఐగుప్తురాజైన ఫరో బాహువును విరిచితిని, అది బాగవుటకు ఎవరును దానికి కట్టుకట్టరు, అది కుదర్చబడి ఖడ్గము పట్టుకొనులాగున ఎవరును దానికి బద్దకట్టరు; కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా

21. Ezekiel, son of man, I, the LORD, have defeated the king of Egypt! I broke his arm, and no one has wrapped it or put it in a sling, so that it could heal and get strong enough to hold a sword.

22. నేను ఐగుప్తురాజైన ఫరోకు విరోధినైయున్నాను, బాగుగా ఉన్న దానిని విరిగిపోయిన దానిని అతని రెండు చేతులను విరిచి, అతని చేతిలోనుండి ఖడ్గము జారిపడజేసెదను.

22. So tell him that I am now his worst enemy. I will break both his arms--the good one and the broken one! His sword will drop from his hand forever,

23. ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును, ఆ యా దేశములకు వారిని వెళ్లగొట్టుదును.

23. and I will scatter the Egyptians all over the world.

24. మరియబబులోను రాజుయొక్క చేతులను బలపరచి నా ఖడ్గము అతని చేతికిచ్చెదను, ఫరోయొక్క చేతులను నేను విరిచినందున బబులోనురాజు చూచుచుండగా ఫరో చావు దెబ్బతినిన వాడై మూల్గులిడును.

24. I will strengthen the power of Babylonia's king and give him my sword to use against Egypt. I will also make the wounded king of Egypt powerless, and he will moan in pain and die in front of the Babylonian king. Then everyone on earth will know that I am the LORD.

25. బబులోను రాజుయొక్క చేతులను బలపరచి ఫరో చేతులను ఎత్తకుండచేసి, ఐగుప్తుదేశముమీద చాపుటకై నేను నా ఖడ్గమును బబులోనురాజు చేతికియ్యగా నేను యెహోవానైయున్నానని ఐగుప్తీయులు తెలిసికొందురు.

25. (SEE 30:24)

26. నేనే యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు నేను ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టి ఆ యా దేశములకు వారిని వెళ్లగొట్టుదును.

26. I will force the Egyptians to live as prisoners in foreign nations, and they will know that I, the LORD, have punished them.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezekiel - యెహెఙ్కేలు 30 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఈజిప్టుకు వ్యతిరేకంగా ఒక జోస్యం. (1-19) 
ఈజిప్టు పతనానికి సంబంధించిన జోస్యం అనూహ్యంగా వివరించబడింది. దేవుని విరోధులతో తమను తాము పొత్తుపెట్టుకునే వారు వారి శిక్షలో పాలుపంచుకుంటారు. బాబిలోన్ రాజు మరియు అతని సైన్యం ఈ నాశనానికి ఏజెంట్లుగా పనిచేస్తారు. ఒక చెడ్డ వ్యక్తిని మరొకరిని శిక్షించే సాధనంగా దేవుడు ఉపయోగించుకోవడం అసాధారణం కాదు. కల్దీయుల ఉగ్రత నుండి ఈజిప్టులో ఏ మూలలోనూ ఆశ్రయం ఉండదు. అతను నిర్వహించే తీర్పుల ద్వారా ప్రభువు పాత్ర బహిర్గతమవుతుంది. ఏది ఏమైనప్పటికీ, ఇవి దైవిక అసంతృప్తి యొక్క తక్షణ పరిణామాలు మాత్రమే, మరియు యేసు తన అనుచరులను రక్షించే భవిష్యత్తు కోపంతో పోల్చితే అవి లేతగా ఉంటాయి.

మరొకటి. (20-26)
ఈజిప్టు బలం క్రమంగా తగ్గిపోతుంది. తేలికపాటి తీర్పులు వినయపూర్వకంగా విఫలమైతే మరియు పాపులను సంస్కరణ వైపు నడిపిస్తే, దేవుడు మరింత కఠినమైన వారిని పంపుతాడు. ఇతరులకు హాని కలిగించాలన్నా, వారిని మోసగించాలన్నా దుర్వినియోగం చేసిన శక్తిని బలహీనపరచడం దేవుడు చేసిన న్యాయమైన చర్య. మరోవైపు బబులోను శక్తి పెరుగుతుంది. ప్రభువు విచ్ఛిన్నం చేయాలనుకున్నవాటిని సరిదిద్దడానికి ప్రయత్నించడం మరియు అతను పడగొట్టాలని అనుకున్నవారిని బలోపేతం చేయడం మానవులకు వ్యర్థం. దేవుని సత్యం మరియు దయ యొక్క వెల్లడిని విస్మరించే వారు వారి పాపాల ఫలితాలలో అతని శక్తిని మరియు న్యాయాన్ని అనుభవిస్తారు.



Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |