Psalms - కీర్తనల గ్రంథము 84 | View All

1. సైన్యములకధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు

శీర్షిక – కోరహు సంతతివారు – కీర్తన 42 దగ్గర నోట్. అక్కడిలాగానే ఇక్కడ కూడా ఈ కీర్తన కోరహు సంతతివారిలో ఒకడు రాశాడో, లేక కీర్తనకు రాగం సమకూర్చి గానం చేసేందుకు కోరహు సంతతివారికోసం రాయబడిందో తెలియదు. చూస్తుంటే ఇది దావీదు రాసిన కీర్తనలాగే ఉంది గాని ఖచ్చితంగా తేల్చి చెప్పడం కుదరదు. ఇక్కడ రచయిత దేవుని నివాస స్థలాల అందాన్ని మెచ్చుకోవడం లేదు. అవి తనకెంత ప్రీతిపాత్రమైనవో, తానక్కడ ఉండగలిగేందుకు ఎంత తహతహలాడుతున్నాడో, ఇక్కడ వెల్లడి చేస్తున్నాడు. కీర్తనల గ్రంథము 42:1-2; కీర్తనల గ్రంథము 63:1-2 పోల్చిచూడండి. దీన్నిబట్టి కవి జెరుసలంకు దూరంగా ఉన్నాడనీ అప్పుడు అక్కడికి చేరుకోవడం అతనికి అసాధ్యంగా ఉన్నదనీ అర్థం చేసుకోవచ్చు. అయితే అక్కడికి చేరి దేవుణ్ణి ఆరాధించే తలంపే అతని హృదయానికి ఆనందాన్ని తెస్తుంది. ఇతర విశ్వాసుల సహవాసంలో చేసే దైవారాధన అతని పాలిట గొప్ప ఉల్లాసంగా అనిపించింది. ఇలాంటి ఆరాధన సభలకు వెళ్ళాలని ఎవరూ అతణ్ణి బలవంతం చేయనక్కరలేదు. బలవంతమంతా అతని అంతరంగంలో నుంచే ఎడతెగక వస్తూ ఉంది. యేసు ప్రభువును రక్షకుడుగా ఎరిగిన మనక్కూడా దేవుని ఆరాధన స్థలాలకు వెళ్ళాలన్న ఇలాంటి తహతహ ఉండాలి గదా.

2. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి.

3. సైన్యములకధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను.

“సేనల ప్రభువైన”– 1 సమూయేలు 1:3 నోట్. ఆరాధన గుడారం ఆవరణాల్లో గూళ్ళు కట్టుకున్న పక్షుల గురించి ఆలోచించినా ఈ రచయితకు అసూయగానే ఉంది. ఆ ఆవరణల్లోనే నివసిస్తూ అనుదినం దేవుణ్ణి ఆరాధించే భాగ్యం ఉన్న యాజులను కూడా అతడు తలచుకొంటున్నాడు. దేవుణ్ణి ఇతడు సంబోధించడంలో ధ్వనిస్తున్న నిశ్చయత, ఆనందం గమనించండి – “నా రాజా, నా దేవా”. ఈ కీర్తనలో “ధన్యజీవులు” అనే మాట మూడు సార్లు కనిపిస్తున్నాయి. మొదటిది ఈ వచనంలో ఉంది. ఈ కీర్తనకు “ధన్యకరమైన జీవితం” అని పేరు పెట్టవచ్చు. ధన్యులెవరంటే దేవునికి సమీపంగా ఉండేవారు (4 వ), దేవునిలో బలం కలిగి ఆయనదగ్గరికి వెళ్ళేందుకు యాత్ర చేసేవారు (5 వ), ఆయనపై నమ్మకం ఉంచేవారు (12 వ). ధన్యత, దీవెన గురించి ఇతర రిఫరెన్సుల కోసం కీర్తనల గ్రంథము 1:1 చూడండి.

4. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. (సెలా. )

5. నీవలన బలము నొందు మనుష్యులు ధన్యులు యాత్రచేయు మార్గములు వారికి అతి ప్రియములు.

“బలం”– కీర్తనల గ్రంథము 18:1-2; కీర్తనల గ్రంథము 28:7; కీర్తనల గ్రంథము 31:4; కీర్తనల గ్రంథము 73:26. “యాత్ర”– ఇస్రాయేల్‌కు నియమితమైన కొన్ని పండుగల సమయాల్లో దేవుని ప్రజలు దేశం నలుమూలలనుండి దేవుణ్ణి ఆరాధించేందుకు జెరుసలంకు వచ్చారు. ఇక్కడ సీయోను చేరేందుకు ఏదో మొక్కుబడిగా అంత దూరం నడిచి వచ్చేవాడు ధన్యుడని కవి అనడం లేదు. ఆ దారులను హృదయంలో ఎవడైతే భద్రం చేసుకొంటాడో, యాత్రికుడుగా ఉండడం ఎవడికైతే మనస్ఫూర్తిగా ఇష్టమౌతుందో, అంటే దేవుని నగరానికి పయనించి రావడానికి ఎవరికి నిజమైన ఆనందం ఉంటుందో వాడే ధన్యుడు. విచారం, పాపం నిండిన ఈ లోకంనుంచి పరమ జెరుసలంకు యాత్ర వెళ్ళే ఈనాటి విశ్వాసుల జీవిత విధానం గురించిన నీడ ఇక్కడ కనిపిస్తున్నది (హెబ్రీయులకు 11:13-16; 1 పేతురు 2:11).

6. వారు బాకా లోయలోబడి వెళ్లుచు దానిని జలమయముగా చేయుదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును.

బాఖా అంటే అర్థం “ఏడ్పు” కావచ్చు. ఆ దేశంలో ఈ లోయ ఎక్కడ ఉన్నదీ, దానికీ పేరు ఎందుకు వచ్చినదీ మనకు తెలియదు. తెలియవలసిన అవసరం కూడా లేదు. ఈ కన్నీటి లోయలో, యాత్రా జీవనం ఎదుర్కొనే విచారకరమైన అనుభవాల్లో, దైన్యస్థితి అనుభవించవలసిన ఎడారి ప్రాంతాల్లో కూడా అదంతా నమ్మకంవల్ల ఓదార్పు, ఆనందం, విశ్రాంతి ఊటగా కాగలదు. ఈ సత్యం తెలుసుకొంటే చాలు (అపో. కార్యములు 16:22-25; 2 కోరింథీయులకు 1:5; ఫిలిప్పీయులకు 2:17; కొలొస్సయులకు 1:24).

7. వారు నానాటికి బలాభివృద్ధినొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును.

సుదీర్ఘ ప్రయాణంలో అలాంటివారి శక్తి అంతకంతకూ సన్నగిల్లవలసింది పోయి, నానాటికీ బలాభివృద్ధి చెందుతుంది (కీర్తనల గ్రంథము 103:5; యెషయా 40:30-31; 2 కోరింథీయులకు 4:7-10 2 కోరింథీయులకు 4:16; 2 కోరింథీయులకు 12:9-10). “కనబడుతారు”– చివరికి ప్రతి యాత్రికుడు దేవుని సన్నిధికి చేరాడు (నిర్గమకాండము 23:17; నిర్గమకాండము 34:23; ద్వితీయోపదేశకాండము 16:16). ఇప్పటి నిజమైన యాత్రికులంతా, అంటే నిజ విశ్వాసులంతా చివరికి పరమ సీయోనులో మహానందంతో దేవుని సన్నిధిలో కనబడుతారు (యోహాను 14:3; యోహాను 17:24; 2 కోరింథీయులకు 5:1; ఎఫెసీయులకు 1:4; కొలొస్సయులకు 3:4; యూదా 1:24-25 వచనాలు).

8. యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము యాకోబు దేవా, చెవియొగ్గుము. (సెలా. )

“విను”– కీర్తనల గ్రంథము 4:1; కీర్తనల గ్రంథము 5:1; కీర్తనల గ్రంథము 54:2; కీర్తనల గ్రంథము 140:6. కీర్తనల రచయితలకు జవాబు రాని ప్రార్థనవల్ల తృప్తి కలగలేదు. “యాకోబు యొక్క దేవుడు”– కీర్తనల గ్రంథము 146:5 నోట్.

9. దేవా, మా కేడెమా, దృష్టించుము నీవు అభిషేకించినవాని ముఖమును లక్షింపుము.

“డాలు”– కీర్తనల గ్రంథము 3:3; కీర్తనల గ్రంథము 5:12; కీర్తనల గ్రంథము 28:7; కీర్తనల గ్రంథము 35:2. ఇది రాజుకోసం చేసిన ప్రార్థన.

10. నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినములకంటె శ్రేష్ఠము. భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటె నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము.

దేవుణ్ణి ఆరాధించడం, సేవించడం పట్ల మనకుండవలసిన మనసును ఇంతకన్నా స్పష్టంగా చెప్పడం సాధ్యమా? దేవుని సన్నిధిలో గడిపే ఒక్క రోజు, వేరొక చోట మూడు సంవత్సరాలు గడపడం కన్న మేలు. దేవుడు మనకు అప్పగించిన అతి అల్పమైన ఏ పని అయినా చేయడం ఈ పాపిష్టి లోకంలో ఉన్న అన్ని కార్యకలాపాల కన్న ఎక్కువ సంతృప్తి నిస్తుంది, అది వాటికంటే ముఖ్యమైనది కూడా. సైతానుకు చెందే అతి శ్రేష్ఠమైనదానికన్నా దేవునికి చెందే అతి తక్కువయినది ఎన్నో రెట్లు మిన్న. దుర్మార్గుల సుఖభోగాలు, సంపదలు, సౌఖ్యాలన్నిటి కంటే దేవునికి చేసే అతి అల్ప సేవ అనేక రెట్లు మంచిది. అసలు ఈ రెంటికి పోలికే లేదు. ఈ కీర్తనతో సంబంధం గల కోరహు సంతతివారు దేవుని ఆలయం ద్వారపాలకులు (1 దినవృత్తాంతములు 9:19). దేవుని సేవపట్ల మనకు సరైన సవ్యమైన అభిప్రాయం గనుక లేకపోతే మనం దేవుని సంకల్పానికి అనుగుణమైనవాళ్ళంగా ఉండలేము. మనకోసం అన్నీ చేసిన మన ముక్తిదాతకోసం ఏ కొంచెమైనా, ఏమైనా చెయ్యగలగడం మనం మహానందంగా భావించాలి.

11. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై యున్నాడు యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు.

“సూర్యప్రకాశం”– యాత్రికుల మార్గంలో వెలుగును ఇచ్చేదీ, వారిని శత్రువుల బారినుంచి రక్షించేదీ దేవుడే. యాత్ర ప్రయాణంలో మనకవసరమైనదంతా దేవుడే అనుగ్రహిస్తాడు. ఇకముందు ఘనతను కూడా మనకిస్తాడు. “కృప”– యోహాను 1:16; రోమీయులకు 5:2; 1 కోరింథీయులకు 1:4; 1 కోరింథీయులకు 15:10; 2 కోరింథీయులకు 12:9. “ఘనత”– యోహాను 12:26; యోహాను 17:22; రోమీయులకు 2:10; రోమీయులకు 8:17-18; 2 కోరింథీయులకు 4:17; కొలొస్సయులకు 1:27; 2 తిమోతికి 2:10; హెబ్రీయులకు 2:10; 1 పేతురు 1:7. “మేలు”– కీర్తనల గ్రంథము 34:9-10; కీర్తనల గ్రంథము 37:25; మత్తయి 7:11; ఫిలిప్పీయులకు 4:19. అయితే మనకు ఏది మంచిదో, ఏది కాదో ఆ నిర్ణయాన్ని దేవునికే వదలాలి.

12. సైన్యములకధిపతివగు యెహోవా, నీయందు నమ్మికయుంచువారు ధన్యులు.

కీర్తనల గ్రంథము 2:12; కీర్తనల గ్రంథము 40:4 దేవుని దీవెనలన్నిటినీ అందుకునే చెయ్యి నమ్మకమే.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Psalms - కీర్తనల గ్రంథము 84 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

కీర్తనకర్త దేవుని శాసనాల పట్ల తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. (1-7) 
దేవుని శాసనాలు ఈ సమస్యాత్మక ప్రపంచంలో విశ్వాసులకు ఓదార్పునిస్తాయి; వాటిలో, వారు సజీవమైన దేవుని ఉనికిని అనుభవిస్తారు, అది వారిని మరింత ఎక్కువగా కోరుకునేలా చేస్తుంది. ఈ శాసనాలు పక్షి ఆత్మకు పోషణ గూడు లాంటివి. అయినప్పటికీ, అవి స్వర్గపు ఆనందానికి ముందస్తు రుచి మాత్రమే. దైవిక శాసనాలు అలసటగా అనిపిస్తే ఎవరైనా ఆ పవిత్ర రాజ్యంలోకి ప్రవేశించాలని ఎలా కోరుకుంటారు? తమ సమృద్ధికి మూలమైన యేసుక్రీస్తు కృపపై ఆధారపడి, తమ మతపరమైన భక్తిలో కొనసాగే వారికే నిజమైన ఆనందం చెందుతుంది.
స్వర్గపు నగరానికి వారి ప్రయాణంలో యాత్రికులు దుఃఖం మరియు శుష్క ఎడారుల లోయలను దాటవచ్చు, కానీ వారికి మోక్షం యొక్క బావులు తెరవబడతాయి మరియు వారిని నిలబెట్టడానికి ఓదార్పులు పంపబడతాయి. వారి క్రైస్తవ ప్రయాణంలో పట్టుదలతో ఉన్నవారు దేవుడు వారి కృపలను మరింత దయతో పెంచుతున్నాడని కనుగొంటారు. మరియు దయలో ఎదుగుతున్న వారు కీర్తిలో పరిపూర్ణతను పొందుతారు.

శాసనాల దేవుని పట్ల అతని కోరిక. (8-12)
దేవునికి మన ప్రార్థనలన్నిటిలో, ఆయన ఎన్నుకోబడిన క్రీస్తుపై ఆయన దృష్టిని తీవ్రంగా వెతకాలి మరియు క్రీస్తు యోగ్యత కారణంగా ఆయన అంగీకారాన్ని ప్రార్థించాలి. మన విశ్వాసం క్రీస్తుపై స్థిరంగా ఉండాలి మరియు ప్రతిగా, అభిషిక్తుని ముఖాన్ని దేవుడు దయతో చూస్తాడు. క్రీస్తు లేకుండా, ఆయన ముందు మనల్ని మనం ప్రదర్శించే ధైర్యం లేదు.
కీర్తనకర్త దేవుని శాసనాల పట్ల తనకున్న ప్రేమను ఉద్రేకంతో వ్యక్తపరుస్తాడు. దేవుని సన్నిధిలోని ఒక రోజును మరెక్కడా గడిపిన వెయ్యి రోజుల కంటే విలువైనదిగా పరిశీలిద్దాం మరియు అతని సేవలో అత్యున్నతమైన ప్రాపంచిక గౌరవం కంటే ఉన్నతమైనదిగా పరిగణించండి. మనం ప్రస్తుతం చీకటిలో నివసిస్తున్నప్పటికీ, దేవుడు మన దేవుడైతే, ఆయన మన సూర్యుడు, మనకు ప్రకాశిస్తూ మరియు ఉత్తేజపరిచే, మన మార్గాన్ని నడిపిస్తాడు మరియు నిర్దేశిస్తాడు. మనం ఆపదను ఎదుర్కొన్నప్పటికీ, ఆయన మనకు రక్షణగా ఉంటాడు, మన చుట్టూ ఉన్న అనేక సవాళ్ల నుండి మనలను రక్షిస్తాడు. దేవుడు సంపద మరియు హోదాను వాగ్దానం చేయనప్పటికీ, తన నిర్దేశించిన మార్గంలో వారిని కోరుకునే వారికి తన దయ మరియు మహిమను ఆయన మనకు హామీ ఇచ్చాడు. దేవుణ్ణి తెలుసుకోవడం, ప్రేమించడం మరియు సేవ చేయడంలో కనిపించే స్వర్గానికి ఆరంభం తప్ప కృప ఏమిటి? ఆయనలాగా మారడం మరియు ఆయన శాశ్వతమైన ఉనికిని అనుభవించడంలో ఈ ఆనందం యొక్క పరిపూర్ణత తప్ప మహిమ ఏమిటి?
మనకు నిజంగా ప్రయోజనకరమైన ప్రతిదీ అందించడానికి దేవుణ్ణి విశ్వసిస్తూ, నిటారుగా నడవడానికి మన ప్రాధాన్యత ఇద్దాం. మనం భౌతికంగా ప్రభువు గృహంలోకి ప్రవేశించలేకపోతే, విశ్వాసంతో ఇంటి ప్రభువు సన్నిధిలోకి ప్రవేశిద్దాం. ఆయనలో, మనం ఆనందం మరియు శాంతిని కనుగొంటాము. ఒక వ్యక్తి యాకోబు దేవుడైన సైన్యములకధిపతియగు ప్రభువుపై విశ్వాసముంచినప్పుడు, బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా యథార్థంగా సంతృప్తి చెందుతాడు.



Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |