Jeremiah - యిర్మియా 52 | View All

1. సిద్కియా యేలనారంభించినప్పుడు అతడు ఇరువది యొక్క సంవత్సరములవాడు. అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరములు ఏలెను, అతని తల్లిపేరు హమూటలు; ఈమె లిబ్నా ఊరివాడైన యిర్మీయా కుమార్తె.

1. Zedekiah was twenty-one years old when he came to the throne, and he reigned for eleven years in Jerusalem. His mother's name was Hamital daughter of Jeremiah, of Libnah.

2. యెహోయాకీము నడిచిన చెడ్డనడత ప్రకారముగా సిద్కియాయు యెహోవా దృష్టికి చెడ్డనడత నడిచెను.

2. He did what is displeasing to Yahweh, just as Jehoiakim had done.

3. యెహోవా కోపపడి తనయెదుట నుండకుండ వారిని తోలివేయునంతగా ఆ చర్య యెరూషలేములోను యూదాలోను జరిగెను. సిద్కియా బబులోను రాజుమీద తిరుగుబాటుచేయగా

3. That this should happen to Jerusalem and Judah was due to Yahweh's anger, resulting in his casting them away from his presence. Zedekiah rebelled against the king of Babylon.

4. అతని యేలుబడియందు తొమ్మిదవ సంవత్సరము పదియవ నెల పదియవ దినమున బబులోనురాజైన నెబుకద్రెజరు తన సైన్యమంతటితో యెరూషలేముమీదికి వచ్చి, దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టు కోటలు కట్టిరి.

4. In the ninth year of his reign, in the tenth month, on the tenth day of the month, Nebuchadnezzar king of Babylon advanced on Jerusalem with his entire army; he pitched camp in front of the city and threw up earthworks round it.

5. ఆలాగు జరుగగా సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవ త్సరమువరకు పట్టణము ముట్టడిలో నుంచబడెను.

5. The city lay under siege till the eleventh year of King Zedekiah.

6. నాల్గవ నెల తొమ్మిదవ దినమున క్షామము పట్టణములో హెచ్చుగా నున్నప్పుడు దేశ ప్రజలకు ఆహారము లేకపోయెను.

6. In the fourth month, on the ninth day of the month, when famine was raging in the city and there was no food for the populace,

7. పట్టణప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరు పారి పోయి రాజుతోటకు దాపైన రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రియందు పట్టణములోనుండి బయలు వెళ్లిరి; కల్దీయులు పట్టణమును చుట్టుకొని యుండగా సైనికులు యొర్దానునది మార్గముగా తర్లిపోయిరి.

7. a breach was made in the city wall. The king and all the fighting men then fled, leaving the city under cover of dark, by way of the gate between the two walls, which is near the king's garden -- the Chaldaeans had surrounded the city -- and made his way towards the Arabah.

8. కల్దీయుల దండు సిద్కియా రాజును తరిమి యెరికో మైదానములో అతని కలిసికొనగా అతని దండంతయు అతనియొద్దనుండి చెదరిపోయెను.

8. The Chaldaean troops pursued the king and caught up with Zedekiah in the plains of Jericho, where all his troops deserted.

9. వారు రాజును పట్టు కొని హమాతు దేశమునందలి రిబ్లాపట్టణమున నున్న బబు లోను రాజునొద్దకు అతని తీసికొనిపోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్షవిధించెను.

9. But the Chaldaeans captured the king and took him to the king of Babylon at Riblah in the territory of Hamath, where he passed sentence on him.

10. బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నులయెదుట చంపించెను; మరియు అతడు రిబ్లాలో యూదా అధిపతుల నందరిని చంపించెను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడ దీయించి

10. He had Zedekiah's sons slaughtered before his eyes; he also had all the chief men of Judah put to death at Riblah.

11. రెండు సంకెళ్లతో అతని బంధించి, బబులోను నకు అతని తీసికొనిపోయి, మరణమగువరకు చెరసాలలో అతనిపెట్టించెను.

11. He then put out Zedekiah's eyes and, loading him with chains, the king of Babylon carried him off to Babylon where he kept him prisoner until his dying day.

12. అయిదవ నెల పదియవ దినమున, అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు ఏలుబడియందు పందొమ్మిదవ సంవత్సరమున బబులోనురాజు ఎదుట నిలుచు నెబూజర దానను రాజదేహసంరక్షకుల యధిపతి యెరూషలేమునకు వచ్చెను.

12. In the fifth month, on the tenth day of the month -- it was in the nineteenth year of Nebuchadnezzar king of Babylon -- Nebuzaradan commander of the guard, a member of the king of Babylon's staff, entered Jerusalem.

13. అతడు యెహోవా మందిరమును రాజునగరును యెరూషలేములోని గొప్పవారి యిండ్లనన్నిటిని కాల్చి వేసెను.

13. He burnt down the Temple of Yahweh, the royal palace and all the houses in Jerusalem.

14. మరియు రాజదేహసంరక్షకుల యధిపతితోకూడ నుండిన కల్దీ యుల సేనాసంబంధులందరు యెరూషలేము చుట్టునున్న ప్రాకారములన్నిటిని పడగొట్టిరి

14. The Chaldaean troops who accompanied the commander of the guard demolished all the walls surrounding Jerusalem.

15. మరియు రాజ దేహసంరక్షకుల యధిపతియైన నెబూజరదాను ప్రజ లలో కడుబీదలైన కొందరిని, పట్టణములో శేషించిన కొదువ ప్రజలను, బబులోనురాజు పక్షము చేరినవారిని, గట్టి పనివారిలో శేషించినవారిని చెరగొని పోయెను.

15. Nebuzaradan commander of the guard deported (some of the poor people and) the remainder of the population left in the city, the deserters who had gone over to the king of Babylon, and the rest of the artisans.

16. అయితే రాజదేహసంరక్షకుల యధిపతియైన నెబూజర దాను ద్రాక్షావనములను చక్కపరచుటకును సేద్యము చేయుటకును కడుబీదలలో కొందరిని ఉండనిచ్చెను.

16. But Nebuzaradan commander of the guard left some of the poor country-people behind as vineyard workers and ploughmen.

17. మరియయెహోవా మందిరములోనుండిన ఇత్తడి స్తంభ ములను మందిరములోనుండిన మట్లను ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బబు లోనునకు గొనిపోయిరి.

17. The Chaldaeans broke up the bronze pillars from the Temple of Yahweh, the wheeled stands and the bronze Sea, which were in the Temple of Yahweh, and took all the bronze away to Babylon.

18. అదియుగాక వారు బిందెలను కుండలను కత్తెరలను గిన్నెలను గరిటెలను యాజకులు సేవ చేయు ఇత్తడి ఉపకరణములన్నిటిని గొనిపోయిరి.

18. They also took the ash containers, the scoops, the knives, the sprinkling bowls, the incense bowls, and all the bronze furnishings used in worship.

19. మరియు పళ్లెములను ధూపార్తులను గిన్నెలను పాత్రలను, బంగారు వాటిని బంగారునకును వెండివాటిని వెండికిని చేర్చుకొని రాజదేహసంరక్షకుల యధిపతి గొనిపోయెను.

19. The commander of the guard also took the bowls, the censers, the sprinkling bowls, the ash containers, the lamp-stands, the goblets and the saucers: everything that was made of gold and everything made of silver.

20. రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లక్రిందనుండిన పండ్రెండు ఇత్తడి వృషభములను గొనిపోయెను. వీటి కన్నిటికున్న ఇత్తడి యెత్తువేయుటకు అసాధ్యము.

20. As regards the two pillars, the one Sea, the twelve bronze oxen supporting the Sea, and the wheeled stands, which King Solomon had made for the Temple of Yahweh, there was no reckoning the weight of bronze in all these objects.

21. వాటిలో ఒక్కొక్క స్తంభము పదునెనిమిది మూరల యెత్తుగలది, పండ్రెండు మూరల నూలు దాని చుట్టు తిరుగును, దాని దళసరి నాలుగు వ్రేళ్లు; అది గుల్లది.

21. As regards the pillars, the height of one pillar was eighteen cubits, its circumference was twelve cubits, it was four fingers thick, and hollow inside;

22. దానిమీద ఇత్తడి పైపీట యుండెను; ఒక్క పైపీట అయి దేసి మూరల ఎత్తుగలది, పైపీటకు చుట్టు అల్లిన వల అల్లి కయు దానిమ్మ పండ్లును ఉండెను; అవి యన్నియు ఇత్త డివి. ఈ స్తంభమునకును ఆ స్తంభమునకును ఆలాగుననే దానిమ్మ పండ్లుండెను.

22. on it stood a capital of bronze, the height of the capital being five cubits; round the capital were filigree and pomegranates, all in bronze. So also for the second pillar.

23. ప్రక్కలయందు తొంబదియారు దానిమ్మపండ్లుండెను; చుట్టు ఉండిన వల అల్లికమీద దానిమ్మపండ్లన్నియు నూరు.

23. There were ninety-six pomegranates round the sides, making a hundred pomegranates round the filigree in all.

24. మరియు రాజదేహసంరక్షకుల యధిపతి ప్రధానయాజకుడైన శెరాయాను రెండవ యాజకుడైన జెఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టు కొనెను.

24. The commander of the guard took prisoner Seraiah the chief priest, Zephaniah the priest next in rank, and the three guardians of the threshold.

25. అతడు పట్టణములోనుండి యోధులమీద నియ మింపబడిన యొక ఉద్యోగస్ధుని, పట్టణములో దొరికిన రాజసన్నిధిలో నిలుచు ఏడుగురు మనుష్యులను, దేశ సైన్యాధిపతియగు వానియొక్క లేఖరిని, పట్టణపు మధ్యను దొరికిన అరువదిమంది దేశప్రజలను పట్టుకొనెను.

25. In the city he took prisoner an official who was in command of the fighting men, seven of the king's personal friends who were discovered in the city, the secretary to the army commander responsible for military conscription, and sixty men of distinction discovered in the city.

26. రాజ దేహసంరక్షకుల యధిపతియైన నెబూజరదాను వీరిని పట్టు కొని రిబ్లాలో నుండిన బబులోనురాజు నొద్దకు తీసికొని వచ్చెను.

26. Nebuzaradan commander of the guard took these men and brought them to the king of Babylon at Riblah,

27. బబులోనురాజు హమాతుదేశమందలి రిబ్లాలో వారిని కొట్టించి చంపించి యూదా వారిని తమ దేశములో నుండి చెరగొనిపోయెను.

27. and at Riblah, in the territory of Hamath, the king of Babylon had them put to death. Thus Judah was deported from its country.

28. నెబుకద్రెజరు తన యేలుబడి యందు ఏడవ సంవత్సరమున మూడువేల ఇరువది ముగ్గురు యూదులను చెరగొనిపోయెను

28. The number of people deported by Nebuchadnezzar was as follows. In the seventh year: three thousand and twenty-three Judaeans;

29. నెబుకద్రెజరు ఏలుబడి యందు పదునెనిమిదవ సంవత్సరమున అతడు యెరూష లేమునుండి ఎనిమిదివందల ముప్పది యిద్దరిని చెరగొని పోయెను.

29. in the eighteenth year of Nebuchadnezzar, eight hundred and thirty-two persons were deported from Jerusalem;

30. నెబుకద్రెజరు ఏలుబడియందు ఇరువది మూడవ సంవత్సరమున రాజ దేహసంరక్షకుల యధిపతియగు నెబూజరదాను యూదులలో ఏడువందల నలుబది యయిదుగురు మనుష్యులను చెరగొనిపోయెను; ఆ మను ష్యుల వెరసి నాలుగువేల ఆరువందలు.

30. in the twenty-third year of Nebuchadnezzar, Nebuzaradan commander of the guard deported seven hundred and forty-five Judaeans. In all: four thousand six hundred persons.

31. యూదారాజైన యెహోయాకీను చెరపట్టబడిన ముప్పది యేడవ సంవత్సరమున పండ్రెండవ నెల యిరువదియైదవ దినమున బబులోనురాజైన ఎవీల్మెరోదకు తన యేలుబడి యందు మొదటి సంవత్సరమున యూదారాజైన యెహో యాకీనునకు దయచూపి, బందీగృహములోనుండి అతని తెప్పించి

31. But in the thirty-seventh year of the exile of Jehoiachin king of Judah, in the twelfth month, on the twenty-fifth day of the month, Evil-Merodach king of Babylon, in the year he came to the throne, pardoned Jehoiachin king of Judah and released him from prison.

32. అతనితో దయగా మాటలాడి అతనితోకూడ బబులోనులోనుండు రాజుల సింహాసనముకంటె ఎత్తయిన సింహాసనము అతనికి నియమించెను.

32. He treated him kindly and allotted him a seat above those of the other kings who were with him in Babylon.

33. మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించి కొని తన జీవితకాలమంతయు ఎవీల్మెరోదకు సన్నిధిని భోజనము చేయుచువచ్చెను.

33. So Jehoiachin laid aside his prisoner's garb and for the rest of his life always ate at the king's table.

34. మరియు అతడు చనిపోవు వరకు అతడు బ్రతికిన దినములన్నియు అనుదినము అతని పోషణకై బబులోనురాజుచేత భోజనపదార్థములు ఇయ్య బడుచుండెను.

34. And his upkeep was permanently ensured by the king, day after day, for the rest of his life until the day he died.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Jeremiah - యిర్మియా 52 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

సిద్కియా యొక్క విధి. (1-11) 
అన్నింటికంటే పాపం యొక్క పరిణామాల నుండి విముక్తి పొందాలని మనం హృదయపూర్వకంగా ప్రార్థించాలి. కీర్తనల గ్రంథము 51:11లో చెప్పబడినట్లుగా, "నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము" అని మనము వేడుకోవలెను. దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడిన వారు, వారి పాపపు చర్యల ద్వారా, ఆయన నుండి తమను తాము దూరం చేసుకోవాలని ఎంచుకున్నారు. సిద్కియా తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు, ఎందుకంటే దేవుని తీర్పులను తప్పించుకోవడం లేదు; వారు ఎక్కడికి పారిపోవడానికి ప్రయత్నించినా, వారు తప్పనిసరిగా పాపిని పట్టుకుంటారు.

జెరూసలేం నాశనం. (12-23) 
కల్దీయుల సైన్యం వినాశకరమైన విధ్వంసం చేసింది, అయితే ఈ వృత్తాంతంలో ప్రముఖంగా కనిపించేది ఆలయంలోని వస్తువులను దోచుకోవడం. వారి అద్భుతమైన అందం మరియు గొప్ప విలువను జ్ఞాపకం చేసుకోవడం పాపం యొక్క లోతైన దుష్టత్వాన్ని నొక్కి చెప్పడానికి ఉపయోగపడుతుంది.

బందీలు. (24-30) 
యూదు నాయకులు తమ ప్రజలను తప్పుదారి పట్టించారు, ఇప్పుడు వారు దైవిక న్యాయానికి స్పష్టమైన ఉదాహరణలుగా పనిచేస్తున్నారు. ఇక్కడ, మేము రెండు మునుపటి బందిఖానాల రికార్డులను కనుగొన్నాము. ఈ దేశం తరచుగా దేవుని తీర్పులు మరియు అతని దయ రెండింటినీ అనుభవించింది, అవి వారి స్వంత హక్కులో గొప్పవి.

జెహోయాచిన్ యొక్క పురోగతి. (31-34)
2 రాజులు 25:27-30లో కింగ్ యెహోయాకిన్ వృత్తాంతం చదవండి. అణచివేతను సహించే వారు ప్రభువు విడుదల కోసం తమ నిరీక్షణ మరియు సహనం వ్యర్థం కాదని తెలుసుకుంటారు. మనం సంభాషించే వారందరి హృదయాలు ఉన్నట్లే, మన విధిని దేవుడు కలిగి ఉన్నాడు. శాశ్వతమైన పునాదిపై మన నమ్మకాన్ని ఉంచడానికి మరియు ప్రభువు సీయోనును పునరుద్ధరించే మరియు చర్చి యొక్క విరోధులందరినీ ఓడించే క్షణాన్ని అచంచలమైన విశ్వాసంతో ఎదురుచూడడానికి మేము మరింత శక్తిని పొందుతాము.



Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |