Ezekiel - యెహెఙ్కేలు 13 | View All

1. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

1. And the word of the Lord was maad to me,

2. నరపుత్రుడా, ప్రవచించుచున్న ఇశ్రాయేలీయుల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి, మనస్సు వచ్చినట్లు ప్రవచించువారితో నీవీలాగు చెప్పుము యెహోవా మాట ఆలకించుడి.

2. and he seide, Sone of man, profesie thou to the profetis of Israel that profesien; and thou schalt seie to hem that profesien of her herte,

3. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా దర్శనమేమియు కలుగకున్నను స్వబుద్ధి ననుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ.

3. Here ye the word of the Lord. The Lord God seith these thingis, Wo to the vnwise profetis, that suen her spirit, and seen no thing;

4. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండు నక్కలతో సాటిగా ఉన్నారు.

4. Israel, thi profetis weren as foxis in desert.

5. యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలుచు నట్లు మీరు గోడలలోనున్న బీటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు.

5. Ye stieden not euene ayens, nether ayensettiden a wal for the hous of Israel, that ye shulden stonde in batel in the dai of the Lord.

6. వారు వ్యర్థమైన దర్శనములు చూచి, అబద్ధపు సోదె చూచి యెహోవా తమ్మును పంపక పోయినను, తాము చెప్పినమాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పుదురు.

6. Thei seen veyn thingis, and deuynen a leesyng, and seien, The Lord seith, whanne the Lord sente not hem; and thei contynueden to conferme the word.

7. నేను సెలవియ్యకపోయినను ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పిన యెడల మీరు కనినది వ్యర్థమైన దర్శనముగదా? మీరు నమ్మదగని సోదెగాండ్రయితిరి గదా?

7. Whether ye seen not a veyn visioun, and spaken fals diuynyng, and seiden, The Lord seith, whanne Y spak not?

8. కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

8. Therfor the Lord God seith these thingis, For ye spaken veyn thingis, and sien a leesyng, therfor lo! Y to you, seith the Lord God.

9. వ్యర్థమైన దర్శనములు కనుచు, నమ్మదగని సోదెగాండ్రయిన ప్రవక్తలకు నేను పగవాడను, వారు నా జనుల సభలోనికి రారు, ఇశ్రాయేలీయుల సంఖ్యలో చేరినవారు కాక పోదురు, వారు ఇశ్రాయేలీయుల దేశములోనికి తిరిగి రారు, అప్పుడు నేను ప్రభువైన యెహోవానని మీరు తెలిసికొందురు.

9. And myn hond schal be on the profetis that seen veyn thingis, and dyuynen a leesyng; thei schulen not be in the councel of my puple, and thei schulen not be writun in the scripture of the hous of Israel, nether thei schulen entre in to the lond of Israel; and ye schulen wite, that Y am the Lord God.

10. సమాధానమేమియు లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చు చున్నారు; నా జనులు మంటిగోడను కట్టగా వారు వచ్చి దానిమీద గచ్చుపూత పూసెదరు.
1 థెస్సలొనీకయులకు 5:3, మత్తయి 7:27, అపో. కార్యములు 23:3

10. For thei disseyueden my puple, and seiden, Pees, pees, and no pees is; and it bildide a wal, but thei pargitiden it with fen with out chaffis.

11. ఇందువలననే పూయుచున్న వారితో నీ విట్లనుము వర్షము ప్రవాహముగా కురియును, గొప్ప వడగండ్లు పడును, తుపాను దాని పడగొట్టగా అది పడిపోవును.

11. Seie thou to hem that pargiten with out temperure, that it schal falle doun; for a strong reyn schal be flowynge, and I shal yyue ful grete stoones fallinge fro aboue, and Y schal yyue a wynd of tempest that distrieth.

12. ఆ గోడ పడగా జనులు మిమ్మును చూచి మీరు పూసిన పూత యేమాయెనని అడుగుదురు గదా?

12. For lo! the wal felle doun. Whether it schal not be seid to you, Where is the pargetyng, which ye pargetiden?

13. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నేను రౌద్రము తెచ్చుకొని తుపానుచేత దానిని పడగొట్టుదును, నా కోపమునుబట్టి వర్షము ప్రవాహముగా కురియును, నా రౌద్రమునుబట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచును,

13. Therfor the Lord God seith these thingis, And Y schal make the spirit of tempestis to breke out in myn indignacioun, and strong reyn flowynge in my strong veniaunce schal be, and greet stoonys in wraththe in to wastyng.

14. దాని పునాది కనబడునట్లు మీరు గచ్చుపూత పూసిన గోడను నేను నేలతో సమముగా కూల్చెదను, అది పడిపోగా దానిక్రింద మీరును నాశనమగుదురు, అప్పుడు నేను యెహోవానని మీరు తెలిసికొందురు.

14. And Y schal distrie the wal, which ye pargetiden with out temperure, and Y schal make it euene with the erthe; and the foundement therof schal be schewid, and it schal falle doun, and it schal be wastid in the myddis therof; and ye schulen wite, that Y am the Lord.

15. ఈలాగున ఆ గోడమీదను దానిమీద గచ్చుపూత పూసినవారిమీదను నా కోపము నేను తీర్చుకొని, ఆ గోడకును దానికి పూత పూసినవారికిని పని తీరెనని మీతో చెప్పుదును.

15. And Y schal fille myn indignacioun in the wal, and in hem that pargeten it with out temperure; and Y schal seie to you, The wal is not, and thei ben not,

16. యెరూషలేమునకు సమాధానము లేకపోయినను ఆ పూత పూయువారు సమాధానార్థమైన దర్శనములు కనుచు ప్రవచించువారు ఇశ్రాయేలీయుల ప్రవక్తలే; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

16. that pargeten it, the profetis of Israel, that profesien to Jerusalem, and seen to it the visioun of pees, and pees is not, seith the Lord God.

17. మరియు నరపుత్రుడా, మనస్సునకు వచ్చినట్టు ప్రవచించు నీ జనుల కుమార్తెలమీద కఠినదృష్టియుంచి వారికి విరోధముగా ఈలాగు ప్రవచింపుము

17. And thou, sone of man, sette thi face ayens the douytris of thi puple, that profesien of her herte; and profesie thou on hem,

18. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మనుష్యులను వేటాడ వలెనని చేతుల కీళ్లన్నిటికిని గుడ్డలుకుట్టి, యెవరి యెత్తు చొప్పున వారి తలలకు ముసుకులుచేయు స్త్రీలారా, మీకు శ్రమ; మీరు నా జనులను వేటాడి మిమ్మును రక్షించుకొందురు.

18. and seie thou, The Lord God seith these thingis, Wo to hem that sowen togidere cuschens vndur ech cubit of hond, and maken pilewis vndur the heed of ech age, to take soulis; and whanne thei disseyueden the soulis of my puple, thei quykenyden the soulis of hem.

19. అబద్ధపు మాటల నంగీకరించు నా జనులతో అబద్ధఫు మాటలు చెప్పుచు, చేరెడు యవలకును రొట్టెముక్కలకును ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు, బ్రదుకుటకు అపాత్రులైన వారిని బ్రదికించుచు నా జనులలో మీరు నన్ను దూషించెదరు.

19. And thei defouliden me to my puple, for an handful of barli, and for a gobet of breed, that thei schulden sle soulis that dien not, and quykene soulis that lyuen not; and thei lieden to my puple, bileuynge to leesyngis.

20. కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధములచేత మీరు దుఃఖింపజేయుదురు, దుర్మార్గులు తమ దుష్‌ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించుకొనకుండ మీరు వారిని ధైర్యపరతురు గనుక

20. For this thing the Lord God seith these thingis, Lo! Y to youre cuschens, bi whiche ye disseyuen soulis fliynge; and Y schal al to-breke tho fro youre armes, and Y schal delyuere soulis which ye disseyuen, soulis to fle.

21. మనుష్యులను వేటాడుటకై మీరు కుట్టు గుడ్డలకు నేను విరోధినై వారిని విడిపించెదను, మీ కౌగిటిలోనుండి వారిని ఊడ బెరికి, మీరు వేటాడు మనుష్యులను నేను విడిపించి తప్పించుకొననిచ్చెదను.

21. And Y schal al to-breke youre pilewis, and Y schal delyuere my puple fro youre hond; and thei schulen no more be in youre hondis, to be robbid; and ye schulen wite, that Y am the Lord.

22. మరియు నేను యెహోవానని మీరు తెలిసికొనునట్లు మీరు వేసిన ముసుకులను నేను చింపి మీ చేతిలోనుండి నా జనులను విడిపించెదను, వేటాడుటకు వారికను మీ వశమున ఉండరు.

22. For that that ye maden falsli the herte of a iust man to morene, whom Y made not sori; and ye coumfortiden the hondis of a wickid man, that he schulde not turne ayen fro his yuel weie, and lyue.

23. మీరికను వ్యర్థమైన దర్శనములు కనకయుందురు, సోదె చెప్పక యుందురు; నేను యెహోవానని మీరు తెలిసికొనునట్లు నా జనులను మీ వశమునుండి విడిపించెదను.

23. Therfor ye schulen not se veyn thingis, and ye schulen no more dyuyne false dyuynyngis; and Y schal delyuere my puple fro youre hond, and ye schulen wite, that Y am the Lord.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezekiel - యెహెఙ్కేలు 13 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

అబద్ధం చెప్పే ప్రవక్తలకు వ్యతిరేకంగా భారీ తీర్పులు. (1-9) 
ఏదైనా ప్రయత్నాన్ని చేపట్టడానికి దేవుడు అనుమతి ఇచ్చినప్పుడు, దానిని కోరుకునే వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అయితే, వారు అందించినది క్రీస్తు పరిచారకుల అనుభవాలు లేదా బోధలకు అనుగుణంగా లేదు. వారు ప్రార్థన ద్వారా స్వర్గంతో కమ్యూనికేట్ చేసిన ప్రవచనాత్మక వ్యక్తులు కాదు; బదులుగా, వారు ప్రజలకు నిజమైన ప్రయోజనం చేకూర్చడం కంటే వారిని శాంతింపజేసే మార్గాలను రూపొందించారు. వారు పాపానికి వ్యతిరేకంగా దృఢమైన వైఖరిని తీసుకోలేదు కానీ తప్పుడు ఆశలతో వ్యక్తులను మెప్పించారు. దేవుని ఉగ్రత ఇప్పటికీ వారిపై వేలాడుతున్నప్పటికీ, వారు నిత్యజీవానికి అర్హులని నమ్మేలా ప్రజలను నడిపించడం ద్వారా విభజనను విస్తృతం చేయడానికి ఇటువంటి చర్యలు మాత్రమే ఉపయోగపడతాయి.

వారి పని యొక్క అసమర్థత. (10-16)
ఒక మోసపూరిత ప్రవక్త తప్పుడు ఆశల గోడ నిర్మాణాన్ని ప్రారంభించాడు, జెరూసలేం విజయం సాధిస్తుందనే ఆలోచనను ప్రచారం చేశాడు, తద్వారా ప్రజలలో ఆమోదం పొందాడు. ఇతరులు ఈ మోసాన్ని మరింత ఒప్పించారు; వారు మొదటి ప్రవక్త నిలబెట్టిన గోడపై చిత్రించారు. అయితే, కల్దీయుల సైన్యం భూమిని నాశనం చేసినందున, దేవుని నీతియుక్తమైన కోపపు తుఫానులో వారి ప్రయత్నాలు కూలిపోయినప్పుడు వారి భ్రమలు త్వరలోనే చెదిరిపోతాయి. దేవుని ఆమోదం లేని శాంతి మరియు శ్రేయస్సు కోసం ఆశలు చివరికి వ్యక్తులను మోసం చేస్తాయి, ఇది బాగా పెయింట్ చేయబడినప్పటికీ పేలవంగా నిర్మించబడిన గోడ వలె ఉంటుంది.

తప్పుడు ప్రవక్తలకు వ్యతిరేకంగా బాధలు. (17-23)
అసహ్యకరమైన సత్యాల కంటే ఓదార్పునిచ్చే అబద్ధాలను వినడానికి ఇష్టపడే వారు విచారకరమైన స్థితిలో ఉన్నారు. మోసపూరిత ప్రవక్తలు తమ తలపై ఉన్న అలంకారాల ద్వారా ప్రజలను తేలికగా ఉంచడానికి మరియు అహంకారాన్ని పెంపొందించడానికి వారి ప్రయత్నాల ద్వారా సూచించబడినట్లుగా, తప్పుడు భద్రతా భావాన్ని కలిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయినప్పటికీ, వారి ప్రయత్నాలు చివరికి వారికి అవమానాన్ని తెస్తాయి మరియు దేవుని ప్రజలు వారి ప్రభావం నుండి రక్షించబడతారు. క్రైస్తవులు దేవుని వాక్యానికి నిబద్ధతతో స్థిరంగా ఉండడం మరియు అన్ని విషయాలలో పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వం కోసం వెతకడం చాలా అవసరం. ఆయన ఆజ్ఞలను నమ్మకంగా పాటించేలా మనల్ని నడిపించే విధంగా మనం దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచాలి.



Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |