Jeremiah - యిర్మియా 26 | View All

1. యోషీయా కుమారుడును యూదారాజునగు యెహోయాకీము ఏలుబడి ఆరంభములో యెహోవా యొద్దనుండి వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

1. In the begynnynge of the reigne of Ioachim the sonne of Iosias kynge of Iuda, came this worde from the LORDE, sayenge:

2. యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, నీవు యెహోవా మందిరావరణములో నిలిచి, నేను నీ కాజ్ఞాపించు మాటలన్నిటిని యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికి ప్రకటింపుము; వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు.

2. Thus saieth the LORDE: Stonde in the courte of the LORDES house, and speake vnto all them which (out of the cities of Iuda) come to do worshippe in the LORDES house, all the wordes yt I commaunde the to saye. Loke that thou kepe not one worde backe,

3. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలచిన కీడును చేయక నేను సంతాపపడునట్లుగా వారు ఆలకించి తన దుర్మార్గము విడుచుదురేమో.

3. yf (perauenture) they will herke, and turne euery man from his wicked waye: that I maye also repente of the plage, which I haue determed to brynge vpon them, because of their wicked invencions.

4. నీవు వారితో ఈ మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చునదేమనగా

4. And after this maner shalt thou speake vnto them: Thus saieth the LORDE: yf ye will not obeye me, to walke in my lawes, which I haue geuen you,

5. మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రము ననుసరించి నడుచు కొనుడనియు, నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులగు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి.

5. and to heare the wordes of my seruauntes the prophetes, whom I sent vnto you, rysynge vp tymely, and still sendinge: Yf ye will not folowe the (I saye)

6. మీరీలాగున చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమున కును చేసెదను, ఈ పట్టణమును భూమిమీదనున్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసెదను.

6. then will I do to this house, as I dyd vnto Silo, and will make this cite to be abhorred of all the people of the earth.

7. యిర్మీయా యీ మాటలను యెహోవా మందిరములో పలుకుచుండగా యాజకులును ప్రవక్తలును జనులందరును వినిరి.

7. And the prestes, the prophetes and all the people herde Ieremy preach these wordes, in the house of the LORDE.

8. జనుల కందరికిని ప్రకటింపవలెనని యెహోవా యిర్మీయాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అతడు పలికి చాలించిన తరువాత యాజకులును ప్రవక్తలును జనులందరును అతని పట్టుకొని నీవు మరణశిక్ష నొందక తప్పదు.

8. Now when he had spoken out all the wordes, that the LORDE commaunded him to preach vnto all the people, then the prestes, the prophetes and all the people toke holde vpon him, and sayde: thou shalt dye.

9. యెహోవా నామమునుబట్టి ఈ మందిరము షిలోహువలె నగుననియు, ఈ పట్టణము నివాసిలేక పాడైపోవుననియు నీవేల ప్రకటించుచున్నావు అనుచు, ప్రజలందరు యెహోవా మందిరములో యిర్మీయాయొద్దకు కూడివచ్చిరి.

9. How darrest thou be so bolde, as to saye in the name of the LORDE: it shal happen to this house as it dyd vnto Silo? and this cite shalbe so waist, that no man shal dwell there in?

10. యూదా అధిపతులు ఆ సంగతులు విని రాజు నగరులో నుండి యెహోవా మందిరమునకు వచ్చి, యెహోవా మందిరపు క్రొత్త గవిని ద్వారమున కూర్చుండగా

10. And when all the people were gathered aboute Ieremy in the house of the LORDE, the prynces of Iuda herde of this rumoure, & they came soone out of the kinges Palace in to the house of the LORDE, and sat them downe before the new dore of the LORDE.

11. యాజకులును ప్రవక్తలును అధిపతులతోను సమస్త ప్రజల తోను ఈలాగనిరి మీరు చెవులార వినియున్న ప్రకారము, ఈ మనుష్యుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించుచున్నాడు; గనుక ఇతడు మరణమునకు పాత్రుడు.
అపో. కార్యములు 6:13

11. Then spake the prestes and the prophetes vnto the rulers & to all the people, these wordes: This man is worthy to dye, for he hath preached agaynst this cite, as ye youre selues haue herde with youre eares.

12. అప్పుడు యిర్మీయా అధిపతులందరితోను జనులందరితోను ఈ మాట చెప్పెనుఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటిని ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపియున్నాడు.

12. Then sayde Ieremy vnto the rulers and to all the people: The LORDE hath sente me to preach agaynst this house & agaynst this cite all the wordes that ye haue herde.

13. కాబట్టి యెహోవా మీకు చేసెదనని తాను చెప్పిన కీడునుగూర్చి ఆయన సంతాపపడునట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి.

13. Therfore amende youre wayes, and youre advysementes, and be obedient vnto the voyce of the LORDE youre God: so shal the LORDE repet of the plage, yt he had deuysed agaynst you.

14. ఇదిగో నేను మీ వశములోనున్నాను, మీ దృష్టికేది మంచిదో యేది యుక్తమైనదో అదే నాకు చేయుడి.

14. Now as for me: I am in youre hondes, do with me, as ye thinke expediet and good.

15. అయితే మీకు చెవులార ఈ మాటలన్నిటిని చెప్పుటకు నిజముగా యెహోవా మీయొద్దకు నన్ను పంపియున్నాడు గనుక, మీరు నన్ను చంపినయెడల మీరు మీమీదికిని ఈ పట్టణముమీదికిని దాని నివాసుల మీదికిని నిరపరాధి రక్తదోషము తెప్పించుదురని నిస్సందేహముగా తెలిసికొనుడి.

15. But this shall ye knowe: yf ye put me to death, ye shal make youre selues, this cite & all the inhabitours there of, giltie of innocent bloude. For this is of a treuth: that the LORDE hath sente me vnto you, to speake all these wordes in youre eares.

16. కాగా అధిపతులును జనులందరును యాజకులతోను ప్రవక్తలతోను ఇట్లనిరి ఈ మనుష్యుడు మన దేవుడైన యెహోవా నామమునుబట్టి మనకు ఈ సమాచారము ప్రకటించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు కాడు.

16. Then sayde the rulers and the people vn the prestes and prophetes: This man maye not be condemned to death, for he hath preached vnto vs in the name of the LORDE oure God.

17. మరియు దేశమందలి పెద్దలలో కొందరు లేచి సమాజముగా కూడిన జనులతో ఈ మాటలు పలికిరి.

17. The Elders also of the londe stode vp, & sayde thus vnto all the people:

18. యూదారాజైన హిజ్కియా దినములలో మోరష్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుచు వచ్చెను సైన్యముల కధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు చేనుదున్నబడునట్లు మిమ్మునుబట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్లకుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నతస్థలములవలె అగును.

18. Micheas the Morascite, which was a prophet vnder Ezechias kinge of Iuda, spake to all the people of Iuda: Thus saieth the LORDE of hoostes: Sion shalbe plowed like a felde, Ierusale shalbe an heape of stones, & the hill of the LORDES house shalbe turned to an hie wod.

19. అట్లు పలికి నందున యూదారాజైన హిజ్కియాయైనను యూదా జనులందరిలో మరి ఎవడైనను అతని చంపిరా? యెహోవా వారికి చేసెదనని తాను చెప్పిన కీడును చేయక సంతాప పడునట్లు రాజు యెహోవాయందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను గదా? మనము ఈ కార్యము చేసినయెడల మనమీదికే గొప్ప కీడు తెచ్చు కొందుము అని చెప్పిరి.

19. Dyd Ezechias ye kinge of Iuda & the people of Iuda put him to deeth for this? No verely, but rather feared ye LORDE, & made their praier vnto him. For the which cause also ye LORDE repented of the plage, yt he had deuysed agaynst them. Shulde we then do soch a shamefull dede agaynst oure soules?

20. మరియకిర్యత్యారీము వాడైన షెమయా కుమారుడగు ఊరియాయను ఒకడు యెహోవా నామమునుబట్టి ప్రవచించుచుండెను. అతడు యిర్మీయా చెప్పిన మాటల రీతిని యీ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించెను.

20. There was a prophet also, that preached stiffly in the name of the LORDE, called Vrias the sonne of Semeia of Cariathiarim: this ma preached also agaynst this cite & agaynst this lode, acordinge to all as Ieremy saieth.

21. రాజైన యెహోయాకీమును అతని శూరులందరును ప్రధానులందరును అతని మాటలు వినినమీదట రాజు అతని చంపజూచుచుండగా, ఊరియా దాని తెలిసికొని భయపడి పారిపోయి ఐగుప్తు చేరెను.

21. Now when Ioachim the kinge with all the estates & prynces had herde his wordes, the kinge went aboute to slaye him. When Vrias perceaued that, he was afrayed, & fled, & departed in to Egipte.

22. అప్పుడు రాజైన యెహోయాకీము అక్బోరు కుమారుడగు ఎల్నాతానును అతనితో కొందరిని ఐగుప్తునకు పంపెను;

22. Then Ioachim the kinge sent seruauntes into the lode of Egipte, Namely: Elnatha the sonne of Achbor, & certayne men wt him into Egipte,

23. వారు ఐగుప్తులోనుండి ఊరియాను తీసి కొనివచ్చి రాజైన యెహోయాకీమునొద్ద చేర్చగా, ఇతడు ఖడ్గముతో అతని చంపి సామాన్యజనుల సమాధిలో అతని కళేబరమును వేయించెను.

23. which fetched Vrias out of Egipte, & brought him vnto kinge Ioachim that slewe him with the swearde, & cast his deed body into ye como peoples graue.

24. ఈలాగు జరుగగా షాఫాను కుమారుడైన అహీకాము యిర్మీయాకు తోడైయున్నందున అతని చంపుటకు వారు జనుల చేతికి అతనిని అప్పగింపలేదు.

24. But Ahicam the sonne of Saphan helped Ieremy, that he came not in to the hondes of the people to be slayne.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Jeremiah - యిర్మియా 26 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

దేవాలయం మరియు నగరం నాశనం చేయబడుతుందని ముందే చెప్పబడింది. (1-6) 
దైవ దూతలు మానవుల దయను కోరడం లేదా వారి స్వంత శ్రేయస్సును కాపాడుకోవడం మానుకోవాలి. సర్వశక్తిమంతుడు మానవాళిపై దయను ఎలా ప్రసాదించాలని ఓపికగా కోరుకుంటున్నాడో గమనించండి. వారు ధిక్కరిస్తూ కొనసాగితే, అది వారి నగరం మరియు అభయారణ్యం యొక్క పతనాన్ని సూచిస్తుంది. ఏదైనా ప్రత్యామ్నాయ ఫలితాన్ని నిజంగా ఊహించగలరా? దేవుని నిర్దేశాలను లక్ష్యపెట్టడానికి నిరాకరించేవారు దైవిక ఖండనకు తమను తాము ఇష్టపూర్వకంగా బహిర్గతం చేస్తారు.

యిర్మీయా ప్రాణానికి ముప్పు ఉంది. (7-15) 
యాజకులు మరియు ప్రవక్తలు యిర్మీయా మరణానికి అర్హులని నిందించారు మరియు అతనికి వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యాలను అందించారు. ఈ విషయాన్ని పరిశోధించడానికి ఇశ్రాయేలు పెద్దలు సమావేశమయ్యారు. ఈ ప్రవచనాన్ని చెప్పడానికి ప్రభువు తనను పంపాడని యిర్మీయా ధృవీకరించాడు. మంత్రులు తమకు అందిన దైవిక సందేశానికి కట్టుబడి ఉన్నంత కాలం, వారు భయపడాల్సిన అవసరం లేదు. పాపం యొక్క పరిణామాల గురించి బోధించే మంత్రులను వ్యక్తులు విమర్శించడం అన్యాయం, ఎందుకంటే వారి ఉద్దేశ్యం ప్రజలను స్వర్గం మరియు మోక్షం వైపు నడిపించడం. యిర్మీయా తనను వ్యతిరేకిస్తూనే ఉంటే వారు ఎదుర్కొనే ప్రమాదాల గురించి వారిని హెచ్చరించాడు. నమ్మకంగా మందలించే వారి పట్ల హాని చేయడం, చంపడం లేదా ద్వేషాన్ని ప్రదర్శించడం వారి స్వంత శిక్షను వేగవంతం చేస్తుంది మరియు తీవ్రతరం చేస్తుందని అందరికీ తెలుసు.

అతను పెద్దలచే సమర్థించబడ్డాడు. (16-24)
పశ్చాత్తాపపడని పాపులు దేవుని ఆత్మ యొక్క సంభావ్య నష్టం మరియు దేవుని రాజ్యం నుండి మినహాయించబడటం గురించి హెచ్చరించినప్పుడు, అది దేవుని వాక్యం యొక్క బోధలకు అనుగుణంగా ఉంటుంది. మీకాను రక్షించిన హిజ్కియాను పరిగణించండి - అతను అభివృద్ధి చెందాడు. దానికి విరుద్ధంగా, ఊరియాను చంపిన యెహోయాకీము విజయం సాధించాడా? దుష్ట వ్యక్తుల యొక్క ప్రతికూల ఉదాహరణలు మరియు వారి పాపాల యొక్క భయంకరమైన పరిణామాలు చెడు చర్యల నుండి నిరోధకంగా ఉపయోగపడతాయి. ఉరిజా తన సందేశాన్ని నమ్మకంగా అందించాడు కానీ తన మిషన్‌ను విడిచిపెట్టడం ద్వారా తప్పు చేశాడు. ప్రభువు, తన జ్ఞానంలో, ఊరియా తన ప్రాణాలను కోల్పోయేలా అనుమతించాడు, అయితే యిర్మీయా ఆపద సమయంలో రక్షించబడ్డాడు. తమ బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా దేవునిపై సాధారణ నమ్మకాన్ని ఉంచేవారు సురక్షితమైనవారు. దేవుడు ప్రజలందరి హృదయాలను కలిగి ఉన్నాడని గుర్తించి, మన బాధ్యతలను నెరవేర్చేటప్పుడు ఆయనను విశ్వసించమని ప్రోత్సహించాలి. తన నిమిత్తము హింసించబడిన వారిపట్ల దయ చూపేవారికి ఆయన ప్రతిఫలమిచ్చి ఆశీర్వదిస్తాడు.



Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |