ఈజిప్ట్ నుంచి ఎర్ర సముద్రం మీదుగా అరణ్య మార్గంలో ఇస్రాయేల్వారు పయనించిన వైనాన్ని ఆసాపు గుర్తు చేసుకుంటున్నాడు. ఇదంతా దేవుని ప్రేమను, విశ్వసనీయతను (15,20 వ), దేవుని బలప్రభావాలను, మహిమను (16-18 వ), తన ప్రజలపట్ల దేవుడు అవలంబించే నిగూఢమైన పద్ధతులను (వ 19) అతనికి జ్ఞాపకం చేసింది. వీటిని గుర్తు చేసుకోవడమే ఆసాపులో అలుముకొన్న నిరుత్సాహానికి సరైన మందు. మనశ్శాంతి దొరకాలంటే దేవుడు అనుసరించే నిగూఢ మార్గాలన్నీ మనకు అర్థం కానవసరం లేదు. ఆయన కృపకోసం ఆయనలో నమ్మకం ఉంచి ఆయన అడుగు జాడల్లో, అరణ్య మార్గంలాంటి ఈ లోకంలో సాగిపోవడమే అవసరం.