ఇక్కడ మాట్లాడుతున్న ఆమె క్రీస్తు స్వంత జనమందరికీ ప్రతినిధిగా మాట్లాడుతున్నది. క్రీస్తు సమీప సహవాసాన్నీ, ఆయన ప్రత్యక్షమైన ప్రేమనూ అనుభవించాలన్న వారి లోతైన అభిలాషను చూపిస్తూ ఉంది. ఆయన ప్రేమ ద్రాక్షరసం గానీ మరి ఏ ఇతర పానీయం గానీ శరీరానికి కలిగించే చురుకుదనం, ఉత్సాహం కంటే, ఎన్నో రెట్లు ఎక్కువైన ఉల్లాసాన్నీ, ఉత్తేజాన్నీ మనసుకూ ఆత్మకూ కలిగిస్తుంది.