Chronicles II - 2 దినవృత్తాంతములు 6 | View All

1. అప్పుడు సొలొమోను ఈలాగు ప్రకటన చేసెను గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చియున్నాడు.

1. Then Solomon said, O Lord, to the sun you have given the heaven for a living-place, but your living-place was not seen by men,

2. నీవు నిత్యము కాపుర ముండుటకై నిత్యనివాసస్థలముగా నేనొక ఘనమైన మంది రమును నీకు కట్టించియున్నాను అని చెప్పి
అపో. కార్యములు 7:47

2. So I have made for you a living-place, a house in which you may be for ever present.

3. రాజు తన ముఖము ప్రజలతట్టు త్రిప్పుకొని ఇశ్రాయేలీయుల సమాజకులందరును నిలుచుచుండగా వారిని దీవించెను.

3. Then, turning his face about, the king gave a blessing to all the men of Israel; and they were all on their feet together.

4. మరియు రాజు ఇట్లు ప్రకటన చేసెనునా తండ్రియైన దావీదునకు మాట యిచ్చి, తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక.

4. And he said, Praise be to the Lord, the God of Israel, who himself gave his word to my father David, and with his strong hand has made his word come true, saying,

5. ఆయన సెలవిచ్చినదేమనగానేను నా జనులను ఐగుప్తుదేశములోనుండి రప్పించిన దినము మొదలు కొని నా నామముండుటకై యొక మందిరమును కట్టింపవలెనని నేను ఇశ్రాయేలీయుల గోత్రస్థానములలో ఏ పట్టణమునైనను కోరుకొనలేదు, నా జనులైన ఇశ్రాయేలీ యులమీద అధిపతిగా నుండుటకై యేమనుష్యునియైనను నేను నియమింపలేదు.

5. From the day when I took my people out of the land of Egypt, no town in all the tribes of Israel has been marked out by me for the building of a house for the resting-place of my name; and I took no man to be a ruler over my people Israel;

6. ఇప్పుడు నా నామముండుటకై యెరూషలేమును కోరుకొంటిని, నా జనులైన ఇశ్రాయేలీ యులమీద అధిపతిగా నుండుటకై దావీదును కోరుకొంటిని.

6. But now I have made selection of Jerusalem, that my name might be there, and of David, to be over my people Israel.

7. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలెనని నా తండ్రి యైన దావీదు మనోభిలాష గలవాడాయెను.
అపో. కార్యములు 7:45-46

7. Now it was in the heart of my father David to put up a house for the name of the Lord, the God of Israel.

8. అయితే యెహోవా నా తండ్రియైన దావీదుతో సెలవిచ్చిన దేమనగానా నామఘనతకొరకు మందిరమును కట్టింపవలెనని నీవు ఉద్దేశించిన యుద్దేశము మంచిదే గాని
అపో. కార్యములు 7:45-46

8. But the Lord said to David my father, You did well to have in your heart the desire to make a house for my name:

9. నీవు ఆ మందిరమును కట్టరాదు, నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును.

9. But you yourself will not be the builder of the house; but your son, the offspring of your body, he it is who will put up a house for my name.

10. అప్పుడు తాను అట్లు చెప్పియున్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చియున్నాడు, యెహోవా సెలవుప్రకారము నేను నా తండ్రియైన దావీదునకు ప్రతిగా రాజునై ఇశ్రాయేలీయుల రాజాసనమందు కూర్చుండి ఇశ్రాయేలీయుల దేవు డైన యెహోవాకు మందిరమును కట్టించి
అపో. కార్యములు 7:47

10. And the Lord has kept his word; for I have taken my father David's place on the seat of the kingdom of Israel, as the Lord gave his word; and I have made the house for the name of the Lord the God of Israel.

11. యెహోవా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనకు గురుతైన మందస మును దానియందు ఉంచితినని చెప్పి

11. And there I have put the ark, in which is the agreement of the Lord, which he made with the people of Israel.

12. ఇశ్రాయేలీయు లందరు సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను.

12. Then he took his place in front of the altar of the Lord, all the men of Israel being present,

13. తాను చేయించిన అయిదు మూరల పొడవును అయిదు మూరల వెడల్పును మూడు మూరల యెత్తునుగల యిత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమునందుంచి, దానిమీద నిలిచియుండి, సమాజముగా కూడియున్న ఇశ్రాయేలీయు లందరి యెదుటను మోకాళ్లూని, చేతులు ఆకాశమువైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థనచేసెను.

13. (For Solomon had made a brass stage, five cubits long, five cubits wide and three cubits high, and had put it in the middle of the open space; on this he took his place and went down on his knees before all the meeting of Israel, stretching out his hands to heaven.)

14. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీవంటి దేవుడు ఆకాశమందైనను భూమి యందైనను లేడు.

14. And he said, O Lord, the God of Israel, there is no God like you in heaven or on earth; keeping faith and mercy unchanging for your servants, while they go in your ways with all their hearts;

15. నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చినమాట నెరవేర్చియున్నావు; నీవు వాగ్దానముచేసి యీ దినమున కనబడుచున్నట్టుగా దానిని నెరవేర్చియున్నావు.

15. For you have kept the word which you gave to your servant David, my father; with your mouth you said it and with your hand you have made it come true this day.

16. నీవు నాముందర నడచి నట్లుగా నీ కుమారులును తమ ప్రవర్తన కాపాడుకొని, నా ధర్మశాస్త్రముచొప్పున నడచినయెడల ఇశ్రాయేలీ యుల సింహాసనముమీద కూర్చుండువాడు నా యెదుట నీకుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చినమాట, ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నెరవేర్చుము.

16. So now, O Lord, the God of Israel, let your word to your servant David, my father, come true, when you said, You will never be without a man to take his place before me on the seat of the kingdom of Israel; if only your children give attention to their ways, walking in my law, as you have done before me.

17. ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవును గాక.

17. So now, O Lord, the God of Israel, make your word come true which you said to your servant David.

18. మనుష్యులతో కలిసి దేవుడు భూమియందు నివాసము చేయునా? ఆకాశ మును మహాకాశమును నిన్ను పట్టచాలవే; నేను కట్టిన యీ మందిరము నిన్ను పట్టునా?
అపో. కార్యములు 17:24, ప్రకటన గ్రంథం 21:3

18. But is it truly possible that God may be housed with men on earth? see, heaven and the heaven of heavens are not wide enough to be your resting-place: how much less this house which I have made:

19. దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థనయందును విన్న పమునందును లక్ష్యముంచి, నీ సేవకుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొఱ్ఱను ఆలకించుము.

19. Still, let your heart be turned to the prayer of your servant and to his prayer for grace, O Lord my God, and give ear to the cry and the prayer which your servant makes before you;

20. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకైనా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న యీ మందిరముమీద నీ కనుదృష్టి రాత్రిం బగళ్లు నిలుచునుగాక.

20. That your eyes may be open to this house day and night, to this place of which you have said that you would put your name there; to give ear to the prayer which your servant may make, turning to this place.

21. నీ సేవకుడును నీ జనులైన ఇశ్రా యేలీయులును ఈ స్థలముతట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలను నీవు ఆలకించుము, ఆకాశముననున్న నీ నివాసస్థలమందు ఆలకించుము, ఆలకించునప్పుడు క్షమించుము.

21. And give ear to the prayers of your servant and of your people Israel, when they make their prayers, turning to this place; give ear from heaven your living-place; and hearing have mercy.

22. ఎవడైనను తన పొరుగువానియెడల తప్పుచేసినప్పుడు అతని చేత ప్రమాణము చేయించుటకై అతనిమీద ఒట్టు పెట్టబడి ఆ ఒట్టు ఈ మందిరమందుండు నీ బలిపీఠము ఎదుటికి వచ్చినప్పుడు

22. If a man does wrong to his neighbour and has to take an oath, and comes before your altar to take his oath in this house:

23. నీవు ఆకాశమందు విని, నీ దాసులకు న్యాయముతీర్చి, హాని చేసినవాని తలమీదికి శిక్ష రప్పించి, నీతిపరుని నీతిచొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము.

23. Then let your ear be open in heaven, and be the judge of your servants, giving punishment to the wrongdoer, so that his sin may come on his head; and, by your decision, keeping from evil him who has done no wrong.

24. నీజనులైన ఇశ్రాయేలీయులు నీ దృష్టియెదుట పాపము చేసినవారై తమ శత్రువుల బలమునకు నిలువలేక పడిపోయినప్పుడు, వారు నీయొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పు కొని, యీ మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసినయెడల

24. And if your people Israel are overcome in war, because of their sin against you; if they are turned to you again, honouring your name, making prayers and requesting your grace in this house:

25. ఆకాశమందు నీవు విని, నీ జనులైన ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి, వారికిని వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరల రప్పించుదువుగాక.

25. Then give ear from heaven, and let the sin of your people Israel have forgiveness, and take them back again to the land which you gave to them and to their fathers.

26. వారు నీ దృష్టియెదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియ కున్నప్పుడు, వారు ఈ స్థలముతట్టు తిరిగి ప్రార్థనచేసి నీ నామమును ఒప్పుకొని, నీవు వారిని శ్రమపెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచి పెట్టి తిరిగినయెడల

26. When heaven is shut up and there is no rain, because of their sin against you: if they make prayers with their faces turned to this place, honouring your name and turning away from their sin when you send trouble on them:

27. ఆకాశ మందున్న నీవు ఆలకించి, నీ సేవకులును నీ జనులునగు ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి, వారు నడువవలసిన మంచిమార్గము వారికి బోధించి, నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయ చేయుదువుగాక.

27. Then give ear from heaven, so that the sin of your servants and the sin of your people Israel may have forgiveness, when you make clear to them the good way in which they are to go; and send rain on your land which you have given to your people for their heritage.

28. దేశమునందు కరవుగాని తెగులుగాని కనబడినప్పుడైనను, గాడ్పు దెబ్బగాని చిత్తపట్టుటగాని తగిలినప్పుడైనను, మిడతలుగాని చీడపురుగులుగాని దండు దిగినప్పుడైనను, వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడైనను, ఏ బాధగాని యే రోగముగాని వచ్చినప్పుడైనను

28. If there is no food in the land, if there is disease, if the fruits of the earth are damaged by heat or water, locust or worm; if their towns are shut in by their attackers: whatever trouble or whatever disease there may be:

29. ఎవడైనను ఇశ్రా యేలీయులగు నీ జనులందరు కలిసియైనను, నొప్పిగాని కష్టముగాని అనుభవించుచు, ఈ మందిరముతట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నియు ప్రార్థనలన్నియు నీ నివాసస్థలమైన ఆకాశమునుండి నీవు ఆలకించి క్షమించి

29. Whatever prayer or request for your grace is made by any man, or by all your people Israel, whatever his trouble may be, whose hands are stretched out to this house:

30. నీవు మా పితరులకిచ్చిన దేశమందు వారు తమ జీవితకాల మంతయు నీయందు భయభక్తులు కలిగి

30. Then give ear from heaven your living-place, answering with forgiveness, and give to every man, whose secret heart is open to you, the reward of all his ways; (for you, and you only, have knowledge of the hearts of the children of men;)

31. నీ మార్గములలో నడుచునట్లుగా వారి వారి హృదయములను ఎరిగియున్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయ చేయుదువు గాక. నీవు ఒక్కడవే మానవుల హృదయము నెరిగిన వాడవు గదా.

31. So that they may give you worship, walking in your ways, as long as they are living in the land which you gave to our fathers.

32. మరియు నీ జనులైన ఇశ్రా యేలీయుల సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమును గూర్చియు, నీ బాహుబలమును గూర్చియు, చాచిన చేతులను గూర్చియు వినినవారై, దూరదేశమునుండి వచ్చి ఈ మందిరముతట్టు తిరిగి విన్నపము చేసినపుడు

32. And as for the man from a strange land, who is not of your people Israel but comes from a far country because of the glory of your name and your strong hand and your outstretched arm; when he comes to make his prayer, turning to this house:

33. నీ నివాసస్థలమగు ఆకాశమునుండి నీవు వారి ప్రార్థన నంగీకరించి, నీ జనులగు ఇశ్రాయేలీయులు తెలిసికొనినట్లు భూజనులందరును నీ నామమును తెలిసికొని, నీయందుభయభక్తులు కలిగి, నేను కట్టిన యీ మందిరమునకు నీ పేరు పెట్టబడెనని గ్రహించునట్లుగా ఆ యన్యులు నీకు మొఱ్ఱపెట్టిన దానిని నీవు దయచేయుదువు గాక.

33. Then give ear from heaven your living-place, and give him his desire, whatever it may be; so that all the peoples of the earth may have knowledge of your name, worshipping you as do your people Israel, and may see that this house which I have made is truly named by your name.

34. నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై బయలుదేర నుద్దేశించి, నీవు కోరుకొనిన యీ పట్టణము తట్టును నీ నామమునకు నేను కట్టించిన యీ మందిరముతట్టు తిరిగి విన్నపము చేసిన యెడల

34. If your people go out to war against their attackers, by whatever way you may send them, if they make their prayers to you turning their faces to this town of yours and to this house which I have put up for your name:

35. ఆకాశమునుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించుదువుగాక.

35. Then give ear from heaven to their prayer and their cry for grace, and see right done to them.

36. పాపము చేయనివాడెవడును లేడు గనుక వారు నీ దృష్టి యెదుట పాపము చేసినప్పుడు నీవు వారిమీద ఆగ్ర హించి, శత్రువుల చేతికి వారిని అప్పగింపగా, చెరపట్టు వారు వారిని దూరమైనట్టి గాని సమీపమైనట్టి గాని తమ దేశములకు పట్టుకొనిపోగా

36. If they do wrong against you, (for no man is without sin,) and you are angry with them, and give them up into the power of those who are fighting against them, so that they take them away prisoners to a land far off or near;

37. వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనస్సు త్రిప్పు కొనిమేము పాపముచేసితివిు, దోషులమైతివిు, భక్తిహీనముగా నడచితివిు అని ఒప్పుకొని

37. And if they take thought, in the land where they are prisoners, turning again to you, crying out in prayer to you in that land, and saying, We are sinners, we have done wrong, we have done evil;

38. తాము చెరలోనున్న దేశమందు పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను నీయొద్దకు మళ్లుకొని, తమ పితరులకు నీవిచ్చిన తమ దేశముమీదికిని, నీవు కోరుకొనిన యీ పట్టణముమీదికిని, నీ నామఘనతకొరకు నేను కట్టించిన యీ మందిరముమీదికిని మనస్సు త్రిప్పి విన్నపము చేసినయెడల

38. If with all their heart and soul they are turned again to you, in the land where they are prisoners, the land where they have been taken, and make their prayers, turning their eyes to their land which you gave to their fathers, and to the town which you took for yourself, and the house which I have made for your name:

39. నీ నివాసస్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి, నీ దృష్టియెదుట పాపముచేసిన నీ జనులను క్షమించుదువుగాక.

39. Then give ear from heaven your living-place to their prayer and their cry, and see right done to them, answering with forgiveness your people who have done wrong against you.

40. నా దేవా, యీ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి యుంచు దువుగాక, నీ చెవులు దానిని ఆలకించునుగాక.

40. Now, O my God, may your eyes be open and your ears awake to the prayers made in this place.

41. నా దేవా, యెహోవా, బలమున కాధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము; నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము; దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించు కొందురుగాక; నీ భక్తులు నీ మేలునుబట్టి సంతోషింతురు గాక.

41. Up! now, O Lord God, come back to your resting-place, you and the ark of your strength: let your priests, O Lord God, be clothed with salvation, and let your saints be glad in what is good.

42. దేవా యెహోవా, నీవు నీచేత అభిషేకము నొందిన వానికి పరాజ్ముఖుడవై యుండకుము, నీవు నీ భక్తు డైన దావీదునకు వాగ్దానముచేసిన కృపలను జ్ఞాపకము చేసికొనుము.

42. O Lord God, let him whom you have taken for yourself never be given up by you: keep in mind your mercies to David your servant.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Chronicles II - 2 దినవృత్తాంతములు 6 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఆలయ సమర్పణలో సోలమన్ ప్రార్థన.

సోలమన్ ప్రార్థన యొక్క నిర్దేశిత క్రమానికి కట్టుబడి ఉండాలి. మొట్టమొదట మరియు అన్నిటికంటే, అతను పశ్చాత్తాపం మరియు క్షమాపణ కోసం వేడుకుంటున్నాడు, ఇది ప్రాథమిక ఆశీర్వాదం మరియు ఇతర ఉపకారాలకు స్థిరమైన మూలస్తంభం. తదనంతరం, అతను తాత్కాలిక సహాయాల కోసం వేడుకుంటున్నాడు, తద్వారా మన ప్రార్థనలలో అత్యంత ముఖ్యమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడంలో మరియు వాటిని కోరుకోవడంలో మనకు మార్గనిర్దేశం చేస్తాడు. ఈ సూత్రం క్రీస్తు తన దోషరహిత నమూనా మరియు ప్రార్థన యొక్క నిర్మాణంలో కూడా ఉదహరించబడింది, ఇక్కడ ఒక ప్రార్థన మాత్రమే బాహ్య విషయాలకు సంబంధించినది, మిగిలినది ఆధ్యాత్మిక ఆశీర్వాదాల చుట్టూ కేంద్రంగా ఉంటుంది.
ఈ ఆలయం క్రీస్తు యొక్క మానవ కోణాన్ని సూచిస్తుంది, అతనిలో దైవిక సారాంశం మొత్తం శారీరకంగా వ్యక్తమవుతుంది. మందసము అతని విధేయత మరియు పరీక్షలను సూచిస్తుంది, దీని ద్వారా పశ్చాత్తాపపడిన అతిక్రమణదారులు రాజీపడిన దేవునికి మరియు అతనితో సహవాసానికి ప్రాప్తిని పొందుతారు. ఇమ్మాన్యుయేల్ అనే వ్యక్తి ద్వారా యెహోవా మన మానవ స్వభావాన్ని శాశ్వతంగా తన నివాసంగా ఎంచుకున్నాడు మరియు ఈ విధంగా, అతను విమోచించబడిన పాపుల తన సంఘంలో నివసించి ఆనందాన్ని పొందుతాడు.
మన హృదయాలు ఆయన నివాస స్థలంగా రూపాంతరం చెందుతాయి; క్రీస్తు విశ్వాసం ద్వారా వారిలో నివసించి, వాటిని తన పవిత్ర స్థలాలుగా పరిశుద్ధపరచి, అందులో తన ప్రేమను పంచుతాడు. తండ్రి తన అభిషిక్తుని లోపల మరియు అతని ద్వారా మనలను పరిగణిస్తారు; మరియు క్రీస్తులో మరియు క్రీస్తు ద్వారా సాధించబడిన పాపుల పట్ల ఆయనకున్న కనికరానికి అనుగుణంగా ఆయన అన్ని విషయాలలో మనల్ని గుర్తుంచుకుని, అనుగ్రహిస్తాడు.



Shortcut Links
2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |