Isaiah - యెషయా 40 | View All

1. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా,
లూకా 2:25

యెషయా 12:1-3 లో “ఆ రోజున” అంటే “కొమ్మ” (అంటే అభిషిక్తుడు యెషయా 11:1) పరిపాలించేందుకు ప్రత్యక్షమైన తరువాత ప్రజలకు చేకూరే ఆదరణను గురించి రాసి ఉంది. ఇది ఆ భాగంలాంటిదే. అక్కడలాగా ఇక్కడా ఆదరణకు కారణం రక్షణ అనుభవించడం, దేవుని కోపం తొలగిపోవడం. దేవునినుండి లభించే నిజమైన ఆదరణ ఆయన ఇచ్చే “క్షమాపణ”, ఆయన సన్నిధి అనుభవంతో ముడిపడి ఉంది.

2. నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను ఆమె దోషరుణము తీర్చబడెను యెహోవా చేతివలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి.
ప్రకటన గ్రంథం 1:5

“జెరుసలం”– ఇస్రాయేల్ రాజధాని నగరం. అక్షరాలా ఇక్కడ ఇస్రాయేల్ జాతిని సూచిస్తూ ఉంది. జెరుసలం తిరిగి తన పూర్వ వైభవాన్ని పొందే విషయం యెషయా 1:26; యెషయా 2:1-4; మొ।। చోట్ల చూడవచ్చు. “పొందిందని”– విమోచన పూర్తి అయింది. క్షమాపణ దొరికింది. జెరుసలం పాపానికి సరిపోయిన శిక్ష దానికి పడిందని దేవుడు పరిగణిస్తున్నట్టు దీనికి అర్థం చెప్పుకోవచ్చు (2వ వచనం చివరి భాగం). యెషయా గ్రంథంలో తరచుగా జెరుసలం పొందిన బాధలు, శిక్షలు మనకు కనిపిస్తూవుంటాయి. యెషయా 3:1-26; యెషయా 5:3-6, యెషయా 5:25-30; యెషయా 7:18-25; యెషయా 8:5-8; యెషయా 22:1-13; యెషయా 29:1-4. ప్రపంచంలో మరి ఏ ఇతర నగరమూ ఇలా పదే పదే విపత్తులనూ, బాధలనూ, వినాశాలనూ ఎదుర్కోలేదు. యెషయా ఈ మాటలు రాస్తున్న సమయంలో జెరుసలంకు సంభవించవలసిన బాధలు మరి కొన్ని ఉన్నాయి. అంతేగాక, ఈ యుగాంతంలో మరిన్ని బాధలు రానున్నాయి – జెకర్యా 12:2-3; జెకర్యా 14:2; మత్తయి 24:15-22. అయితే దాని కష్టాలన్నీ కడతేరిపోయే రోజు రానున్నది.

3. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి.
మత్తయి 3:3, మార్కు 1:3, లూకా 1:76, యోహాను 1:23, లూకా 3:4-6

ఈ అధ్యాయంలో కనిపించే మూడు స్వరాల్లో ఇది మొదటిది (వ 3,6,9). ఇది బాప్తిసం ఇచ్చే యోహాను స్వరం (మత్తయి 3:3; మార్కు 1:3; లూకా 3:4; యోహాను 1:23). యెషయా ఈ మాటలు రాసిన కాలానికి 700 సంవత్సరాల తరువాత యోహాను వచ్చాడు. జెరుసలంకు గానీ మనకు గానీ నిజమైన, స్థిరమైన ఆదరణ ఎవరిద్వారా కలుగుతుందో ఆయన్ను యోహాను ప్రకటించాడు (మార్కు 1:7-8; యోహాను 1:29). యోహాను యేసుప్రభువుకోసం మార్గం సిద్ధపరుస్తున్నాడంటే దేవుని కోసమే అలా చేస్తున్నాడని గుర్తుంచుకోండి. “సిద్ధం చెయ్యండి”– ఈ రోజుల్లో లాగానే ఆ కాలంలో కూడా ఒక అధికారి నగరానికి వస్తున్నాడంటే రాజమార్గాన్ని బాగుచేయడం కద్దు. పరలోకంనుండి వస్తున్న రాజుకోసం యోహాను దారిని సిద్ధం చేశాడు.

4. ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండ వలెను.

యెషయా 26:7; యెషయా 49:11. రాజు రాకడకు ఉన్న ఆటంకాలు, అవరోధాలన్నిటినీ తొలగించి ఆయన్ను ఆహ్వానించేందుకు అన్ని ఏర్పాట్లూ జరగాలని దీని అర్థం.

5. యెహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.
లూకా 2:30-31, అపో. కార్యములు 28:28

పాత ఒడంబడిక కాలంలో దేవుని మహిమా ప్రకాశాన్ని కొందరు కొంతమట్టుకు చూశారు (నిర్గమకాండము 33:18-23; నిర్గమకాండము 40:34; ద్వితీయోపదేశకాండము 5:24). దేవుని మహిమ మరింతగా మనుషులకు వెల్లడౌతుందన్న వాగ్దానం ఇక్కడ ఉంది. మనుషులంతా దాన్ని చూస్తారు. క్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు ఇది కొంతవరకు నెరవేరింది (యోహాను 1:1, యోహాను 1:14; యోహాను 11:40; 2 కోరింథీయులకు 4:6; హెబ్రీయులకు 1:3). అయితే ఆయన రెండవ రాకడ సమయంలో క్రీస్తు ద్వారా దేవుని మహిమా ప్రకాశం మరింత ప్రస్ఫుటంగా వెల్లడి అవుతుంది (మత్తయి 16:27; మత్తయి 24:30; మత్తయి 25:31; ప్రకటన గ్రంథం 1:7). అప్పుడు అక్షరాలా ప్రతి కన్నూ ఆయనను చూస్తుంది. 3వ వచనం క్రీస్తు మొదటి రాకను ప్రకటిస్తూ ఉంది. 5వ వచనం పూర్తి నెరవేర్పు ఈ యుగాంతంలో ఉంటుంది.

6. ఆలకించుడి, ప్రకటించుమని యొకడు ఆజ్ఞ ఇచ్చు చున్నాడు నేనేమి ప్రకటింతునని మరి యొకడడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డియై యున్నారు వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నది
యాకోబు 1:10-11, 1 పేతురు 1:24-25

“చాటించు”– అంటే ఇక్కడ చెప్పబొయ్యే సత్యాన్ని మనుషులంతా తెలుసుకొనేలా చెయ్యి. ఇంతకు ముందు వచనాలకూ, తరువాతి వచనాలకూ ఈ భాగంలో ఒక వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. 5వ వచనంలో దేవుని మహిమా తేజం గురించి ఉంది. మనిషి ఘనత ఎందుకూ కొరగానిది, అశాశ్వతమైనది, మహిమ అని అనిపించుకోవడానికి తగినది కాదు. మనిషి బలహీనుడు, గడ్డిలాగా ఎండిపోయేవాడు. జెరుసలంకు (లేక ఎవరికైనా) రక్షణ, ఆదరణ కల్పించేందుకు అశక్తుడు. కాబట్టి మనిషి చెయ్యలేని దాన్ని చేసేందుకు దేవుడు రావలసిందే. “గడ్డి”– యెషయా 37:27; యెషయా 51:12; యాకోబు 1:10; 1 పేతురు 1:24-25.

7. యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డివంటివారే.
యాకోబు 1:10-11

“ఊదగానే”– కీర్తనల గ్రంథము 103:15-16. “ఎండి...వాడిపోతుంది”– మానవ చరిత్ర సారాంశం, అందులో కనిపించిన అహంకారం, ఆడంబరం, శోభ అంతా ఈ మాటల్లో ఇమిడి ఉన్నాయి. అయితే తరాలు గడిచిపోతూ ఉండగా గతించిపోనిది ఒకటుంది – దేవుని వాక్కు (కీర్తనల గ్రంథము 119:89; మత్తయి 5:18; మత్తయి 24:35; లూకా 16:17; 1 పేతురు 1:25). ఒక మనిషి నమ్మకం పెట్టుకోవడానికి పాత్రమైనదీ ఈ లోకమంతటిలోనూ శాశ్వతంగా నిలిచేదీ బైబిలు సత్యమే.

8. గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.

9. సీయోనూ, సువార్త ప్రటించుచున్నదానా, ఉన్నతపర్వతము ఎక్కుము యెరూషలేమూ, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి - ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము.
యోహాను 12:15

“శుభవార్త”– ఈ సందర్భాన్ని బట్టి చూస్తే ఈ శుభవార్త లో 2,5,8 వచనాల్లో ఉన్న విషయాలూ, ఈ భాగంలో ఉన్న విషయాలూ ఉన్నాయి. “కొండ”– దేశమంతా వినాలని దేవుని ఉద్దేశమన్నమాట. ఈ మాటలు సంకేత రూపంలో ఉన్నాయి. కొండ శిఖరాలపైనుండి ప్రకటించే స్వరం చక్కగా వినబడుతుంది. “భయపడక”– మనుషుల భయంవల్ల గాని, నీవు ప్రకటించే సందేశంలోని గంబీరత్వం, గొప్పతనం వల్ల గాని సందేహించకు. “దేవుడు”– యెషయా 25:9. కీర్తనల గ్రంథము 42:3, కీర్తనల గ్రంథము 42:10 లోని ప్రశ్నతో పోల్చి చూడండి. క్రీస్తు రాక అంటే దేవుని రాకే.

10. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తిసంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చు బహుమానము ఆయనయొద్దనున్నది ఆయన చేయు ప్రతికారము ఆయనకు ముందుగానడచుచున్నది.
ప్రకటన గ్రంథం 22:7-12

9వ వచనంలో రాసి ఉన్న దేవుని ప్రత్యక్షత క్రీస్తు రెండవ రాకడ సమయంలో వస్తుందని ఈ వచనం సూచిస్తున్నది (యెషయా 62:11; మత్తయి 16:27; మత్తయి 25:19-21, మత్తయి 25:31-34; ప్రకటన గ్రంథం 22:12).

11. గొఱ్ఱెలకాపరివలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొఱ్ఱెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును.
యోహాను 10:11

“కాపరి”– ప్రతి యుగంలోనూ, అన్ని సమయాలలోనూ, దేవుని ప్రజల విషయంలో ఇది సత్యం (ఆదికాండము 48:15; కీర్తనల గ్రంథము 23:1; కీర్తనల గ్రంథము 28:9; కీర్తనల గ్రంథము 78:52; కీర్తనల గ్రంథము 80:1; యిర్మియా 31:10; యెహెఙ్కేలు 34:12-16, యెహెఙ్కేలు 34:23, యెహెఙ్కేలు 34:31; యోహాను 10:11-16). “చేతులతో...గుండెమీద”– వారి బలహీనతనూ ఆయన ప్రేమ, వాత్సల్యతలనూ ఇది సూచిస్తున్నది. విశ్వాసులు ఆయనకు ఎంత ప్రియమైనవారు! ఇక్కడి సందర్భాన్నిబట్టి క్రీస్తు రెండవ రాక సమయంలో ఇస్రాయేల్ ప్రజ విషయంలో ఇది నిజం అవుతుందని తెలుస్తున్నది.

12. తన పుడిసిటిలో జలములు కొలిచినవాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు? త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు? తూనికచేత కొండలను తూచినవాడెవడు?

యెషయా 3:9-10 వచనాల్లో దేవుని గురించిన వర్ణన ఉంది. రాబోతున్న ఆ దేవుని గొప్పతనం ఇక్కడ వర్ణించబడింది. నిజ దేవుణ్ణి తెలుసుకోవడం, ఆయన గుణాలు, స్వభావం, ప్రభావం మహిమలను గురించి సరైన అభిప్రాయాలను కలిగివుండడం మనకు చాలా అవసరం. ఇది నెరవేరేందుకు ఈ అధ్యాయాన్ని వాడుకొంటే ఇది వెల కట్టేందుకు వీలుకాని భాగం. యోబు 28:25-26; యోబు 38:3-5, యోబు 38:8-11, యోబు 38:18; సామెతలు 30:4.

13. యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఆయనకు మంత్రియై ఆయనకు బోధపరచినవాడెవడు? ఎవనియొద్ద ఆయన ఆలోచన అడిగెను?
1 కోరింథీయులకు 2:16, రోమీయులకు 11:34-35

రోమీయులకు 11:34-36; 1 కోరింథీయులకు 2:16.

14. ఆయనకు వివేకము కలుగజేసినవాడెవడు? న్యాయమార్గమును గూర్చి ఆయనకు నేర్పినవాడెవడు? ఆయనకు జ్ఞానమును ఆభ్యసింపజేసినవాడెవడు? ఆయనకు బుద్ధిమార్గము బోధించినవాడెవడు?
రోమీయులకు 11:34-35

యోబు 12:13; యోబు 21:22; యోబు 36:22; కొలొస్సయులకు 2:3; యెషయా 55:9.

15. జనములు చేదనుండి జారు బిందువులవంటివి జనులు త్రాసుమీది ధూళివంటివారు ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువులవలె నున్నవి.

యెషయా 2:22; కీర్తనల గ్రంథము 62:9. దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన దృష్టి భూగోళం ఇసుకరేణువంత చిన్నగా కనిపిస్తుంది. దేవుని చేతిలో భూమి ఎంత తేలికగా ఉంటుందంటే దానికసలు బరువు ఉన్నట్టే ఉండదు.

16. సమిధలకు లెబానోను చాలకపోవును దహనబలికి దాని పశువులు చాలవు

లెబానోనులో దేవదారు చెట్లు నిండిన పెద్ద అడవులు ఉన్నాయి. వాటన్నిటినీ వంట చెరుకుగా మార్చి నిప్పు అంటించి ఆ అగ్నిలో లెబానోనులో ఉన్న పశువులన్నిటినీ దేవునికి బలిగా అర్పించినా అది ఆయన ఘనతకు, యోగ్యతకు సరిపోదు. 1 రాజులు 8:27; కీర్తనల గ్రంథము 50:8-15; అపో. కార్యములు 17:24-25.

17. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే యుండును ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును.

జాతులను, జనాలను, సంభవాలను తన ఇష్టం వచ్చినట్టు అదుపులో ఉంచడం దేవునికి సమస్య కాదు. ఆయన ఉద్దేశాలను పడద్రోయగల శక్తి భూమిపై ఏదీ లేదు. యెషయా గ్రంథమంతటిలోనూ దేవుడు తన ఆశయాలను నెరవేర్చడానికి వివిధ జాతులను వాడుకోవడమూ, తన సంకల్పానుసారంగా వాటికి ఏమీ బలం లేనట్టుగా నాశనం చెయ్యడమూ కనిపిస్తూవుంది – వ 23,24.

18. కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటిచేయగలరు?
అపో. కార్యములు 17:29

దేవుని ఈ మహా ఘనతను బట్టి ఆలోచిస్తే ఆయనకు ప్రతినిధిగా ఉండాలన్న ఉద్దేశంతో ఏదైనా విగ్రహాన్ని తయారు చెయ్యబూనుకోవడం ఎంత తెలివితక్కువ పనో చూడగలం. దేవునికి ప్రతినిధిగా ఉండడానికి దేవుని పోలికలో ఉన్నవాడొకడు ఉన్నాడు (2 కోరింథీయులకు 4:4; హెబ్రీయులకు 1:3).

19. విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయును కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును దానికి వెండి గొలుసులు చేయును

20. విలువగలదానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రాను ఏర్పరచుకొనును కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పని వాని వెదకి పిలుచుకొనును.

21. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటినుండి ఎవరును మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటనుబట్టి మీరుదాని గ్రహింపలేదా?

వ 28; కీర్తనల గ్రంథము 19:1; అపో. కార్యములు 14:15-17; రోమీయులకు 1:18-23.

22. ఆయన భూమండలముమీద ఆసీనుడై యున్నాడు దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను.

“కూర్చుని ఉన్నాడు”– యెషయా 66:1; కీర్తనల గ్రంథము 2:4; కీర్తనల గ్రంథము 47:2, కీర్తనల గ్రంథము 4:7-8. “పరుస్తాడు”– యెషయా 42:5; యెషయా 44:24; యెషయా 51:13; కీర్తనల గ్రంథము 104:2.

23. రాజులను ఆయన లేకుండచేయును భూమియొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయును.

వ 6-8,17; యెషయా 34:12; యెషయా 41:2; యెషయా 43:13; సామెతలు 21:1; దానియేలు 4:35.

24. వారు నాటబడగనే విత్తబడగనే వారి మొదలు భూమిలో వేరు తన్నకమునుపే ఆయన వారిమీద ఊదగా వారు వాడిపోవుదురు సుడిగాలి పొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును.

25. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు? అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు.

వ 18.

26. మీకన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలు దేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు.

దేవుని సృష్టిని మానవులు ఆలోచనా పూర్వకంగా చూచి అది చెప్పే సందేశాన్ని వినాలని దేవుడు కోరుతున్నాడు. వారు అలా చేస్తే జీవితం పట్ల వారి మనస్తత్వమంతటినీ అది మార్చివేసి దేవుని చెంతకు వెళ్ళేదారిలో వారిని పెట్టగలదు. కీర్తనల గ్రంథము 19:1-4 చూడండి. మనందరితోనూ దేవుడీమాటలు చెప్తున్నాడు: నక్షత్రాలకేసి చూడండి, మనసు పెట్టి ఆలోచించండి! “ప్రతి దానికీ”– మన నక్షత్ర వీధిలో కంటికి కనిపించే నక్షత్రాలు కొన్ని వేలు మాత్రమే ఉన్నా, అందులో అనేక కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఇలాంటి నక్షత్ర వీధులు అనేక కోట్లకొద్దీ ఉన్నాయి. వాటన్నిటినీ దేవుడే చేశాడు. అవన్నీ ఆయనకు తెలుసు. వాటన్నిటినీ నిలిపి ఉంచేది ఆయనే.

27. యాకోబూనా మార్గము యెహోవాకు మరుగై యున్నది నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేల అనుచున్నావు? ఇశ్రాయేలూ, నీవేల ఈలాగు చెప్పుచున్నావు?

మరోసారి యెషయా కాలంలోని యూదుల పరిస్థితికి మన దృష్టిని ఇది మరలిస్తున్నది. దేవుని కంటబడకుండా తమ ఇష్టం వచ్చినట్టుగా చెయ్యవచ్చుననుకున్నారు కొందరు (యెషయా 29:15). కొందరైతే దేవుడు తమ సంగతి పట్టించుకుంటున్నాడా లేదా అంటూ సంశయంలో, అపనమ్మకంలో ఉన్నారు (యెషయా 49:14).

28. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.

“యెహోవా”– ఇది ఎవరికి తెలిసినా, తెలియకపోయినా యూదులకు మాత్రం తప్పక తెలిసి ఉండాలి. ఇస్రాయేల్‌వారి దేవుడు యెహోవా ఏకైక దేవుడు (యెషయా 43:10; యెషయా 44:8; యెషయా 45:5; కీర్తనల గ్రంథము 18:31). “అలసట”– 26 వచనంలో రాసివున్నదాన్ని చేయగల దేవుడు భూమిపై తన ప్రజలమధ్య తాను చేస్తున్న పనులవల్ల అలసిపోడు. “అసాధ్యం”– యెషయా 55:8-9; కీర్తనల గ్రంథము 147:5; రోమీయులకు 11:33.

30. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు ¸యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు

వ 6-8 లోని వివరణలో యువతరం కూడా ఉంది. ఆదికాండము 8:21 లో కూడా ఇంతే. ఆధ్యాత్మిక విషయాల్లో కూడా యువకులకు సుదీర్ఘమైన పందెం, కష్టమైన జీవన పోరాటం కోసం సొంత బలం చాలదు. దేవునిలో వారు బలాన్నికనుగొంటే తప్ప, పరీక్షకు తట్టుకొని నిలవలేరు.

31. యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.

ఈ పతిత లోకంలో పవిత్రంగా నడుచుకోవాలంటే, జీవిత యాత్ర ఆనందంగా ముగించాలంటే, దేవునికిష్టమైన రీతిలో ఆయన్ను సేవించగల సామర్థ్యం కావాలంటే మన బలం చాలదు. మన అల్ప బలానికి మారుగా దేవుని అమిత బలాన్ని పొందడం నేర్చుకోవాలి (వ 28,29. ఎఫెసీయులకు 1:18-21 చూడండి – విశ్వాసులకు క్రీస్తులో దొరకగల బలం ఎలాంటిదో తెలుస్తుంది). విశ్వాసంతో దేవునివైపు చూస్తేనే ఇది దొరుకుతుంది. మనలో మనకోసం మనం దేన్నైతే చేసుకోలేమో అది దేవుడే చెయ్యాలని ఆయన మీద నమ్మకం పెట్టుకోవడం మనం నేర్చుకోవాలి. మత్తయి 11:28-30 యువకులైనా, వృద్ధులైనా అలసిపోయినవారికి మరి కొన్ని ఆదరణ వాక్కులున్నాయి.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Isaiah - యెషయా 40 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible


సువార్త ప్రకటించడం, క్రీస్తు రాకడ గురించిన శుభవార్త. (1-11) 
"మానవ అస్తిత్వం అంతా ఒక స్థిరమైన యుద్ధం, మరియు క్రైస్తవ జీవితం బహుశా అన్నింటికంటే చాలా కష్టతరమైనది. అయితే, ఈ పోరాటం శాశ్వతమైనది కాదు; దీనికి ముగింపు ఉంది. కష్టాలు ప్రేమ యొక్క శక్తి ద్వారా తొలగించబడతాయి, ముఖ్యంగా పాపాలు క్షమించబడినప్పుడు. క్రీస్తు మరణం ద్వారా సాధించిన అద్భుతమైన ప్రాయశ్చిత్తం ద్వారా, దేవుని దయ అతని న్యాయానికి అనుగుణంగా, అతని మహిమను వెల్లడిస్తుంది.క్రీస్తులో మరియు అతని బాధలో, నిజమైన పశ్చాత్తాపకులు తమ పాపాలన్నిటికీ రెట్టింపు ఆశీర్వాదాన్ని కనుగొంటారు, ఎందుకంటే అతని మరణం ద్వారా క్రీస్తు అందించిన సంతృప్తి అమూల్యమైనది.
ప్రవక్త యొక్క మాటలు నిజానికి బాబిలోన్ నుండి యూదులు తిరిగి రావడానికి సంబంధించినవి కావచ్చు, అయితే ఈ సంఘటన కొత్త నిబంధనలో పవిత్రాత్మ ద్వారా ముందుగా చెప్పబడిన క్షణంతో పోలిస్తే జాన్ బాప్టిస్ట్ క్రీస్తు రాకను తెలియజేసాడు. పురాతన కాలంలో, తూర్పు పాలకులు నిర్జనమైన భూముల గుండా ప్రయాణించినప్పుడు, వారి కోసం మార్గాలు చాలా జాగ్రత్తగా సిద్ధం చేయబడ్డాయి మరియు అడ్డంకులు తొలగించబడ్డాయి. ప్రభువు తన బోధల ద్వారా మరియు అతని ఆత్మ యొక్క విశ్వాసాల ద్వారా మన హృదయాలను సిద్ధం చేస్తాడు, మన ఉన్నతమైన ఆలోచనలను తగ్గించి, ధర్మబద్ధమైన కోరికలను పెంపొందించుకుంటాడు, మన వంకర మరియు మొండి స్వభావాలను సరిదిద్దడం మరియు ఏవైనా అడ్డంకులు తొలగించడం, తద్వారా మేము అతని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటాము. భూమి మరియు అతని స్వర్గపు రాజ్యం కోసం సిద్ధంగా ఉండండి.
పడిపోయిన మానవత్వంతో అనుబంధించబడిన అన్నింటినీ పరిగణించండి లేదా మానవులు సాధించిన ఏదైనా-గడ్డి మరియు దాని నశ్వరమైన పువ్వులు వంటివి. శిక్షను ఎదుర్కొంటున్న పాపికి బిరుదులు మరియు ఆస్తులు ఏ విలువను కలిగి ఉంటాయి? కేవలం శరీరానికి చేయలేనిది మన కోసం చేయగల శక్తి ప్రభువు వాక్యానికి ఉంది. క్రీస్తు ఆసన్నమైన రాక యొక్క సంతోషకరమైన సందేశం భూమి యొక్క సుదూర ప్రాంతాలకు వ్యాపించడానికి ఉద్దేశించబడింది. సాతాను బలీయమైన విరోధి కావచ్చు, కానీ మన ప్రభువైన యేసు శక్తిమంతుడు, మరియు అతను తన ప్రణాళికలను విఫలం కాకుండా అమలు చేస్తాడు. క్రీస్తు కరుణామయమైన గొర్రెల కాపరిగా పనిచేస్తాడు, కొత్త మతమార్పిడులు, బలహీన విశ్వాసులు మరియు దుఃఖంతో బాధపడేవారి పట్ల సున్నిత శ్రద్ధను ప్రదర్శిస్తాడు. ఆయన వాక్యం మనకు అందించడానికి వీలు కల్పించే వాటిని మాత్రమే కోరుతుంది మరియు ఆయన మనలను సహించటానికి బలపరిచే దానికంటే ఎక్కువ కష్టాలను విధించదు. మన కాపరి యొక్క స్వరాన్ని గుర్తించి, ఆయనను నమ్మకంగా అనుసరించి, తద్వారా మనల్ని మనం అతని ప్రతిష్టాత్మకమైన గొర్రెలుగా ధృవీకరిద్దాం.

దేవుని సర్వశక్తిమంతమైన శక్తి. (12-17)
సృష్టికర్త సన్నిధిలో, సృష్టి అంతా అల్పమైపోతుంది. ప్రభువు తన ఆత్మ ద్వారా ప్రపంచాన్ని రూపొందించినప్పుడు, ఏమి చేయాలో లేదా ఎలా కొనసాగించాలో ఎవరూ మార్గదర్శకత్వం లేదా సలహా ఇవ్వలేదు. దేశాలు, అతనికి వ్యతిరేకంగా కొలిచినప్పుడు, అపారమైన బకెట్‌లో ఒంటరిగా ఉన్న డ్రాప్ లేదా బ్యాలెన్స్‌లో ఉన్న మైనస్‌క్యూల్ ధూళిని పోలి ఉంటాయి, ఇది మొత్తం భూమితో పోలిస్తే ఎటువంటి ప్రభావాన్ని చూపదు. యోహాను 3:16లో చెప్పబడినట్లుగా, ప్రపంచం పట్ల దేవుని ప్రేమ యొక్క అపారతను ఇది నొక్కి చెబుతుంది, అతని దృష్టిలో అది చిన్నదిగా మరియు అల్పమైనదిగా కనిపించినప్పటికీ, యోహాను 3:16లో దాని విమోచనం కోసం ఆయన తన అద్వితీయ కుమారుని త్యాగం చేశాడు. చర్చి యొక్క అర్పణలు మరియు ఆరాధనలు అతని పరిపూర్ణతను ఎన్నటికీ పెంచలేవు, ఎందుకంటే తండ్రి యొక్క ఏకైక కుమారుని నిస్వార్థ సమర్పణ ద్వారా మాత్రమే మన ఆత్మలు శాశ్వతమైన విధ్వంసం నుండి తప్పించబడ్డాయి.

విగ్రహారాధన యొక్క మూర్ఖత్వం. (18-26) 
ఎప్పుడైతే మనం దేవుని కంటే ఎక్కువ గౌరవం లేదా ఆప్యాయత, భయము లేదా ఆశతో దేనినైనా కలిగి ఉంటాము, మనం చిత్రాలను సృష్టించకపోయినా లేదా పూజలో పాల్గొనకపోయినా, ఆ జీవిని దేవునితో సమానమైన స్థితికి సమర్థవంతంగా ఎదుగుతాము. బలిగా అర్పించడానికి తమ వద్ద ఏమీ లేనంతగా నిరుపేదగా ఉన్న వ్యక్తి కూడా ఇప్పటికీ గౌరవించటానికి వారి స్వంత దేవతను కనుగొంటారు. ప్రజలు తమ విగ్రహాల విషయానికి వస్తే ఎంత విలాసంగా ఉంటారో చెప్పుకోదగినది, అయినప్పటికీ వారు మన దేవుని సేవలో అదే విధంగా పెట్టుబడి పెట్టడానికి వెనుకాడతారు. దేవుని గొప్పతనం యొక్క పరిమాణాన్ని నొక్కిచెప్పడానికి, ప్రవక్త అన్ని తరాలను మరియు దేశాలను సాక్షులుగా పిలుస్తాడు. ఈ సత్యం గురించి తెలియని వారు ఇష్టపూర్వకంగానే చేస్తారు. దేవుడు అన్ని జీవులపై మరియు సృష్టిలోని ప్రతి అంశముపై ఆధిపత్యం కలిగి ఉన్నాడు. ప్రవక్త మన ఇంద్రియాలకు అదనంగా మన తెలివిని ఉపయోగించమని ప్రోత్సహిస్తాడు, ఖగోళ అతిధేయల సృష్టికర్త గురించి ఆలోచించమని మరియు ఆయనకు మన గౌరవాన్ని చెల్లించమని ప్రేరేపిస్తాడు. ఆయన సంకల్పాన్ని నెరవేర్చడంలో ఏ ఒక్క సంస్థ కూడా విఫలం కాదు. ఆయన అన్ని వాగ్దానాలు చేయడమే కాకుండా వాటిని నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నారని కూడా గుర్తుంచుకోండి.

అవిశ్వాసానికి వ్యతిరేకంగా. (27-31)
దేవుని ప్రజలు విశ్వాసం లేకపోవడం మరియు ఆయనపై వారి అపనమ్మకం కారణంగా చీవాట్లు ఎదుర్కొంటారు. వారు జాకబ్ మరియు ఇజ్రాయెల్ అనే పేర్లను కలిగి ఉన్నారని, జాకబ్ తన పరీక్షలన్నింటికీ మద్దతునిచ్చిన దేవుని విశ్వసనీయతకు గుర్తింపుగా వారికి పేర్లు పెట్టారని వారు గుర్తుంచుకోవాలి. ఈ పేర్లు ఆయనతో వారి ఒడంబడిక సంబంధాన్ని సూచిస్తాయి. అనేక నిరాధారమైన చింతలు మరియు నిరాధారమైన భయాలు వాటి మూలాలను జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా తొలగించబడతాయి. ప్రతికూల ఆలోచనలు మన మనస్సులలో వేళ్ళూనుకోవడం అనువైనది కాదు, కానీ వాటిని ప్రతికూల ప్రసంగంగా వ్యక్తీకరించడానికి మనం అనుమతించినప్పుడు అది మరింత ఘోరంగా ఉంటుంది.
ఈ భయాందోళనలు మరియు అనిశ్చితులన్నింటినీ అణచివేయడానికి వారికి ఇప్పటికే తెలిసినవి మరియు విన్నవి సరిపోతాయి. దేవుడు కృప యొక్క పనిని ప్రారంభించినప్పుడు, అతను దానిని పూర్తి చేస్తాడు. ఆయనపై వినయపూర్వకంగా ఆధారపడే వారికి, స్వయంగా చర్య తీసుకునే వారికి ఆయన సహాయం చేస్తాడు. వారి బలం ఆనాటి డిమాండ్లకు అనుగుణంగా ఉంటుంది, దైవిక దయకు ధన్యవాదాలు, వారి ఆత్మలు ప్రాపంచిక ఆందోళనల కంటే ఎదగడానికి వీలు కల్పిస్తాయి. వారు నూతన శక్తితో దేవుని ఆజ్ఞలను ఆనందంగా పాటిస్తారు.
అవిశ్వాసం, అహంకారం మరియు స్వావలంబన నుండి కాపాడుకుందాం. మనం మన స్వంత శక్తితో ముందుకు సాగితే, మనం తడబడటం మరియు జారిపోయే అవకాశం ఉంది. అయితే, మనము మన హృదయాలను మరియు ఆశలను పరలోకంలో ఉంచినట్లయితే, మనము అన్ని అడ్డంకులను అధిగమించి, క్రీస్తుయేసునందు మన ఉన్నతమైన పిలుపు యొక్క బహుమతిని పొందుతాము.



Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |