Psalms - కీర్తనల గ్రంథము 77 | View All

1. నేను ఎలుగెత్తి దేవునికి మొఱ్ఱపెట్టుదును ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును.

“దేవునికి మొరలిడుతాను”– గొప్ప నిరుత్సాహ స్థితిని గురించి ఆసాపు ఈ కీర్తనలో రాస్తున్నాడు. తనకు దేవుడు చేసేవాటిని అతను అర్థం చేసుకోలేకపోయాడు. అతని నమ్మకం కఠిన పరీక్షకు గురైంది. ఈ కీర్తనను 3 భాగాలుగా విభజించవచ్చు. ఆసాపు నిరుత్సాహ స్థితి, అతని ప్రార్థన (1-9 వ), దేవుని గొప్పతనాన్ని నెమరు వేసుకోవాలన్న అతని నిర్ణయం (10-12 వ), ప్రత్యేకించి అతడు గుర్తు చేసుకున్న దేవుని ఘన కార్యాలు. (వ 13-20).

2. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండ చాప బడియున్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లక యున్నది.

ఎవరైనా దుఃఖ భారంతో కృంగివుంటే అందుకు చికిత్సలో ఒక భాగం. దేవుణ్ణి వెతకడం కొత్త జీవాన్ని, బలాన్ని, ఆనందాన్ని తెస్తుంది (కీర్తనల గ్రంథము 9:10; కీర్తనల గ్రంథము 22:26; కీర్తనల గ్రంథము 34:10; కీర్తనల గ్రంథము 40:16; కీర్తనల గ్రంథము 69:32; కీర్తనల గ్రంథము 70:4; కీర్తనల గ్రంథము 105:3). మనుషులు ఇవ్వజూపే ఆదరణ, అతని అవసరానికి సరిపోని ఆదరణ అంతటినీ ఆసాపు నిరాకరించాడు. దేవుని ఓదార్పు మాత్రమే అతనికి కావలిసినది.

3. దేవుని జ్ఞాపకము చేసికొనునప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను నేను ధ్యానించునప్పుడు నా ఆత్మ క్రుంగిపోవుచున్నది (సెలా.)

“జ్ఞాపకం”– దేవుణ్ణి గురించిన ఆలోచనలు గతంలో అతడు అనుభవించిన సంతోషాలను జ్ఞప్తికి తెచ్చాయి (5,6 వ), మానసికంగా అతణ్ణి మరింత కృంగదీశాయి. “నిట్టూర్పు”– మూలుగులు, ఆర్తనాదాలు కొన్ని సార్లు శ్రేష్ఠమైన ప్రార్థనలౌతాయి. చంటి పాపకు ఇంకా మాటలు రాకముందే తల్లి ఆ పాప ఏడుపు విని ఓదారుస్తుంది.

4. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేక యున్నాను.

మనో వేదనను, హృదయాభిలాషను వెల్లడించేందుకు కొన్ని సార్లు మాటలు చాలవు. అవి శూన్యంగా, వ్యర్థంగా ధ్వనిస్తాయి. పవిత్రాత్మ సహా మానవ హృదయంలో మూలుగులను ఉపయోగించి తండ్రియైన దేవునికి విన్నపం చేస్తాడు. రోమీయులకు 8:26 చూడండి.

5. తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును.

6. నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసి కొందును హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పుమార్గము శ్రద్ధగా వెదకెను.

7. ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇకెన్నడును కటాక్షింపడా?

చాలా మనోవేదన అనుభవిస్తున్న వ్యక్తి అంటున్న మాటలివి. దేవునితో అతని సహవాసమంతా తెగిపోయినట్టుంది. దేవుడు కోపంగా ఉన్నట్టు అనిపిస్తున్నది. యోబు 6:4; విలాపవాక్యములు 3:1-18 కూడా చూడండి. ఇలాంటి అనుభవం మనలో ఎవరికైనా కలగవచ్చు. అలా కలిగినప్పుడు మనకు మార్గదర్శకంగా ఈ కీర్తన ఉంది.

8. ఆయన కృప ఎన్నటికిలేకుండ మానిపోయెనా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పి పోయెనా?

9. దేవుడు కటాక్షింప మానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా?(సెలా.)

10. అందుకునేనీలాగు అనుకొనుచున్నాను మహోన్నతుని దక్షిణహస్తము మార్పునొందెననుకొను టకు నాకు కలిగిన శ్రమయే కారణము.

దేవుణ్ణి వెతుకుతూ ఉన్నప్పుడు ఆయన తన ప్రజలపట్ల గతంలో చేసిన ఘనకార్యాలను ధ్యానించుకోవాలని నిశ్చయించుకొన్నాడు. ఇలా జ్ఞాపకం చేసుకోవడం మన నమ్మకానికి సహాయం చేస్తుంది. తద్వారా నమ్మకం బలపడి నిరుత్సాహాన్ని పారదోలుతుంది. మనవైపు మనం చూసుకోవడం వల్ల మనశ్శాంతి కలగదు. దేవుని విమోచన క్రియల వైపుకు చూడడం వల్లే కలుగుతుంది. హీబ్రూ భాషలో 10వ వచనం అస్పష్టంగా ఉంది. అనేక విధాలైన తర్జుమాలు దీనికి వెలువడ్డాయి. ఇక్కడ మేము చేసిన అనువాదం ఇంగ్లీషు కింగ్ జేమ్స్ బైబిలును అనుసరించి చేసినది. తెలుగు పాత తర్జుమాలో ఇచ్చిన అనువాదం కూడా సరైనది అనుకోవడానికి అవకాశం ఉంది. గాని కొంత సందేహానికి తావు లేకపోలేదు.

11. యెహోవా చేసిన కార్యములను,పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును

దేవుని వాక్కు ఆజ్ఞాపించినదాన్ని చేసేందుకు ఇక్కడ ఆసాపు నిశ్చయించుకున్నాడు (ద్వితీయోపదేశకాండము 7:18; ద్వితీయోపదేశకాండము 8:2 ద్వితీయోపదేశకాండము 8:18; ద్వితీయోపదేశకాండము 32:7).

12. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును.

కీర్తనల గ్రంథము 1:1-2; కీర్తనల గ్రంథము 143:5; కీర్తనల గ్రంథము 145:5; 1 తిమోతికి 4:15.

13. దేవా, నీమార్గము పరిశుద్ధమైనది.దేవునివంటి మహా దేవుడు ఎక్కడనున్నాడు?

ఆసాపు గుర్తు చేసుకొంటున్న మొదటి అంశమేమంటే దేవుని మార్గం సంపూర్ణమైన పవిత్రత గలది. అందువల్ల దేవుడు అతని పట్ల చేస్తున్నవన్నీ న్యాయమైనవే, పొరపాటులకు ఏ మాత్రం చోటివ్వలేదు (కీర్తనల గ్రంథము 18:30). దేవుని పవిత్రత గురించి నోట్ లేవీయకాండము 20:7. “గొప్ప దేవుడు”– కీర్తనల గ్రంథము 71:19; కీర్తనల గ్రంథము 86:8; నిర్గమకాండము 15:11; ద్వితీయోపదేశకాండము 32:31; యెషయా 40:25.

14. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని యున్నావు.

కీర్తనల గ్రంథము 72:18; కీర్తనల గ్రంథము 86:10; కీర్తనల గ్రంథము 136:4.

15. నీ బాహుబలమువలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించియున్నావు.

ఈజిప్ట్ నుంచి ఎర్ర సముద్రం మీదుగా అరణ్య మార్గంలో ఇస్రాయేల్‌వారు పయనించిన వైనాన్ని ఆసాపు గుర్తు చేసుకుంటున్నాడు. ఇదంతా దేవుని ప్రేమను, విశ్వసనీయతను (15,20 వ), దేవుని బలప్రభావాలను, మహిమను (16-18 వ), తన ప్రజలపట్ల దేవుడు అవలంబించే నిగూఢమైన పద్ధతులను (వ 19) అతనికి జ్ఞాపకం చేసింది. వీటిని గుర్తు చేసుకోవడమే ఆసాపులో అలుముకొన్న నిరుత్సాహానికి సరైన మందు. మనశ్శాంతి దొరకాలంటే దేవుడు అనుసరించే నిగూఢ మార్గాలన్నీ మనకు అర్థం కానవసరం లేదు. ఆయన కృపకోసం ఆయనలో నమ్మకం ఉంచి ఆయన అడుగు జాడల్లో, అరణ్య మార్గంలాంటి ఈ లోకంలో సాగిపోవడమే అవసరం.

16. దేవా, జలములు నిన్ను చూచెను జలములు నిన్ను చూచి దిగులుపడెను అగాధజలములు గజగజలాడెను.

17. మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కుల పారెను.

“బాణాలు”– అంటే మెరుపులు.

18. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వణకి కంపించెను.

19. నీ మార్గము సముద్రములో నుండెను. నీ త్రోవలు మహా జలములలో ఉండెను. నీ యడుగుజాడలు గుర్తింపబడక యుండెను.

20. మాషే అహరోనులచేత నీ ప్రజలను మందవలె నడి పించితివి.


Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |

Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.