Ezekiel - యెహెఙ్కేలు 17 | View All

1. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

1. The Word of the Lord came to me saying,

2. నరపుత్రుడా, నీవు ఉపమానరీతిగా విప్పుడు కథ యొకటి ఇశ్రాయేలీయులకు వేయుము. ఎట్లనగా ప్రభువగు యెహోవా సెల విచ్చునదేమనగా

2. 'Son of man, give the people of Israel this picture-story to think about.

3. నానావిధములగు విచిత్ర వర్ణములు గల రెక్కలును ఈకెలును పొడుగైన పెద్ద రెక్కలునుగల యొక గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతమునకు వచ్చి యొక దేవదారు వృక్షపు పైకొమ్మను పట్టుకొనెను.

3. Tell them, 'The Lord God says, 'A large eagle with big wings and long feathers of many colors came to Lebanon and took away the top of the cedar tree.

4. అది దాని లేతకొమ్మల చిగుళ్లను త్రుంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న యొక పురమందు దానిని నాటెను.

4. He broke off the very top of its young branches and brought it to a land of traders. He placed it in a city of people who buy and sell.

5. మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసికొనిపోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారము పారు నీరు కలిగి బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దాని నాటెను.

5. Then he took some of the seed of the land and planted it in good ground for growing. He planted it like a willow tree where there was much water to make it grow.

6. అది చిగిర్చిపైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షావల్లి ఆయెను; దాని కొమ్మలు ఆ పక్షిరాజువైపున అల్లుకొనుచుండెను, దాని వేళ్లు క్రిందికి తన్నుచుండెను; ఆలాగున ఆ ద్రాక్షచెట్టు శాఖోపశాఖలుగా వర్థిల్లి రెమ్మలువేసెను.

6. And it grew and became a low spreading vine. Its branches grew toward him, but its roots stayed under it. So it became a vine, and branches and leaves grew out from it.

7. పెద్ద రెక్కలును విస్తారమైన యీకెలునుగల యింకొక గొప్ప పక్షి రాజు కలడు. ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి, బహుగా ఫలించు మంచి ద్రాక్షావల్లి యగునట్లుగా అది విస్తార జలముగల మంచి భూమిలో నాటబడియుండినను ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలెనని తన పాదులకాలువ లోనుండి అది యా పక్షితట్టు తన వేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచెను.

7. 'But there was another large eagle with big wings and many feathers. And the vine turned its roots and branches toward him from where it was planted, that he might water it.

8. కావున నీవీలాగు ప్రకటింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా అట్టి ద్రాక్షావల్లి వృద్ధినొందునా?

8. It had been planted in good ground beside much water, that it might grow branches and give fruit and become a beautiful vine.' '

9. అది యెండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసివేతురు, దాని చిగుళ్లు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేళ్లు ఇక చిగిరింపవు.

9. Tell them, 'The Lord God says, 'Will it live and grow? Will not its roots be pulled up and its fruit be cut off so that its leaves that started to grow dry up? It will not take a strong arm or many people to pull it up by the roots.

10. అది నాటబడినను వృద్ధి పొందునా? తూర్పుగాలి దానిమీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును, అది నాటబడిన పాదిలోనే యెండి పోవును.

10. Even if it is planted again, will it live and grow? Will it not dry up when the east wind hits it? Will it not dry up in the place where it grew?' ' '

11. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

11. Then the Word of the Lord came to me saying,

12. తిరుగుబాటుచేయు వీరితో ఇట్లనుము ఈ మాటల భావము మీకు తెలియదా? యిదిగో బబులోనురాజు యెరూషలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని, తనయొద్ద నుండుటకై బబులోనుపురమునకు వారిని తీసికొనిపోయెను.

12. 'Now tell these sinful people, 'Do you not know what these things mean?' Tell them, 'See, the king of Babylon came to Jerusalem. He took its king and the king's sons, and brought them back with him to Babylon.

13. మరియు అతడు రాజసంతతిలో ఒకని నేర్పరచి, ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయలేక యుండు నట్లును, తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనుట వలన అది నిలిచియుండునట్లును,

13. He took one of the king's family and made an agreement with him. And he made him promise to keep it. He also took away the strong leaders of the land,

14. అతనితో నిబంధనచేసి అతనిచేత ప్రమాణముచేయించి, దేశములోని పరాక్రమ వంతులను తీసికొనిపోయెను.

14. so that the nation would be under his power and not become strong again. It could only last by keeping his agreement.

15. అయితే అతడు తనకు గుఱ్ఱములను గొప్ప సైన్యము నిచ్చి సహాయముచేయవలెనని యడుగుటకై ఐగుప్తుదేశమునకు రాయబారులను పంపి బబులోనురాజు మీద తిరుగుబాటు చేసెను; అతడు వర్ధిల్లునా? అట్టి క్రియలను చేసిన వాడు తప్పించుకొనునా? నిబంధనను భంగము చేసెను గనుక తప్పించుకొనడు

15. But the king of Judah turned against him by sending his men to Egypt to get horses and a large army for him. Will it go well for him? Can he get away with that? Can he break the agreement and not be punished?

16. ఎవనికి తాను ప్రమాణముచేసి దాని నిర్లక్ష్యపెట్టెనో, యెవనితో తానుచేసిన నిబంధనను అతడు భంగముచేసెనో, యెవడు తన్ను రాజుగా నియమించెనో ఆ రాజునొద్దనే బబులోను పురములోనే అతడు మృతినొందునని నా జీవ ముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభు వైన యెహోవా వాక్కు.

16. As I live,' says the Lord God, 'he will die in the land of the king who put him on the throne, whose promise he hated, and whose agreement he broke. He will die in Babylon.

17. యుద్ధము జరుగగా అనేక జనులను నిర్మూలము చేయవలెనని కల్దీయులు దిబ్బలువేసి బురుజులు కట్టిన సమయమున, ఫరో యెంత బలము ఎంత సమూహము కలిగి బయలుదేరినను అతడు ఆ రాజునకు సహాయము ఎంతమాత్రము చేయజాలడు.

17. Pharaoh with his powerful army of many men will not help him in the war, when battle-walls are put up so that many people are killed.

18. తన ప్రమాణము నిర్లక్ష్యపెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేసెను, తన చెయ్యి యిచ్చియు ఇట్టి కార్యములను అతడు చేసెనే, అతడు ఎంతమాత్రమును తప్పించుకొనడు.

18. He hated the promise and broke the agreement. Because he had given his promise and then did all these things, he will not get away from being punished.' '

19. ఇందుకు ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు అతడు నిర్లక్ష్యపెట్టిన ప్రమాణము నేను చేయించినది గదా, అతడు రద్దుపరచిన నిబంధన నేను చేసినదే గదా, నా జీవముతోడు ఆ దోషశిక్ష అతని తలమీదనే మోపుదును,

19. So the Lord God says, 'As I live, I will punish him for hating My promise and for breaking My agreement.

20. అతని పట్టుకొనుటకై నేను వలనొగ్గి యతని చిక్కించుకొని బబులోనుపురమునకు అతని తీసికొనిపోయి, నామీద అతడు చేసియున్న విశ్వాస ఘాతకమునుబట్టి అక్కడనే అతనితో వ్యాజ్యెమాడుదును.

20. I will spread My net over him and he will be caught in My trap. Then I will bring him to Babylon and punish him there for not being faithful to Me.

21. మరియయెహోవానగు నేనే ఈ మాట సెలవిచ్చితినని మీరు తెలిసికొనునట్లు అతని దండువారిలో తప్పించుకొని పారి పోయినవారందరును ఖడ్గముచేత కూలుదురు, శేషించిన వారు నలుదిక్కుల చెదరిపోవుదురు.

21. And all the best of his soldiers will be killed by the sword, and those left alive will be thrown to the wind. Then you will know that I, the Lord, have spoken.'

22. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఎత్తయిన దేవదారు వృక్షపు పైకొమ్మ యొకటి నేను తీసి దాని నాటుదును, పైగా నున్నదాని శాఖలలో లేతదాని త్రుంచి అత్యున్నత పర్వతముమీద దాని నాటుదును.
మత్తయి 13:32, మార్కు 4:32, లూకా 13:19

22. The Lord God says, 'I will also take a young branch from the very top of the cedar tree and plant it. I will break a soft new one from the very top of its young branches, and plant it on a high mountain.

23. ఇశ్రాయేలు దేశములోని యెత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్ఠమైన దేవదారు చెట్టగును, సకల జాతుల పక్షులును దానిలో గూళ్లు కట్టుకొనును.
మత్తయి 13:32, మార్కు 4:32

23. I will plant it on the high mountain of Israel. It will grow branches and give fruit and become a beautiful cedar. Birds of every kind will nest in it. They will nest in the shadow of its branches.

24. దాని కొమ్మల నీడను అవి దాగును; మరియు యెహో వానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవు నట్లును ఎండిన చెట్టు వికసించునట్లును చేయువాడననియు భూమియందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే దాని నెరవేర్చెదను.

24. Then all the trees of the field will know that I am the Lord. I bring down the high tree and make the low tree grow tall. I dry up the green tree, and make the dry tree become green. I, the Lord, have spoken, and I will do what I say.'



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezekiel - యెహెఙ్కేలు 17 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

యూదు దేశానికి సంబంధించిన ఉపమానం. (1-10) 
శక్తివంతమైన విజేతలను పక్షులు లేదా మాంసాహారులతో పోల్చవచ్చు, అయినప్పటికీ వారి విధ్వంసక ప్రేరణలు చివరికి దైవిక ప్రయోజనాల ద్వారా నిర్దేశించబడతాయి. దేవునితో ఉన్న సంబంధాన్ని విడిచిపెట్టేవారు కేవలం ఒక ప్రాపంచిక ఆధారపడటాన్ని మరొకదానికి మార్చుకుంటారు మరియు వారు ఎప్పటికీ నిజమైన విజయాన్ని పొందలేరు.

దీనికి వివరణ జోడించబడింది. (11-21) 
ఉపమానం విశదీకరించబడింది మరియు ఆ కాలంలో యూదు దేశ చరిత్రలోని నిర్దిష్ట సంఘటనలను గుర్తించవచ్చు. సిద్కియా తన శ్రేయోభిలాషి పట్ల కృతఘ్నతను ప్రదర్శించాడు, దేవునికి వ్యతిరేకంగా చేసిన అతిక్రమం. గంభీరమైన ప్రమాణం చేసినప్పుడల్లా, ప్రమాణం చేసిన వ్యక్తి యొక్క నిజాయితీకి సాక్షిగా దేవుడిని ఆరాధిస్తారు. నిజాయితీ అనేది ప్రతి ఒక్కరికీ బాధ్యత. నిజమైన విశ్వాసం యొక్క అనుచరులు భిన్నమైన విశ్వాసం ఉన్న వారి పట్ల ద్రోహానికి పాల్పడితే, వారి విశ్వాసం వారి తప్పును మరింత తీవ్రతరం చేస్తుంది మరియు దేవుడు దానిని మరింత కఠినంగా శిక్షిస్తాడు. తన పేరును దుర్వినియోగం చేసేవారిని ప్రభువు క్షమించడు మరియు పశ్చాత్తాపం చెందని అపరాధభావంతో మరణించే ఎవరైనా దేవుని న్యాయమైన తీర్పు నుండి తప్పించుకోలేరు.

మెస్సీయ యొక్క ప్రత్యక్ష వాగ్దానం. (22-24)
మానవ అవిశ్వాసం దేవుని వాగ్దానాన్ని రద్దు చేయదు. మునుపు బెదిరింపు సందర్భంలో ఉపయోగించిన చెట్టుకు సంబంధించిన ఉపమానం ఇప్పుడు వాగ్దానంగా అందించబడింది. ఈ వాగ్దానం ముఖ్యంగా దావీదు కుమారుడైన మరియు దేవుని ఎంపిక చేయబడిన మెస్సీయ అయిన యేసుకు వర్తిస్తుందని స్పష్టమవుతుంది. ఇంతకాలం చెప్పుకోదగ్గ అధికారాన్ని కలిగి ఉన్న సాతాను ఆధిపత్యం చెదిరిపోతుంది మరియు ఒకప్పుడు అపహాస్యం చేయబడిన క్రీస్తు రాజ్యం స్థిరంగా స్థిరపడుతుంది. మన విమోచకుడు భూమి యొక్క అత్యంత సుదూర ప్రాంతాలలో కూడా గుర్తించబడ్డాడు కాబట్టి మేము దేవునికి మా కృతజ్ఞతలు తెలియజేస్తాము. ఆయనలో, రాబోయే కోపం నుండి అభయారణ్యం, అలాగే అన్ని శత్రువులు మరియు ప్రమాదాల నుండి రక్షణను మనం కనుగొనవచ్చు మరియు విశ్వాసులు అతని సంరక్షణలో వృద్ధి చెందుతారు.



Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |