Jeremiah - యిర్మియా 28 | View All

1. యూదారాజైన సిద్కియా యేలుబడి ఆరంభమున నాల్గవ సంవత్సరము అయిదవ నెలలో గిబియోనువాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడునైన హనన్యా యాజకుల యెదుటను ప్రజలందరియెదుటను యెహోవా మందిరములో నాతో ఈలాగనెను.

1. That same year, in the fifth month of the fourth year that Zedekiah was king, Hananiah son of Azzur, a prophet from the town of Gibeon, spoke to me in the Temple. In the presence of the priests and of the people he told me

2. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను బబులోనురాజు కాడిని విరిచియున్నాను.

2. that the LORD Almighty, the God of Israel, had said: 'I have broken the power of the king of Babylonia.

3. రెండు సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్రెజరు ఈ స్థలములోనుండి బబులోనునకు తీసికొనిపోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటిని ఇచ్చటికి మరల తెప్పించెదను.

3. Within two years I will bring back to this place all the Temple treasures that King Nebuchadnezzar took to Babylonia.

4. బబులోను రాజు కాడిని విరుగగొట్టి యెహోయాకీము కుమారుడును యూదారాజునైన యెకోన్యాను, బబులోనునకు చెరగొని పోయిన యూదులనందిరిని, యీ స్థలమునకు తిరిగి రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు.

4. I will also bring back the king of Judah, Jehoiachin son of Jehoiakim, along with all of the people of Judah who went into exile in Babylonia. Yes, I will break the power of the king of Babylonia. I, the LORD, have spoken.'

5. అప్పుడు ప్రవక్తయైన యిర్మీయా యాజకులయెదుటను యెహోవా మందిరములో నిలుచుచున్న ప్రజలందరి యెదుటను ప్రవక్తయైన హనన్యాతో ఇట్లనెను

5. Then in the presence of the priests and of all the people who were standing in the Temple, I said to Hananiah,

6. ఆలాగున జరుగునుగాక, యెహోవా ఆలాగుననే చేయునుగాక, యెహోవా మందిరపు ఉపకరణములన్నిటిని, చెరగొనిపోబడిన వారి నందరిని యెహోవా బబులోనులోనుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చునుగాక.

6. 'Wonderful! I hope the LORD will do this! I certainly hope he will make your prophecy come true and will bring back from Babylonia all the Temple treasures and all the people who were taken away as prisoners.

7. అయినను నేను నీ చెవులలోను ఈ ప్రజలందరి చెవులలోను చెప్పుచున్న మాటను చిత్తగించి వినుము.

7. But listen to what I say to you and to the people.

8. నాకును నీకును ముందుగా నున్న ప్రవక్తలు, అనేకదేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు, కీడు సంభవించుననియు, తెగులుకలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచు వచ్చిరి.

8. The prophets who spoke long ago, before my time and yours, predicted that war, starvation, and disease would come to many nations and powerful kingdoms.

9. అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త యున్నాడే, అతని మాట నెరవేరినయెడల యెహోవా నిజముగా అతని పంపెనని యొప్పుకొనదగునని ప్రవక్తయైన యిర్మీయా చెప్పగా

9. But a prophet who predicts peace can only be recognized as a prophet whom the LORD has truly sent when that prophet's predictions come true.'

10. ప్రవక్తయైన హనన్యా ప్రవక్తయైన యిర్మీయా మెడ మీదనుండి ఆ కాడిని తీసి దాని విరిచి

10. Then Hananiah took the yoke off my neck, broke it in pieces,

11. ప్రజలందరి యెదుట ఇట్లనెను యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు రెండు సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్రెజరు కాడిని సర్వజనముల మెడమీద నుండి తొలగించి దాని విరిచివేసెదను; అంతట ప్రవక్తయైన యిర్మీయా వెళ్లిపోయెను.

11. and said in the presence of all the people, 'The LORD has said that this is how he will break the yoke that King Nebuchadnezzar has put on the neck of all the nations; and he will do this within two years.' Then I left.

12. ప్రవక్తయైన హనన్యా ప్రవక్తయైన యిర్మీయా మెడ మీదనున్న కాడిని విరిచిన తరువాత యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

12. Some time after this the LORD told me

13. నీవు పోయి హనన్యాతో ఇట్లనుము యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీవు కొయ్యకాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనుపకాడిని చేయించవలెను.

13. to go and tell Hananiah: 'The LORD has said that you may be able to break a wooden yoke, but he will replace it with an iron yoke.

14. ఇశ్రా యేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ జనులందరును బబులోను రాజైన నెబుకద్రెజరునకు దాసులు కావలెనని వారి మెడమీద ఇనుపకాడి యుంచితిని గనుక వారు అతనికి దాసులగుదురు, భూజంతువులను కూడ నేను అతనికి అప్పగించియున్నాను.

14. The LORD Almighty, the God of Israel, has said that he will put an iron yoke on all these nations and that they will serve King Nebuchadnezzar of Babylonia. The LORD has said that he will make even the wild animals serve Nebuchadnezzar.'

15. అంతట ప్రవక్తయైన యిర్మీయా ప్రవక్తయైన హనన్యాతో ఇట్లనెనుహనన్యా వినుము;యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు.

15. Then I told Hananiah this, and added, 'Listen, Hananiah! The LORD did not send you, and you are making these people believe a lie.

16. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడుభూమిమీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను, యెహోవా మీద తిరుగుబాటుచేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమౌదువు అని చెప్పెను.

16. And so the LORD himself says that he is going to get rid of you. Before this year is over you will die because you have told the people to rebel against the LORD.'

17. ఆ సంవత్సరమే యేడవ నెలలో ప్రవక్తయైన హనన్యా మృతినొందెను.

17. And Hananiah died in the seventh month of that same year.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Jeremiah - యిర్మియా 28 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఒక తప్పుడు ప్రవక్త యిర్మీయాను వ్యతిరేకించాడు. (1-9) 
యూదు ప్రజలను పశ్చాత్తాపపడి దేవుని వైపుకు తిరిగి రావాలని ప్రోత్సహించే ఎలాంటి తెలివైన సలహా లేకుండా హనన్యా మోసపూరితమైన ప్రవచనాన్ని అందించాడు. బదులుగా, అతను దేవుని పేరులో తాత్కాలిక ప్రాపంచిక ఆశీర్వాదాల వాగ్దానాలను అందించాడు, దేవుడు ఎల్లప్పుడూ భూసంబంధమైన శ్రేయస్సుతో కూడిన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను విస్మరించాడు. యిర్మీయా ప్రజలకు వ్యతిరేకంగా ప్రవచించినప్పటికీ, ఈ సంఘటన మొదటిసారి కాదు. హనన్యా మాటల్లోని అబద్ధాన్ని బట్టబయలు చేయడానికి అతను ఈ చరిత్రను ప్రస్తావించాడు.
శాంతి మరియు శ్రేయస్సు గురించి మాత్రమే మాట్లాడే ఒక ప్రవక్త, దేవుని అనుగ్రహాన్ని పొందేందుకు ఉద్దేశపూర్వకంగా పాపం చేయకుండా ఉండవలసిన అవసరాన్ని నొక్కి చెప్పడంలో విఫలమయ్యాడు, అతను తప్పుడు ప్రవక్తగా నిరూపించబడ్డాడు. దేవుని వాక్యంలోని ఓదార్పునిచ్చే మరియు హెచ్చరించే రెండు అంశాలను ప్రకటించని, పశ్చాత్తాపం, విశ్వాసం మరియు పవిత్రతకు ప్రజలను పిలవని వారు అబద్ధ ప్రవక్తల అడుగుజాడలను అనుసరిస్తారు. క్రీస్తు సువార్త పశ్చాత్తాపానికి అనుగుణమైన ఫలాలను ఉత్పత్తి చేయమని వ్యక్తులను ప్రోత్సహిస్తుంది కానీ పాపపు మార్గాల్లో కొనసాగడానికి ఎటువంటి ఆమోదాన్ని అందించదు.

తప్పుడు ప్రవక్త తన మరణం గురించి హెచ్చరించాడు. (10-17)
హనన్యా యొక్క విధి మూసివేయబడింది మరియు యిర్మీయా, దైవిక మార్గదర్శకత్వం పొందిన తర్వాత, నిర్భయంగా అతనికి ఈ సందేశాన్ని అందజేస్తాడు. అయితే, యిర్మీయా ఈ కమీషన్ అందుకున్న తర్వాత మాత్రమే చేస్తాడు. దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తూ తమ హృదయాలను కఠినం చేసుకున్నప్పటికీ, పాపులకు శాంతిని ప్రసాదించే వారు గొప్ప బాధ్యత వహిస్తారు.
దేవుని సేవకుడు అన్ని వ్యక్తుల పట్ల మృదుత్వాన్ని ప్రదర్శించాలి, వారి స్వంత హక్కులను కూడా అప్పగించాలి మరియు వారి తరపున వాదించడానికి ప్రభువును అప్పగించాలి. దేవుని ఉద్దేశాలను అడ్డుకోవడానికి భక్తిహీనులు చేసే ఏ ప్రయత్నమైనా వారి స్వంత బాధలను మాత్రమే పెంచుతుంది.



Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |