Chronicles II - 2 దినవృత్తాంతములు 8 | View All

1. సొలొమోను యెహోవా మందిరమును తన నగరును కట్టించిన యిరువది సంవత్సరముల కాలము తీరిన తరువాత

1. At the end of twenty years, Solomon had quite a list of accomplishments. He had: built The Temple of GOD and his own palace;

2. హీరాము తనకిచ్చిన పట్టణములను సొలొమోను కట్టించి వాటిలో ఇశ్రాయేలీయులను కాపురముంచెను.

2. rebuilt the cities that Hiram had given him and colonized them with Israelites;

3. తరువాత సొలొమోను హమాతుసొబా అను స్థలమునకు పోయి దానిని పట్టుకొనెను.

3. marched on Hamath Zobah and took it;

4. మరియు అరణ్య మందుండు తద్మోరుకును హమాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటికిని ప్రాకారములను కట్టించెను.

4. fortified Tadmor in the desert and all the store-cities he had founded in Hamath;

5. ఇదియు గాక అతడు ఎగువ బేత్‌హోరోను దిగువ బేత్‌హోరోను గవునులు అడ్డగడలుగల ప్రాకారపట్టణములుగా కట్టించెను.

5. built the fortress cities Upper Beth Horon and Lower Beth Horon, complete with walls, gates, and bars;

6. బయలతును, ఖజానా ఉంచు పట్టణములన్నిటిని, రథములుంచు పట్టణములన్నిటిని, గుఱ్ఱపు రౌతులుండు పట్టణములన్నిటిని కట్టించెను. మరియయెరూషలేమునందును లెబానోనునందును తాను ఏలు దేశములన్నిటియందును ప్రాకారపురములుగా కట్టించవలెనని తానుద్దేశించిన పట్టణములన్నిటిని సొలొమోను కట్టించెను.

6. built Baalath and store-cities; built chariot-cities for his horses. Solomon built impulsively and extravagantly--whenever a whim took him. And in Jerusalem, in Lebanon--wherever he fancied.

7. ఇశ్రాయేలీయుల సంబంధులు కాని హిత్తీయులలో నుండియు అమోరీయులలోనుండియు, పెరిజ్జీయులలో నుండియు, హివ్వీయులలోనుండియు, యెబూసీయులలో నుండియు, శేషించియున్న సకల జనులను

7. The remnants from the original inhabitants of the land (Hittites, Amorites, Perizzites, Hivites, Jebusites--all non-Israelites),

8. ఇశ్రాయేలీ యులు నాశనముచేయక వదలివేసిన ఆ యా జనుల సంతతి వారిని సొలొమోను నేటివరకును తనకు వెట్టిపనులు చేయువారినిగా చేసికొనియుండెను.

8. survivors of the holy wars, were rounded up by Solomon for his gangs of slave labor. The policy is in effect today.

9. అయితే ఇశ్రా యేలీయులలో ఒకనినైనను సొలొమోను తన పనిచేయుటకు దాసునిగా నియమింపలేదు; వారిని యోధులుగాను తన అధిపతులలో ప్రధానులుగాను రథములకును గుఱ్ఱపు రౌతులకును అధిపతులుగాను నియమించెను.

9. But true Israelites were not treated this way; they were used in his army and administration--government leaders and commanders of his chariots and charioteers.

10. వీరిలో శ్రేష్ఠులైన రెండువందల ఏబదిమంది రాజైన సొలొమోను క్రింద అధిపతులై ప్రజలమీద అధికారులై యుండిరి.

10. They were also the project managers responsible for Solomon's building operations--250 in all in charge of the workforce.

11. ఇశ్రాయేలీయుల రాజైన దావీదు నగరునందు నా భార్య నివాసముచేయవలదు, యెహోవా మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి, సొలొమోను ఫరోకుమార్తెను దావీదు పట్టణమునుండి తాను ఆమెకొరకు కట్టించిన నగరునకు రప్పించెను.

11. Solomon brought Pharaoh's daughter from the City of David to a house built especially for her, 'Because,' he said, 'my wife cannot live in the house of David king of Israel, for the areas in which the Chest of GOD has entered are sacred.'

12. అది మొదలుకొని సొలొమోను తాను మంటపము ఎదుట కట్టించిన యెహోవా బలిపీఠముమీద దహనబలులు అర్పించుచు వచ్చెను. అతడు అనుదిన నిర్ణయముచొప్పున

12. Then Solomon offered Whole-Burnt-Offerings to GOD on the Altar of GOD that he had built in front of The Temple porch.

13. మోషే యిచ్చిన ఆజ్ఞనుబట్టి విశ్రాంతి దినములయందును, అమావాస్యలయందును, నియామక కాలములయందును, సంవత్సరమునకు ముమ్మారుజరుగు పండుగలయందును, అనగా పులియని రొట్టెల పండుగయందును వారముల పండుగయందును పర్ణశాలల పండుగయందును యెహోవాకు దహనబలులు అర్పించుచు వచ్చెను.

13. He kept to the regular schedule of worship set down by Moses: Sabbaths, New Moons, and the three annual feasts of Unraised Bread (Passover), Weeks (Pentecost), and Booths.

14. అతడు తన తండ్రియైన దావీదు చేసిన నిర్ణయమునుబట్టి వారి వారి సేవాధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకును, కట్టడనుబట్టి అను దినమున యాజకుల సముఖమున స్తుతిచేయుటకును, ఉప చారకులుగా ఉండుటకును, వంతులచొప్పున లేవీయులను, ద్వారములన్నిటి దగ్గర కావలి యుండుటకై వారి వారి వంతులచొప్పున ద్వారపాలకులను నియమించెను; దైవ జనుడైన దావీదు ఆలాగుననే యాజ్ఞ ఇచ్చియుండెను.

14. He followed the practice of his father David in setting up groups of priests carrying out the work of worship, with the Levites assigned to lead the sacred music for praising God and to assist the priests in the daily worship; he assigned security guards to be on duty at each gate--that's what David the man of God had ordered.

15. ఏ విషయమును గూర్చియేగాని బొక్కసములను గూర్చియే గాని రాజు యాజకులకును లేవీయులకును చేసియున్న నిర్ణ యమును బట్టి వారు సమస్తమును జరుపుచువచ్చిరి

15. The king's directions to the priests and Levites and financial stewards were kept right down to the fine print--no innovations--including the treasuries.

16. యెహోవా మందిరమునకు పునాదివేసిన దినము మొదలుకొని అది సంపూర్ణమగువరకు సొలొమోను పని యంతయు చేయించెను; అప్పుడు యెహోవా మందిరము సమాప్త మాయెను.

16. All that Solomon set out to do, from the groundbreaking of The Temple of GOD to its finish, was now complete.

17. సొలొమోను ఎదోము దేశముయొక్క సముద్రపు దరినున్న ఎసోన్గెబెరునకును ఏలతునకును పోగా

17. Then Solomon went to Ezion Geber and Elath on the coast of Edom.

18. హీరాము తన పనివారిద్వారా ఓడలను ఓడ నడుపుటయందు యుక్తి గల పనివారిని పంపెను. వీరు సొలొమోను పనివారితో కూడ ఓఫీరునకు పోయి అక్కడనుండి తొమ్మిదివందల మణుగుల బంగారమును ఎక్కించుకొని రాజైన సొలొమోను నొద్దకు తీసికొని వచ్చిరి.

18. Hiram sent him ships and with them veteran sailors. Joined by Solomon's men they sailed to Ophir (in east Africa), loaded on fifteen tons of gold, and brought it back to King Solomon.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Chronicles II - 2 దినవృత్తాంతములు 8 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

సోలమన్ భవనాలు మరియు వ్యాపారం.

ఒక్కోసారి, కేవలం కీర్తిపై ఆధారపడిన రాజ్యాన్ని పరిపాలించడం కంటే దేవుని గౌరవంతో కుటుంబాన్ని నడిపించడంలో గొప్ప జ్ఞానం మరియు దృఢసంకల్పం అవసరం. ఒక వ్యక్తి తన భార్యను సహాయక భాగస్వామిగా కాకుండా అడ్డంకిగా భావించినప్పుడు సవాలు తీవ్రమవుతుంది. మోజాయిక్ చట్టం సూచించిన పవిత్రమైన ఆచారాలను సోలమన్ శ్రద్ధగా సమర్థించాడు. బలులు స్థిరంగా అర్పించబడకపోతే బలిపీఠం నిర్మాణం మరియు స్వర్గపు అగ్ని ఫలించలేదు. క్రమశిక్షణతో కూడిన భక్తిని పెంపొందించే రోజువారీ మరియు వారపు అభ్యాసం, ఆధ్యాత్మిక సమర్పణలను సమర్పించడానికి మనం కూడా పిలువబడ్డాము.
ఆలయ సేవను నిర్వహించడం ద్వారా, లార్డ్ యొక్క ఇల్లు పరిపూర్ణతను పొందినట్లు నమోదు చేయబడింది. పూర్తి చేసిన పనులపై దృష్టి కేంద్రీకరించబడింది, కేవలం భౌతిక నిర్మాణంపై మాత్రమే కాదు; అన్ని విధులు పూర్తయ్యే వరకు ఆలయం అసంపూర్తిగా ఉంది. కనాను సమృద్ధిగా ప్రగల్భాలు పలికినప్పటికీ, అది ఓఫీర్ నుండి బంగారాన్ని కోరింది. అదేవిధంగా, తమ జ్ఞానానికి పేరుగాంచిన ఇశ్రాయేలీయులకు, సముద్ర సంబంధ పరిజ్ఞానంలో నైపుణ్యం ఉన్నవారికి తూరు రాజు నుండి సహాయం అవసరం. నిజమైన ఐశ్వర్యం బంగారం కంటే దయతో నివసిస్తుంది మరియు దేవుడు మరియు అతని చట్టాలను తెలుసుకోవడం అంతిమ జ్ఞానం.
దేవుని పిల్లలుగా, ప్రాపంచిక వ్యక్తులకు ప్రాపంచిక ఆస్తుల సాధనలను వదులుకుందాం. బదులుగా, మన హృదయాలను మన నిజమైన సంపదతో సమలేఖనం చేస్తూ మన సంపదలను స్వర్గంలో పెట్టుబడి పెడతాము.



Shortcut Links
2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |