Exodus - నిర్గమకాండము 9 | View All

1. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఫరోయొద్దకు వెళ్లి - నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము.

1. The LORDE sayde vnto Moses: Go in to Pharao, and speake vnto him: Thus sayeth the LORDE God of ye Hebrues: let my people go, yt they maye serue me.

2. నీవు వారిని పోనియ్యనొల్లక ఇంకను వారిని నిర్బంధించినయెడల

2. Yf thou wilt not, but holde them longer,

3. ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువులమీదికిని నీ గుఱ్ఱములమీదికిని గాడిదలమీదికిని ఒంటెలమీదికిని ఎద్దుల మీదికిని గొఱ్ఱెల మీదికిని వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును.

3. beholde, the hande of the LORDE shalbe vpon thy catell in the felde, vpon horses, vpon Asses, vpon Camels, vpon oxen, vpon shepe with a very sore pestilence.

4. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును; ఇశ్రాయేలీయులకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని

4. And ye LORDE shall make a diuysion betwene the catell of the Israelites & the Egipcians, so yt there shal nothinge dye of all that the children of Israel haue.

5. మరియయెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుననెను.

5. And ye LORDE appoynted a tyme, and sayde: Tomorow shal the LORDE do this vpon earth.

6. మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నియు చచ్చెను గాని ఇశ్రాయేలీయుల పశువులలో ఒకటియు చావలేదు.

6. And the LORDE dyd the same on the morow. And there dyed of all maner of catell of the Egipcians: but of ye catell of ye childre of Israel there dyed not one.

7. ఫరో ఆ సంగతి తెలిసికొన పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటియు చావలేదు; అయినను అప్పటికిని ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయెను.

7. And Pharao sent thither, & beholde, there was not one of the catell of Israel deed. But Pharaos hert was hardened, so yt he let not ye people go.

8. కాగా యెహోవా - మీరు మీ పిడికిళ్లనిండ ఆవపు బుగ్గి తీసికొనుడి, మోషే ఫరో కన్నులయెదుట ఆకాశమువైపు దాని చల్లవలెను.

8. Then sayde ye LORDE vnto Moses & Aaron: Take youre handes full of asshes out of the fornace, & let Moses sprenkle it towarde heauen before Pharao,

9. అప్పుడు అది ఐగుప్తు దేశమంతట సన్నపు ధూళియై ఐగుప్తు దేశమంతట మనుష్యుల మీదను జంతువులమీదను పొక్కులు పొక్కు దద్దురులగునని మోషే అహరోనులతో చెప్పెను.
రోమీయులకు 16:2

9. that it maye be dust in all the lande of Egipte, & that there maye be sores & blaynes vpon men & vpon catell in all the lande of Egipte.

10. కాబట్టి వారు ఆవపుబుగ్గి తీసికొనివచ్చి ఫరో యెదుట నిలిచిరి. మోషే ఆకాశమువైపు దాని చల్లగానే అది మనుష్యులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దురులాయెను.
రోమీయులకు 16:2

10. And they toke asshes out of ye fornace, & stode before Pharao, & Moses sprenkled it towarde heaue. Then were there sores and blaynes vpon men & vpon catell,

11. ఆ దద్దురులవలన శకునగాండ్రు మోషే యెదుట నిలువ లేకపోయిరి ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీయులందరికినిపుట్టెను.

11. so that the Sorcerers might not stode before Moses by reason of the sores. For there were sores vpo the Sorcerers as well as vpon all the Egipcians.

12. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను, అతడు వారి మాట వినకపోయెను.
రోమీయులకు 9:18

12. But the LORDE hardened Pharaos hert, so that he herkened not vnto them, eue as the LORDE had sayde vnto Moses.

13. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను - హెబ్రీయుల దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు; నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరోయెదుట నిలిచినన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము.

13. Then sayde the LORDE vnto Moses: Get the vp tomorow by tymes, & stonde before Pharao, & speake vnto him: Thus sayeth ye LORDE God of the Hebrues: let my people go, yt they maye serue me,

14. సమస్త భూమిలో నావంటి వారెవరును లేరని నీవు తెలిసికొనవలెనని ఈ సారి నేను నా తెగుళ్ళన్నియు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకులమీదికిని నీ ప్రజలమీదికిని పంపెదను;

14. els wyll I at this tyme sende all my plages in to thine hert, & vpon thy seruautes & vpon thy people: that thou mayest knowe, yt there is none like me in all londes.

15. భూమిమీద నుండకుండ నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపియుంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసియుందును.

15. For I will now stretch out my hande, & smyte the & thy people wt pestilence, so yt thou shalt be roted out from the earth.

16. నా బలమును నీకు చూపునట్లును, భూలోక మందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని.
ప్రకటన గ్రంథం 9:17

16. Yet haue I stered ye vp for this cause, euen to shew my power vpon ye, and that my name might be declared in all londes.

17. నీవు ఇంక నా ప్రజలను పోనియ్యనొల్లక వారిమీద ఆతిశయపడుచున్నావు.

17. Thou holdest my people yet, & wilt not let them go,

18. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించెదను; ఐగుపు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని యిదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు.

18. beholde, tomorow aboute this tyme wyll I cause a mightie greate hayle to rayne, soch as hath not bene in the londe of Egipte, sence the tyme that it was grouded, hither to.

19. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రముచేయుము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుష్యునిమీదను జంతువు మీదను వడగండ్లు కురియును, అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను.

19. And now sende thou, & saue thy catell, & all yt thou hast in the felde: for all men & catell that shalbe founde in the felde, & not brought in to the houses, yf the hayle fall vpon them, they shall dye.

20. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను.

20. Now who so feared the worde of the LORDE amonge Pharaos seruauntes, caused his seruauntes & catell to flye in to the houses:

21. అయితే యెహోవా మాట లక్ష్యపెట్టనివాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను.

21. but loke whose hertes regarded not the worde of ye LORDE, left their seruauntes and catell in the felde.

22. యెహోవా - నీ చెయ్యి ఆకాశమువైపు చూపుము; ఐగుప్తుదేశమందలి మనుష్యులమీదను జంతువులమీదను పొలముల కూరలన్నిటిమీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతట పడునని మోషేతో చెప్పెను.

22. Then sayde the LORDE vnto Moses: Strech out thy hande towarde heaue, that it maye hayle vpon all the lande of Egipte, vpon men, vpon catell, & vpon all herbes of the felde in the lande of Egipte.

23. మోషే తన కఱ్ఱను ఆకాశమువైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమిమీద పడుచుండెను. యెహోవా ఐగుప్తుదేశముమీద వడగండ్లు కురిపించెను.

23. So Moses stretched out his staff towarde heauen, and the LORDE caused it to thonder & hayle, so yt the fyre ranne alonge vpon the earth. Thus the LORDE hayled & rayned vpon the londe of Egipte,

24. ఆలాగు వడగండ్లును వడగండ్లతో కలిసిన పిడుగులును బహు బలమైన వాయెను. ఐగుప్తు దేశమందంతటను అది రాజ్యమైనది మొదలుకొని యెన్నడును అట్టివి కలుగలేదు.
ప్రకటన గ్రంథం 8:7, ప్రకటన గ్రంథం 11:19

24. so that the hayle & fyre wente so horrybly together, as neuer was in all the lade of Egipte, sens the tyme that there were people therin.

25. ఆ వడగండ్లు ఐగుప్తుదేశమందంతట మనుష్యులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరుగ గొట్టెను.

25. And the hayle smote the whole lande of Egipte, all that was vpon ye felde, both men & catell, & smote all the herbes vpon the felde, & brake all the trees vpon ye felde,

26. అయితే ఇశ్రాయేలీయులున్న గోషెను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు.

26. saue onely in the lande of Gosen, where the childre of Israel were, there it hayled not.

27. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి - నేను ఈసారి పాపము చేసియున్నాను; యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులును దుర్మార్గులము;

27. Then sent Pharao & called for Moses & Aaron, & sayde vnto them: Now haue I synned, ye LORDE is righteous, but I & my people are vngodly.

28. ఇంతమట్టుకు చాలును; ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా
అపో. కార్యములు 8:24

28. Yet praye ye vnto the LORDE, that the thonder & hayle of God maye ceasse, then wyl I let you go, that ye shal tary here no longer.

29. మోషే అతని చూచి - నేను ఈ పట్టణమునుండి బయలు వెళ్లగానే నా చేతులు యెహోవావైపు ఎత్తెదను. ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లును ఇకమీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును.

29. Moses sayde vnto him: Whan I am come out of the cite, I wyll stretch out myne handes vnto the LORDE, so shal the thonder ceasse, & there shal be nomore hayle: that thou mayest knowe, that the earth is the LORDES.

30. అయినను నీవును నీ సేవకులును ఇకను దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలిసియున్నదనెను.

30. But I knowe, yt both thou & thy seruauntes feare not yet the LORDE God.

31. అప్పుడు జనుపచెట్లు పువ్వులు పూసెను, యవలచేలు వెన్నులు వేసినవి గనుక జనుప యవలచేలును చెడగొట్టబడెను గాని

31. Thus the flax and the barlye were smytten: for the barlye was shot vp, & ye flax was boulled:

32. గోధుమలు మెరపమొలకలు ఎదగనందున అవి చెడగొట్ట బడలేదు.

32. but the wheate and ye rye were not smytten, for they were late sowen.

33. మోషే ఫరోను విడిచి ఆ పట్టణమునుండి బయలు వెళ్లి యెహోవావైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములును వడగండ్లును నిలిచిపోయెను, వర్షము భూమి మీద కురియుట మానెను.

33. So Moses wente from Pharao out of ye cite, & stretched out his hades vnto ye LORDE. And ye thoder & the hayle ceassed, & the rayne dropped not vpo the earth.

34. అయితే ఫరో వర్షమును వడగండ్లును ఉరుములును నిలిచిపోవుట చూచి, అతడును అతని సేవకులును ఇంక పాపము చేయుచు తమ హృదయములను కఠినపరచుకొనిరి.

34. But wha Pharao sawe yt the rayne & thonder & hayle ceassed, he synned agayne, and herdened his hert, he & his seruauntes.

35. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను; అతడు ఇశ్రాయేలీయులను పోనియ్యక పోయెను.

35. So Pharaos hert was hardened, yt he let not the childre of Israel go, eue as the LORDE had sayde by Moses.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Exodus - నిర్గమకాండము 9 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
మృగాల ముర్రేన్. (1-7) 
దేవుడు ఇశ్రాయేలును ఫరో పాలన నుండి విడిపించాలనుకున్నాడు, కాని ఫరో వారిని విడిచిపెట్టాలని కోరుకోలేదు. కాబట్టి, ఈజిప్టులోని అనేక జంతువులను చనిపోయేలా చేయడం ద్వారా నిజంగా ఎవరు బాధ్యత వహిస్తారో చూపించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. అప్పటికే ఇజ్రాయెల్‌ను పేదలుగా మార్చిన జంతువుల యజమానులకు ఇది పెద్ద సమస్య. కానీ దేవుడు ఇశ్రాయేలీయుల జంతువులు ఏవీ చనిపోకుండా చూసుకున్నాడు. చాలా కాలం క్రితం, ఈజిప్టులోని కొందరు వ్యక్తులు ఆవులను నిజంగా ముఖ్యమైనవిగా భావించి, వాటిని పూజించేవారు. కానీ, కొన్నిసార్లు మనం దేనికైనా ఎక్కువ విలువ ఇచ్చినప్పుడు, అది మనకు మంచిది కాదు. ఈ ఒక్క పాలకుడు నిజంగా నీచుడు మరియు శిక్షకు అర్హుడు. మనుషులు చెడ్డపనులు చేస్తే, వారికి శిక్ష పడటం న్యాయమే. కొంతమందికి చాలా కఠినమైన హృదయాలు ఉంటాయి మరియు వారి తప్పుల నుండి నేర్చుకోరు, కానీ ఇతరులు వినయంగా మరియు తప్పు చేసినప్పుడు క్షమించండి. ప్రజలు తప్పు చేసినప్పుడు, అది వారి తప్పు మరియు వారు ఇతరులను నిందించకూడదు, వారి చర్యలకు దేవుడు వారిని శిక్షించినప్పటికీ. 

దిబ్బలు మరియు బ్లెయిన్స్ యొక్క ప్లేగు. (8-12) 
ఈజిప్షియన్లు తమ జంతువులు చనిపోయినప్పుడు పట్టించుకోలేదు, కాబట్టి దేవుడు వారిని నిజంగా చెడు అనారోగ్యంతో బాధపెట్టాడు. చిన్న చిన్న శిక్షలు ఫలించకపోతే దేవుడు పెద్ద శిక్ష వేస్తాడు. కొన్నిసార్లు దేవుడు వారి తప్పులను శిక్షించడం ద్వారా ప్రజలకు చూపిస్తాడు. ఈజిప్షియన్లు ఇశ్రాయేలీయుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు మరియు వారిని వేడి పొయ్యిలలో పని చేసేవారు, కానీ ఇప్పుడు ఆ కొలిమిల నుండి వచ్చే బూడిద వారిని భయపెట్టింది. అనారోగ్యం నిజంగా చెడ్డది మరియు ఇంద్రజాలికులు కూడా దానిని పొందారు. ముందు, మాంత్రికులు మోషేను ఆపడానికి ప్రయత్నించారు, కానీ వారు ఇకపై చేయలేకపోయారు. ఫరో ఇప్పటికీ దేవుణ్ణి నమ్మలేదు. అతను దేవుని మాట వినలేదు మరియు చెడు పనులు చేసాడు కాబట్టి దేవుడు అతనికి ఏది కావాలంటే అది చేయనివ్వండి. దీని వలన అతను ఏది ఒప్పు మరియు తప్పు అని చూడలేకపోయాడు మరియు అతను చెడ్డ వ్యక్తిని స్వాధీనం చేసుకోవడానికి అనుమతించినట్లుగా ఉంది. ప్రజలు మంచిని విస్మరించడాన్ని ఎంచుకుంటే, దానిని విస్మరించడాన్ని దేవుడు అనుమతించడం న్యాయమైనది. ఇది ఒక వ్యక్తికి జరిగే అత్యంత నీచమైన విషయం, నరకంలో ఉండటం కంటే కూడా అధ్వాన్నంగా ఉంటుంది. 

వడగళ్ల ప్లేగు బెదిరించింది. (13-21) 
ఫరో అనే వ్యక్తికి చాలా చెడ్డ సందేశం చెప్పమని మోషేకు దేవుడు చెప్పాడు. దేవుడు చాలా కష్టమైన వ్యక్తి కాబట్టి ఫరోతో వ్యవహరించడానికి మోషేను ఎన్నుకున్నాడు. దేవుడు ఎంత శక్తిమంతుడో మరియు గర్వించే ప్రజలను కూడా ఆయన ఎలా వినయస్థులనుగా చేయగలడనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. దేవుడు కోపించి, ప్రజలను శిక్షించాలనుకున్నప్పుడు, వారు శిక్షను ఎలా తప్పించుకోవాలో కూడా చూపిస్తాడు. దేవుడు ఈజిప్షియన్లు మరియు ఇశ్రాయేలీయుల మధ్య మరియు వివిధ ఈజిప్షియన్ల మధ్య కూడా తేడా చేశాడు. ఫరో హెచ్చరికను వినకపోతే, ఇంకా కొంతమంది సూచనలను విని, పాటించినట్లయితే శిక్ష నుండి తప్పించుకోగలరు. కొంతమంది చెప్పినది విని భయపడి, తమ జంతువులను మరియు సేవకులను జాగ్రత్తగా చూసుకున్నారు, ఇది తెలివైన పని. రాజు దగ్గర పని చేసే వాళ్ళు కూడా దేవుడు చెప్పిన మాటలకు భయపడిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా భయపడకూడదా? అయితే కొందరు నమ్మకపోవడంతో తమ జంతువులను బయట వదిలేశారు. ప్రజలు నమ్మడానికి నిరాకరించినప్పుడు, వారు మంచి సలహాలు మరియు హెచ్చరికలను విస్మరిస్తారు మరియు వారు పర్యవసానాలను అనుభవిస్తే అది వారి స్వంత తప్పు. 

వడగాలుల ప్లేగు. (22-35)
భారీ వడగళ్ల వాన చాలా నష్టాన్ని కలిగించింది. ఇది ప్రజలను మరియు జంతువులను బాధించింది మరియు పెరుగుతున్న పంటలను నాశనం చేసింది. కానీ గోషెను భూమి బాగానే ఉంది. కొన్నిసార్లు, దేవుడు ఒక చోట వర్షం లేదా వడగళ్ళు కురిపిస్తాడు కానీ వేరే కారణాల వల్ల మరొక చోట కాదు. రాజైన ఫరో మోషే మాట విని తప్పు జరిగినందుకు క్షమించమని చెప్పాడు. అతను బిగ్గరగా మరియు శక్తివంతంగా మాట్లాడినప్పటికీ, దేవుడు ఎల్లప్పుడూ సరైనవాడని అతను అంగీకరించాడు. మోషే పాలకుడైన ఫరోను తన ప్రజలను వెళ్లనివ్వమని అడిగాడు, కానీ ఫరో హృదయం మొండిగా ఉంది మరియు అతను వినలేదు. మోషే దేవునితో మాట్లాడాడు మరియు ఫరో తన మనసు మార్చుకుంటాడని భావించినప్పటికీ, అతను తన స్నేహితుడిగా ఉంటానని వాగ్దానం చేశాడు. భయానక వాతావరణం ఉన్నప్పుడు కూడా, మోషే ఫరోతో మాట్లాడటానికి నగరం నుండి బయలుదేరాడు. చెడు విషయాలు జరిగినప్పుడు, దేవునితో స్నేహం చేయడం మీకు దృఢంగా అనిపించడంలో సహాయపడుతుంది. నిజంగా పెద్ద తుఫాను వచ్చినప్పుడు ఫరో భయపడ్డాడు, కానీ అది ముగిసిన తర్వాత అతను మోషేకు చేసిన వాగ్దానాల గురించి మరచిపోయాడు. మంచి లేదా చెడు విషయాల నుండి నేర్చుకోని వ్యక్తులు సాధారణంగా మంచిగా మారరు. 



Shortcut Links
నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |