Jeremiah - యిర్మియా 26 | View All

1. యోషీయా కుమారుడును యూదారాజునగు యెహోయాకీము ఏలుబడి ఆరంభములో యెహోవా యొద్దనుండి వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

1. yōsheeyaa kumaaruḍunu yoodhaaraajunagu yehōyaakeemu ēlubaḍi aarambhamulō yehōvaa yoddhanuṇḍi vaakku pratyakshamai yeelaagu selavicchenu.

2. యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, నీవు యెహోవా మందిరావరణములో నిలిచి, నేను నీ కాజ్ఞాపించు మాటలన్నిటిని యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికి ప్రకటింపుము; వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు.

2. yehōvaa aagna ichunadhemanagaa, neevu yehōvaa mandiraavaraṇamulō nilichi, nēnu nee kaagnaapin̄chu maaṭalanniṭini yehōvaa mandiramulō aaraadhin̄chuṭakai vachu yoodhaa paṭṭaṇasthulandariki prakaṭimpumu; vaaṭilō oka maaṭainanu cheppaka viḍavakooḍadu.

3. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలచిన కీడును చేయక నేను సంతాపపడునట్లుగా వారు ఆలకించి తన దుర్మార్గము విడుచుదురేమో.

3. vaari durmaargamunu baṭṭi vaariki cheyadalachina keeḍunu cheyaka nēnu santhaapapaḍunaṭlugaa vaaru aalakin̄chi thana durmaargamu viḍuchudurēmō.

4. నీవు వారితో ఈ మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చునదేమనగా

4. neevu vaarithoo ee maaṭa cheppavalenu. Yehōvaa selavichunadhemanagaa

5. మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రము ననుసరించి నడుచు కొనుడనియు, నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులగు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి.

5. meeru naa maaṭalu vini nēnu meeku niyamin̄china dharmashaastramu nanusarin̄chi naḍuchu konuḍaniyu, nēnu pendalakaḍa lēchi pampuchunna naa sēvakulagu pravakthala maaṭalanu aṅgeekarin̄chuḍaniyu nēnu meeku aagna iyyagaa meeru vinakapōthiri.

6. మీరీలాగున చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమున కును చేసెదను, ఈ పట్టణమును భూమిమీదనున్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసెదను.

6. meereelaaguna chesinanduna nēnu shilōhunaku chesinaṭlu ee mandiramuna kunu chesedanu, ee paṭṭaṇamunu bhoomimeedanunna samastha janamulaku shaapaaspadamugaa chesedanu.

7. యిర్మీయా యీ మాటలను యెహోవా మందిరములో పలుకుచుండగా యాజకులును ప్రవక్తలును జనులందరును వినిరి.

7. yirmeeyaa yee maaṭalanu yehōvaa mandiramulō palukuchuṇḍagaa yaajakulunu pravakthalunu janulandarunu viniri.

8. జనుల కందరికిని ప్రకటింపవలెనని యెహోవా యిర్మీయాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అతడు పలికి చాలించిన తరువాత యాజకులును ప్రవక్తలును జనులందరును అతని పట్టుకొని నీవు మరణశిక్ష నొందక తప్పదు.

8. janula kandarikini prakaṭimpavalenani yehōvaa yirmeeyaaku aagnaapin̄china maaṭalanniṭini athaḍu paliki chaalin̄china tharuvaatha yaajakulunu pravakthalunu janulandarunu athani paṭṭukoni neevu maraṇashiksha nondaka thappadu.

9. యెహోవా నామమునుబట్టి ఈ మందిరము షిలోహువలె నగుననియు, ఈ పట్టణము నివాసిలేక పాడైపోవుననియు నీవేల ప్రకటించుచున్నావు అనుచు, ప్రజలందరు యెహోవా మందిరములో యిర్మీయాయొద్దకు కూడివచ్చిరి.

9. yehōvaa naamamunubaṭṭi ee mandiramu shilōhuvale nagunaniyu, ee paṭṭaṇamu nivaasilēka paaḍaipōvunaniyu neevēla prakaṭin̄chuchunnaavu anuchu, prajalandaru yehōvaa mandiramulō yirmeeyaayoddhaku kooḍivachiri.

10. యూదా అధిపతులు ఆ సంగతులు విని రాజు నగరులో నుండి యెహోవా మందిరమునకు వచ్చి, యెహోవా మందిరపు క్రొత్త గవిని ద్వారమున కూర్చుండగా

10. yoodhaa adhipathulu aa saṅgathulu vini raaju nagarulō nuṇḍi yehōvaa mandiramunaku vachi, yehōvaa mandirapu krottha gavini dvaaramuna koorchuṇḍagaa

11. యాజకులును ప్రవక్తలును అధిపతులతోను సమస్త ప్రజల తోను ఈలాగనిరి మీరు చెవులార వినియున్న ప్రకారము, ఈ మనుష్యుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించుచున్నాడు; గనుక ఇతడు మరణమునకు పాత్రుడు.
అపో. కార్యములు 6:13

11. yaajakulunu pravakthalunu adhipathulathoonu samastha prajala thoonu eelaaganiri meeru chevulaara viniyunna prakaaramu, ee manushyuḍu ee paṭṭaṇamunaku virōdhamugaa pravachin̄chuchunnaaḍu; ganuka ithaḍu maraṇamunaku paatruḍu.

12. అప్పుడు యిర్మీయా అధిపతులందరితోను జనులందరితోను ఈ మాట చెప్పెనుఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటిని ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపియున్నాడు.

12. appuḍu yirmeeyaa adhipathulandarithoonu janulandarithoonu ee maaṭa cheppenu'ee mandiramunaku virōdhamugaanu ee paṭṭaṇamunaku virōdhamugaanu meeru vinina maaṭalanniṭini prakaṭin̄chuṭaku yehōvaayē nannu pampiyunnaaḍu.

13. కాబట్టి యెహోవా మీకు చేసెదనని తాను చెప్పిన కీడునుగూర్చి ఆయన సంతాపపడునట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి.

13. kaabaṭṭi yehōvaa meeku chesedhanani thaanu cheppina keeḍunugoorchi aayana santhaapapaḍunaṭlu meeru mee maargamulanu mee kriyalanu chakkaparachukoni mee dhevuḍaina yehōvaa maaṭa vinuḍi.

14. ఇదిగో నేను మీ వశములోనున్నాను, మీ దృష్టికేది మంచిదో యేది యుక్తమైనదో అదే నాకు చేయుడి.

14. idigō nēnu mee vashamulōnunnaanu, mee drushṭikēdi man̄chidō yēdi yukthamainadō adhe naaku cheyuḍi.

15. అయితే మీకు చెవులార ఈ మాటలన్నిటిని చెప్పుటకు నిజముగా యెహోవా మీయొద్దకు నన్ను పంపియున్నాడు గనుక, మీరు నన్ను చంపినయెడల మీరు మీమీదికిని ఈ పట్టణముమీదికిని దాని నివాసుల మీదికిని నిరపరాధి రక్తదోషము తెప్పించుదురని నిస్సందేహముగా తెలిసికొనుడి.

15. ayithē meeku chevulaara ee maaṭalanniṭini cheppuṭaku nijamugaa yehōvaa meeyoddhaku nannu pampiyunnaaḍu ganuka, meeru nannu champinayeḍala meeru meemeedikini ee paṭṭaṇamumeedikini daani nivaasula meedikini niraparaadhi rakthadōshamu teppin̄chudurani nissandhehamugaa telisikonuḍi.

16. కాగా అధిపతులును జనులందరును యాజకులతోను ప్రవక్తలతోను ఇట్లనిరి ఈ మనుష్యుడు మన దేవుడైన యెహోవా నామమునుబట్టి మనకు ఈ సమాచారము ప్రకటించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు కాడు.

16. kaagaa adhipathulunu janulandarunu yaajakulathoonu pravakthalathoonu iṭlaniri ee manushyuḍu mana dhevuḍaina yehōvaa naamamunubaṭṭi manaku ee samaachaaramu prakaṭin̄chuchunnaaḍu ganuka ithaḍu maraṇamunaku paatruḍu kaaḍu.

17. మరియు దేశమందలి పెద్దలలో కొందరు లేచి సమాజముగా కూడిన జనులతో ఈ మాటలు పలికిరి.

17. mariyu dheshamandali peddalalō kondaru lēchi samaajamugaa kooḍina janulathoo ee maaṭalu palikiri.

18. యూదారాజైన హిజ్కియా దినములలో మోరష్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుచు వచ్చెను సైన్యముల కధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు చేనుదున్నబడునట్లు మిమ్మునుబట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్లకుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నతస్థలములవలె అగును.

18. yoodhaaraajaina hijkiyaa dinamulalō mōrashtheeyuḍaina meekaa pravachin̄chuchuṇḍenu. Athaḍu yoodhaa janulandarithoo iṭlu prakaṭin̄chuchu vacchenu sainyamula kadhipathiyagu yehōvaa eelaagu selavichuchunnaaḍu chenudunnabaḍunaṭlu mimmunubaṭṭi seeyōnu dunnabaḍunu, yerooshalēmu raaḷlakuppalagunu, mandiramunna parvathamu araṇyamulōni unnathasthalamulavale agunu.

19. అట్లు పలికి నందున యూదారాజైన హిజ్కియాయైనను యూదా జనులందరిలో మరి ఎవడైనను అతని చంపిరా? యెహోవా వారికి చేసెదనని తాను చెప్పిన కీడును చేయక సంతాప పడునట్లు రాజు యెహోవాయందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను గదా? మనము ఈ కార్యము చేసినయెడల మనమీదికే గొప్ప కీడు తెచ్చు కొందుము అని చెప్పిరి.

19. aṭlu paliki nanduna yoodhaaraajaina hijkiyaayainanu yoodhaa janulandarilō mari evaḍainanu athani champiraa? Yehōvaa vaariki chesedhanani thaanu cheppina keeḍunu cheyaka santhaapa paḍunaṭlu raaju yehōvaayandu bhayabhakthulu kaligi yehōvaa dayanu vēḍukonenu gadaa? Manamu ee kaaryamu chesinayeḍala manameedikē goppa keeḍu techu kondumu ani cheppiri.

20. మరియకిర్యత్యారీము వాడైన షెమయా కుమారుడగు ఊరియాయను ఒకడు యెహోవా నామమునుబట్టి ప్రవచించుచుండెను. అతడు యిర్మీయా చెప్పిన మాటల రీతిని యీ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించెను.

20. mariyu kiryatyaareemu vaaḍaina shemayaa kumaaruḍagu ooriyaayanu okaḍu yehōvaa naamamunubaṭṭi pravachin̄chuchuṇḍenu. Athaḍu yirmeeyaa cheppina maaṭala reethini yee paṭṭaṇamunaku virōdhamugaanu ee dheshamunaku virōdhamugaanu pravachin̄chenu.

21. రాజైన యెహోయాకీమును అతని శూరులందరును ప్రధానులందరును అతని మాటలు వినినమీదట రాజు అతని చంపజూచుచుండగా, ఊరియా దాని తెలిసికొని భయపడి పారిపోయి ఐగుప్తు చేరెను.

21. raajaina yehōyaakeemunu athani shoorulandarunu pradhaanulandarunu athani maaṭalu vininameedaṭa raaju athani champajoochuchuṇḍagaa, ooriyaa daani telisikoni bhayapaḍi paaripōyi aigupthu cherenu.

22. అప్పుడు రాజైన యెహోయాకీము అక్బోరు కుమారుడగు ఎల్నాతానును అతనితో కొందరిని ఐగుప్తునకు పంపెను;

22. appuḍu raajaina yehōyaakeemu akbōru kumaaruḍagu elnaathaanunu athanithoo kondarini aigupthunaku pampenu;

23. వారు ఐగుప్తులోనుండి ఊరియాను తీసి కొనివచ్చి రాజైన యెహోయాకీమునొద్ద చేర్చగా, ఇతడు ఖడ్గముతో అతని చంపి సామాన్యజనుల సమాధిలో అతని కళేబరమును వేయించెను.

23. vaaru aigupthulōnuṇḍi ooriyaanu theesi konivachi raajaina yehōyaakeemunoddha cherchagaa, ithaḍu khaḍgamuthoo athani champi saamaanyajanula samaadhilō athani kaḷēbaramunu vēyin̄chenu.

24. ఈలాగు జరుగగా షాఫాను కుమారుడైన అహీకాము యిర్మీయాకు తోడైయున్నందున అతని చంపుటకు వారు జనుల చేతికి అతనిని అప్పగింపలేదు.

24. eelaagu jarugagaa shaaphaanu kumaaruḍaina aheekaamu yirmeeyaaku thooḍaiyunnanduna athani champuṭaku vaaru janula chethiki athanini appagimpalēdu.


Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |

Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.