Jeremiah - యిర్మియా 49 | View All

1. అమ్మోనీయులనుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇశ్రాయేలునకు కుమారులు లేరా? అతనికి వారసుడు లేకపోయెనా? మల్కోము గాదును ఎందుకు స్వతంత్రించుకొనును? అతని ప్రజలు దాని పట్టణములలో ఎందుకు నివసింతురు?

1. Concerning the sons of Ammon, thus says the Lord: Are there no sons in Israel? Or have they no one to succeed [them]? Why has Milcom inherited Gilead, and why shall their people dwell in their cities?

2. కాగా యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు రాగల దినములలో నేను అమ్మోనీయుల పట్టణమగు రబ్బా మీదికి వచ్చు యుద్ధము యొక్క ధ్వని వినబడజేసెదను; అది పాడుదిబ్బయగును, దాని ఉపపురములు అగ్నిచేత కాల్చబడును, దాని వారసులకు ఇశ్రాయేలీయులు వారసులగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

2. Therefore behold, the days are coming, says the Lord, when I will cause a tumult of wars to be heard in Rabbah; and they shall become a waste and ruined place, and her altars shall be burned with fire; then shall Israel succeed to his dominion.

3. హెష్బోనూ, అంగ లార్చుము, హాయి పాడాయెను, మల్కోమును అతని యాజకులును అతని యధిపతులును చెరలోనికి పోవు చున్నారు; రబ్బా నివాసినులారా, కేకలువేయుడి, గోనెపట్ట కట్టుకొనుడి, మీరు అంగలార్చి కంచెలలో ఇటు అటు తిరుగులాడుడి.

3. Howl, O Heshbron, for Ai has perished; cry, you daughters of Rabbah, gird yourselves with sackcloth, and lament; for Milcom shall go into banishment, his priests and his princes together.

4. విశ్వాసఘాతకురాలా నా యొద్దకు ఎవడును రాలేడని నీ ధనమునే ఆశ్రయముగా చేసికొన్నదానా,

4. Why do you boast in the plains of the Enakim, you haughty daughter, that trust in [your] treasures, that say, Who shall come in to me?

5. నీ లోయలో జలములు ప్రవహించు చున్నవని, నీవేల నీ లోయలనుగూర్చి యతిశయించు చున్నావు? ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

5. Behold, I [will] bring terror upon you, says the Lord, from all the country round about you; and you shall be scattered, everyone right before him, and there is none to gather you.

6. నేను నీ చుట్టునున్న వారందరివలన నీకు భయము పుట్టించు చున్నాను; మీరందరు శత్రువుని కెదురుగా తరుమబడు దురు, పారిపోవువారిని సమకూర్చు వాడొకడును లేక పోవును, అటుతరువాత చెరలోనున్న అమ్మోనీయులను నేను రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు.

6. [This translation omits this verse.]

7. సైన్యములకధిపతియగు యెహోవా ఎదోమునుగూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు తేమానులో జ్ఞానమిక నేమియులేదా? వివేకులకు ఇక ఆలోచన లేకపోయెనా? వారి జ్ఞానము వ్యర్థమాయెనా?

7. Concerning Edom, thus says the Lord: There is no longer wisdom in Teman, counsel has perished from the wise ones, their wisdom is gone,

8. ఏశావును విమర్శించుచు నేనతనికి కష్టకాలము రప్పించుచున్నాను; దదానీయు లారా, పారిపోవుడి వెనుకకు మళ్లుడి బహులోతున దాగు కొనుడి.

8. their place has been deceived. Dig deep for a dwelling, you that inhabit Dedan, for he has wrought grievously. I have brought trouble upon him in the time at which I visited him.

9. ద్రాక్షపండ్లు ఏరువారు నీయొద్దకు వచ్చిన యెడల వారు పరిగెలను విడువరా? రాత్రి దొంగలు వచ్చినయెడల తమకు చాలునంత దొరుకువరకు నష్టము చేయుదురు గదా?

9. For grape gatherers have come, who shall not leave to you a remnant; as thieves by night, they shall lay their hand upon [your possessions].

10. నేను ఏశావును దిగంబరినిగా చేయు చున్నాను, అతడు దాగియుండకుండునట్లు నేనతని మరుగు స్థలమును బయలుపరచుచున్నాను, అతని సంతానమును అతని స్వజాతివారును అతని పొరుగువారును నాశన మగు చున్నారు, అతడును లేకపోవును.

10. For I have stripped Esau, I have uncovered their secret places; they shall have no power to hide themselves, they have perished, [each] by the hand of his brother, My neighbor, and it is impossible

11. అనాధులగు నీ పిల్లలను విడువుము, నేను వారిని సంరక్షించెదను, నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలెను.
1 తిమోతికి 5:5

11. for your fatherless one to be left to live, but I shall live, and the widows trust in Me.

12. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు న్యాయముచేత ఆ పాత్రలోనిది త్రాగను రానివారు నిశ్చయముగా దానిలోనిది త్రాగుచున్నారే, నీవుమాత్రము బొత్తిగా శిక్ష నొందకపోవుదువా? శిక్ష తప్పించుకొనక నీవు నిశ్చయముగా త్రాగుదువు.

12. For thus says the Lord: They who were not appointed to drink the cup have drunk; and you shall by no means be cleared.

13. బొస్రా పాడుగాను అపహాస్యాస్పదముగాను ఎడారి గాను శాపవచనముగాను ఉండుననియు, దాని పట్టణము లన్నియు ఎన్నటెన్నటికి పాడుగానుండుననియు నా తోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెల విచ్చుచున్నాడు.

13. For by Myself I have sworn, says the Lord, that you shall be in the midst of her an impassable [land], and a reproach, and a curse; and all her cities shall be deserted forever.

14. యెహోవా యొద్దనుండి నాకు వర్త మానము వచ్చెను; జనముల యొద్దకు దూత పంపబడి యున్నాడు, కూడికొని ఆమెమీదికి రండి యుద్ధమునకు లేచి రండి.

14. I have heard a report from the Lord, and He has sent messengers to the nations, [saying,] Assemble yourselves, and come against her; rise up to war.

15. జనములలో అల్పునిగాను మనుష్యులలో నీచునిగాను నేను నిన్ను చేయుచున్నాను.

15. I have made you small among the nations, utterly contemptible among men.

16. నీవు భీకరుడవు; కొండసందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరచుకొనువాడా, నీ హృదయగర్వము నిన్ను మోసపుచ్చెను, నీవు పక్షిరాజువలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను అక్కడనుండి నిన్ను క్రింద పడద్రోసెదను; ఇదే యెహోవా వాక్కు.

16. Your insolence has risen up against you, the fierceness of your heart has burst the holes of the rocks, it has seized upon the strength of a lofty hill; for as an eagle he set his nest on high; from there will I bring you down.

17. ఎదోము పాడైపోవును, దాని మార్గమున నడుచువారు ఆశ్చర్యపడి దాని యిడుమలన్నియు చూచి వేళాకోళము చేయుదురు.

17. And Edom shall be a desert; everyone that passes by shall hiss at it.

18. సొదొమయు గొమొఱ్ఱాయు వాటి సమీప పట్టణములును పడగొట్టబడిన తరువాత వాటిలో ఎవడును కాపురముండక పోయినట్లు ఏ మనుష్యుడును అక్కడ కాపురముండడు, ఏ నరుడును దానిలో బసచేయడు.

18. As Sodom and Gomorrah were overthrown, and they that sojourned in her, says the Lord Almighty, no man shall dwell there, nor shall any son of man inhabit there.

19. చిరకాలము నిలుచు నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యొర్దాను ప్రవాహములో నుండి సింహమువలె వచ్చుచున్నారు, నిమిషములోనే నేను వారిని దాని యొద్దనుండి తోలివేయుదును, నేనెవని నేర్పరతునో వానిని దానిమీద నియమించెదను; నన్ను పోలియున్న వాడై నాకు ఆక్షేపణ కలుగచేయువాడేడి? నన్ను ఎదిరింప గల కాపరియేడి?

19. Behold, he shall come up as a lion out of the midst of the Jordan to the place of Etham; for I will speedily drive them from it, and I will set the young men against her; for who is like Me? And who will withstand Me? And who [is] this shepherd, who shall confront Me?

20. ఎదోమునుగూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. తేమాను నివాసులనుగూర్చి ఆయన ఉద్దేశించినదాని వినుడి. నిశ్చయముగా మందలో అల్పులైన వారిని శత్రువులు లాగుదురు, నిశ్చయముగా వారి నివాస స్థలము వారినిబట్టి ఆశ్చర్యపడును.

20. Therefore hear the counsel of the Lord which He has framed against Edom, and his device, which he has devised against the inhabitants of Teman: surely the least of the sheep shall be swept off; surely their dwelling shall be made desolate for them.

21. వారు పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను; భూమి దానికి దద్దరిల్లుచున్నది, అంగలార్పు ఘోషయు ఎఱ్ఱసముద్రము దనుక వినబడెను.

21. For at the sound of their fall the earth was scared, and the cry of the sea was not heard.

22. శత్రువు పక్షిరాజువలె లేచి యెగిరి బొస్రామీద పడవలె నని తన రెక్కలు విప్పుకొనుచున్నాడు; ఆ దినమున ఎదోము బలాఢ్యుల హృదయములు ప్రసవించు స్త్రీ హృదయమువలె ఉండును.

22. Behold, He shall look [upon her] as an eagle, and spread forth [His] wings over her strongholds; and the heart of the mighty men of Edom shall be in that day as the heart of a woman in her pangs.

23. దమస్కును గూర్చిన వాక్కు. హమాతును అర్పాదును దుర్వార్త విని సిగ్గు పడు చున్నవి అవి పరవశములాయెను సముద్రముమీద విచారము కలదుదానికి నెమ్మదిలేదు.

23. Concerning Damascus: Hamath is brought to shame, and Arpad; for they have heard an evil report. They are amazed, they are angry, they shall be utterly unable to rest.

24. దమస్కు బలహీనమాయెను. పారిపోవలెనని అది వెనుకతీయుచున్నది వణకు దానిని పట్టెను ప్రసవించు స్త్రీని పట్టునట్లు ప్రయాసవేదనలు దానిని పట్టెను.

24. Damascus is utterly weakened, she is put to flight; trembling has seized upon her.

25. ప్రసిద్ధిగల పట్టణము బొత్తిగా విడువబడెను నాకు ఆనందమునిచ్చు పట్టణము బొత్తిగా విడువ బడెను.

25. How has she not left My city, they have loved the village?

26. ఆమె ¸యౌవనులు ఆమె వీధులలో కూలుదురు ఆ దినమున యోధులందరు మౌనులైయుందురు ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు.

26. Therefore shall the young men fall in your streets, and all your warriors shall fall, says the Lord.

27. నేను దమస్కు ప్రాకారములో అగ్ని రాజబెట్టెదను అది బెన్హదదు నగరులను కాల్చివేయును.

27. And I will kindle a fire in the wall of Damascus, and it shall devour the streets of the son of Ader.

28. బబులోనురాజైన నెబుకద్రెజరు కొట్టిన కేదారును గూర్చియు హాసోరు రాజ్యములనుగూర్చియు యెహోవా సెల విచ్చినమాట లేచి కేదారునకు వెళ్లుడి తూర్పుదేశస్థులను దోచు కొనుడి.

28. Concerning Kedar, the queen of the palace, whom Nebuchadnezzar king of Babylon struck, thus says the Lord: Arise, and go up to Kedar, and fill the sons of Kedem.

29. వారి గుడారములను గొఱ్ఱెల మందలను శత్రువులు కొనిపోవుదురు తెరలను ఉపకరణములను ఒంటెలను వారు పట్టు కొందురు నఖముఖాల భయమని వారు దానిమీద చాటింతురు

29. They shall take their tents and their sheep, they shall take for themselves their garments, and all their baggage and their camels; and summon destruction against them from every side.

30. హాసోరు నివాసులారా, బబులోనురాజైన నెబుకద్రెజరు మీమీదికి రావలెనని ఆలోచన చేయుచున్నాడు మీమీద పడవలెనను ఉద్దేశముతో ఉన్నాడు యెహోవా వాక్కు ఇదే పారిపోవుడి బహులోతున వెళ్లుడి అగాధస్థలములలో దాగుడి

30. Flee, dig very deep for a dwelling place, you that dwell in the palace; for the king of Babylon has framed a counsel, and devised a device against you.

31. మీరు లేచి ఒంటరిగా నివసించుచు గుమ్మములు పెట్టకయు గడియలు అమర్చకయు నిశ్చింతగాను క్షేమముగాను నివసించు జనముమీద పడుడి.

31. Rise up, and go up against a nation settled [and] dwelling at ease, who have no doors, nor bolts, nor bars, [who] dwell alone.

32. వారి ఒంటెలు దోపుడుసొమ్ముగా ఉండును వారి పశువులమందలు కొల్లసొమ్ముగా ఉండును గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొనువారిని నఖముఖాల చెదరగొట్టుచున్నాను నలుదిక్కులనుండి ఉపద్రవమును వారిమీదికి రప్పించుచున్నాను ఇదే యెహోవా వాక్కు,

32. And their camels shall be a spoil, and the multitude of their cattle shall be destroyed; and I will scatter them as chaff with every wind, having their hair cut about their foreheads; I will bring on their overthrow from all sides, says the Lord.

33. హాసోరు చిరకాలము పాడై నక్కలకు నివాస స్థలముగా ఉండును అక్కడ ఏ మనుష్యుడును కాపురముండడు ఏ నరుడును దానిలో బసచేయడు.

33. And the palace shall be a resting place for ostriches, and desolate forever. No man shall abide there, and no son of man shall dwell there.

34. యూదారాజైన సిద్కియా యేలుబడి ఆరంభములో యెహోవా వాక్కు ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమై ఏలామునుగూర్చి

34. The prophecies of Jeremiah against the nations of Elam:

35. ఈలాగు సెలవిచ్చెనుసైన్యములకధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగానేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచు చున్నాను.

35. Thus says the Lord: The bow of Elam is broken, [even] the chief of their power.

36. నలుదిశలనుండి నాలుగు వాయువులను ఏలాముమీదికి రప్పించి, నలుదిక్కులనుండి వచ్చువాయు వులవెంట వారిని చెదరగొట్టుదును, వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమేదియు నుండదు.
ప్రకటన గ్రంథం 7:1

36. And I will bring upon Elam the four winds from the four corners of heaven, and I will disperse them toward all these winds; and there shall be no nation [to] which they shall not come, [even] the outcasts of Elam.

37. మరియు వారి శత్రువులయెదుటను వారి ప్రాణము తీయజూచు వారియెదుటను ఏలామును భయపడ జేయుదును, నా కోపాగ్నిచేత కీడును వారి మీదికి నేను రప్పించుదును, వారిని నిర్మూలము చేయువరకు వారివెంట ఖడ్గము పంపు చున్నాను; ఇదే యెహోవా వాక్కు.

37. And I will put them in fear before their enemies that seek their life; and I will bring evils upon them according to My great anger; and I will send forth My sword after them, until I have utterly destroyed them.

38. నా సింహాసనమును అచ్చటనే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనముచేయుదును; ఇదే యెహోవా వాక్కు.

38. And I will set My throne in Elam, and I will send forth from there king and rulers.

39. అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరల రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు.

39. But it shall come to pass at the end of days, that I will turn the captivity of Elam, says the Lord.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Jeremiah - యిర్మియా 49 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

అమ్మోనీయులకు సంబంధించిన ప్రవచనాలు. (1-6) 
మనుష్యుల మధ్య హక్కుకు వ్యతిరేకంగా తరచుగా ప్రబలంగా ఉండవచ్చు, అయినప్పటికీ అది సర్వశక్తిమంతుడిచే నియంత్రించబడుతుంది, ఎవరు సరైన తీర్పునిస్తారు; మరియు వారు తమను తాము తప్పుగా భావిస్తారు, అమ్మోనీయుల వలె, వారు తమ చేతులు వేయగల ప్రతి విషయాన్ని తమ స్వంతంగా భావిస్తారు. నిజాయితీ లేని ప్రతి సందర్భానికి, ముఖ్యంగా నిరుపేదలకు లెక్క చెప్పమని ప్రభువు మనుష్యులను పిలుస్తాడు.

ఎదోమీయులు. (7-22) 
ఎదోమీయులు చాలాకాలంగా ఇశ్రాయేలీయులకు విరోధులుగా ఉన్నారు, వారు దేవుని ఎన్నుకోబడిన ప్రజలుగా పరిగణించబడ్డారు. అయితే, వారి లెక్కింపు సమయం వచ్చేసింది. ఈ ప్రవచనాత్మక ప్రకటన ఎదోమీయులకు ఒక హెచ్చరికగా మాత్రమే కాకుండా తమ శత్రువుల చేతుల్లో అదనపు బాధలను సహించిన ఇశ్రాయేలీయులకు ఓదార్పునిస్తుంది. దైవిక తీర్పులు వివిధ దేశాల గుండా ఎలా తిరుగుతాయో, ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలాన్ని ఏర్పరుస్తున్నాయని ఇది వివరిస్తుంది, దైవిక ప్రతీకార ఏజెంట్ల నుండి ఎవరూ అతీతులు కారు. మానవ హింస వల్ల ఏర్పడే గందరగోళాల మధ్య, దేవుని నీతిని గుర్తించడం మరియు సమర్థించడం చాలా కీలకం.

సిరియన్లు. (23-27) 
వారి ధైర్యసాహసాలకు అత్యంత ప్రసిద్ధి చెందిన దేశాల ఆత్మలను దేవుడు ఎంత అప్రయత్నంగా తగ్గించగలడనేది విశేషమైనది. డమాస్కస్ వంటి నగరం కూడా తన బలాన్ని కోల్పోతుంది. ఒకానొక సమయంలో, ఇది మానవత్వం అందించే అన్ని ఆనందాలతో నిండిన గొప్ప ఆనందకరమైన ప్రదేశం. అయితే, తమ ఆనందాన్ని కేవలం ప్రాపంచిక సుఖాలలో మాత్రమే కనుగొనే వారు తమను తాము భ్రమింపజేసుకుంటున్నారు.

ది కెదరనీస్. (28-33) 
అరేబియా ఎడారులలో నివసించే కేదార్ నివాసులకు నాశనాన్ని తీసుకురావాలని నెబుచాడ్నెజార్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. అనేక బలీయమైన నగరాలను జయించిన వ్యక్తి కూడా గుడారాలలో నివసించే వారిని విడిచిపెట్టడు. అతని ప్రేరణలు వ్యక్తిగత దురాశ మరియు ఆశయంతో నడిచేవి, కానీ కృతజ్ఞత లేని ప్రజలను క్రమశిక్షణలో ఉంచడం మరియు వారు అత్యంత సురక్షితంగా ఉన్నప్పుడు ఇబ్బందులు తలెత్తగలవని అజాగ్రత్త ప్రపంచానికి ముందే హెచ్చరించడం దేవుని దివ్య ప్రణాళిక. ఈ ప్రజలు చెదరగొట్టబడతారు, మారుమూల ఎడారి ప్రాంతాలలో ఆశ్రయం పొందారు మరియు వారు చెదరగొట్టబడతారు. అయితే, ఏకాంతం మరియు అస్పష్టత ఎల్లప్పుడూ భద్రత మరియు రక్షణకు హామీ ఇవ్వవని గుర్తుంచుకోవడం చాలా అవసరం.

ది ఎలామైట్స్. (34-39)
ముఖ్యంగా పర్షియన్లు అయిన ఎలమైట్‌లు, దేవుని ప్రజలైన ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా వ్యవహరించారు మరియు వారి చర్యల యొక్క పరిణామాలను వారు ఎదుర్కొంటారు. పాపులు చివరికి వారి చెడు పనుల పర్యవసానాలను వెంబడిస్తారు. వారు తన సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తారని దేవుడు నిర్ధారిస్తాడు. అయితే, ఎలాం నాశనం శాశ్వతం కాదని గమనించడం ముఖ్యం; ఈ వాగ్దానం మెస్సీయ కాలంలో పూర్తిగా నెరవేరుతుంది.
చర్చి యొక్క ప్రత్యర్థులందరి ఓటమి యొక్క దైవిక హామీని చదివినప్పుడు, ఈ పవిత్ర యుద్ధం యొక్క ఫలితం నిస్సందేహంగా దేవుని ప్రజలకు అనుకూలంగా ఉందని విశ్వాసులు భరోసా పొందుతారు. మన పక్షాన ఉన్నవాడు మనల్ని వ్యతిరేకించే దేనికన్నా గొప్పవాడని, మన ఆత్మల శత్రువులపై ఆయన విజయం సాధిస్తాడని గుర్తుంచుకోవడం ఓదార్పునిస్తుంది.



Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |