Isaiah - యెషయా 47 | View All

1. కన్యకయైన బబులోనూ, క్రిందికి దిగి మంటిలో కూర్చుండుము కల్దీయుల కుమారీ, సింహాసనము లేకయే నేలమీద కూర్చుండుము నీవు మృదువువనియైనను సుకుమారివనియైనను జనులు ఇకమీదట చెప్పరు.

1. 'Get off your high horse and sit in the dirt, virgin daughter of Babylon. No more throne for you--sit on the ground, daughter of the Chaldeans. Nobody will be calling you 'charming' and 'alluring' anymore. Get used to it.

2. తిరుగటిదిమ్మలు తీసికొని పిండి విసరుము నీ ముసుకు పారవేయుము కాలిమీద జీరాడు వస్త్రము తీసివేయుము కాలిమీది బట్ట తీసి నదులు దాటుము.

2. Get a job, any old job: Clean gutters, scrub toilets. Hock your gowns and scarves, put on overalls--the party's over.

3. నీ కోకయు తీసివేయబడును నీకు కలిగిన యవమానము వెల్లడియగును నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను.

3. Your nude body will be on public display, exposed to vulgar taunts. It's vengeance time, and I'm taking vengeance. No one gets let off the hook.'

4. సైన్యములకధిపతియు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా అని మా విమోచకునికి పేరు.

4. Our Redeemer speaks, named GOD-of-the-Angel-Armies, The Holy of Israel:

5. కల్దీయుల కుమారీ, మౌనముగా నుండి చీకటిలోనికి పొమ్ము రాజ్యములకు దొరసానియని యికమీదట జనులు నిన్నుగూర్చి చెప్పరు.

5. 'Shut up and get out of the way, daughter of Chaldeans. You'll no longer be called 'First Lady of the Kingdoms.'

6. నా జనులమీద కోపపడి నా స్వాస్థ్యము నపవిత్ర పరచి వారిని నీ చేతికి అప్పగించితిని నీవు వారియందు కనికరపడక వృద్దులమీద నీ కాడి మ్రానును మిక్కిలి బరువుగా మోపితివి.

6. I was fed up with my people, thoroughly disgusted with my progeny. I turned them over to you, but you had no compassion. You put old men and women to cruel, hard labor.

7. నేను సర్వదా దొరసానినై యుందునని నీవనుకొని వీటిని ఆలోచింపకపోతివి వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి.
ప్రకటన గ్రంథం 18:7

7. You said, 'I'm the First Lady. I'll always be the pampered darling.' You took nothing seriously, took nothing to heart, never gave tomorrow a thought.

8. కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను నేను తప్ప మరి ఎవరును లేరు నేను విధవరాలనై కూర్చుండను పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్నదానా, ఈ మాటను వినుము
ప్రకటన గ్రంథం 18:7

8. Well, start thinking, playgirl. You're acting like the center of the universe, Smugly saying to yourself, 'I'm Number One. There's nobody but me. I'll never be a widow, I'll never lose my children.'

9. ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్ర శోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభ వించును. నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసికొనినను ఆ యపాయములు నీమీదికి సంపూర్తిగా వచ్చును.
ప్రకటన గ్రంథం 18:8-23

9. Those two things are going to hit you both at once, suddenly, on the same day: Spouse and children gone, a total loss, despite your many enchantments and charms.

10. నీ చెడుతనమును నీవు ఆధారము చేసికొని యెవడును నన్ను చూడడని అనుకొంటివి నేనున్నాను నేను తప్ప మరి ఎవరును లేరని నీవను కొనునట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను.

10. You were so confident and comfortable in your evil life, saying, 'No one sees me.' You thought you knew so much, had everything figured out. What delusion! Smugly telling yourself, 'I'm Number One. There's nobody but me.'

11. కీడు నీమీదికివచ్చును నీవు మంత్రించి దాని పోగొట్ట జాలవు ఆ కీడు నీమీద పడును దానిని నీవు నివారించలేవు నీకు తెలియని నాశనము నీమీదికి ఆకస్మికముగా వచ్చును.
ప్రకటన గ్రంథం 18:7

11. Ruin descends-- you can't charm it away. Disaster strikes-- you can't cast it off with spells. Catastrophe, sudden and total-- and you're totally at sea, totally bewildered!

12. నీ బాల్యమునుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో ఒకవేళ నీవు మనుష్యులను బెదరింతువేమో

12. But don't give up. From your great repertoire of enchantments there must be one you haven't yet tried. You've been at this a long time. Surely something will work.

13. నీ విస్తారమైన యోచనలవలన నీవు అలసియున్నావు జ్యోతిష్కులు నక్షత్రసూచకులు మాసచర్య చెప్పు వారు నిలువబడి నీమీదికి వచ్చునవి రాకుండ నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము.

13. I know you're exhausted trying out remedies, but don't give up. Call in the astrologers and stargazers. They're good at this. Surely they can work up something!

14. వారు కొయ్యకాలువలెనైరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది జ్వాలయొక్క బలమునుండి తమ్ముతాము తప్పించుకొన లేక యున్నారు అది కాచుకొనుటకు నిప్పుకాదు ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు.

14. 'Fat chance. You'd be grasping at straws that are already in the fire, A fire that is even now raging. Your 'experts' are in it and won't get out. It's not a fire for cooking venison stew, not a fire to warm you on a winter night!

15. నీవు ఎవరికొరకు ప్రయాసపడి అలసితివో వారికి ఆలాగే జరుగుచున్నది నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయు వారు తమ తమ చోట్లకు వెళ్లిపోవుచున్నారు నిన్ను రక్షించువాడొకడైన నుండడు.

15. That's the fate of your friends in sorcery, your magician buddies you've been in cahoots with all your life. They reel, confused, bumping into one another. None of them bother to help you.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Isaiah - యెషయా 47 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

బాబిలోన్‌పై దేవుని తీర్పులు. (1-6) 
బాబిలోన్, అధోకరణం మరియు బాధలను సహించే బాధలో ఉన్న స్త్రీ యొక్క చిత్రం ద్వారా సూచించబడుతుంది. ఆమె నేలపై కూర్చొని, హ్యాండ్‌మిల్‌లో శ్రమిస్తున్నట్లుగా చిత్రీకరించబడింది, అత్యంత నీచమైన మరియు శ్రమతో కూడిన పని. దేవుని ప్రతీకారం న్యాయమైనది మరియు ఎవరూ జోక్యం చేసుకోకూడదు. ప్రవక్త ఇశ్రాయేలు యొక్క విమోచకుడు మరియు పరిశుద్ధుడైన సేనల ప్రభువులో సంతోషిస్తాడు. కొన్నిసార్లు, దేవుడు తన ప్రజలపై విజయం సాధించడానికి దుష్ట వ్యక్తులను అనుమతిస్తాడు, కానీ వారిని క్రూరంగా అణచివేసే వారు చివరికి శిక్షను ఎదుర్కొంటారు.

అజాగ్రత్త మరియు విశ్వాసం చెడును నిరోధించవు. (7-15)
బాబిలోన్ అడుగుజాడలను అనుసరించకుండా, వారి ప్రవర్తనకు అద్దం పట్టే చర్యలకు మరియు మాటలకు దూరంగా ఉండకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. దౌర్జన్యం మరియు అణచివేతపై మన నమ్మకాన్ని ఉంచడం, మన సామర్థ్యాల గురించి గొప్పగా చెప్పుకోవడం మానేయడం మరియు మన స్వంత తెలివి మరియు వివేకం వల్ల అన్ని విజయాలను ఆపాదించుకుంటూ మనపై మాత్రమే ఆధారపడటం నుండి దూరంగా ఉందాం. ఈ విధంగా, బబులోను చివరికి పతనానికి గురికాకుండా మనం తప్పించుకోవచ్చు. శ్రేయస్సు యొక్క శిఖరాన్ని అధిరోహించే వారు తరచుగా ప్రతికూల పరిస్థితులకు గురికాకుండా ఉంటారని నమ్ముతారు మరియు పాపులు తమ చెడ్డ మార్గాలు దాగి ఉన్నారని నమ్ముతారు కాబట్టి వారు సురక్షితంగా ఉన్నారని భావిస్తారు. అయితే, ఈ తప్పుడు భద్రతా భావం అంతిమంగా వారి నాశనానికి దారి తీస్తుంది.
పైన పేర్కొన్న వాటి వంటి భాగాల నుండి, వినయం మరియు దేవునిపై మన నమ్మకాన్ని ఉంచడంలో విలువైన పాఠాలను సంగ్రహిద్దాం. మనకు దేవుని వాక్యంపై విశ్వాసం ఉంటే, శాశ్వతత్వం కోసం నీతిమంతులు మరియు దుష్టుల విధి గురించి అంతర్దృష్టిని పొందవచ్చు. ఈ జ్ఞానం రాబోయే కోపాన్ని నివారించడంలో, దేవుణ్ణి మహిమపరచడంలో, జీవితాంతం శాంతిని పొందడంలో, మరణంపై నిరీక్షణతో మరియు శాశ్వతమైన ఆనందాన్ని పొందడంలో మనకు మార్గనిర్దేశం చేస్తుంది. కాబట్టి, అన్ని రకాల మోసాలకు దూరంగా ఉందాం.



Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |