Isaiah - యెషయా 66 | View All

1. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించునది ఏపాటిది?
మత్తయి 5:34-35, మత్తయి 23:22, అపో. కార్యములు 7:49-50

యెషయా ద్వారా దేవుడు తన మాటలను కొనసాగిస్తున్నాడు. తన ప్రజలు ఎలాంటివారుగా ఉండాలని తాను కోరుతున్నాడో నొక్కి చెప్తున్నాడు. వారలా అయితే కలిగే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్తున్నాడు. తనను, తన వాక్కును నిరాకరించినవారి అంతం ఎలా ఉంటుందో కూడా తెలియజేస్తున్నాడు. యెషయా 40:21-22; 1 రాజులు 8:27; కీర్తనల గ్రంథము 2:4; మత్తయి 5:34-35; అపో. కార్యములు 7:48-50; అపో. కార్యములు 17:24-25. ఇస్రాయేల్ వారి దేవుడు మహా బలాఢ్యుడైన సృష్టికర్త – యెషయా 40:26; ఆదికాండము 1:1. ఈ విశ్వమంతా కలిసినా ఆయన దృష్టిలో అల్పమే. చేతులతో కట్టిన ఆలయం ఆయనకు అక్కరలేదు. ఆత్మ సంబంధమైన ఆలయం ఆయనకు ఎక్కువ ఇష్టం. అంటే ఆయనలో నమ్మకం ఉంచిన మనుషుల వినయపూరితమైన హృదయాలు, దేహాలే ఆయనకు ఆలయాలు (యెషయా 57:15; 1 కోరింథీయులకు 6:19; ఎఫెసీయులకు 2:21-22). అలాంటివారి మీద ఆయన దృష్టి ఉంటుంది. ఇక్కడున్న హీబ్రూ పదానికి అక్షరార్థం

2. అవన్నియు నా హస్తకృత్యములు అవి నావలన కలిగినవని యెహోవా సెలవిచ్చు చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట వినివణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను.
అపో. కార్యములు 7:49-50

“వారి మీదే నా దృష్టి”– ఇదే మాట ఆదికాండము 4:4-5; నిర్గమకాండము 2:25; సంఖ్యాకాండము 16:15; న్యాయాధిపతులు 6:14; కీర్తనల గ్రంథము 25:16 లో కూడా ఉంది. దీన్లోనే ఆమోదం, అప్యాయత ఇమిడి ఉన్నాయి. వినయం, నలిగిన హృదయం గురించి యెషయా 57:15; కీర్తనల గ్రంథము 51:17; మత్తయి 5:3-4; లూకా 18:13-14; యాకోబు 4:6 చూడండి. దేవుని మాటకు వణకడమంటే మన అయోగ్యతను గుర్తించి, ఆయనకేదన్నా కోపం తెప్పిస్తామేమోనన్న భయంతో, ఆయన పట్ల గౌరవభావంతో ఆయన మాటను పాటించేందుకు వేగిరపాటుతో ఉండడమన్న మాట – ఎజ్రా 9:4; హోషేయ 3:5. కీర్తనల గ్రంథము 2:11; కీర్తనల గ్రంథము 99:1; కీర్తనల గ్రంథము 114:7; యిర్మియా 5:22 పోల్చి చూడండి.

3. ఎద్దును వధించువాడు నరుని చంపువానివంటివాడే గొఱ్ఱెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువానివంటివాడే నైవేద్యము చేయువాడు పందిరక్తము అర్పించువాని వంటివాడే ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువానివంటి వాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి వారి యసహ్యమైన పనులు తమకే యిష్టముగాఉన్నవి.

యెషయా 1:11-14 పోల్చి చూడండి. దుర్మార్గుల అర్పణలేవీ దేవునికి అంగీకారం కాదు – సామెతలు 15:8; సామెతలు 21:27. “సొంత మార్గాలు”– యెషయా 53:6; యెషయా 57:17. తమ అసహ్య కార్యాలనుబట్టి ఆనందిస్తున్నారంటే మనుషులు తమ పాపంలో చాలా ముదిరిపోయారన్నమాట. ఫిలిప్పీయులకు 3:18-19 పోల్చి చూడండి.

4. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడును లేక పోయెను నేను మాటలాడినప్పుడు వినువాడొకడును లేక పోయెను నా దృష్టికి చెడ్డదైనదాని చేసిరి నాకిష్టము కానిదాని కోరుకొనిరి కావున నేనును వారిని మోసములో ముంచుదును వారు భయపడువాటిని వారిమీదికి రప్పించెదను.

యెషయా 65:7, యెషయా 65:12; కీర్తనల గ్రంథము 18:25-26.

5. యెహోవా వాక్యమునకు భయపడువారలారా, ఆయన మాట వినుడి మిమ్మును ద్వేషించుచు నా నామమునుబట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడునట్లు యెహోవా మహిమనొందును గాక అని చెప్పుదురు వారే సిగ్గునొందుదురు.
2 థెస్సలొనీకయులకు 1:12

దేవుని వాక్కుకు వినయంతో అణుకువ చూపేవారిని ప్రేమించవలసినవాళ్ళే కొన్నిసార్లు ద్వేషిస్తారు (యెషయా 59:15; కీర్తనల గ్రంథము 38:20; మీకా 7:6; మత్తయి 10:36). “సంతోషం”– యెషయా 5:19; కీర్తనల గ్రంథము 22:8 మొదలైన చోట్లలాగా ఇది ఎత్తి పొడుపు మాట.

6. ఆలకించుడి, పట్టణములో అల్లరిధ్వని పుట్టుచున్నది దేవాలయమునుండి శబ్దము వినబడుచున్నది తన శత్రువులకు ప్రతికారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది.
ప్రకటన గ్రంథం 16:1-17

“నగరం, దేవాలయం”– యెషయా 64:10-11; యిర్మియా 52:12-14. తన శత్రువులకు ప్రతిక్రియ చేసేందుకు తరచుగా దేవుడు మనుషులను వాడుకొంటాడు (యెషయా 10:5-6).

7. ప్రసవవేదన పడకమునుపు ఆమె పిల్లను కనినది నొప్పులు తగులకమునుపు మగపిల్లను కనినది.
ప్రకటన గ్రంథం 12:2-5

ఇది ఇస్రాయేల్ జాతికి ప్రతినిధిగా ఉన్న సీయోను ఫలవంతంగా ఉంటుందని తెలియజేస్తున్నది. యెషయా 49:14-20; యెషయా 54:1-8 పోల్చి చూడండి. 7వ వచనంలోని “పిల్లవాడు” ఇస్రాయేల్ దేశమే, ఆ జాతే (వ 8). దేశంలోని మార్పు ఎంత మహత్తరంగా ఉంటుందంటే ఆ దేశం, ఆ జనం పూర్తిగా నవనూతనమయ్యాయా అనిపిస్తుంది. యెషయా 4:2-6; యెషయా 11:6-16; యెషయా 27:6; యెషయా 35:1-10 పోల్చి చూడండి. ఇస్రాయేల్‌లోని ఈ మార్పు పురిటి నొప్పులు లేకుండానే హఠాత్తుగా కలుగుతుంది. జెకర్యా 12:10; రోమీయులకు 11:26-27; ప్రకటన గ్రంథం 1:7.

8. అట్టివార్త యెవరు వినియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవవేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా? సీయోనునకు ప్రసవవేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను.

9. నేను ప్రసవవేదన కలుగజేసి కనిపింపక మానెదనా? అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా? అని నీ దేవుడడుగుచున్నాడు.

10. యెరూషలేమును ప్రేమించువారలారా, మీరందరు ఆమెతో సంతోషించుడి ఆనందించుడి. ఆమెనుబట్టి దుఃఖించువారలారా, మీరందరు ఆమెతో ఉత్సహించుడి

యెషయా 65:18; కీర్తనల గ్రంథము 122:6; కీర్తనల గ్రంథము 137:6.

11. ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించె దరు.

వ 12; యెషయా 49:23; యెషయా 60:16. వెయ్యేళ్ళ పాలన సమయంలో జెరుసలం ఒక తల్లిలాగా ఉంటుంది. చివరికి అది నమ్మేవారందరికీ తల్లిగా ఉన్న పరమ జెరుసలంకు (గలతియులకు 4:26) నిజమైన ప్రతిబింబంగా ఉంటుంది.

12. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి, నదివలె సమాధానమును ఆమెయొద్దకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు ఒడ్డుమీద పొర్లిపారు జలప్రవాహమువలె మీయొద్దకు దానిని రాజేతును మీరు చంకను ఎత్తికొనబడెదరు మోకాళ్లమీద ఆడింపబడెదరు.

యెషయా 48:18; యెషయా 60:5.

13. ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆద రించెదను యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు.

దేవుని వాత్సల్యం తల్లి వాత్సల్యం లాంటిది. జెరుసలం భవిష్యత్తు గురించి దిగులుపడుతూ ఉన్న వారందరినీ ఆయన ఓదారుస్తాడు (యెషయా 40:1-2; యెషయా 49:13-16; యెషయా 54:7-8).

14. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ యెముకలు లేతగడ్డివలె బలియును యెహోవా హస్తబలము ఆయన సేవకులయెడల కను పరచబడును ఆయన తన శత్రువులయెడల కోపము చూపును.
యోహాను 16:22

“గడ్డి”– యెషయా 40:6-8 లో లాగా కాదు; యెషయా 44:4 లోని విధంగా. “చెయ్యి”– యెషయా 53:1; ఎజ్రా 7:9; ఎజ్రా 8:31. ఇక్కడి అర్థం తన ప్రజలకు దీవెనలు కలిగించేందుకు పని చేస్తున్న దేవుని శక్తి.

15. ఆలకించుడి, మహాకోపముతో ప్రతికారము చేయుట కును అగ్నిజ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్నిరూపముగా వచ్చుచున్నాడు ఆయన రథములు తుపానువలె త్వరపడుచున్నవి.
2 థెస్సలొనీకయులకు 1:8

యెషయా 2:11, యెషయా 2:17, యెషయా 2:20-21; యెషయా 26:20-21; యెషయా 30:27-28; యెషయా 34:2; యెషయా 42:25; 2 థెస్సలొనీకయులకు 1:1, 2 థెస్సలొనీకయులకు 1:7-10; ప్రకటన గ్రంథం 19:11-16.

16. అగ్ని చేతను తన ఖడ్గముచేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యెమాడును యెహోవాచేత అనేకులు హతులవుదురు.

17. తోటలోనికి వెళ్లవలెనని మధ్యనిలుచున్న యొకని చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచు కొనుచున్నవారై పందిమాంసమును హేయవస్తువును పందికొక్కులను తినువారును ఒకడును తప్పకుండ నశించెదరు ఇదే యెహోవా వాక్కు.

యెషయా వంటి మహోత్కృష్టమైన పుస్తకంలోని ఇలాంటి శ్రేష్ఠమైన ఆఖరు అధ్యాయంలో మోషే ధర్మశాస్త్రం నిషేధించిన ఆహారాన్ని తినడం గురించి చెప్పడం ఆశ్చర్యంగా ఉంది గదా. యెషయా 65:4 కూడా చూడండి. ఇక్కడ చెప్తున్నది అక్షరాలా ఇస్రాయేల్ జాతి గురించే అని దీన్ని బట్టి తెలియదా? వారిలోని దుర్మార్గులు దేవుని ఆజ్ఞల పట్ల తిరస్కార భావం చూపడం ద్వారా బయట పడతారు. ధర్మశాస్త్రంలోని ఆదేశాలన్నిటిలోకీ ఆచరణలో పెట్టడానికి అతి తేలికైనది అశుద్ధ జంతువుల గురించిన ఆజ్ఞ. ఈ ఆదేశాలను పాటించడానికి ఇష్టం లేనివారు ఇక ఇతర ఆజ్ఞలను ఎలా పాటిస్తారు? కొన్ని ఆహార పదార్థాలు తినడం నిషేధం గురించి నోట్స్ లేవీ 11 అధ్యాయంలో చూడండి.

18. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేయున్నవి అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట లాడువారిని సమకూర్చెదను వారు వచ్చి నా మహిమను చూచెదరు.

“తలంపులు”– యెషయా 65:2. “జనాలన్నిటిని”– యోవేలు 3:2; జెఫన్యా 3:8; జెకర్యా 14:2-5. దేవుడు తన ప్రజలను కాపాడడంలోను, వారి శత్రువులను సంహరించడంలోను చూపే పరాక్రమాన్ని, మహిమను ఇస్రాయేల్‌వారి శత్రువులంతా ఎర్ర సముద్రం దగ్గర ఈజిప్ట్ వాళ్ళు చూచినట్టు చూస్తారు (నిర్గమ 14 అధ్యాయం).

19. నేను వారియెదుట ఒక సూచక క్రియను జరిగించెదను వారిలో తప్పించుకొనినవారిని విలుకాండ్రైన తర్షీషు పూలు లూదు అను జనుల యొద్ద కును తుబాలు యావాను నివాసులయొద్దకును నేను పంపె దను నన్నుగూర్చిన సమాచారము విననట్టియు నా మహి మను చూడనట్టియుదూరద్వీపవాసులయొద్దకు వారిని పంపెదనువారు జనములలో నా మహిమను ప్రకటించెదరు.

ఈ సందర్భాన్ని బట్టీ, యెషయా తదితర ప్రవక్తల గ్రంథాల్లోని వాక్కులను బట్టీ చూస్తే ఈ మాటలు రాబోయే వెయ్యేళ్ళ పాలనలోని సంభవాలు కొన్నిటిని వర్ణిస్తున్నాయి. ఇందులో కొన్ని మాటలు క్రొత్త ఒడంబడిక సంఘం కార్యకలాపాలకు సరిపోతున్నాయి, గాని కొన్ని అలా సరిపోవడం లేదు.

20. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్య మును యెహోవా మందిరములోనికి తెచ్చునట్లుగా గుఱ్ఱములమీదను రథములమీదను డోలీలమీదను కంచరగాడిదలమీదను ఒంటెలమీదను ఎక్కించి సర్వజనములలోనుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసికొనివచ్చెదరని యెహోవా సెలవిచ్చు చున్నాడు.

యెషయా 11:11-12; యెషయా 49:22; యెషయా 60:4.

21. మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియయెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

యెషయా 61:6 దగ్గర నోట్. ఈ క్రొత్త ఒడంబడిక యుగంలో విశ్వాసులంతా యాజులే, ప్రత్యేకంగా కొందరని లేదు (1 పేతురు 2:5, 1 పేతురు 2:9). మనకు తెలిసినంతవరకు ఎవరూ లేవీవారుగా పని చేయడం లేదు.

22. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముకాక నా సన్నిధిని నిలుచునట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును ఇదే యెహోవా వాక్కు.
2 పేతురు 3:13, ప్రకటన గ్రంథం 21:1

యెషయా 65:17.

23. ప్రతి అమావాస్యదినమునను ప్రతి విశ్రాంతిదినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చె దరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

“శరీరం ఉన్న వారందరూ”అంటూ మానవాళినంతటినీ ఉద్దేశించి రాయడం గమనించండి.

24. వారు పోయి నామీద తిరుగుబాటు చేసినవారి కళేబరములను తేరి చూచెదరు వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును.
మార్కు 9:48

యెషయాలో తరచుగా కనిపించే అంశం “తిరుగుబాటు” (యెషయా 1:2, యెషయా 1:23; యెషయా 3:1, యెషయా 3:9; యెషయా 60:10; యెషయా 65:2). జెరుసలం నగర వాసులు వెళ్ళి హిన్నోం, తోఫెతు లోయలోకి చూస్తున్న దృశ్యం ఇక్కడ ఉంది (యెషయా 30:33; యిర్మియా 7:31-33; యిర్మియా 19:6). దేవుని పై తిరగబడిన వారందరి అంతం ఇక్కడ తెలుస్తున్నది. క్రొత్త ఒడంబడిక గ్రంథంలో హిన్నోం నరకానికి సూచనగా ఉంది. ఈ వచనంలో కొంత భాగం మార్కు 9:48 లో రాసి ఉంది. యూదుడైనా ఇతర జాతివాడైనా ఈ వచనంలో రాసివున్న శిక్షను తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఇది ఈ పుస్తకం 53వ అధ్యాయం వర్ణించిన వేదన పాలైన అభిషిక్తుణ్ణి ఆశ్రయించడమే.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Isaiah - యెషయా 66 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

దేవుడు హృదయాన్ని చూస్తాడు, మరియు అపరాధం కోసం ప్రతీకారం బెదిరించబడుతుంది. (1-4) 
యూదు ప్రజలు తమ ఆలయంలో గొప్పగా గర్వపడ్డారు, కానీ మానవ చేతులతో నిర్మించిన నిర్మాణంలో శాశ్వతమైన మనస్సు సంతృప్తిని పొందడం సాధ్యమేనా? మానవులు సృష్టించిన దేవాలయాలతో పాటుగా దేవుడు తన స్వంత స్వర్గం మరియు భూమిని కలిగి ఉన్నాడు, అయినప్పటికీ అతను వినయపూర్వకమైన మరియు పశ్చాత్తాపాన్ని కలిగి ఉన్న, శ్రద్ధగల, స్వీయ-వ్యతిరేకత మరియు స్వీయ-తిరస్కరించే వారిని విలువైనదిగా భావిస్తాడు. ఎవరి హృదయాలు నిజంగా పాపంతో బాధపడతాయో వారు దేవునికి సజీవ దేవాలయాలు అవుతారు. దుర్మార్గపు స్థితిలో బలులు అర్పించుట దేవుని అనుగ్రహాన్ని పొందలేకపోవడమే కాకుండా ఆయనను చాలా బాధపెడుతుంది. పాత చట్టం ప్రకారం బలులు అర్పించడం కొనసాగించేవారు క్రీస్తు బలిని సమర్థవంతంగా అణగదొక్కుతారు. ఈ పద్ధతిలో ధూపం వేయడం క్రీస్తు మధ్యవర్తిత్వాన్ని విస్మరిస్తుంది మరియు విగ్రహాన్ని ఆశీర్వదించినట్లే. ప్రజలు తమను తాము మోసం చేసుకోవడానికి ఉపయోగించే వారి తప్పుడు విశ్వాసాల ద్వారా తప్పుదారి పట్టించవచ్చు. అవిశ్వాస హృదయాలు మరియు శుద్ధి చేయని మనస్సాక్షిలు తమ స్వంత భయాలు వాటిని తినేసేలా అనుమతించడం కంటే తమపై తాము దుఃఖం తెచ్చుకోవడానికి ఇంకేమీ అవసరం లేదు. క్రీస్తు యొక్క యాజకత్వం, ప్రాయశ్చిత్తం మరియు మధ్యవర్తిత్వం కోసం మానవులు ప్రత్యామ్నాయం చేసే ఏదైనా చివరికి దేవునికి అసహ్యకరమైనది.

చర్చి యొక్క పెరుగుదల, యూదుడు మరియు అన్యులు విమోచకుని వద్దకు సేకరించబడినప్పుడు. (5-14) 
ప్రవక్త దేవుని వాక్యాన్ని భక్తితో స్వీకరించిన వారిపై తన దృష్టిని మళ్లిస్తాడు, వారికి ఓదార్పు మరియు ప్రోత్సాహాన్ని అందించాలనే లక్ష్యంతో. ప్రభువు తనను తాను వ్యక్తపరుస్తాడు, హృదయపూర్వక విశ్వాసులకు ఆనందాన్ని మరియు కపటులకు మరియు హింసించేవారికి కలవరాన్ని తెస్తుంది. ఆత్మ కుమ్మరించబడినప్పుడు మరియు సీయోను నుండి సువార్త వెలువడినప్పుడు, అనేకమంది ఆత్మలు త్వరితగతిన మార్చబడ్డాయి. దేవుని వాక్యం, ప్రత్యేకించి ఆయన వాగ్దానాలు మరియు శాసనాలు, చర్చికి ఓదార్పు మూలంగా పనిచేస్తాయి. క్రీస్తు వైపు తిరిగే ప్రతి వ్యక్తితో క్రైస్తవులందరి నిజమైన ఆనందం విస్తరించబడుతుంది. సువార్త పూర్తి శక్తితో స్వీకరించబడిన చోట, అది మనలను అనంతమైన మరియు శాశ్వతమైన ఆనందం వైపు తీసుకువెళ్ళే శాంతి నదిని తెస్తుంది. దైవిక ఓదార్పు అంతరంగాన్ని చొచ్చుకుపోతుంది మరియు ప్రభువు యొక్క ఆనందం విశ్వాసి యొక్క బలం అవుతుంది. దేవుని దయ మరియు న్యాయం రెండూ వెల్లడి చేయబడతాయి మరియు శాశ్వతంగా ఉన్నతమవుతాయి.

చర్చి యొక్క ప్రతి శత్రువు నాశనం చేయబడతాడు మరియు భక్తిహీనుల చివరి వినాశనం కనిపిస్తుంది. (15-24)
ఒక ప్రవచనాత్మక ప్రకటన ప్రభువు తన చర్చిని వ్యతిరేకించే వారందరిపై, ప్రత్యేకించి క్రైస్తవ వ్యతిరేక విరోధులతో సహా చివరి రోజులలో సువార్తను ఎదిరించే వారిపై ప్రవచిస్తుంది. 19 మరియు 20 వచనాలు పాపులను మార్చడానికి అందుబాటులో ఉన్న వనరులను స్పష్టంగా వివరిస్తాయి. ఈ వ్యక్తీకరణలు రూపకంగా ఉంటాయి, దేవుడు ఎన్నుకున్నవారు క్రీస్తు వైపుకు ఆకర్షితులయ్యే విస్తారమైన మరియు దయగల మార్గాలను సూచిస్తారు. అందరికీ స్వాగతం, మరియు మద్దతు మరియు ప్రోత్సాహం పరంగా ఏమీ లోటు ఉండదు. చర్చిలో సువార్త పరిచర్య ఏర్పాటు చేయబడుతుంది మరియు ప్రభువు ముందు గంభీరమైన ఆరాధన అందించబడుతుంది. ఆఖరి పద్యంలో, మరణానంతర జీవితంలో పాపుల కోసం ఎదురుచూస్తున్న శిక్ష యొక్క స్వభావం చిత్రీకరించబడింది. ఆ సమయంలో, నీతిమంతులు మరియు దుర్మార్గులు వేరు చేయబడతారు. మన రక్షకుడు పరలోకంలో పశ్చాత్తాపం చెందని పాపుల శాశ్వతమైన బాధలు మరియు హింసలకు దీనిని వర్తింపజేస్తాడు. వారిని వేరుగా ఉంచే ఉచిత దయకు గౌరవసూచకంగా, ప్రభువు నుండి విమోచించబడినవారు వినయం మరియు భక్తి భావంతో విజయవంతమైన పాటలను పాడనివ్వండి. యెషయా తన ప్రవచనాలను ఈ పదునైన చిత్రణతో ముగిస్తున్నాడు, ఇది మానవాళి మొత్తాన్ని చుట్టుముట్టే నీతిమంతుల మరియు దుర్మార్గుల యొక్క విభిన్నమైన విధిని కలిగి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు నుండి దయతో కూడిన ఆహ్వానం కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ, ఆయన సత్యాలను గట్టిగా పట్టుకొని, ప్రతి మంచి పనిలో పట్టుదలతో, ఆయన నామాన్ని గౌరవించే మరియు ప్రేమించేవారిలో దేవుడు, క్రీస్తు కొరకు మనకు చోటును ప్రసాదించుగాక: "రండి, మీరు నా తండ్రి నుండి ఆశీర్వదించబడ్డారు, ప్రపంచం స్థాపించబడినప్పటి నుండి మీ కోసం సిద్ధం చేసిన రాజ్యాన్ని వారసత్వంగా తీసుకోండి.



Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |