“నీకు”– అంటే ఇస్రాయేల్జాతికి ప్రతినిధిగా ఉన్న జెరుసలం – వ 10,14,15,18,21. ఇస్రాయేల్జాతికి భవితవ్యం ఏమీ లేదనీ ఈ అధ్యాయంలోను, ఇతర చోట్ల కనిపించే ఈ భవిష్యద్వాక్కులు క్రొత్త ఒడంబడిక సంఘానికే వర్తిస్తాయనీ కొందరు భావిస్తారు. ఈ భవిష్యద్వాక్కులు ఆధ్యాత్మికంగా క్రొత్త ఒడంబడిక సంఘానికి ఏమాత్రం చెందవని ఈ వ్యాఖ్యాత చెప్పడం లేదు గాని ఇస్రాయేల్జాతి విషయంలో ఇవి అక్షరాలా నెరవేరవు అన్న మాటతో ఏకీభవించడం లేదు. పాత ఒడంబడిక గ్రంథంలో దేవుని రాజ్యం గురించిన భవిష్యద్వాక్కులకు నాలుగు నెరవేర్పులు ఉండవచ్చు – ప్రవక్తలు బ్రతికిన కాలంలోని పరిస్థితులకు ఇవి వర్తించాయి; క్రీస్తు సంఘానికి ఆధ్యాత్మికంగా, సాదృశ్యరూపకంగా వర్తించవచ్చు; వెయ్యేళ్ళ పాలనకు అక్షరార్థంగా వర్తించవచ్చు; చివరిగా క్రొత్త భూమి, ఆకాశాల విషయంలో జరిగే శాశ్వత నేరవేర్పు కూడా ఉండవచ్చు.
“వెలుగు...ప్రకాశం”– యెషయా 4:5-6; యెషయా 9:2; యెషయా 58:8; మొ।। “ఉదయించింది”– ఆధ్యాత్మిక అంధకారాన్ని పటాపంచలు చేసే వెలుగు సాక్షాత్తూ యెహోవాదేవుడే (మలాకీ 4:2; యోహాను 8:12; 2 కోరింథీయులకు 4:3-6).