Isaiah - యెషయా 30 | View All

1. యెహోవా వాక్కు ఇదే లోబడని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకొనునట్లుగా వారు నన్ను అడుగక ఆలోచనచేయుదురు నా ఆత్మ నియమింపని సంధిచేసికొందురు

1. यहोवा की यह वाणी है, हाय उन बलवा करनेवाले लड़कों पर जो युक्ति तो करते परन्तु मेरी ओर से नहीं; वाचा तो बान्धते परन्तु मेरे आत्मा के सिखाये नहीं; और इस प्रकार पाप पर पाप बढ़ाते हैं।

2. వారు నా నోటి మాట విచారణచేయక ఫరోబలముచేత తమ్మును తాము బలపరచుకొనుటకు ఐగుప్తునీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయా ణము చేయుదురు.

2. वे मुझ से बिन पूछे मि को जाते हैं कि फिरौन की रक्षा में रहे और मि की छाया में शरण लें।

3. ఫరోవలన కలుగు బలము మీకు అవమానకరమగును ఐగుప్తునీడను శరణుజొచ్చుటవలన సిగ్గు కలుగును.

3. इसलिये फिरौन का शरणस्थान तुम्हारी लज्जा का, और मि की छाया में शरण लेना तुम्हारी निन्दा का कारण होगा।

4. యాకోబువారి అధిపతులు సోయనులో కనబడునప్పుడు వారి రాయబారులు హానేసులో ప్రవేశించునప్పుడు

4. उसके हाकिम सोअन में आए तो हैं और उसके दूत अब हानेस में पहुंचे हैं।

5. వారందరును తమకు అక్కరకు రాక యే సహాయ మునకైనను ఏ ప్రయోజనమునకైనను పనికిరాక సిగ్గును నిందయు కలుగజేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు.

5. वे सब एक ऐसी जाति के कारण लज्जित होंगे जिस से उनका कुछ लाभ न होगा, जो सहायता और लाभ के बदले लज्जा और नामधराई का कारण होगी।।

6. దక్షిణ దేశములోనున్న క్రూరమృగములను గూర్చిన దేవోక్తి సింహీ సింహములును పాములును తాపకరమైన మిడునాగులు నున్న మిక్కిలి శ్రమ బాధలుగల దేశముగుండ వారు గాడిదపిల్లల వీపులమీద తమ ఆస్తిని ఒంటెల మూపులమీద తమ ద్రవ్యములను ఎక్కించు కొని తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని తీసికొని పోవుదురు.

6. दक्खिन देश के पशुओं के विषय भारी वचन। वे अपनी धन सम्पति को जवान गदहों की पीठ पर, और अपने खजानों को ऊंटों के कूबड़ों पर लादे हुए, संकट और सकेती के देश में होकर, जहां सिंह और सिंहनी, नाग और उड़नेवाले तेज विषधर सर्प रहते हैं, उन लोगों के पास जा रहे हैं जिन से उनको लाभ न होगा।

7. ఐగుప్తువలని సహాయము పనికిమాలినది, నిష్ప్రయోజన మైనది అందుచేతనుఏమియు చేయక ఊరకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను.

7. क्योंकि मि की सहायता व्यर्थ और निकम्मी है, इस कारण मैं ने उसको बैठी रहनेवाली रहब कहा है।।

8. రాబోవు దినములలో చిరకాలమువరకు నిత్యము సాక్ష్యార్థముగా నుండునట్లు నీవు వెళ్లి వారియెదుట పలకమీద దీని వ్రాసి గ్రంథ ములో లిఖింపుము

8. अब आकर इसको उनके साम्हने पत्थर पर खोद, और पुस्तक में लिख, कि वह भविष्य के लिये वरन सदा के लिये साक्षी बनी रहे।

9. వారు తిరుగబడు జనులు అబద్ధమాడు పిల్లలు యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు

9. क्योंकि वे बलवा करनेवाले लोग और झूठ बोलनेवाले लड़के हैं जो यहोवा की शिक्षा को सुनना नहीं चाहते।

10. దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పు వారును యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి మృదువైన మాటలనే మాతో పలుకుడి మాయాదర్శనములను కనుడి

10. वे दर्शियों से कहते हैं, दर्शी मत बनो; और नबियों से कहते हैं, हमारे लिये ठीक नबूवत मत करो; हम से चिकनी चुपड़ी बातें बोलो, धोखा देनेवाली नबूवत करो।

11. అడ్డము రాకుండుడి త్రోవనుండి తొలగుడి ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని సంగతి మా యెదుట ఎత్తకుడి అని భవిష్యద్‌ జ్ఞానులతో పలుకువారునై యున్నారు.

11. मार्ग से मुड़ो, पथ से हटो, और इस्राएल के पवित्रा को हमारे साम्हने से दूर करो।

12. అందుచేతను ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు ఈ వాక్యమువద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసికొంటిరి గనుక

12. इस कारण इस्राएल का पवित्रा यों कहता है, तुम लोग जो मेरे इस वचन को निकम्मा जानते और अन्धेर और कुटिलता पर भरोसा करके उन्हीं पर टेक लगाते हो;

13. ఈ దోషము మీకు ఎత్తయిన గోడ నుండి జోగిపడబోవుచున్న గోడ అండవలె అగును అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును.

13. इस कारण यह अधर्म तुम्हारे लिये ऊंची भीत का टूटा हुआ भाग होगा जो फटकर गिरने पर हो, और वह अचानक पल भर में टूटकर गिर पड़ेगा,

14. కుమ్మరి కుండ పగులగొట్టబడునట్లు ఆయన ఏమియు విడిచిపెట్టక దాని పగులగొట్టును పొయిలోనుండి నిప్పు తీయుటకు గాని గుంటలోనుండి నీళ్లు తీయుటకు గాని దానిలో ఒక్క పెంకైనను దొరకదు.

14. और कुम्हार के बर्तन की नाई फूटकर ऐसा चकनाचूर होगा कि उसके टुकड़ों का एक ठीकरा भी न मिलेगा जिस से अंगेठी में से आग ली जाए वा हौद में से जल निकाला जाए।।

15. ప్రభువును ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు మరలి వచ్చి ఊరకుండుటవలన రక్షింపబడెదరు మీరు ఊరకుండి నమ్ముకొనుటవలన మీకు బలము కలుగును.

15. प्रभु यहोवा, इस्राएल का पवित्रा यों कहता है, लौट आने और शान्त रहने में तुम्हारा उद्धार है; शान्त रहते और भरोसा रखने में तुम्हारी वीरता है। परन्तु तुम ने ऐसा नहीं किया,

16. అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు, మేము గుఱ్ఱములనెక్కి పారిపోవుదుమంటిరి కాగా మీరు పారిపోవలసి వచ్చెను. మేము వడిగల గుఱ్ఱములను ఎక్కి పోయెదమంటిరే కాగా మిమ్మును తరుమువారు వడిగలవారుగా నుందురు.

16. तुम ने कहा, नहीं, हम तो घोड़ों पर चढ़कर भागेंगे, इसलिये तुम भागोगे; और यह भी कहा कि हम तेज सवारी पर चलेंगे, सो तुम्हारा पीछा करनेवाले उस से भी तेज होंगे।

17. మీరు పర్వతముమీదనుండు కొయ్యవలెను కొండమీదనుండు జెండావలెను అగువరకు ఒకని గద్దింపునకు మీలో వెయ్యిమంది పారిపోయెదరు అయిదుగురి గద్దింపునకు మీరు పారిపోయెదరు.

17. एक ही की धमकी से एक हजार भागेंगे, और पांच की धमकी से तुम ऐसा भागोगे कि अन्त में तुम पहाड़ की चोटी के डण्डे वा टीले के ऊपर की ध्वजा के समान रह जाओगे जो चिन्ह के लिये गाड़े जाते हैं।

18. కావున మీయందు దయచూపవలెనని యెహోవా ఆలస్యముచేయుచున్నాడు మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి యున్నాడు యెహోవా న్యాయముతీర్చు దేవుడుఆయన నిమిత్తము కనిపెట్టుకొనువారందరు ధన్యులు.

18. तौभी यहोवा इसलिये विलम्ब करता है कि तुम पर अनुग्रह करे, और इसलिये ऊंचे उठेगा कि तुम पर दया करे। क्योंकि यहोवा न्यायी परमेश्वर है; क्या ही धन्य हैं वे जो उस पर आशा लगाए रहते हैं।।

19. సీయోనులో యెరూషలేములోనే యొక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు ఆయన నీ మొఱ్ఱ విని నిశ్చయముగా నిన్ను కరు ణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును.

19. हे सिरयोन के लोगों तुम यरूशलेम में बसे रहो; तुम फिर कभी न रोओगे, वह तुम्हारी दोहाई सुनते ही तुम पर निश्चय अनुग्रह करेगा: वह सुनते ही तुम्हारी मानेगा।

20. ప్రభువు నీకు క్లేషాన్నపానముల నిచ్చును ఇకమీదట నీ బోధకులు దాగియుండరు నీవు కన్నులార నీ బోధకులను చూచెదవు

20. और चाहे प्रभु तुम्हें विपत्ति की रोटी और दु:ख का जल भी दे, तौभी तुम्हारे उपदेशक फिर न छिपें, और तुम अपनी आंखों से अपने उपदेशकों को देखते रहोगे।

21. మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.

21. और जब कभी तुम दहिनी वा बाई ओर मुड़ने लगो, तब तुम्हारे पीछे से यह वचन तुम्हारे कानों में पड़ेगा, मार्ग यही है, इसी पर चलो।

22. చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరతురు హేయములని వాటిని పారవేయుదురు. లేచిపొమ్మని దానితో చెప్పుదురు.

22. तब तुम वह चान्दी जिस से तुम्हारी खुदी हुई मूत्तियां मढ़ी हैं, और वह सोना जिस से तुम्हारी ढली हुई मूत्तियां आभूषित हैं, अशुद्ध करोगे। तुम उनको मैले कुचैले वस्त्रा की नाईं फेंक दोगे और कहोगे, दूर हो।

23. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును భూమి రాబడియైన ఆహారద్రవ్యమిచ్చును అది విస్తార సార రసములు కలదై యుండును ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డిబీళ్లలో మేయును.

23. और वह तुम्हारे लिये जल बरसाएगा कि तुम खेत में बीज बो सको, और भूमि की उपज भी उत्तम और बहुतायत से होगी। उस समय तुम्हारे जानवरों को लम्बी- चौड़ी चराई मिलेगी।

24. భూమి సేద్యముచేయు ఎడ్లును లేత గాడిదలును చేట తోను జల్లెడతోను చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును.

24. और बैल और गदहे जो तुम्हारी खेती के काम में आएंगे, वे सूप और डलिया से फटका हुआ स्वादिष्ट चारा खाएंगे।

25. గోపురములు పడు మహా హత్యదినమున ఉన్నతమైన ప్రతి పర్వతముమీదను ఎత్తయిన ప్రతి కొండమీదను వాగులును నదులును పారును.

25. और उस महासंहार के समय जब गुम्मट गिर पड़ेंगे, सब ऊंचे ऊंचे पहाड़ों और पहाड़ियों पर नालियां और सोते पाए जाएंगे।

26. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగుచేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశమువలె ఉండును సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును.

26. उस समय यहोवा अपनी प्रजा के लोगों का घाव बान्धेगा और उनकी चोट चंगा करेगा; तब चन्द्रमा का प्रकाश सूर्य का सा, और सूर्य का प्रकाश सातगुना होगा, अर्थात् अठवारे भर का प्रकाश एक दिन में होगा।।

27. ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరమునుండి వచ్చుచున్నది ఆయన పెదవులు ఉగ్రతతో నిండియున్నవి ఆయన నాలుక దహించు అగ్నిజ్వాలవలె ఉన్నది.

27. देखो, यहोवा दूर से चला आता है, उसका प्रकोप भड़क उठा है, और धूएं का बादल उठ रहा है; उसके होंठ क्रोध से भरे हुए और उसकी जीभ भस्म करनेवाली आग के समान है।

28. ఆయన ఊపిరి కుతికలలోతు వచ్చు ప్రవాహమైన నదివలె ఉన్నది వ్యర్థమైనవాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనము లను గాలించును త్రోవ తప్పించు కళ్లెము జనుల దవడలలో ఉండును.

28. उसकी सांस ऐसी उमण्डनेवाली नदी के समान है जो गले तक पहुंचती है; वह सब जातियों को नाश के सूप से फटकेगा, और देश देश के लोगों को भटकाने के लिये उनके जभड़ों में लगाम लगाएगा।।

29. రాత్రియందు పండుగ నాచరించునట్లుగా మీరు సంగీతము పాడుదురు. ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవాయొక్క పర్వతమునకు పిల్లనగ్రోవి నాదముతో ప్రయాణము చేయువారికి కలుగునట్టి హృదయసంతోషము కలుగును.

29. तब तुम पवित्रा पर्व की रात का सा गीत गाओगे, और जैसा लोग यहोवा के पर्वत की ओर उस से मिलने को, जो इस्राएल की चट्टान है, बांसुली बजाते हुए जाते हैं, वैसे ही तुम्हारे मन में भी आनन्द होगा।

30. యెహోవా తన ప్రభావముగల స్వరమును వినిపించును ప్రచండమైన కోపముతోను దహించు జ్వాలతోను పెళపెళయను గాలివాన వడగండ్లతోను తన బాహువు వాలుట జనులకు చూపించును.
ప్రకటన గ్రంథం 19:20

30. और यहोवा अपनी प्रतापीवाणी सुनाएगा, और अपना क्रोध भड़काता और आग की लौ से भस्म करता हुआ, और प्रचण्ड आन्धी और अति वर्षा और ओलों के साथ अपना भुजबल दिखाएगा।

31. యెహోవా దండముతో అష్షూరును కొట్టగా అది ఆయన స్వరము విని భీతినొందును.

31. अश्शूर यहोवा के शब्द की शक्ति से नाश हो जाएगा, वह उसे सोंटे से मारेगा।

32. యెహోవా అష్షూరుమీద పడవేయు నియామక దండమువలని ప్రతి దెబ్బ తంబుర సితారాల నాదముతో పడును ఆయన తన బాహువును వానిమీద ఆడించుచు యుద్ధము చేయును.

32. और जब जब यहोवा उसको दण्ड देगा, तब तब साथ ही डफ और वीणा बजेंगी; और वह हाथ बढ़ाकर उसको लगातार मारता रहेगा।

33. పూర్వమునుండి తోపెతు సిద్ధపరచబడియున్నది అది మొలెకుదేవతకు సిద్ధపరచబడియున్నది లోతుగాను విశాలముగాను ఆయన దాని చేసి యున్నాడు అది అగ్నియు విస్తారకాష్ఠములును కలిగియున్నది గంధక ప్రవాహమువలె యెహోవా ఊపిరి దాని రగులబెట్టును.
ప్రకటన గ్రంథం 19:20, ప్రకటన గ్రంథం 20:10-15, ప్రకటన గ్రంథం 21:8

33. बहुत काल से तोपेत तैयार किया गया है, वह राजा की के लिये ठहराया गया है, वह लम्बा चौड़ा और गहिरा भी बनाया गया है, वहां की चिता में आग और बहुत सी लकड़ी हैं; यहोवा की सांस जलती हुई गन्धक की धारा की नाईं उसको सुलगाएगी।।



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Isaiah - యెషయా 30 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఈజిప్టు నుండి సహాయం కోరినందుకు యూదులు మందలించారు. (1-7) 
యూదులు తమ పొరుగువారి నుండి సహాయం కోరడం ద్వారా తరచుగా తప్పు చేస్తారు, వారు దేవుని వైపు తిరగడానికి బదులు ఒక వైపు ఇబ్బందిని ఎదుర్కొన్నారు. క్రీస్తు యొక్క నీతిలో ఆశ్రయం పొందడం ద్వారా మరియు పరిశుద్ధాత్మ పవిత్రతను కోరుకోవడం ద్వారా మాత్రమే పాపం యొక్క తీవ్రమైన పరిణామాలను నివారించవచ్చు. చరిత్ర అంతటా, ప్రజలు తరచుగా వారి స్వంత అవగాహనపై ఆధారపడి ఉంటారు, ఇది అవమానం మరియు దుఃఖానికి దారి తీస్తుంది. వారు దేవునిపై విశ్వాసం ఉంచడంలో విఫలమయ్యారు మరియు ఈజిప్షియన్ల అనుగ్రహాన్ని పొందేందుకు గొప్ప ప్రయత్నాలు చేసారు, కానీ భూసంబంధమైన సంపదను వెంబడించడం ఫలించలేదు. ప్రాపంచిక విశ్వాసాల కోసం దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు, ఒకరు ప్రయాణించే ప్రమాదకరమైన మార్గాన్ని ఇది వివరిస్తుంది. సృష్టికర్త, యుగాల శిల వలె, అస్థిరంగా ఉంటాడు, అయితే జీవి విరిగిన రెల్లు వలె పెళుసుగా ఉంటుంది. మనం మానవత్వం నుండి ఎక్కువగా ఆశించకూడదు కానీ దేవునిపై మన అత్యంత విశ్వాసం ఉంచాలి. దేవుని మంచితనంపై వినయపూర్వకంగా ఆధారపడడం మరియు ఆయన చిత్తాన్ని నిర్మలమైన అంగీకారంతో నిశ్చలంగా ఉండడంలో మన బలం ఉంది.

దేవుని వాక్యాన్ని వారు ధిక్కరించిన ఫలితంగా తీర్పులు. (8-18) 
యూదులు, ఆ సమయంలో, ప్రపంచంలోని ఏకైక దేవుని ప్రజలుగా చెప్పుకునేవారు, అయినప్పటికీ వారిలో చాలామంది తిరుగుబాటుదారులు. దైవిక మార్గదర్శకత్వం అందుబాటులో ఉన్నప్పటికీ, వారు కాంతి కంటే చీకటిని ఇష్టపడతారు. ప్రవక్తలు వారి పాపపు మార్గాల నుండి వారిని అరికట్టడానికి ప్రయత్నించారు, దీనివల్ల కొందరు కోపం తెచ్చుకున్నారు. అయినప్పటికీ, విశ్వాసపాత్రులైన పరిచారకులు పాపులను మేల్కొలిపే వారి మిషన్ నుండి అరికట్టబడరు. దేవుడు, ఇశ్రాయేలీయుల పరిశుద్ధునిగా, తనను వెదకువారికి ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. అయినప్పటికీ, యూదులు అతని పవిత్ర ఆజ్ఞల రిమైండర్‌లను మరియు పాపాన్ని ఆయన అసహ్యించుకోవడాన్ని స్వాగతించలేదు. ఇలాంటి ఉపదేశాలకు దూరంగా ఉండాలని కోరారు. అయినప్పటికీ, వారు దేవుని వాక్యాన్ని విస్మరించినందున, వారి పాపాలు వారి భద్రతను క్షీణింపజేసాయి, కుమ్మరి పాత్ర పగిలినట్లుగా వారి పతనానికి దారితీసింది.
మన దుష్టమార్గాల నుండి తిరిగి వచ్చి కర్తవ్య మార్గంలో మనల్ని మనం స్థిరపరచుకోవాలి, అదే మోక్షానికి మార్గం. బలాన్ని కనుగొనడానికి, మనం దానిని ప్రశాంతత మరియు విశ్వాసంతో వెతకాలి, అంతర్గత శాంతిని కాపాడుకోవాలి మరియు దేవునిపై ఆధారపడాలి. కొందరు తమను తాము దేవుని కంటే తెలివైన వారని నమ్ముతారు, కానీ వారి తప్పుదోవ పట్టించే పథకాలు వారి స్వంత నాశనాన్ని మాత్రమే తెచ్చుకున్నాయి. కొంతమంది మాత్రమే తప్పించుకోగలుగుతారు, ఇతరులకు ఒక హెచ్చరిక ఉదాహరణగా పనిచేస్తారు. ప్రజలు పశ్చాత్తాపపడటానికి నిరాకరిస్తే, దేవుని ఆశ్రయించి, ఆయన అనుగ్రహం మరియు సేవలో ఆనందాన్ని కోరుకుంటే, వారి కోరికలు వారి మరణాన్ని వేగవంతం చేస్తాయి.
దేవునిపై మాత్రమే విశ్వాసం ఉంచే వారు ఓదార్పును పొందుతారు. క్రీస్తునందు విశ్వాసముంచి తనను సమీపించే వారందరికీ దేవుడు తన కృపను అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆయన కోసం ఓపికగా ఎదురుచూసే వారు ధన్యులు.

అతని చర్చికి దేవుని దయ. (19-26) 
దేవుని ప్రజలు త్వరలోనే పరలోక సీయోనుకు చేరుకుంటారు, అక్కడ వారు మళ్లీ ఏడ్వరు. ఇప్పుడు కూడా, వారు తమ ప్రార్థనలలో మరింత శ్రద్ధగా ఉంటే మరింత ఓదార్పు మరియు పవిత్రతను అనుభవించగలరు. రొట్టె కొరత అనేది దేవుని వాక్యం యొక్క కొరత వలె తీవ్రమైన తీర్పు కాదు. రెండు వైపులా ఆపదలు ఉన్నాయి; టెంటర్ మనల్ని తప్పుదారి పట్టించడానికి చురుకుగా ప్రయత్నిస్తున్నాడు. నమ్మకమైన మంత్రి లేదా స్నేహితుని మార్గదర్శకత్వం ద్వారా, మనస్సాక్షి యొక్క ఉపదేశాల ద్వారా లేదా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ద్వారా, మనం సందేహాస్పదంగా ఉన్నప్పుడు సరిదిద్దబడి, తప్పు మార్గం నుండి దూరంగా ఉంటే అది అదృష్టమే. వారు తమ విగ్రహారాధన నుండి స్వస్థపరచబడతారు మరియు నిజమైన పశ్చాత్తాపానికి, పాపం తీవ్ర అసహ్యకరమైనదిగా మారుతుంది. దైవిక దయ యొక్క శక్తి ద్వారా ఆత్మల మార్పిడిలో ఈ పరివర్తన ప్రతిరోజూ స్పష్టంగా కనిపిస్తుంది, వారిని దేవునికి భయపడి మరియు ప్రేమించేలా చేస్తుంది. దయ యొక్క సమృద్ధి సాధనాలు, పరిశుద్ధాత్మ ప్రభావంతో పాటు, అవి లేని ప్రదేశాలకు విస్తరించబడతాయి. ఇది దేవుని ప్రజలకు ఓదార్పు మరియు సంతోషాన్ని కలిగించాలి. వెలుగుగా ప్రతీక అయిన జ్ఞానం పెరుగుతుంది. విరిగిన హృదయం ఉన్నవారికి స్వస్థతను ప్రకటిస్తూ సువార్త ప్రపంచానికి తెచ్చిన ప్రకాశం ఇది.

అస్సిరియన్ సైన్యం మరియు దేవుని శత్రువులందరి నాశనం. (27-33)
దేవుడు అణచివేసి, అనర్థాలు జరగకుండా నిరోధిస్తాడు. ఒక్క మాటతో, ఆయన తన ప్రజలను సరైన మార్గంలో నడిపిస్తాడు, కానీ ఒక కంచెతో, అతను తన శత్రువులను వారి స్వంత పతనం వైపు మళ్లిస్తాడు. ఈ సందర్భంలో, ప్రవక్త సన్హెరీబ్ సైన్యాన్ని నాశనం చేస్తామని బెదిరిస్తున్నందున, అతను పశ్చాత్తాపం చెందని పాపులందరి అంతిమ మరియు శాశ్వతమైన నాశనం వైపు చూపుతున్నాడు.
టోఫెట్ అనేది జెరూసలేం సమీపంలోని ఒక లోయ, ఇక్కడ హానికరమైన మరియు అభ్యంతరకరమైన వస్తువులను కాల్చడానికి మంటలు నిరంతరం మండుతున్నాయి. విగ్రహారాధన చేసే యూదులు తమ పిల్లలను అగ్ని గుండా పంపడం ద్వారా మోలోచ్‌కు బలి ఇచ్చారు. ఇది విధ్వంసం యొక్క నిశ్చయతను సూచిస్తుంది, మరణానంతర జీవితంలో హింసించే స్థలం యొక్క భయంకరమైన చిహ్నంగా పనిచేస్తుంది. ఏ అణచివేతదారుడు దైవిక కోపం నుండి తప్పించుకోలేడు. కావున, పాపులు క్రీస్తు వైపు మొగ్గు చూపాలి, ఆయనతో సయోధ్యను కోరుకుంటారు, తద్వారా సర్వశక్తిమంతుడి తీర్పు దుర్మార్గపు కార్మికులందరినీ తుడిచిపెట్టినప్పుడు వారు భద్రత మరియు ఆనందాన్ని పొందవచ్చు.



Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |