Exodus - నిర్గమకాండము 6 | View All

1. అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోవుచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు; బలమైన హస్తముచేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశములోనుండి వారిని తోలివేయునని మోషేతో అనెను.
అపో. కార్యములు 13:17

1. The LORDE sayde vnto Moses: Now shalt thou se, what I will do vnto Pharao, for thorow a mightie hande must he let them go, thorow a mightie hande must he dryue them from him out of his londe.

2. మరియదేవుడు మోషేతో ఇట్లనెను - నేనే యెహోవాను;

2. And God spake vnto Moses, & sayde vnto him: I am ye LORDE,

3. నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు.

3. & I appeared vnto Abraham, Isaac & Iacob, an Allmightie God: but my name, LORDE, haue I not shewed vnto them:

4. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కనాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచితిని.

4. My couenaunt also haue I made with them, that I wil geue them the londe of Canaan, the londe of their pilgremage, wherin they haue bene straungers.

5. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరచియున్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకముచేసికొని యున్నాను.

5. Morouer I haue herde the complaynte of the children of Israel, whom ye Egipcians oppresse with laboure, and haue remembred my couenaunt.

6. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుము. నేనే యెహోవాను; నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి, వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులుతీర్చి మిమ్మును విడిపించి,
అపో. కార్యములు 13:17

6. Therfore saye vnto the childre of Israel: I am the LORDE, & wil brynge you out from yor burthens in Egipte, & wil rydd you from youre laboure, and wil delyuer you thorow a stretched out arme & greate iudgmetes,

7. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రిందనుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురు.

7. and will receaue you for my people, & will be yor God: so that ye shal knowe, that I the LORDE am yor God, which brynge you out from the burthen of Egipte,

8. నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చెదనని చెయ్యి యెత్తి ప్రమాణముచేసిన దేశములోనికి మిమ్మును రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను; నేను యెహోవానని చెప్పుమనగా

8. and will brynge you into the lande, ouer the which I haue lift vp my hande, to geue it vnto Abraham, Isaac and Iacob, ye same wil I geue vnto you for a possession. I the LORDE.

9. మోషే ఇశ్రాయేలీయులతో ఆలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమునుబట్టియు కఠిన దాసత్వమును బట్టియు మోషే మాట వినరైరి.

9. Moses tolde this vnto the childre of Israel. But they herkened not vnto him, for very anguysh of sprete, & for sore laboure.

10. మరియయెహోవా మోషేతో నీవు లోపలికి వెళ్లి,

10. The spake the LORDE vnto Moses, & sayde:

11. ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలీయులను తన దేశములోనుండి వెలుపలికి పోనియ్యవలెనని అతనితో చెప్పుమనెను.

11. Go thy waye, & speake vnto Pharao the kynge of Egypte, yt he let the childre of Israel go out of his lande.

12. అప్పుడు మోషే చిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు; మాటమాంద్యము గలవాడనగు నా మాట ఫరో యెట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.

12. But Moses spake before ye LORDE, & saide: Beholde, ye childre of Israel herke not vnto me, how shulde Pharao the heare me? And I am also of vncircumcised lyppes.

13. మరియయెహోవా మోషే అహరోనులతో నిట్లనెను ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములోనుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీయుల యొద్దకును ఫరో యొద్దకును వెళ్లవలెనని వారి కాజ్ఞాపించెను.

13. So the LORDE spake vnto Moses & Aaron, & gaue the a commaundemet vnto the childre of Israel, & vnto Pharao the kynge of Egipte, yt they shulde brynge the childre of Israel out of Egipte.

14. వారి పితరుల కుటుంబముల మూలపురుషులు ఎవరనగా, ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు పల్లు హెస్రోను కర్మీ; వీరు రూబేను కుటుంబములు.

14. These are ye heades of the house of their fathers. The children of Ruben the first sonne of Israel, are these: Hanoch, Pallu, Hezron, Charmi: These are the generacions of Ruben.

15. షిమ్యోను కుమారులు యెమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనాను స్త్రీకి కుమారుడైన షావూలు; వీరు షిమ్యోను కుటుంబములు.

15. The children of Simeon are these: Iemuel, Iamin, Ohad, Iachin, Zophar, and Saul the sonne of the Cananitish woman: These are the generacions of Symeon.

16. లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను కహాతు మెరారి. లేవి నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.

16. These are the names of the childre of Leui in their generacios: Gerson, Rahath and Merari: Leui was an hundreth and seuen & thirtie yeare olde.

17. గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్నీ షిమీ.

17. The children of Gerson are these: Libni and Semei in their generacions.

18. కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. కహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రదికెను.

18. The childre of Rahath are these: Amram, Iezear, Hebron, Usiel. Rahath was an hundreth & thre & thirtie yeare olde.

19. మెరారి కుమారులు మహలి మూషి; వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు.

19. The children of Merari are these: Maheli and Musi. These are ye generacions of Leui in their kynreds.

20. అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెండ్లి చేసికొనెను; ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.

20. And Amram toke his vncles doughter Iochebed to wife, which bare him Aaron & Moses. Amram was an C. & vij. & thirtie yeare olde.

21. ఇస్హారు కుమారులు కోరహు నెపెగు జిఖ్రీ

21. The childre of Iezear are these: Korah, Nepheg, Sichri.

22. The children of Vsiel are these: Misael, Elzaphan, Sithri.

23. అహరోను అమ్మినాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషెబను పెండ్లిచేసికొనెను. ఆమె అతనికి నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును కనెను.

23. Aaron toke Elizaba ye doughter of Aminadab Nahassons sisters to wife, which bare him Nadab, Abihu, Eleasar, Ithamar.

24. కోరహు కుమారులు అస్సీరు ఎల్కానా అబీయా సాపు; వీరు కోరహీయుల కుటుంబములు.

24. The childre of Korah are these: Assir, Elkana, & Abiassaph. These are ye generacios of ye Korahites.

25. అహరోను కుమారుడైన ఎలియాజరు పూతీయేలు కుమార్తెలలో ఒకతెను పెండ్లిచేసికొనెను. ఆమె అతనికి ఫీనెహాసును కనెను; వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీయుల పితరుల మూల పురుషులు.

25. Eleasar Aarons sonne toke one of the doughters of Putiel to wife, which bare him Phineas. These are the heades amonge the fathers of the generacions of the Leuites.

26. ఇశ్రాయేలీయులను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు.

26. This is yt Aaron & Moses, vnto whom ye LORDE sayde: Bringe ye childre of Israel out of the lande of Egipte wt their armies.

27. ఇశ్రాయేలీయలను ఐగుప్తులోనుండి వెలుపలికి రప్పించవలెనని ఐగుప్తు రాజైన ఫరోతో మాటలాడిన వారు వీరు; ఆ మోషే అహరోనులు వీరే.

27. It is they (namely Moses & Aaron) yt spake vnto Pharao the kynge of Egipte, yt they might brynge the children of Israel out of Egipte.

28. ఐగుప్తు దేశములో యెహోవా మోషేతో మాటలాడిన దినమున

28. The same daie spake ye LORDE vnto Moses in ye lande of Egipte,

29. యెహోవా నేను యెహోవాను; నేను నీతో చెప్పునది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా

29. & sayde: I am ye LORDE, speake thou vnto Pharao ye kynge of Egipte, all yt I saye vnto ye.

30. మోషే చిత్తగించుము; నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట యెట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.

30. And he answered before ye LORDE: Beholde, I am of vncircumcised lippes, how shall Pharao the heare me?



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Exodus - నిర్గమకాండము 6 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
దేవుడు తన వాగ్దానాన్ని పునరుద్ధరించాడు. (1-9) 
దేవుడిని సంతోషపెట్టడానికి మరియు ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించినప్పుడు మనం జీవితంలో బాగా రాణిస్తాము. మనం అన్నీ మన స్వంతంగా చేయలేమని, దేవునిపై ఆధారపడాలని మనం నేర్చుకోవాలి. దేవుడు ఏమి చేస్తాడో చూడాలని మోషే ఎదురు చూస్తున్నాడు మరియు ఇప్పుడు దేవుడు తన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడు మరియు అతను ప్రారంభించిన వాటిని పూర్తి చేస్తాడు. మనం సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనతో ఉంటాడని, మనల్ని ప్రత్యేక సమూహంలా చూసుకుంటానని చెప్పాడు. మనం సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటాడు మరియు అతను ఎంత గొప్పవాడో మనకు చూపించాలనుకుంటున్నాడు. అతను మనకు మంచి వాగ్దానం చేసినప్పటికీ, కొన్నిసార్లు మన సమస్యల గురించి మనం చాలా కలత చెందుతాము, అతని వాగ్దానాల గురించి మనం మరచిపోతాము మరియు సంతోషంగా ఉండలేము. మనం ఫిర్యాదు చేసినప్పుడు మరియు ఎక్కువగా చింతిస్తున్నప్పుడు, దేవుడు మన కోసం ప్లాన్ చేసిన మంచి విషయాలను కోల్పోతాము మరియు మనం బాధపడతాము. 

మోషే మరియు అహరోను మళ్లీ ఫరో వద్దకు పంపబడ్డారు. (10-13) 
మోషేకు దేవుణ్ణి విశ్వసించడం చాలా కష్టమైంది మరియు అతని పని చేయడం అతనికి కష్టమైంది. దేవునికి విధేయత చూపడం మరియు ఆయనపై విశ్వాసం ఉంచడం చాలా ముఖ్యం. మనం బలహీనంగా అనిపించినప్పటికీ, దేవుణ్ణి సేవించడానికి మన వంతు ప్రయత్నం చేయాలి. మోషే సాకులు చెప్పడం కొనసాగించినప్పుడు, దేవుడు అతనికి మరియు అహరోనుకు ఏమి చేయాలో చెప్పాడు మరియు ప్రతి ఒక్కరూ లోబడవలసి వచ్చింది. మనం దేవుని అధికారాన్ని విశ్వసించాలి మరియు ఫిర్యాదు లేదా వాదించకూడదు. Phi 2:14

మోసెస్ మరియు ఆరోన్ల తల్లిదండ్రులు. (14-30)
మోషే మరియు అహరోనులు ఇశ్రాయేలీయులకు మార్గనిర్దేశం చేయడానికి మరియు సహాయం చేయడానికి దేవుడు ఎన్నుకున్న ప్రత్యేక వ్యక్తులు, అదే విధంగా యేసు ప్రజలందరికీ సహాయం చేయడానికి ఎన్నుకోబడ్డాడు. ఇశ్రాయేలీయులను విడిపించమని మోషే ఫరోతో చెప్పవలసి వచ్చింది, కానీ అతను భయపడ్డాడు మరియు అతను దానిని చేయటానికి సరైన వ్యక్తి కాదో తెలియదు. కొన్నిసార్లు మనం ఆలోచించకుండా విషయాలు చెప్పినప్పుడు, మోషేలా మనం తర్వాత పశ్చాత్తాపపడవచ్చు. బైబిల్‌లో ఎవరైనా "సున్నతి పొందలేదు" అని మనం చెప్పినప్పుడు, వారు చేయవలసిన పనిని చేయడానికి వారు తగినవారు కాదని అర్థం. మనం ఎక్కువగా మనపై ఆధారపడకూడదు, కానీ మనకు సహాయం చేయడానికి దేవునిపై నమ్మకం ఉంచాలి. అపొస్తలుడైన పౌలు తనంతట తానుగా పనులు చేయలేనని చెప్పినట్లే, యేసు సహాయంతో అతను ఏదైనా చేయగలడు.



Shortcut Links
నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |