Exodus - నిర్గమకాండము 5 | View All

1. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి.

1. Afterward Moses and Aaron went in and said to Pharaoh, Thus says Jehovah the God of Israel: Let My people go, that they may hold a feast unto Me in the wilderness.

2. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయననెను.

2. And Pharaoh said, Who is Jehovah, that I should obey His voice to let Israel go? I do not know Jehovah; neither will I let Israel go.

3. అప్పుడు వారు హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను, సెలవైన యెడల మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణమంత దూరముపోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదము; లేని యెడల ఆయన మా మీద తెగులుతోనునైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి.

3. And they said, The God of the Hebrews has met with us. Now, let us go three days' journey into the desert and sacrifice unto Jehovah our God, that He not fall upon us with pestilence or with the sword.

4. అందుకు ఐగుప్తు రాజుమోషే అహరోనూ, ఈ జనులు తమ పనులను చేయకుండ మీరేల ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పొండనెను.

4. And the king of Egypt said to them, Moses and Aaron, why do you restrain the people from their work? Go to your burdens.

5. మరియఫరో ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించియున్నది; వారు తమ బరువులను విడిచి తీరికగా నుండునట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను.

5. And Pharaoh said, Behold, the people of the land are many now, and you have made them cease from their burdens.

6. ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించెను

6. So the same day Pharaoh commanded the taskmasters of the people and their officers, saying,

7. ఇటుకలు చేయుటకు మీరు ఇకమీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్లి తామే గడ్డి కూర్చుకొనవలెను.

7. You shall no longer give the people straw to make brick as before. Let them go and gather straw for themselves.

8. అయినను వారు ఇదివరకు చేసిన యిటుకల లెక్కనే వారి మీద మోపవలెను, దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు; వారు సోమరులు గనుక మేము వెళ్లి మా దేవునికి బలి నర్పించుటకు సెలవిమ్మని మొఱ పెట్టుచున్నారు.

8. And you shall lay on them the tally of bricks which they made before. You shall not diminish it. For they are idle; therefore they cry out, saying, Let us go and sacrifice to our God.

9. ఆ మనుష్యులచేత ఎక్కువ పని చేయింపవలెను, దానిలో వారు కష్టపడవలెను, అబద్ధపు మాటలను వారు లక్ష్యపెట్టకూడదనెను.

9. Let more labor be laid upon the men, that they may work in it, and let them not regard deceptive words.

10. కాబట్టి ప్రజలు కార్యనియామకులును వారి నాయకులును పోయి ప్రజలను చూచి నేను మీకు గడ్డి ఇయ్యను;

10. And the taskmasters of the people and their officers went out and spoke to the people, saying, Thus says Pharaoh: I will not give you straw.

11. మీరు వెళ్లి మీకు గడ్డి యెక్కడ దొరకునో అక్కడ మీరే సంపాదించుకొనుడి, అయితే మీ పనిలో నేమాత్రమును తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చెననిరి.

11. Go, get yourselves straw where you can find it; yet none of your labor shall be diminished.

12. అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్య కాలు కూర్చుటకు ఐగుప్తు దేశమందంతటను చెదిరిపోయిరి.

12. So the people were scattered abroad throughout all the land of Egypt to gather stubble instead of straw.

13. మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటివలెనే యేనాటిపని ఆనాడే ముగించుడనిరి.

13. And the taskmasters were pressing upon them saying, Fulfill your work, the matter of each day, as when there was straw.

14. ఫరో కార్యనియామకులు తాము ఇశ్రాయేలీయులలో వారిమీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటివలె మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఏల చేయించలేదని అడుగగా

14. And the officers of the children of Israel, whom Pharaoh's taskmasters had set over them, were beaten and were asked, Why have you not completed the prescribed amount to make brick, both yesterday and today, as before?

15. ఇశ్రాయేలీయుల నాయకులు ఫరో యొద్దకు వచ్చి తమ దాసుల యెడల తమరెందుకిట్లు జరిగించుచున్నారు?

15. Then the officers of the children of Israel came and cried out to Pharaoh, saying, Why are you dealing thus with your servants?

16. తమ దాసులకు గడ్డినియ్యరు అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు; చిత్తగించుము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు; అయితే తప్పిదము తమరి ప్రజలయందే యున్నదని మొఱపెట్టిరి.

16. There is no straw given to your slaves, and they say to us, Make brick! And behold, your servants are beaten, but the fault is in your own people.

17. అందుకతడు - మీరు సోమరులు మీరు సోమరులు అందుచేత మేము వెళ్లి యెహోవాకు బలినర్పించుటకు సెలవిమ్మని మీరడుగుచున్నారు.

17. But he said, You are idle! Idle! Therefore you say, Let us go and sacrifice to Jehovah.

18. మీరు పొండి, పనిచేయుడి, గడ్డి మీకియ్యబడదు, అయితే ఇటుకల లెక్క మీరప్పగింపక తప్పదని చెప్పెను.

18. Therefore go now and work; for no straw shall be given you, yet you shall deliver the amount of bricks.

19. మీ ఇటుకల లెక్కలో నేమాత్రమును తక్కువ చేయవద్దు, ఏనాటి పని ఆనాడే చేయవలెనని రాజు సెలవియ్యగా, ఇశ్రాయేలీయుల నాయకులు తాము దురవస్థలో పడియున్నట్లు తెలిసికొనిరి.

19. And the officers of the children of Israel saw that they were in a bad way after it was said, You shall not diminish any bricks from the matter day by day.

20. వారు ఫరో యొద్దనుండి బయలుదేరి వచ్చుచు, తమ్మును ఎదుర్కొనుటకు దారిలో నిలిచియున్న మోషే అహరోనులను కలిసికొని

20. And, as they came out from Pharaoh, they met Moses and Aaron standing there to meet them.

21. యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చును గాక; ఫరో యెదుటను అతని దాసుల యెదుటను మమ్మును అసహ్యులనుగా చేసి మమ్ము చంపుటకై వారిచేతికి ఖడ్గమిచ్చితిరని వారితో అనగా

21. And they said to them, Jehovah look upon you and judge, because you have made us abhorrent in the eyes of Pharaoh and in the eyes of his servants, to put a sword in their hand to kill us.

22. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లి ప్రభువా, నీవేల ఈ ప్రజలకు కీడు చేసితివి? నన్నేల పంపితివి?

22. And Moses returned to Jehovah and said, Lord, why have You brought hurt upon this people? Why then have You sent me?

23. నేను నీ పేరట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపను లేదనెను.

23. For since I came to Pharaoh to speak in Your name, he has done evil to this people; neither have You rescued to deliver Your people.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Exodus - నిర్గమకాండము 5 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
ఫరో యొక్క అసంతృప్తి, అతను ఇశ్రాయేలీయుల పనులను పెంచుతాడు. (1-9) 
దేవుడు తన ప్రజల పట్ల శ్రద్ధ వహిస్తాడు, వారు పేదవారైనా, గౌరవించబడకపోయినా, వారికి అవసరమైనప్పుడు వారికి సహాయం చేస్తాడు. ఫరో దేవుణ్ణి గౌరవించలేదు మరియు అతను చెప్పేది వినలేదు. అతను సరైనది చేయలేనంత గర్వంగా మరియు స్వార్థపూరితంగా ఉన్నాడు మరియు ఇది అతని పతనానికి కారణమైంది. మోషే మరియు ఆరోనులు దేవుణ్ణి ఆరాధించడానికి ప్రజలను ఒక చిన్న యాత్రకు తీసుకెళ్లాలని అనుకున్నారు, కానీ ఫరో అంగీకరించలేదు మరియు ప్రజలు సోమరితనంతో ఉన్నారని చెప్పాడు. ఇతరుల గురించి అబద్ధాలు చెప్పే ఒక నీచమైన వ్యక్తి ఉన్నాడు, తద్వారా అతను వారి జీవితాలను కష్టతరం చేస్తాడు. నేటికీ, కొందరు వ్యక్తులు తమను తాము ఆనందించడానికి బదులుగా దేవుని సేవలో గడిపేవారిని విమర్శిస్తారు, అదే సమయంలో చెడు పనులకు ఎక్కువ సమయం గడిపేవారిని ప్రశంసిస్తారు. ఆ సమయంలో పాలకుడు చాలా క్రూరంగా ప్రవర్తించాడు మరియు మోషే మరియు అహరోనులను మరింత కష్టపడేలా చేశాడు. మత పెద్దలను హింసించే వ్యక్తులు తమను కష్టపెట్టడానికి ఇష్టపడతారు. కార్మికులు సహాయం చేయడానికి సాధారణ పదార్థాలు లేకుండా ఎక్కువ ఇటుకలను తయారు చేయాల్సి వచ్చింది, ఇది వారికి చాలా కష్టతరం చేసింది. వారు అదనపు పని చేయకపోతే, వారు శిక్షించబడతారు. 

ఇశ్రాయేలీయుల బాధలు, మోషే దేవునికి ఫిర్యాదు. (10-23)
ఈజిప్టులో పనివాళ్ళతో చాలా నీచంగా ఉండేవాళ్ళు ఉండేవారు. చెడు వ్యక్తుల నుండి రక్షించబడాలని ప్రార్థించడం ముఖ్యం. కార్మికుల నాయకులు బాస్‌కు ఫిర్యాదు చేసినా ఆయన వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. కొన్నిసార్లు చెడు ఆలోచనలు దేవుణ్ణి ఆరాధించడం సోమరిపోతులకు మాత్రమే అని ప్రజలు భావించేలా చేయవచ్చు, కానీ వాస్తవానికి వారు బిజీగా ఉన్నప్పటికీ ఇది అందరికీ ముఖ్యమైనది. దేవుడిని ఆరాధించడానికి కష్టపడి పనిచేసే వ్యక్తులు, ఇతరులు దానిని మెచ్చుకోకపోయినా, దేవునిచే ప్రతిఫలం పొందుతారు.  ఇశ్రాయేలీయులు ఏదో తప్పు చేసారు మరియు దేవునికి క్షమాపణ చెప్పవలసి ఉంటుంది, కానీ బదులుగా వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులపై కోపం తెచ్చుకున్నారు. మోషే దేవుని వద్దకు తిరిగి వెళ్ళాడు, ఎందుకంటే తాను చేసినదంతా దేవుడు కోరుకున్నదేనని అతనికి తెలుసు. మనం ఏమి చేయాలో తెలియక, దేవుణ్ణి ప్రార్థించాలి మరియు సహాయం కోసం అడగాలి. మనం కోరుకున్న విధంగా విషయాలు జరగనప్పుడు, మనం దేవుణ్ణి వదులుకోకూడదు, బదులుగా వారు జరిగిన విధంగా ఎందుకు జరిగిందో గుర్తించడానికి ప్రయత్నించాలి. 



Shortcut Links
నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |