Psalms - కీర్తనల గ్రంథము 91 | View All

1. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు.

చాలామంది పండితులు ఈ కీర్తన మోషే రాశాడన్నారు. అయితే ఆ విషయం ఖచ్చితంగా చెప్పలేము. అది ఎలా ఉన్నా మొత్తం మీద 90 వ కీర్తన మోషే ప్రార్థన తరువాత చక్కగా సరిపోయే కీర్తన ఇది. రెంటిలోనూ విశ్వాసుల నివాస స్థలం దేవుడే అన్న తలంపు కనిపిస్తున్నది (కీర్తనల గ్రంథము 90:1; కీర్తనల గ్రంథము 91:1 కీర్తనల గ్రంథము 91:9). కానీ 90వ కీర్తన పాపానికి వ్యతిరేకంగా దేవుని కోపాన్ని గురించి ప్రధానంగా చెప్తున్నది. 91లో దేవుడిచ్చే సంపూర్ణ సంరక్షణ, విజయం ప్రధానాంశం. రోమీయులకు 8:31 లో క్రీస్తు రాయబారి పౌలు ఈ కీర్తన సారాంశాన్ని ఇచ్చాడు. ఈ కీర్తనలో కనిపిస్తున్న గొప్ప వాగ్దానాలు దేవుని సంరక్షణ కింద నిలిచి ఉండేవారికీ ఆయన నీడలో నిలకడగా ఉండిపోయేవారికీ మాత్రమే. తమకిష్టం వచ్చినట్టు జీవిస్తూ ఆపదలు కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి వాడుకోవాలని చూచేవారి కోసం కాదు.

2. ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా దేవుడని నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను.

“ఆశ్రయ స్థానం”– కీర్తనల గ్రంథము 7:1-2. మొదటి రెండు వచనాల్లో దేవుణ్ణి వర్ణిస్తూ రచయిత వాడిన వేరు వేరు పేర్లను గమనించండి. “సర్వాతీతుడు” విశ్వాసిని అన్ని ప్రమాదాలకూ అందనంత పైకి ఎత్తగలవాడు. “అమిత శక్తిమంతుడు” విశ్వాసిని సంరక్షించడానికి సంపూర్ణ సామర్థ్యం గలవాడు. “యెహోవా” అంటే తన ప్రజలతో ఒడంబడికలూ వాగ్దానాలూ చేసిన విశ్వసనీయత గల దేవుడు. “నా దేవుడు” అంటే విశ్వాసుల దేవుడైన సృష్టికర్త. ఈ పేర్లన్నీ దేవునిలో నివసించేవారికీ, సంరక్షణ కోసం ఆయన్ను నమ్ముకున్నవారికీ దేవుడిచ్చే భద్రత ఎంత సురక్షితమో తెలియజేస్తున్నాయి.

3. వేటకాని ఉరిలోనుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును

ఇందులోనూ, రాబోయే వచనాల్లోనూ దేవుని సంరక్షణ అవసరం అయిన ప్రమాద పరిస్థితులు కొన్నింటిని రచయిత చెప్తున్నాడు. మొదటిది “వల”. వేటగాడు పట్టుకుందామని చూస్తున్న పక్షిలాంటివాడు విశ్వాసి. అతని కాళ్ళకు బంధాలు వెయ్యాలని సైతాను వల పన్నుతూ ఉంటాడు. “విపత్తు” అనడంలో రచయిత బహుశా ఈజిప్ట్‌లో కలిగిన భయంకరమైన ఈతిబాధల గురించీ, వాటన్నిటిలోనూ ఇస్రాయేల్‌వారు క్షేమంగా ఉండడం గురించీ ఆలోచిస్తూ ఉండవచ్చు.

4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది.

“రెక్కల”– కీర్తనల గ్రంథము 17:8; కీర్తనల గ్రంథము 36:7; కీర్తనల గ్రంథము 57:1; కీర్తనల గ్రంథము 63:7; మత్తయి 23:37. “డాలు”– కీర్తనల గ్రంథము 3:3; కీర్తనల గ్రంథము 5:12; కీర్తనల గ్రంథము 28:7; కీర్తనల గ్రంథము 35:2.

5. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను

రాత్రివేళ శత్రు దాడుల నుంచి తన ప్రజలను రక్షించేందుకు దేవుడు ఎంత సమర్థుడో పగలు వచ్చే ప్రమాదాలనుంచి తప్పించడంలో కూడా అంతే సమర్థుడు. అన్ని పరిస్థితుల్లోనూ విశ్వాసి మనశ్శాంతిగా, పూర్తి భద్రత ఉన్నదన్న నమ్మకంతో ఉండవచ్చు.

6. చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు.

7. నీ ప్రక్కను వేయి మంది పడినను నీ కుడిప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకురాదు.

దేవుని ఆశ్రయం కింద ఉన్న విశ్వాసి నాశనం అసాధ్యం. అతడు జీవించి ఉండాలని దేవుని సంకల్పం అయినంత కాలం అతడు మరణించలేడు. దేవుడు తన జ్ఞానం చొప్పున విశ్వాసి మేలుకోసం నిర్ణయించినది తప్ప మరేదీ అతణ్ణి తాకదు.

8. నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును

కీర్తనల గ్రంథము 37:34; కీర్తనల గ్రంథము 58:10. ఈ జీవిత కాలంలో కాకపోయినా, దేవుడు లేచి లోకానికి అంతిమ తీర్పు తీర్చే సమయంలోనైనా విశ్వాసి దీన్ని చూస్తాడు.

9. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసికొనియున్నావు

ఈ వచనం చుట్టున్న గొప్ప వాగ్దానాలు ఇందులోని సత్యాలను అనుభవించినవారికే. కీర్తనల గ్రంథము 90:1 చూడండి.

10. నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు

కీర్తనల గ్రంథము 23:4; కీర్తనల గ్రంథము 41:2; కీర్తనల గ్రంథము 121:7; సామెతలు 1:33; సామెతలు 12:21; 2 తిమోతికి 4:18.

11. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును
మత్తయి 4:6, లూకా 4:10-11, హెబ్రీయులకు 1:14

క్రీస్తును విషమ పరీక్షలకు గురి చేస్తున్న సమయంలో సైతాను ఈ వచనాన్ని పాక్షికంగా వినిపించాడు – మత్తయి 4:6. దేవదూతలు సహాయం చేస్తారన్నది కేవలం కవిత్వం కాదు. దేవదూతలు వాస్తవంగా ఉన్న శక్తివంతమైన జీవులు. తన ప్రజలకు పరిచర్య చేసేందుకు దేవుడు వాళ్ళను పంపిస్తాడు – కీర్తనల గ్రంథము 34:7; దానియేలు 6:21-22; అపో. కార్యములు 12:11; హెబ్రీయులకు 1:14. దేవునిలో నివసించేవారికి దేవదూతలు కావలి కాస్తారు. వారికి ఎదురు దెబ్బ తగిలి పడేలా చేసే చిన్న రాయి వంటి ఆటంకాల నుంచి కూడా కాపాడగలరు.

12. నీ పాదములకు రాయి తగులకుండ వారు నిన్ను తమ చేతులమీద ఎత్తి పట్టుకొందురు
మత్తయి 4:6, లూకా 4:10-11, హెబ్రీయులకు 1:14

13. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అణగ ద్రొక్కెదవు.
లూకా 10:19

ఇక్కడ విష సర్పం, సింహం కనబడడం సైతానును గుర్తుకు తెస్తుంది. సైతాను మింగివేయడానికి గర్జిస్తూ తిరుగుతూ ఉండే సింహం (1 పేతురు 5:8), కాలకూట విషంతో నిండిన సర్పం (ప్రకటన గ్రంథం 12:9). దేవునిలో నివసించేవారికి ఇంత బలమైన శత్రువును కూడా కాలికింద తొక్కివేయగల శక్తి ఉంటుంది. లూకా 10:19-20; యాకోబు 4:7 చూడండి.

14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను

ఇక్కడ రచయిత ద్వారా దేవుడే నేరుగా మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి నిజంగా ప్రేమించేవారికి ఈ వాగ్దానాలన్నీ అని గమనించండి. అలాంటివారిని దేవుడు విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు, వారి ప్రార్థనలకు జవాబిస్తాడు. సంరక్షించి, గౌరవించి, సంతృప్తి పరుస్తాడు. దీర్ఘాయుష్షును గురించిన వాగ్దానం నిర్గమకాండము 20:12; ద్వితీయోపదేశకాండము 5:33; ద్వితీయోపదేశకాండము 6:2 వంటి ఇతర పాత ఒడంబడిక గ్రంథం భాగాలకు అనుగుణమైనది (కొత్త నిబంధనలో దీనికి ప్రాధాన్యత లేదు). మీరు దేవుణ్ణి ప్రేమించి చూడండి చాలు – బైబిలు మీకోసం ఎన్నో ఎన్నో వాగ్దానాలను దాచి ఉంచింది.

15. అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చె దను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను

16. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Psalms - కీర్తనల గ్రంథము 91 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

తమ ఆశ్రయం కోసం దేవుడిని కలిగి ఉన్నవారి భద్రత. (1-8) 
"విశ్వాసం ద్వారా దేవుణ్ణి తమ రక్షకునిగా ఎంచుకునే వారు తమకు కావాల్సినవన్నీ లేదా కోరుకున్నదంతా ఆయనే సమకూరుస్తున్నారని తెలుసుకుంటారు. ప్రభువును తమ ఆశ్రయంగా మార్చుకునే ఓదార్పును అనుభవించిన వారు సహజంగానే ఇతరులకు అదే కోరుకుంటారు. దైవిక కృప ఆధ్యాత్మిక జీవితాన్ని సాతాను నుండి కాపాడుతుంది. వేటగాడి ఉచ్చుల వంటి ప్రలోభాలు, హానికరమైన అంటువ్యాధి అయిన పాపం కలుషితం కాకుండా కాపాడుతుంది.విశ్వాసులకు ఆపద మధ్య గొప్ప భద్రత ఉంటుంది.జ్ఞానం వారిని అనవసరమైన భయం నుండి నిరోధిస్తుంది మరియు విశ్వాసం వారిని అధిక ఆందోళన నుండి నిరోధిస్తుంది. ఏది జరిగినా, మన పరలోకపు తండ్రి చిత్తమే గెలుస్తుంది మరియు మనం భయపడాల్సిన అవసరం లేదు.దేవుని ప్రజలు ఆయన వాగ్దానాల నెరవేర్పును మాత్రమే కాకుండా ఆయన హెచ్చరికలను కూడా చూస్తారు.కాబట్టి, పాపులు ప్రభువును ఆయన కరుణాసనం వద్ద చేరి, విమోచకుని నామాన్ని ఆరాధించి, ఇతరులను విశ్వసించమని ప్రోత్సహించండి. అతనిలో కూడా."

అతని పట్ల వారి అనుగ్రహం. (9-16)
ఏది జరిగినా, విశ్వాసి క్షేమంగా ఉంటారు. పరీక్షలు మరియు కష్టాలు సంభవించినప్పుడు కూడా, అవి హాని కోసం ఉద్దేశించినవి కావు, విశ్వాసి యొక్క అంతిమ మేలు కోసం ఉద్దేశించబడ్డాయి, అవి తక్షణ ఆనందాన్ని ఇవ్వకపోయినా తాత్కాలిక దుఃఖాన్ని కలిగిస్తాయి. దేవుణ్ణి నిజంగా అర్థం చేసుకున్నవారు ఆయనను హృదయపూర్వకంగా ప్రేమిస్తారు మరియు ప్రార్థన ద్వారా నిరంతరం ఆయనను వెతుకుతారు. దేవుని వాగ్దానం ఏమిటంటే, తగిన సమయంలో, అతను విశ్వాసిని కష్టాల నుండి రక్షిస్తాడు మరియు ఈలోగా, అతను వారి పోరాటాలలో వారితో ఉంటాడు. ప్రభువు వారి భూసంబంధమైన విషయాలన్నింటినీ పర్యవేక్షిస్తాడు మరియు ఈ భూమిపై వారి జీవితాన్ని ప్రయోజనకరంగా ఉన్నంత వరకు కాపాడతాడు. ఇందులో ప్రోత్సాహాన్ని పొందేందుకు, విశ్వాసి యేసు వైపు చూస్తాడు, వారు ఈ ప్రపంచంలోకి పంపబడిన ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి మరియు పరలోకానికి సిద్ధంగా ఉండటానికి వారు చాలా కాలం జీవిస్తారని తెలుసు. వారి ద్వారా లేదా వారిపై తన పనిని నెరవేర్చడానికి దేవుడు వారికి కేటాయించిన సమయం కంటే ఒక్క రోజు ఎక్కువ కాలం జీవించాలని ఎవరు కోరుకుంటారు? ఒక వ్యక్తి చిన్న వయస్సులోనే మరణించవచ్చు, అయినప్పటికీ వారి జీవితంలో సంతృప్తిని పొందవచ్చు, అయితే దుష్టుడు సుదీర్ఘ జీవితంతో కూడా సంతృప్తి చెందడు. చివరికి, విశ్వాసి యొక్క యుద్ధం ముగుస్తుంది మరియు వారు ఎప్పటికీ ఇబ్బంది, పాపం మరియు టెంప్టేషన్ నుండి విముక్తి పొందారు.



Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |