Ezekiel - యెహెఙ్కేలు 13 | View All

1. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2. నరపుత్రుడా, ప్రవచించుచున్న ఇశ్రాయేలీయుల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి, మనస్సు వచ్చినట్లు ప్రవచించువారితో నీవీలాగు చెప్పుము యెహోవా మాట ఆలకించుడి.

“మనసుకు తోచినట్లు”– యిర్మియా 14:14. అబద్ధ ప్రవక్తల గురించి ఇతర విషయాలు ఆదికాండము 20:7; ద్వితీయోపదేశకాండము 18:20-22; 1 రాజులు 18:19-29; యిర్మియా 23:32; మత్తయి 7:15-19; మత్తయి 24:11, మత్తయి 24:24 లో చూడండి.

3. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా దర్శనమేమియు కలుగకున్నను స్వబుద్ధి ననుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ.

4. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండు నక్కలతో సాటిగా ఉన్నారు.

వీరు నాశన కర్తలే గాని నిర్మించేవారు ఎంత మాత్రం కాదు. ఇతరులు విడిచి వెళ్లిపోయిన శిథిలాల్లో తమకు మంచి చోటు ఏదన్నా దొరుకుతుందేమోనని చూచేవారు. అయితే ఆ శిథిలాలను మళ్లీ కట్టేందుకు ఏమీ చేయలేకపోయారు.

5. యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలుచు నట్లు మీరు గోడలలోనున్న బీటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు.

6. వారు వ్యర్థమైన దర్శనములు చూచి, అబద్ధపు సోదె చూచి యెహోవా తమ్మును పంపక పోయినను, తాము చెప్పినమాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పుదురు.

తాను ప్రవక్తనని భావించే ప్రతివాడూ ప్రవక్త కాదు. ఇలా తాము ప్రవక్తలమని అనుకునేవారివల్లా లేక ఇతరుల దృష్టిలో ప్రవక్తలుగా ఎంచబడిన వారి వల్లా ప్రజలు పలుమార్లు కష్టాలకూ మోసానికి గురి అయ్యారు.

7. నేను సెలవియ్యకపోయినను ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పిన యెడల మీరు కనినది వ్యర్థమైన దర్శనముగదా? మీరు నమ్మదగని సోదెగాండ్రయితిరి గదా?

8. కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

అబద్ధాలు పలుకుతూ దేవునిమూలంగా పలుకు తున్నామని చెప్పేవారు దేవుడు తమకు విరోధి అని చివరికి తెలుసుకుంటారు. ఈ వచనాల్లో కనిపించే ఇలాంటివారు బబులోను ప్రవాసుల మధ్య ఉన్నారు. యిర్మియా 29:15, యిర్మియా 29:32 చూడండి.

9. వ్యర్థమైన దర్శనములు కనుచు, నమ్మదగని సోదెగాండ్రయిన ప్రవక్తలకు నేను పగవాడను, వారు నా జనుల సభలోనికి రారు, ఇశ్రాయేలీయుల సంఖ్యలో చేరినవారు కాక పోదురు, వారు ఇశ్రాయేలీయుల దేశములోనికి తిరిగి రారు, అప్పుడు నేను ప్రభువైన యెహోవానని మీరు తెలిసికొందురు.

10. సమాధానమేమియు లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చు చున్నారు; నా జనులు మంటిగోడను కట్టగా వారు వచ్చి దానిమీద గచ్చుపూత పూసెదరు.
1 థెస్సలొనీకయులకు 5:3, మత్తయి 7:27, అపో. కార్యములు 23:3

దొంగ ప్రవక్తలు కలిగించే హాని ఇదే. వారు ప్రజలను సత్యానికీ దేవునికీ దూరంగా వేరే దారుల్లోకి తొలగిస్తారు. తమ అపనమ్మకం, పాపాలకారణంగా దేవుని కోపాన్ని తమ తలమీదికి తెచ్చిపెట్టుకొన్న వారితో మీకు శాంతి ఉంటుందని చెప్పారు. రాబోయే విపత్తునుండి కాపాడుకునేందుకు దేవుణ్ణి నమ్మనివారు కట్టుకునే గోడకు వీరు సున్నం వేస్తారు. సున్నం వెయ్యడమంటే ఆ పని పూర్తయిపోయినట్టూ అందంగా కనిపించేట్టూ చెయ్యడమన్నమాట. ఈ విధంగా పాపాత్ముల హృదయ కాఠిన్యానికి దోహదం చేస్తూ చివరికి రాబోయే శిక్షను మరింత బాధకరంగా చేస్తారు ఈ కపట ప్రవక్తలు.

11. ఇందువలననే పూయుచున్న వారితో నీ విట్లనుము వర్షము ప్రవాహముగా కురియును, గొప్ప వడగండ్లు పడును, తుపాను దాని పడగొట్టగా అది పడిపోవును.

ప్రజలు తమకు భద్రతనూ క్షేమాన్నీ ఇచ్చేదని దేనిమీదైతే ఆశలు పెట్టుకున్నారో దాన్నంతటినీ నేలమట్టు చేసే దేవుని కోపానికి ఈ గాలివాన గుర్తుగా ఉంది (వ 13-16).

12. ఆ గోడ పడగా జనులు మిమ్మును చూచి మీరు పూసిన పూత యేమాయెనని అడుగుదురు గదా?

అబద్ధ ప్రవక్తలు ఎలాంటివారో చివరికి బట్టబయలౌతుంది.

13. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నేను రౌద్రము తెచ్చుకొని తుపానుచేత దానిని పడగొట్టుదును, నా కోపమునుబట్టి వర్షము ప్రవాహముగా కురియును, నా రౌద్రమునుబట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచును,

14. దాని పునాది కనబడునట్లు మీరు గచ్చుపూత పూసిన గోడను నేను నేలతో సమముగా కూల్చెదను, అది పడిపోగా దానిక్రింద మీరును నాశనమగుదురు, అప్పుడు నేను యెహోవానని మీరు తెలిసికొందురు.

15. ఈలాగున ఆ గోడమీదను దానిమీద గచ్చుపూత పూసినవారిమీదను నా కోపము నేను తీర్చుకొని, ఆ గోడకును దానికి పూత పూసినవారికిని పని తీరెనని మీతో చెప్పుదును.

16. యెరూషలేమునకు సమాధానము లేకపోయినను ఆ పూత పూయువారు సమాధానార్థమైన దర్శనములు కనుచు ప్రవచించువారు ఇశ్రాయేలీయుల ప్రవక్తలే; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

17. మరియు నరపుత్రుడా, మనస్సునకు వచ్చినట్టు ప్రవచించు నీ జనుల కుమార్తెలమీద కఠినదృష్టియుంచి వారికి విరోధముగా ఈలాగు ప్రవచింపుము

దేవునిమూలంగా నిజంగా పలికే స్త్రీ ప్రవక్త్రిలు ఇస్రాయేల్‌లో ఉన్నారు – మిర్యాం (నిర్గమకాండము 15:20); దెబోరా (న్యాయాధిపతులు 4:4); హుల్దా (2 రాజులు 22:14). వీరు గాక సోదె, మంత్రవిద్యలు అభ్యసించే అబద్ధ ప్రవక్త్రిలు కూడా ఉన్నారు. ఇలాంటి మంత్ర తంత్రాలు, సోదెలు, క్షుద్ర దేవతోపాసనలను బైబిలు ఖండిస్తుంది (నిర్గమకాండము 22:18; ద్వితీయోపదేశకాండము 18:10; అపో. కార్యములు 8:11; ప్రకటన గ్రంథం 9:21; ప్రకటన గ్రంథం 21:8; ప్రకటన గ్రంథం 22:15). వీటిని అభ్యసించేవారికి దేవుడు విరోధి. వీటిని అభ్యసించేవారు వ్యక్తిగత ప్రయోజనాలనే ఆశిస్తారు. చివరికి అవి ఆత్మ సంబంధమైన దాస్యానికి దారితీస్తాయి. అలాంటి అబద్ధాలమీద ఆధారపడి, వాటిమీద ఆశపెట్టుకునేవారికి దేవుని సత్యం తెలియదు. లేక తెలిసినా దాన్ని నిరాకరిస్తారు. ఇలాంటివాటిని వదలకుండా వాటిలో సాగిపోయేవారిని చివరికి అవి నాశనం చేస్తాయి.

18. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మనుష్యులను వేటాడ వలెనని చేతుల కీళ్లన్నిటికిని గుడ్డలుకుట్టి, యెవరి యెత్తు చొప్పున వారి తలలకు ముసుకులుచేయు స్త్రీలారా, మీకు శ్రమ; మీరు నా జనులను వేటాడి మిమ్మును రక్షించుకొందురు.

19. అబద్ధపు మాటల నంగీకరించు నా జనులతో అబద్ధఫు మాటలు చెప్పుచు, చేరెడు యవలకును రొట్టెముక్కలకును ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు, బ్రదుకుటకు అపాత్రులైన వారిని బ్రదికించుచు నా జనులలో మీరు నన్ను దూషించెదరు.

వారు చేసినదంతా లాభాన్ని ఆశించే. యిర్మియా 6:13; యిర్మియా 8:10; మీకా 3:5, మీకా 3:11 పోల్చి చూడండి. డబ్బుకోసం సత్యాన్ని ఒక ప్రక్కకు నెట్టి ప్రజలకు ఏది వినసొంపుగా ఉంటుందో దాన్ని పలికేవారు ఎప్పుడూ ఉంటారు (తీతుకు 1:11). తమ మాటల మూలంగా మోసపోయినవారు ఇహలోకంలోను, శాశ్వతంగా నాశనంపాలైనా కూడా వారికి చీమ కుట్టినట్టయినా అనిపించదు. “అబద్ధాలు వినే నా ప్రజలకు” అనే మాటలు చూడండి. అబద్ధాలను నమ్మడం ప్రజలకు ఇష్టం లేకపోతే అబద్ధ ప్రవక్తలకు ప్రవక్త్రిలకూ వారిమధ్య చోటు ఉండదు. సత్యాన్ని కాక అబద్ధాలు వినేందుకే మొగ్గు చూపేవారిని దేవుడు కఠినంగా శిక్షిస్తాడు (2 థెస్సలొనీకయులకు 2:10-12).

20. కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధములచేత మీరు దుఃఖింపజేయుదురు, దుర్మార్గులు తమ దుష్‌ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించుకొనకుండ మీరు వారిని ధైర్యపరతురు గనుక

అబద్ధ ప్రవక్తలూ ప్రవక్త్రిలూ అబద్ధాలవల్ల, సైతాను శక్తివల్ల ప్రజలను వలలో వేసుకొంటారు. మానవ హృదయాంధకారాన్ని, ఆధ్యాత్మిక అజ్ఞానాన్ని ఆసరాగా తీసుకొని తమ పనులు నెరవేర్చుకుంటారు. మనుషులను నాశనం చేయడానికి సైతాను ఉపయోగించిన విధానాన్నే వీరూ ఉపయోగిస్తారు. అదేమిటంటే, అబద్ధాలు (యోహాను 8:44). బైబిలు తెలియక దానిలో వెల్లడైన దేవుని సత్యాలను నమ్మనివారు ఇలాంటివారి మూలంగా ఘోరమైన ప్రమాదంలో పడతారు. దేవుడు తన సమయం వచ్చినప్పుడు తనకు తోచిన విధంగా అలాంటి వారి విషయంలో చర్య తీసుకొంటాడు.

21. మనుష్యులను వేటాడుటకై మీరు కుట్టు గుడ్డలకు నేను విరోధినై వారిని విడిపించెదను, మీ కౌగిటిలోనుండి వారిని ఊడ బెరికి, మీరు వేటాడు మనుష్యులను నేను విడిపించి తప్పించుకొననిచ్చెదను.

వారి శక్తి ఎలాంటిదంటే దాని నుంచి మనుషులను రక్షించగలిగేది దేవుడు ఒక్కడే (వ 23).

22. మరియు నేను యెహోవానని మీరు తెలిసికొనునట్లు మీరు వేసిన ముసుకులను నేను చింపి మీ చేతిలోనుండి నా జనులను విడిపించెదను, వేటాడుటకు వారికను మీ వశమున ఉండరు.

వ 13,19.

23. మీరికను వ్యర్థమైన దర్శనములు కనకయుందురు, సోదె చెప్పక యుందురు; నేను యెహోవానని మీరు తెలిసికొనునట్లు నా జనులను మీ వశమునుండి విడిపించెదను.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezekiel - యెహెఙ్కేలు 13 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

అబద్ధం చెప్పే ప్రవక్తలకు వ్యతిరేకంగా భారీ తీర్పులు. (1-9) 
ఏదైనా ప్రయత్నాన్ని చేపట్టడానికి దేవుడు అనుమతి ఇచ్చినప్పుడు, దానిని కోరుకునే వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అయితే, వారు అందించినది క్రీస్తు పరిచారకుల అనుభవాలు లేదా బోధలకు అనుగుణంగా లేదు. వారు ప్రార్థన ద్వారా స్వర్గంతో కమ్యూనికేట్ చేసిన ప్రవచనాత్మక వ్యక్తులు కాదు; బదులుగా, వారు ప్రజలకు నిజమైన ప్రయోజనం చేకూర్చడం కంటే వారిని శాంతింపజేసే మార్గాలను రూపొందించారు. వారు పాపానికి వ్యతిరేకంగా దృఢమైన వైఖరిని తీసుకోలేదు కానీ తప్పుడు ఆశలతో వ్యక్తులను మెప్పించారు. దేవుని ఉగ్రత ఇప్పటికీ వారిపై వేలాడుతున్నప్పటికీ, వారు నిత్యజీవానికి అర్హులని నమ్మేలా ప్రజలను నడిపించడం ద్వారా విభజనను విస్తృతం చేయడానికి ఇటువంటి చర్యలు మాత్రమే ఉపయోగపడతాయి.

వారి పని యొక్క అసమర్థత. (10-16)
ఒక మోసపూరిత ప్రవక్త తప్పుడు ఆశల గోడ నిర్మాణాన్ని ప్రారంభించాడు, జెరూసలేం విజయం సాధిస్తుందనే ఆలోచనను ప్రచారం చేశాడు, తద్వారా ప్రజలలో ఆమోదం పొందాడు. ఇతరులు ఈ మోసాన్ని మరింత ఒప్పించారు; వారు మొదటి ప్రవక్త నిలబెట్టిన గోడపై చిత్రించారు. అయితే, కల్దీయుల సైన్యం భూమిని నాశనం చేసినందున, దేవుని నీతియుక్తమైన కోపపు తుఫానులో వారి ప్రయత్నాలు కూలిపోయినప్పుడు వారి భ్రమలు త్వరలోనే చెదిరిపోతాయి. దేవుని ఆమోదం లేని శాంతి మరియు శ్రేయస్సు కోసం ఆశలు చివరికి వ్యక్తులను మోసం చేస్తాయి, ఇది బాగా పెయింట్ చేయబడినప్పటికీ పేలవంగా నిర్మించబడిన గోడ వలె ఉంటుంది.

తప్పుడు ప్రవక్తలకు వ్యతిరేకంగా బాధలు. (17-23)
అసహ్యకరమైన సత్యాల కంటే ఓదార్పునిచ్చే అబద్ధాలను వినడానికి ఇష్టపడే వారు విచారకరమైన స్థితిలో ఉన్నారు. మోసపూరిత ప్రవక్తలు తమ తలపై ఉన్న అలంకారాల ద్వారా ప్రజలను తేలికగా ఉంచడానికి మరియు అహంకారాన్ని పెంపొందించడానికి వారి ప్రయత్నాల ద్వారా సూచించబడినట్లుగా, తప్పుడు భద్రతా భావాన్ని కలిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయినప్పటికీ, వారి ప్రయత్నాలు చివరికి వారికి అవమానాన్ని తెస్తాయి మరియు దేవుని ప్రజలు వారి ప్రభావం నుండి రక్షించబడతారు. క్రైస్తవులు దేవుని వాక్యానికి నిబద్ధతతో స్థిరంగా ఉండడం మరియు అన్ని విషయాలలో పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వం కోసం వెతకడం చాలా అవసరం. ఆయన ఆజ్ఞలను నమ్మకంగా పాటించేలా మనల్ని నడిపించే విధంగా మనం దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచాలి.



Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |