Ezra - ఎజ్రా 4 | View All

1. అంతట యూదావంశస్థులకును బెన్యామీనీయులకును విరోధులైనవారు, చెరనివారణ యయినవారు ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని

1. Now when the enemies of Judah and Benjamin heard that the people of the exile were building a temple to the LORD God of Israel,

2. జరుబ్బాబెలు నొద్దకును పెద్దలలో ప్రధా నులయొద్దకును వచ్చిమీరు ఆశ్రయించునట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము. ఇచ్చటికి మమ్మును రప్పించిన అష్షూరు రాజైన ఏసర్హద్దోనుయొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించు వారము, మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి.

2. they approached Zerubbabel and the heads of fathers' [households], and said to them, 'Let us build with you, for we, like you, seek your God; and we have been sacrificing to Him since the days of Esarhaddon king of Assyria, who brought us up here.'

3. అందుకు జెరుబ్బాబెలును యేషూవయు ఇశ్రాయేలీయుల పెద్దలలో తక్కిన ప్రధానులునుమీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు;మేమే కూడుకొని పారసీకదేశపు రాజైన కోరెషు మాకిచ్చిన ఆజ్ఞప్రకారము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకుమందిరమును కట్టుదుమని వారితో చెప్పిరి.
యోహాను 4:9

3. But Zerubbabel and Jeshua and the rest of the heads of fathers' [households] of Israel said to them, 'You have nothing in common with us in building a house to our God; but we ourselves will together build to the LORD God of Israel, as King Cyrus, the king of Persia has commanded us.'

4. దేశపు జనులు యూదావంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరచిరి.

4. Then the people of the land discouraged the people of Judah, and frightened them from building,

5. మరియు పారసీకదేశపు రాజైన కోరెషు యొక్క దినములన్నిటిలోను పారసీకదేశపు రాజైన దర్యా వేషుయొక్క పరిపాలనకాలమువరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి.

5. and hired counselors against them to frustrate their counsel all the days of Cyrus king of Persia, even until the reign of Darius king of Persia.

6. మరియు అహష్వేరోషు ఏలనారంభించినప్పుడు వారు యూదాదేశస్థులను గూర్చియు యెరూషలేము పట్టణపు వారిని గూర్చియు ఉత్తరము వ్రాసి వారిమీద తప్పు మోపిరి.

6. Now in the reign of Ahasuerus, in the beginning of his reign, they wrote an accusation against the inhabitants of Judah and Jerusalem.

7. అర్తహషస్తయొక్క దినములలో బిష్లామును మిత్రి దాతును టాబెయేలును వారి పక్షముగానున్న తక్కిన వారును పారసీకదేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరము వ్రాసిపంపిరి. ఆ యుత్తరము సిరియాభాషలో వ్రాయబడి సిరియాభాషలోనే తాత్పర్యము చేయబడినది.

7. And in the days of Artaxerxes, Bishlam, Mithredath, Tabeel and the rest of his colleagues wrote to Artaxerxes king of Persia; and the text of the letter was written in Aramaic and translated [from] Aramaic.

8. మరియు మంత్రియగు రెహూమును లేఖకుడగు షివ్షుయియు ఈ ప్రకారముగా యెరూషలేము సంగతినిగూర్చి ఉత్తరము వ్రాసి రాజైన అర్తహషస్తయొద్దకు పంపిరి.

8. Rehum the commander and Shimshai the scribe wrote a letter against Jerusalem to King Artaxerxes, as follows--

9. అంతట మంత్రి యగు రెహూమును లేఖకుడగు షివ్షుయియు వారి పక్ష ముగానున్న తక్కినవారైన దీనాయీయులును అపర్స త్కాయ్యులును టర్పెలాయేలును అపార్సాయులును అర్కెవాయులును బబులోనువారును షూషన్కాయులును దెహావేయులును ఏలామీయులును

9. then [wrote] Rehum the commander and Shimshai the scribe and the rest of their colleagues, the judges and the lesser governors, the officials, the secretaries, the men of Erech, the Babylonians, the men of Susa, that is, the Elamites,

10. ఘనుడును, శ్రేష్ఠుడునైన ఆస్నప్పరు నది యివతలకు రప్పించి షోమ్రోను పట్టణములందును నది యవతలనున్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనములును, నది యివతలనున్న తక్కిన వారును ఉత్తరము ఒకటి వ్రాసిరి.

10. and the rest of the nations which the great and honorable Osnappar deported and settled in the city of Samaria, and in the rest of the region beyond the River. Now

11. వీరు రాజైన అర్తహషస్తకు వ్రాసి పంపించిన ఉత్తరము నకలు. నది యివతలనున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియ జేయునదేమనగా

11. this is the copy of the letter which they sent to him: 'To King Artaxerxes: Your servants, the men in the region beyond the River, and now

12. తమ సన్నిధినుండి మాయొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి, తిరుగుబాటుచేసిన ఆ చెడుపట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మతు చేయు చున్నారు.

12. let it be known to the king that the Jews who came up from you have come to us at Jerusalem; they are rebuilding the rebellious and evil city and are finishing the walls and repairing the foundations.

13. కావున రాజవైన తమకు తెలియవలసినదేమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలువ బెట్టినయెడల వారు శిస్తుగాని సుంకముగాని పన్నుగాని యియ్యకయుందురు, అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టమగును.

13. 'Now let it be known to the king, that if that city is rebuilt and the walls are finished, they will not pay tribute, custom or toll, and it will damage the revenue of the kings.

14. మేము రాజుయొక్క ఉప్పుతిన్నవారము గనుక రాజునకు నష్టమురాకుండ మేము చూడవలెనని ఈ యుత్తరమును పంపి రాజవైన తమకు ఈ సంగతి తెలియ జేసితివిు.

14. 'Now because we are in the service of the palace, and it is not fitting for us to see the king's dishonor, therefore we have sent and informed the king,

15. మరియు తమ పూర్వికులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచినయెడల, ఈ పట్టణపువారు తిరుగుబాటు చేయువారుగాను, రాజులకును దేశములకును హాని చేయువారుగాను, కలహకారులుగాను కనబడుదు రనియు, అందువలననే యీ పట్టణము నాశనము పొందె ననియు రాజ్యపు దస్తావేజులవలననే తమకు తెలియ వచ్చును.

15. so that a search may be made in the record books of your fathers. And you will discover in the record books and learn that that city is a rebellious city and damaging to kings and provinces, and that they have incited revolt within it in past days; therefore that city was laid waste.

16. కావున రాజవైన తమకు మేము రూఢిపరచున దేమనగా, ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలువబెట్టబడినయెడల నది యివతల తమకు హక్కు ఎంత మాత్రము ఉండదు.

16. 'We inform the king that if that city is rebuilt and the walls finished, as a result you will have no possession in [the province] beyond the River.'

17. అప్పుడు రాజుమంత్రియగు రెహూమునకును లేఖకుడగు షివ్షుయికిని షోమ్రోనులో నివసించువారి పక్షముగానున్న మిగిలిన వారికిని నది యవ తలనుండు తక్కినవారికినిమీకు క్షేమసంప్రాప్తియగును గాక అని యీ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చిన దేమనగా

17. [Then] the king sent an answer to Rehum the commander, to Shimshai the scribe, and to the rest of their colleagues who live in Samaria and in the rest of [the provinces] beyond the River: 'Peace. And now

18. మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకొన్నాము.

18. the document which you sent to us has been translated and read before me.

19. అందువిషయమై మా యాజ్ఞను బట్టి వెదకగా, ఆదినుండి ఆ పట్టణపువారు రాజులమీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగుపడినది.

19. 'A decree has been issued by me, and a search has been made and it has been discovered that that city has risen up against the kings in past days, that rebellion and revolt have been perpetrated in it,

20. మరియయెరూషలేముపట్టణమందు బలమైనరాజులు ప్రభుత్వము చేసిరి. వారు నది యవతలి దేశములన్నిటిని ఏలినందున వారికి శిస్తును సుంకమును పన్నును చెల్లు చుండెను.

20. that mighty kings have ruled over Jerusalem, governing all [the provinces] beyond the River, and that tribute, custom and toll were paid to them.

21. కాబట్టి యిప్పుడు ఆ మనుష్యులు ఆ పని చాలించి, మేము సెలవిచ్చువరకు ఆ పట్టణమును కట్టక మానవలెనని ఆజ్ఞాపించుడి.

21. 'So, now issue a decree to make these men stop [work], that this city may not be rebuilt until a decree is issued by me.

22. ఇది తప్పకుండ చేయుటకు మీరు జాగ్రత్తపడుడి. రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహము పెరుగకుండ చూడుడి అని సెలవిచ్చెను.

22. 'Beware of being negligent in carrying out this [matter]; why should damage increase to the detriment of the kings?'

23. రాజైన అర్త హషస్త పంపించిన యుత్తరముయొక్క ప్రతి రెహూమునకును షివ్షుయికిని వీరిపక్షముగా నున్న వారికిని వినిపింపబడినప్పుడు వారు త్వరగా యెరూషలేములోనున్న యూదులయొద్దకు వచ్చి, బలవంతము చేతను అధికారము చేతను వారు పని ఆపునట్లు చేయగా

23. Then as soon as the copy of King Artaxerxes' document was read before Rehum and Shimshai the scribe and their colleagues, they went in haste to Jerusalem to the Jews and stopped them by force of arms.

24. యెరూషలేములో నుండు దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఈలాగున పారసీకదేశపు రాజైన దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరమువరకు ఆ పని నిలిచిపోయెను.

24. Then work on the house of God in Jerusalem ceased, and it was stopped until the second year of the reign of Darius king of Persia.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezra - ఎజ్రా 4 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఆలయ వ్యతిరేకులు. (1-5) 
యథార్థమైన విశ్వాసాన్ని పునరుజ్జీవింపజేయడానికి చేసే ఏ ప్రయత్నమైనా అనివార్యంగా సాతాను మరియు అతని ప్రభావంలో ఉన్నవారి ప్రతిఘటనను రేకెత్తిస్తుంది. ఈ సందర్భంలో ప్రత్యర్థులు 2 రాజులు 17లో వివరించిన విధంగా ఇజ్రాయెల్ భూభాగంలో స్థిరపడిన సమరయులు. ఆయన బోధనలలో సూచించిన విధంగా ప్రభువును ఆరాధించడం నుండి వైదొలగాలనే వారి ఉద్దేశాలు స్పష్టంగా ఉన్నాయి. సానుకూల కార్యక్రమాలను బలహీనపరిచే మరియు వాటిలో నిమగ్నమైన వారి బలాన్ని తగ్గించే వారు ఎవరి ఉదాహరణను అనుకరిస్తున్నారో ఆలోచించాలి.

ఆలయ నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది. (6-24)
ఆలయ అభివృద్ధి చెందడం రాజులు మరియు పాలకులకు హానికరమని రుజువు చేస్తుందని చాలా కాలంగా ఉన్న దురభిప్రాయం పేర్కొంది. ఈ వాదన పూర్తిగా నిరాధారమైనది, ఎందుకంటే నిజమైన దైవభక్తి మన చక్రవర్తులను గౌరవించమని మరియు పాటించాలని నిర్దేశిస్తుంది. అయితే, దేవుని ఆజ్ఞ భూసంబంధమైన చట్టానికి విరుద్ధంగా ఉన్నప్పుడు, మన విధేయత దేవునికి ఉండాలి మరియు మనం సహనంతో పరిణామాలను భరించాలి. సువార్తను ప్రియమైనవారందరూ చర్చి యొక్క విరోధులను అనుకోకుండా ధైర్యపరచకుండా ఉండటానికి, ఏదైనా తప్పు చేసే సూచన నుండి దూరంగా ఉండాలి. విశ్వాసులకు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలను తక్షణమే అంగీకరించడానికి ప్రపంచం సిద్ధపడుతుంది, తరచుగా వారి కథనాన్ని తోసిపుచ్చుతుంది. ఈ మోసాలు మరియు అవాస్తవాల ద్వారా తనను తాను మోసం చేయడానికి రాజు అనుమతించాడు. నాయకులు ఇతరుల కళ్ళు మరియు చెవుల ద్వారా ప్రపంచాన్ని గ్రహిస్తారు, కొన్నిసార్లు తప్పుడు ప్రాతినిధ్యాల ఆధారంగా తీర్పులను ఏర్పరుస్తారు. అయినప్పటికీ, దేవుని తీర్పు నిష్పక్షపాతమైనది; అతను వాస్తవికతను నిజంగా ఉన్నట్లు చూస్తాడు.



Shortcut Links
ఎజ్రా - Ezra : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |