సమరయ (వ 5), ఎఫ్రాయిం (వ 6,9,18,20), అనే పేర్లు కనిపిస్తున్నాయి కాబట్టి ఇది ఉత్తర దిశన ఉన్న పది గోత్రాల సంగతి అని స్పష్టం అవుతున్నది. ఉత్తర రాజ్యం ముఖ్య పట్టణం సమరయ క్రీ.పూ. 721లో శత్రువుల హస్తగతమైంది. అప్పటినుండి ఇప్పటిదాకా ఇస్రాయేల్ ప్రజలు దేవుణ్ణి తిరిగి ఆశ్రయించి సమరయను వశపరచుకోలేదు. ప్రస్తుతం ఇస్రాయేల్ సమరయ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది గాని ఒక జాతిగా అదింకా అపనమ్మకంలోనే ఉంటూ తమ అభిషిక్తుడూ ప్రభువూ అయిన యేసుక్రీస్తును నిరాకరిస్తూ ఉంది. ఈ భవిష్యద్వాక్కులు గతంలో సంపూర్ణంగా నెరవేరలేదు కాబట్టి రాబోయే కాలంలో ఈ నెరవేర్పు కలుగుతుందని మనం ఎదురు చూడవచ్చు.