Jeremiah - యిర్మియా 38 | View All

1. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ పట్టణములో నిలిచియున్నవారు ఖడ్గముచేతనైనను క్షామము చేతనైనను తెగులుచేతనైనను చత్తురు గాని కల్దీయులయొద్దకు బయలు వెళ్లువారు బ్రదుకుదురు, దోపుడుసొమ్ముదక్కించు కొనునట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రదుకుదురు.

1. Saphatiah the son of Mathan, Godoliah the son of Phashur, and Jucal the son of Selemiah, and Phashur the son of Melchiah, perceived the words, that Jeremy had spoken unto all the people, namely on this manner:

2. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ పట్టణము నిశ్చయముగా బబులోనురాజు దండుచేతికి అప్పగింపబడును, అతడు దాని పట్టుకొనును అని యిర్మీయా ప్రజల కందరికి ప్రకటింపగా

2. Thus sayeth the LORD: Who so remaineth in this city, shall perish, either with the sword, with hunger or with pestilence: But who so falleth unto the Caldees, shall escape, winning his soul for a pray, and shall live.

3. మత్తాను కుమారుడైన షెఫట్య యును పషూరు కుమారుడైన గెదల్యాయును షెలెమ్యా కుమారుడైన యూకలును మల్కీయా కుమారుడైన పషూరును వినిరి గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసిన దేమనగా ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడేగాని క్షేమము కోరువాడుకాడు.

3. For thus sayeth the LORD. This city (no doubt) must be delivered into the power of the king of Babylon, and he also shall win it.

4. ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుటవలన ఈ పట్టణ ములో నిలిచియున్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు; చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము.

4. Then said the princes unto the king: Sir, we beseech you let this man be put to death; For thus he discourageth the hands of the soldiers that be in this city, and the hands of all the people, when he speaketh such words unto them. This man verily laboureth not for peace of the people, but mischief.

5. అందుకు రాజైన సిద్కియా అతడు మీవశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడనగా

5. Zedekiah the king answered and said: Lo, he is in your hands, for the king may deny you nothing.

6. వారు యిర్మీయాను పట్టుకొని కారా గృహములోనున్న రాజకుమారుడగు మల్కీయా గోతి లోనికి దింపిరి. అందులోనికి యిర్మీయాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురదమాత్రమే యుండెను, ఆ బురదలో యిర్మీయా దిగబడెను.
హెబ్రీయులకు 11:36

6. Then took they Jeremy, and cast him into the dungeon of Melchiah the son of Hamelech, that dwelt in the fore entry of the prison. And they let down Jeremy with cords into a dungeon, where there was no water, but mire.

7. రాజు బెన్యామీను ద్వారమున కూర్చునియుండగా రాజు ఇంటి లోని కూషీయుడగు ఎబెద్మెలెకను షండుడు,

7. So Jeremy stack fast in the mire. Now when Abedmelech the Morian being a chamberlain in the king's court, understood, that they had cast Jeremy in to the dungeon:

8. వారు యిర్మీ యాను గోతిలో వేసిరను సంగతి విని, రాజు నగరులో నుండి బయలువెళ్లి రాజుతో ఈలాగు మనవి చేసెను

8. he went out of the king's house, and spake to the king, (which then sat under the port of Ben Jamin) these words:

9. రాజా, నా యేలినవాడా, ఆ గోతిలో వేయబడిన యిర్మీయా అను ప్రవక్తయెడల ఈ మనుష్యులు చేసినది యావత్తును అన్యాయము; అతడున్న చోటను అతడు అకలిచేత చచ్చును, పట్టణములోనైనను ఇంకను రొట్టె లేమియు లేవు.

9. My lord the king, where as these men meddle with Jeremy the prophet, they do him wrong: Namely, in that they have put him in prison, there to die of hunger for there is no more bread in the city.

10. అందుకు రాజునీవు ఇక్కడనుండి ముప్పదిమంది మనుష్యులను వెంటబెట్టుకొనిపోయి, ప్రవక్త యైన యిర్మీయా చావకమునుపు ఆ గోతిలోనుండి అతని తీయించుమని కూషీయుడగు ఎబెద్మెలెకునకు సెలవియ్యగా

10. Then the king commanded Abedmelech the Morian and said: Take from hence thirty men whom thou wilt, and draw up Jeremy the prophet out of the dungeon, before he die.

11. ఎబెద్మెలెకు ఆ మనుష్యులను వెంటబెట్టు కొని రాజనగరులో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి,

11. So Abedmelech took the men with him, and went to the house of Amalech, and there under an almery he gat old rags and worn clothes, and let them down by a cord, into the dungeon to Jeremy.

12. అచ్చటనుండి పాతవైన చింకిబట్టలను చిరిగి చీరాకులైన గుడ్డపాతలను తీసికొని పోయి, ఆ గోతిలోనున్న యిర్మీయా పట్టుకొనునట్లుగా త్రాళ్లచేత వాటినిదింపిపాతవై చిరిగి చీరాకులైన యీ బట్టలను త్రాళ్లమీద నీ చంకలక్రింద పెట్టుకొనుమని అతనితో చెప్పెను.

12. And Abedmelech the Morian said unto the prophet Jeremy: O put these rags and clothes under thine arm holes, betwixt them and the cords: And Jeremy did so.

13. యిర్మీయా ఆలాగు చేయగా వారు యిర్మీయాను త్రాళ్లతో చేదుకొని ఆ గోతిలోనుండి వెలుపలికి తీసిరి; అప్పుడు యిర్మీయా బందీగృహశాలలో నివసించెను.

13. So they drew up Jeremy with cords and took him out of the dungeon, and he remained in the fore entry of the prison.

14. తరువాత రాజైన సిద్కియా యెహోవా మందిరములో నున్న మూడవ ద్వారములోనికి ప్రవక్తయైన యిర్మీయాను పిలువనంపించి అతనితో ఇట్లనెనునేను ఒకమాట నిన్నడుగుచున్నాను, నీవు ఏ సంగతిని నాకు మరుగు చేయక దాని చెప్పుమనగా

14. Then Zedekiah the king sent and caused Jeremy the prophet be called unto him, into the third entry, that was by the house of the LORD. And the king said unto Jeremy: I will ask thee somewhat but hide nothing from me.

15. యిర్మీయా నేను ఆ సంగతి నీకు తెలియజెప్పినయెడల నిశ్చయముగా నీవు నాకు మరణ శిక్ష విధింతువు, నేను నీకు ఆలోచన చెప్పినను నీవు నా మాట వినవు.

15. Then Jeremy answered Zedekiah: If I be plain unto thee, thou wilt cause me suffer death: If I give thee counsel, thou wilt not follow me.

16. కావున రాజైన సిద్కియా జీవాత్మను మన కనుగ్రహించు యెహోవాతోడు నేను నీకు మరణము విధింపను, నీ ప్రాణము తీయ జూచుచున్న యీ మనుష్యుల చేతికి నిన్ను అప్పగింపను అని యిర్మీయాతో రహస్యముగా ప్రమాణము చేసెను.

16. So the king swore an oath secretly unto Jeremy, saying: As truly as the LORD liveth, that made us these souls, I will not slay thee, nor give thee in to the hands of them that seek after thy life.

17. అప్పుడు యిర్మీయా సిద్కియాతో ఇట్లనెనుదేవుడు, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునైన యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడునీవు బబులోనురాజు అధిపతులయొద్దకు వెళ్లిన యెడల నీవు బ్రదికెదవు, ఈ పట్టణము అగ్నిచేత కాల్చబడదు, నీవును నీ యింటివారును బ్రదుకుదురు.

17. Then said Jeremy unto Zedekiah: Thus sayeth the LORD of Hosts the God of Israel: If cause be, that thou wilt go forth unto the king of Babylon's princes, thou shalt save thy life, and this city shall not be brent, yea both thou and thy household shall escape with your lives.

18. అయితే నీవు బబులోను అధిపతుల యొద్దకు వెళ్లనియెడల ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడును, వారు అగ్ని చేత దాని కాల్చివేసెదరు, మరియు నీవు వారి చేతిలో నుండి తప్పించుకొనజాలవు.

18. But if thou wilt not go forth to the king of Babylon's princes, then shall this city be delivered into the hands of the Caldees which shall set fire upon it, and thou shalt not be able to escape them.

19. అందుకు రాజైన సిద్కియా యిర్మీయాతో ఇట్లనెనుకల్దీయుల పక్షముగా ఉండు యూదులకు భయపడుచున్నాను; ఒకవేళ కల్దీయులు నన్ను వారి చేతికి అప్పగించినయెడల వారు నన్ను అపహసించెదరు.

19. And Zedekiah said unto Jeremy: I am afraid for the Jews, that are fled unto the Caldees, lest I come in their hands, and so they to have me in derision.

20. అందుకు యిర్మీయావారు నిన్నప్పగింపరు, నీవు బ్రదికి బాగుగానుండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతినిగూర్చి యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము.

20. But Jeremy answered: No, they shall not betray thee: O hearken unto the voice of the LORD (I beseech thee) which I speak unto thee, so shalt thou be well, and save thy life.

21. నీవు ఒకవేళ బయలు వెళ్లక పోయినయెడల యెహోవా ఈ మాట నాకు తెలియజేసెను.

21. But if thou wilt not go forth, the LORD hath told me this plainly:

22. యూదా రాజు నగరులో శేషించియున్న స్త్రీలందరు బబులోను అధిపతులయొద్దకు కొనిపోబడెదరు, ఆలాగు జరుగగా ఆ స్త్రీలు నిన్ను చూచినీ ప్రియస్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైని విజయము పొందియున్నారు, నీ పాదములు బురదలో దిగబడియుండగా వారు వెనుకతీసిరని యందురు.

22. Behold, all the women that are left in the king of Judah's house, shall go out to the king of Babylon's princes. For they think, that thou art deceived: and that the men in whom thou didst put thy trust, have gotten thee under, and set thy feet fast in the mire, and gone their way from thee.

23. నీ భార్యలందరును నీ పిల్లలును కల్దీయులయొద్దకు కొనిపోబడుదురు, నీవు వారి చేతిలోనుండి తప్పించుకొనజాలక బబులోను రాజుచేత పట్టబడెదవు గనుక ఈ పట్టణమును అగ్నిచేత కాల్చుటకు నీవే కారణమగుదువు.

23. Therefore all thy wives with their children shall flee unto the Caldees, and thou shalt not escape their hands, but shalt be the king of Babylon's prisoner, and this city shall be brent.

24. అందుకు సిద్కియా యిర్మీయాతో ఇట్లనెనునీవు మరణశిక్ష నొంద కుండునట్లు ఈ సంగతులను ఎవనికిని తెలియనియ్యకుము.

24. Then said Zedekiah unto Jeremy: Look that no body know of these words, and thou shalt not die.

25. నేను నీతో మాటలాడిన సంగతి అధిపతులు వినినయెడల వారు నీయొద్దకు వచ్చి మేము నిన్ను చంపకుండునట్లు రాజుతో నీవు చెప్పిన సంగతిని రాజు నీతో చెప్పిన సంగతిని మరుగుచేయక మాకిప్పుడే తెలియజెప్పుమనగా

25. But if the princes perceive, that I have talked with thee, and come unto thee, saying: O speak, what said the king to thee? hide it not from us, and we will not put thee to death. Tell us (we pray thee) what said the king to thee?

26. నీవు యోనాతాను ఇంటిలో నేను చనిపోకుండ అక్కడికి నన్ను తిరిగి వెళ్లనంపవద్దని రాజు ఎదుట నేను మనవి చేసికొనబోతినని వారితో చెప్పుమని రాజు యిర్మీయాతో అనెను.

26. See thou give them this answer: I have humbly besought the king, that he will let me lie no more in Jehonathan's house, that I die not there.

27. అంతట అధిపతులందరు యిర్మీయాయొద్దకు వచ్చి యడుగగా అతడు రాజు సెలవిచ్చిన మాటల ప్రకార ముగా వారికుత్తరమిచ్చి ఆ సంగతి వారికి తెలియజేయనందున వారు అతనితో మాటలాడుట మానిరి.

27. Then came all the princes unto Jeremy, and asked him. And he told them, after the manner as the king bade him. Then they held their peace, for they perceived nothing.

28. యెరూష లేము పట్టబడువరకు యిర్మీయా బందీగృహశాలలో ఉండెను.

28. So Jeremy abode still in the fore entry of the prison, until the day that Jerusalem was won.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Jeremiah - యిర్మియా 38 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

యిర్మీయా చెరసాలలో పడవేయబడ్డాడు, అక్కడ నుండి ఇథియోపియన్ అతనిచే బట్వాడా చేయబడతాడు. (1-13) 
యిర్మీయా తన నిబద్ధతలో అస్థిరమైన తన సూటిగా ఉపదేశాన్ని కొనసాగించాడు. రాకుమారులు తమ దుర్మార్గపు మార్గాలను కొనసాగించారు. పాపాత్ములైన వ్యక్తులు దేవుని నమ్మకమైన పరిచారకులను విరోధులుగా పరిగణించడం ఒక సాధారణ సంఘటన, ఎందుకంటే ఈ పరిచారకులు పశ్చాత్తాపపడని దుష్టులలోని శత్రుత్వాన్ని బహిర్గతం చేస్తారు. యిర్మీయా ఒక చెరసాలలో బంధించబడ్డాడు, రహస్యంగా ఖైదు చేయబడిన అనేకమంది దేవుని నమ్మకమైన సేవకులు ఈ విధిని పంచుకున్నారు. ఇథియోపియాకు చెందిన ఎబెద్-మెలెకు రాజును నిర్భయంగా ఎదుర్కొంటూ, "ఈ మనుష్యులు యిర్మీయాకు చేసినదంతా తప్పుగా ప్రవర్తించారు." కష్ట సమయాల్లో దేవుడు తన ప్రజల కోసం మిత్రులను ఎలా పెంచుకుంటాడో సాక్ష్యమివ్వండి. ప్రవక్త విడుదల కొరకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి మరియు ఎబెద్-మెలెకు గొయ్యి నుండి అతనిని రక్షించడాన్ని చూశాడు. దేవుని విషయానికి ధైర్యంగా నిలబడటానికి ఇది మనల్ని ప్రేరేపించనివ్వండి. ఈ రోజు మనం చేసే విధంగానే ఆ కాలపు పాత్రలలో మనం అదే నమూనాను గమనించవచ్చు: ప్రభువు పిల్లలు ఆయన మాదిరిని అనుకరిస్తారు, అయితే సాతాను పిల్లలు తమ యజమానిని ప్రతిబింబిస్తారు.

అతను కల్దీయులకు లొంగిపోవాలని రాజుకు సలహా ఇస్తాడు. (14-28)
హెచ్చరికలను పునరుద్ఘాటించడానికి యిర్మీయా సంకోచించాడు, అలా చేయడం వలన తన ప్రాణాలను ప్రమాదంలో పడేసినట్లు మరియు రాజు యొక్క అపరాధాన్ని మరింత పెంచినట్లు కనిపించింది. బదులుగా, అతను దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి రాజు భయపడుతున్నాడా అని అడిగాడు. దేవునికి ఎంత తక్కువ మంది భయపడితే, ఇతర మనుషులకు అంతగా భయపడటం సర్వసాధారణం. తరచుగా, వారు తమ సొంత తీర్పులు మరియు మనస్సాక్షికి అనుగుణంగా వ్యవహరించడానికి ఇష్టపడరు.



Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |