Exodus - నిర్గమకాండము 18 | View All

1. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి వెలుపలికి రప్పించిన సంగతియు, మిద్యాను యాజకుడును మోషే మామయునైన యిత్రో వినినప్పుడు

1. Jethro was the priest of Midian and the father-in-law of Moses. And he heard what the LORD God had done for Moses and his people, after rescuing them from Egypt.

2. మోషే మామయైన ఆ యిత్రో తనయొద్దకు పంపబడిన మోషే భార్యయైన సిప్పోరాను ఆమె యిద్దరి కుమారులను తోడుకొని వచ్చెను.

2. In the meantime, Moses had sent his wife Zipporah and her two sons to stay with Jethro, and he had welcomed them. Moses was still a foreigner in Midian when his first son was born, and so Moses said, 'I'll name him Gershom.' When his second son was born, Moses said, 'I'll name him Eliezer, because the God my father worshiped has saved me from the king of Egypt.'

3. అతడు అన్యదేశములో నేను పరదేశిననుకొని వారిలో ఒకనికి గేర్షోము అని పేరుపెట్టెను.
అపో. కార్యములు 7:29

3. (SEE 18:2)

4. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించెననుకొని రెండవవానికి ఎలీయెజెరని పేరు పెట్టెను.
అపో. కార్యములు 7:29

4. (SEE 18:2)

5. మోషే మామయైన యిత్రో అతని కుమారులనిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషేయొద్దకు వచ్చెను.

5. While Israel was camped in the desert near Mount Sinai, Jethro sent Moses this message: 'I am coming to visit you, and I am bringing your wife and two sons.'

6. యిత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడ ఆమె యిద్దరు కుమారులును నీయొద్దకు వచ్చియున్నామని మోషేకు వర్తమానము పంపగా

6. (SEE 18:5)

7. మోషే తన మామను ఎదుర్కొన పోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలిసికొని గుడారములోనికి వచ్చిరి.

7. When they arrived, Moses went out and bowed down in front of Jethro, then kissed him. After they had greeted each other, they went into the tent,

8. తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసిన దంతయు, త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును, యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను.

8. where Moses told him everything the LORD had done to protect Israel against the Egyptians and their king. He also told him how the LORD had helped them in all of their troubles.

9. యెహోవా ఐగుప్తీయుల చేతిలొ నుండి విడిపించి ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను.

9. Jethro was so pleased to hear this good news about what the LORD had done,

10. మరియయిత్రో ఐగుప్తీయుల చేతిలోనుండియు ఫరో చేతిలో నుండియు మిమ్మును విడిపించి, ఐగుప్తీయుల చేతిక్రిందనుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక.

10. that he shouted, 'Praise the LORD! He rescued you and the Israelites from the Egyptians and their king.

11. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయులమీద చేసిన దౌర్జన్యమునుబట్టి ఆయన చేసినదాని చూచి, యెహోవా సమస్త దేవతలకంటె గొప్పవాడని యిప్పుడు నాకు తెలిసినదనెను.

11. Now I know that the LORD is the greatest God, because he has rescued Israel from their arrogant enemies.'

12. మరియమోషే మామయైన యిత్రో ఒక దహనబలిని బలులను దేవునికర్పింపగా అహరోనును ఇశ్రాయేలీయుల పెద్దలందరును మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి.

12. Jethro offered sacrifices to God. Then Aaron and Israel's leaders came to eat with Jethro there at the place of worship.

13. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా, ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచియుండిరి.

13. The next morning Moses sat down at the place where he decided legal cases for the people, and everyone crowded around him until evening.

14. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి - నీవు ఈ ప్రజలకు చేయుచున్న యీ పని ఏమిటి? ఉదయము మొదలుకొని సాయంకాలమువరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరు నీయొద్ద నిలిచి యుండనేల అని అడుగగా

14. Jethro saw how much Moses had to do for the people, and he asked, 'Why are you the only judge? Why do you let these people crowd around you from morning till evening?'

15. మోషే దేవుని తీర్పు తెలిసి కొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు.

15. Moses answered, 'Because they come here to find out what God wants them to do.

16. వారికి వ్యాజ్యెము ఏదైనను కలిగినయెడల నా యొద్దకు వచ్చెదరు. నేను వారి విషయము న్యాయము తీర్చి, దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్రవిధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పెను.

16. They bring their complaints to me, and I make decisions on the basis of God's laws.'

17. అందుకు మోషే మామ అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు;

17. Jethro replied: That isn't the best way to do it.

18. నీవును నీతో నున్న యీ ప్రజలును నిశ్చయముగా నలిగిపోవుదురు; ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయచాలవు.

18. You and the people who come to you will soon be worn out. The job is too much for one person; you can't do it alone.

19. కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడైయుండును, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యెములను దేవుని యొద్దకు తేవలెను.

19. God will help you if you follow my advice. You should be the one to speak to God for the people,

20. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్రవిధులను బోధించి, వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను.

20. and you should teach them God's laws and show them what they must do to live right.

21. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి, లంచగొండులుకాని మనుష్యులను ఏర్పరచుకొని, వేయిమందికి ఒకనిగాను, నూరుమందికి ఒకనిగాను, ఏబదిమందికి ఒకనిగాను, పది మందికి ఒకనిగాను, వారిమీద న్యాయాధిపతులను నియమింపవలెను.

21. You will need to appoint some competent leaders who respect God and are trustworthy and honest. Then put them over groups of ten, fifty, a hundred, and a thousand.

22. వారు ఎల్లప్పుడును ప్రజలకు న్యాయము తీర్చవలెను. అయితే గొప్ప వ్యాజ్యెములన్నిటిని నీయొద్దకు తేవలెను. ప్రతి అల్పవిషయమును వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడ ఈ భారమును మోసిన యెడల నీకు సుళువుగా ఉండును.

22. These judges can handle the ordinary cases and bring the more difficult ones to you. Having them to share the load will make your work easier.

23. దేవుడు ఈలాగు చేయుటకు నీకు సెలవిచ్చినయెడల నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరు తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్లుదురని చెప్పెను.

23. This is the way God wants it done. You won't be under nearly as much stress, and everyone else will return home feeling satisfied.

24. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేసెను.

24. Moses followed Jethro's advice.

25. ఇశ్రాయేలీయులందరిలో సామర్థ్యముగల మనుష్యులను ఏర్పరచుకొని, వెయ్యిమందికి ఒకనిగాను, నూరు మందికి ఒకనిగాను, ఏబదిమందికి ఒకనిగాను, పదిమందికి ఒకనిగాను, న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజలమీద ప్రధానులనుగా నియమించెను.

25. He chose some competent leaders from every tribe in Israel and put them over groups of ten, fifty, a hundred, and a thousand.

26. వారెల్లప్పుడును ప్రజలకు న్యాయము తీర్చువారు. వారు కఠిన వ్యాజ్యెములను మోషే యొద్దకు తెచ్చుచు, స్వల్ప వ్యాజ్యెములను తామే తీర్చుచువచ్చిరి.

26. They served as judges, deciding the easy cases themselves, but bringing the more difficult ones to Moses.

27. తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్లెను.

27. After Moses and his father-in-law Jethro had said good-by to each other, Jethro returned home.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Exodus - నిర్గమకాండము 18 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
జెత్రో తన భార్య మరియు ఇద్దరు కుమారులను మోషే వద్దకు తీసుకువస్తాడు. (1-6) 
జెత్రో మోషేను సందర్శించడానికి మరియు అతని కుటుంబాన్ని అతని వద్దకు తీసుకురావడానికి వచ్చాడు. మంచి కుటుంబ నాయకత్వానికి ఉదాహరణగా దేవుని చర్చిని నడిపిస్తున్నప్పుడు మోషే తన కుటుంబం తనతో ఉండాలని కోరుకున్నాడు. 1 తిమోతికి 3:5 

మోషే జెత్రోను అలరించాడు. (7-12) 
దేవుడు ఎంత అద్భుతంగా ఉంటాడో మరియు ఆయన చేసిన పనులు మంచివి మరియు మనం మంచి మార్గంలో ఎదగడానికి సహాయపడతాయి. తన అల్లుడికి మరియు ఇజ్రాయెల్‌కు జరిగిన మంచి విషయాల గురించి జెత్రో సంతోషించాడు. దేవుడు ఇశ్రాయేలు కోసం చేసిన మంచి పనులను చూసిన ప్రజలు నిజంగా మంచి విషయాలను పొందిన వ్యక్తుల కంటే ఎక్కువగా ఆకట్టుకున్నారు. జెత్రో అన్ని మంచి విషయాల కోసం దేవునికి క్రెడిట్ ఇచ్చాడు. మనం ఏదైనా విషయం గురించి సంతోషంగా భావించినప్పుడల్లా, దేవునికి కృతజ్ఞతలు చెప్పడం గుర్తుంచుకోవాలి. దేవుడికి కృతజ్ఞతలు చెప్పేందుకు అందరూ కలిసి వచ్చారు. స్నేహితులు కలిసి పూజిస్తే వారి స్నేహం మరింత బలపడుతుంది. స్నేహితులు కలిసి దేవుణ్ణి ప్రార్థించడం మరియు స్తుతించడం చాలా ముఖ్యం. వారు స్వర్గం నుండి వచ్చిన ప్రత్యేకమైన రొట్టెతో ప్రత్యేక భోజనం చేశారు. జెథ్రో వారి సమూహానికి చెందిన వారు కానప్పటికీ, అతను ఇప్పటికీ ఆహ్వానించబడ్డాడు మరియు స్వాగతించబడ్డాడు. జీవితానికి రొట్టెలాంటి యేసును విశ్వసించడానికి ప్రతి ఒక్కరూ స్వాగతం పలుకుతారు. 

మోషేకు జెత్రో ఇచ్చిన సలహా. (13-27)
ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేయడానికి మోషే చాలా కష్టపడ్డాడు. అతను యేసులా ఉన్నాడు ఎందుకంటే అతను చట్టాలు చేశాడు మరియు ప్రజలకు తీర్పు తీర్చాడు. ప్రజలు ఒకరితో ఒకరు పోరాడుతుంటే, మోషే వారి మాటలను విని వారి సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేసేవాడు. అతను ఈ పనిని చాలా బాగా చేసాడు మరియు పేదవాడు కూడా అతని సహాయం కోరగలడు. మోషే రోజంతా చాలా కష్టపడ్డాడు. అతని స్నేహితుడు జెత్రో అది ఒక వ్యక్తి నిర్వహించలేని పని అని భావించాడు మరియు అది ప్రజలను అలసిపోతుంది. కొన్నిసార్లు మీరు సరైన పని చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఎక్కువ చేయడం మంచిది కాదు. తెలివిగా ఉండటం మరియు మీరు చేయవలసిన పనిని చేయడం మరియు ఎక్కువ చేయకపోవడం మధ్య మంచి సమతుల్యతను కనుగొనడం ముఖ్యం. కాబట్టి పనులు ఎలా మెరుగ్గా చేయాలో జెత్రో మోషేకు కొన్ని సలహాలు ఇచ్చాడు. గొప్ప వ్యక్తులు తమకు ఉపయోగపడే విషయాలను నేర్చుకోవడమే కాకుండా ఇతరులకు కూడా ఉపయోగపడేలా చేయడం చాలా ముఖ్యం. తెలివిగా, ధైర్యంగా, నిజాయితీగా, దృఢమైన నమ్మకాలు కలిగిన మంచి వ్యక్తులను ఎంపిక చేసుకోవడం ముఖ్యం. మంచిగా ఉండటం మరియు సరైన పని చేయడం, ఎవరూ చూడనప్పటికీ, ఏదైనా తప్పు చేయడాన్ని నిరోధించడానికి ఉత్తమ మార్గం. ఇది ముఖ్యమైనదని మోషేకు తెలుసు మరియు ఈ సలహాను విన్నాడు. సలహా వినడానికి మీరు చాలా తెలివిగా ఉన్నారని అనుకోవడం తెలివైన పని కాదు. 



Shortcut Links
నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |