శీర్షిక – విశ్రాంతి దినం కోసం కీర్తన అని ప్రత్యేకంగా చెప్పబడిన కీర్తన ఇదొక్కటే (విశ్రాంతి దినం గురించి నోట్ నిర్గమకాండము 20:8-11). అలాగని విశ్రాంతి దినాన ఇతర కీర్తనలు చదవకూడదు, పాడకూడదు అని కాదు. ఇది విశ్రాంతి దినానికి ప్రత్యేకంగా సరిపోతుందని అర్థం. ఎందుకంటే ఇది విశ్రాంతి, ఆనందాల కీర్తన. దేవుని కార్యాలను బట్టి ఆయనకు స్తుతి కీర్తన. 4వ వచనం దీని సారాంశం ఇస్తున్నది. ఈ కీర్తనలో దిగులు, నిరుత్సాహం, సందేహం, దేవుని విధానాలను ప్రశ్నించడం వంటివి ఏమీ లేవు. హృదయానికి విశ్రాంతి, మనశ్శాంతి, దేవునిలో ఆనందం మాత్రమే ఉన్నాయి. విశ్రాంతి దినం అంటే నిజమైన అర్థం ఇదే.
కృతజ్ఞత అర్పించడం, స్తుతించడం గురించి కీర్తనల గ్రంథము 7:17; కీర్తనల గ్రంథము 33:1-3 దగ్గర నోట్స్, రిఫరెన్సులు చూడండి.