“లేవీగోత్రికులు”– బబులోనువారు చెరగొనిపోయిన వారిలో యూదా, బెన్యామీను, లేవీ గోత్రాలవారు ముఖ్యమైన గోత్రాలు. లేవీవారి గురించి నోట్ సంఖ్యాకాండము 1:47-51; సంఖ్యాకాండము 8:19.
“పురిగొలిపాడో”– వ 1; నిర్గమకాండము 35:20-22; హగ్గయి 1:14. వీరిలో చాలామంది యూదులు బబులోనులో స్థిరపడ్డారు. జెరుసలంకు వెయ్యి కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న నాలుగు నెలల ప్రయాణం (ఎజ్రా 7:9; ఎజ్రా 8:21-23) లోని ఇబ్బందుల్ని ఎదుర్కొనే ఆశ, శిథిలమైన నగరంలో మళ్ళీ జీవనాన్ని కొత్తగా మొదలు పెట్టే ఆశ వారికి లేదు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిని ఎదుర్కొనే ఆశ లేదు. వారు బయలుదేరేందుకు సమ్మతించాలంటే వారి హృదయాల్లో దేవుని ప్రత్యేక ప్రేరేపణ అవసరం.