Chronicles II - 2 దినవృత్తాంతములు 4 | View All

1. అతడు ఇరువది మూరలు పొడవును ఇరువది మూరలు వెడల్పును పది మూరలు ఎత్తునుగల యొక యిత్తడి బలిపీఠ మును చేయించెను.

1. He made a brasen altare also, twentye cubytes longe, and twentye cubytes brode, and ten cubites hye.

2. పోతపోసిన సముద్రపు తొట్టియొకటి చేయించెను, అది యీ యంచుకు ఆ యంచుకు పది మూరల యెడము గలది; దానియెత్తు అయిదు మూరలు, దాని కైవారము ముప్పదిమూరలు,

2. And he made a molten lauer ten cubites wyde fro the one syde to the other rounde aboute, and fyue cubytes hye. And a metelyne of thirtie cubites mighte comprehende it aboute.

3. దాని క్రిందితట్టున ఎద్దులు రూపింపబడియుండెను, అవి ఒక్కొక్క మూరకు పదేసియుండెను, అవి ఆ సముద్రపు తొట్టిని ఆవరించెను; ఎద్దులు రెండు వరుసలు తీరి యుండెను, అవి తొట్టితోకూడనే పోతపోయబడెను.

3. And ymages of Bullockes were vnder it. And aboute the lauer (which was ten cubites wyde) there were two rowes of knoppes, yt were molten withall.

4. అది పండ్రెండు ఎద్దులమీద నిలువబడెను, మూడు ఎద్దులు ఉత్తరపుతట్టు మూడు పడమటితట్టు మూడు దక్షిణపుతట్టు మూడు తూర్పుతట్టు చూచుచుండెను. సముద్రపు తొట్టి వాటిపై నుంచ బడెను, వాటి వెనుకటి పార్శ్వములన్నియు లోపలికి తిరిగి యుండెను.

4. It stode so vpon the bullockes, that thre were turned towarde the north, thre towarde the west, thre towarde the south, and thre towarde the east, and the lauer aboue vpon them, and all their hynder partes were on the ynsyde.

5. అది బెత్తెడు దళముగలది, దాని అంచు గిన్నెయంచువంటిదై తామర పుష్పములు తేల్చబడియుండెను; అది ముప్పది పుట్ల నీళ్లు పట్టును.

5. The thicknesse of it was an handbredth, and the edge of it was like the edge of a cuppe, and as a floured rose. And it conteyned thre thousande Batthes.

6. మరియు దహనబలులుగా అర్పించువాటిని కడుగుటకై కుడి తట్టుకు అయిదును ఎడమ తట్టుకు అయిదును పది స్నానపు గంగాళములను చేయించెను; సముద్రమువంటి తొట్టియందు యాజకులు మాత్రము స్నానము చేయుదురు.

6. And he made ten kettels, wherof he set fyue on the righte hande and fyue on the lefte, to wa?she in them soch thinges as belonged to the burntofferynge, that they mighte thrust them therin: but ye lauer (made he) for for the prestes to wash in.

7. మరియు వాటిని గూర్చిన విధి ననుసరించి పది బంగారపు దీపస్తంభములను చేయించి, దేవాలయమందు కుడి తట్టున అయిదును ఎడమ తట్టున అయిదును ఉంచెను.

7. Ten golden candelstickes made he also as they ought to be, and set them in the temple: fyue on the righte hande, and fyue on the lefte.

8. పది బల్లలను చేయించి దేవాలయమందు కుడి తట్టున అయిదును ఎడమ తట్టున అయిదును ఉంచెను; నూరు బంగారపు తొట్లను చేయించెను.

8. And made ten tables, and set them in the temple: fyue on the righte hande, and fyue on the lefte. And made an hundreth basens of golde.

9. అతడు యాజకుల ఆవరణమును పెద్ద ఆవరణమును దీనికి వాకిండ్లను చేయించి దీని తలుపులను ఇత్తడితో పొదిగించెను.

9. He made a courte likewyse for the prestes, and a greate courte, and dores in the courte, and ouerlayed ye dores with brasse.

10. సముద్రపు తొట్టిని తూర్పుతట్టున కుడిపార్శ్వమందు దక్షిణ ముఖముగా ఉంచెను.

10. And the lauer set he on the righte syde towarde the south east.

11. హూరాము పాత్రలను బూడిదె నెత్తు చిప్పకోలలను తొట్లను చేసెను; రాజైన సొలొమోను ఆజ్ఞప్రకారము దేవుని మందిరమునకు చేయ వలసిన పనియంతయు హూరాము సమాప్తిచేసెను.

11. And Hiram made cauldrous, shouels and basens. So Hiram fynished the worke which he made for kynge Salomon in the house of God:

12. దాని వివరమేమనగా, రెండు స్తంభములు, వాటి పళ్లెములు, వాటి పైభాగమునకు చేసిన పీటలు, వీటి పళ్లెములు, ఆ స్తంభముల శీర్షముల రెండు పళ్లెములను కప్పుట కైన రెండు అల్లికలు,

12. namely the two pilers with the roundels and knoppes aboue vpon both the pilers, and both the wrythen ropes to couer both the roundels of ye knoppes aboue vpo the pilers,

13. ఆ స్తంభముల శీర్షముల రెండు పళ్లెములను కప్పునట్టి అల్లిక, అల్లికకు రెండేసి వరుసలుగా చేయబడిన నాలుగు వందల దానిమ్మపండ్లు.

13. and the foure hundreth pomgranates on both the wrythe ropes, two rowes of pomgranates on euery rope, to couer the roundels of the knoppes that were aboue vpon the pilers.

14. మట్లు, మట్లమీదనుండు తొట్లు,

14. He made the stoles also and ye kettels vpon the stoles,

15. సముద్రపుతొట్టి దాని క్రిందనుండు పండ్రెండు ఎద్దులు,

15. and a lauer, and twolue bullockes there vnder.

16. పాత్రలు, బూడిదె నెత్తు చిప్పకోలలు, ముండ్ల కొంకులు మొదలైన ఉపకరణ ములు. వీటిని హూరాము రాజైన సొలొమోను ఆజ్ఞప్రకారము యెహోవా మందిరముకొరకు మంచి వన్నెగల యిత్తడితో చేసెను.

16. And pottes, shouels, fleshokes, and all their vessels made Hiram Abif of pure metall for kynge Salomon vnto the house of the LORDE.

17. యొర్దాను మైదానమందు సుక్కో తునకును జెరేదాతాకును మధ్యను జిగటమంటి భూమియందు రాజు వాటిని పోత పోయించెను.

17. In the coaste of Iordane dyd the kynge cause them to be molten in thicke earth betwene Suchoth and Zaredatha.

18. ఎత్తు చూడ లేనంత యిత్తడి తన యొద్ద నుండగా సొలొమోను ఈ ఉపకరణములన్నిటిని బహు విస్తారముగా చేయించెను.

18. And Salomon made all these vessels which were so many, that the weight of ye metall was not to be soughte out.

19. దేవుని మందిరమునకు కావలసిన ఉపకరణములన్నిటిని బంగారపు పీఠమును సన్నిధి రొట్టెలు ఉంచు బల్లలను,

19. And Salomen made all the ornamentes for the house of God: namely, the golden altare, the tables and the shewbreds theron,

20. వాటినిగూర్చిన విధిప్రకారము గర్భాలయము ఎదుట వెలుగుచుండుటకై ప్రశస్తమైన బంగారపు దీపస్తంభములను,

20. the candelstickes with their lampes of pure golde, to burne before the Quere acordinge to the maner:

21. పుష్పములను ప్రమిదెలను కత్తెరలను కారులను తొట్లను గిన్నెలను ధూపకలశములను సొలొమోను మేలిమి బంగారముతో చేయించెను.

21. and the floures and the lampes and the snoffers were of golde, all these were of pure golde.

22. మరియు మందిరద్వారము లోపలి తలుపులును అతి పరిశుద్ధ స్థలముయొక్క లోపలి తలుపులును దేవాలయపు తలుపులును అన్నియు బంగార ముతో చేయబడెను.

22. And the knyues, basens, spones and pottes, were of pure golde. And the intraunce and his dores within vnto the Most holy, and the dores of the house of the temple were of golde.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Chronicles II - 2 దినవృత్తాంతములు 4 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఆలయంలోని గృహోపకరణాలు

దేవుని గర్భాలయంలోని గృహోపకరణాల గురించి ఇక్కడ మరింత వివరణ ఉంది. దాని తలుపుల లోపల మరియు వెలుపల, ఈ అలంకరణలు సువార్త యొక్క దయను సూచిస్తాయి మరియు భవిష్యత్ ఆశీర్వాదాలను సూచిస్తాయి, ఇవన్నీ క్రీస్తులో వాటి నెరవేర్పును కనుగొంటాయి. ముఖ్యంగా, ఇత్తడి బలిపీఠం, బుక్ ఆఫ్ కింగ్స్‌లో వివరించబడనప్పటికీ, ప్రధాన పాత్ర పోషించింది. ఇక్కడ, అన్ని బలులు సమర్పించారు, నైవేద్యాలను ప్రతిష్టించారు. ప్రాంగణంలో గుమిగూడిన వారు అగ్ని ద్వారా త్యాగం చేయడాన్ని వీక్షించగలరు, నిర్ణీత సమయంలో వచ్చే అంతిమ త్యాగం గురించి ఆలోచించవచ్చు - ఇది పాపాలను శుభ్రపరుస్తుంది మరియు మరణాన్ని నిర్మూలిస్తుంది, ఇది జంతువుల రక్తానికి అసాధ్యం. ఈ అర్పణల నుండి పెరుగుతున్న పొగ వారి హృదయాలను స్వర్గానికి అధిరోహించటానికి ప్రేరేపించగలదు, దేవుడు మరియు ఆయన అనుగ్రహం కోసం లోతైన కోరికలను పెంపొందించగలదు. మన భక్తి క్రియల అంతటా, మన ఆధ్యాత్మిక దృష్టిని క్రీస్తుపై స్థిరంగా ఉంచాలి. ఆలయ సామాగ్రిని గుడారంలోని వస్తువులతో పోల్చడం, తన చర్చిని విస్తరించాలని మరియు తన ఆరాధకులను గుణించాలనే దేవుని ఉద్దేశాన్ని వెల్లడి చేసింది. దేవునికి స్తుతి, ఎందుకంటే క్రీస్తులో, అందరికీ సమృద్ధిగా ఉంది.


Shortcut Links
2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |