Chronicles I - 1 దినవృత్తాంతములు 18 | View All

1. వారిని లోపరచి, గాతు పట్టణమును దాని గ్రామములును ఫిలిష్తీయుల వశమున నుండకుండ వాటిని పట్టుకొనెను.

1. vaarini loparachi, gaathu pattanamunu daani graamamulunu philishtheeyula vashamuna nundakunda vaatini pattukonenu.

2. అతడు మోయాబీయులను జయించగా వారు దావీదునకు కప్పముకట్టు దాసులైరి.

2. athadu moyaabeeyulanu jayinchagaa vaaru daaveedunaku kappamukattu daasulairi.

3. సోబా రాజైన హదరెజెరు యూఫ్రటీసునదివరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హమాతునొద్ద దావీదు అతనిని ఓడించి

3. sobaa raajaina hadarejeru yoophrateesunadhivaraku thana raajyamunu vyaapinchutakai bayaludheragaa hamaathunoddha daaveedu athanini odinchi

4. అతని యొద్దనుండి వెయ్యి రథములను ఏడువేల గుఱ్ఱపు రౌతులను ఇరువదివేల కాల్బలమును పట్టుకొనెను. దావీదు ఆ రథములలో నూరింటికి కావలసిన గుఱ్ఱములను ఉంచుకొని కడమవాటికన్నిటికి చీలమండ నరములు తెగవేయించెను.

4. athani yoddhanundi veyyi rathamulanu eduvela gurrapu rauthulanu iruvadhivela kaalbalamunu pattukonenu. daaveedu aa rathamulalo noorintiki kaavalasina gurramulanu unchukoni kadamavaatikannitiki chilamanda naramulu tegaveyinchenu.

5. సోబారాజైన హదరెజెరునకు సహాయము చేయవలెనని దమస్కులోని సిరియనులు రాగా దావీదుసిరి యనులలో ఇరువదిరెండు వేలమందిని హతముచేసెను.

5. sobaaraajaina hadarejerunaku sahaayamu cheyavalenani damaskuloni siriyanulu raagaa daaveedu aa siri yanulalo iruvadhirendu velamandhini hathamuchesenu.

6. తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను; సిరియనులు దావీదునకు కప్పముకట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్లనెల్ల యెహోవా అతనికి సహాయముచేయుచు వచ్చెను.

6. tharuvaatha daaveedu siriyaa sambandhamaina damaskulo kaavali sainyamunu unchenu; siriyanulu daaveedunaku kappamukattu sevakulairi. ee prakaaramu daaveedu poyina chootlanella yehovaa athaniki sahaayamucheyuchu vacchenu.

7. మరియు హదరెజెరు సేవకులు పట్టుకొనియున్న బంగారు డాళ్లను దావీదు తీసికొని యెరూషలేమునకు చేర్చెను.

7. mariyu hadarejeru sevakulu pattukoniyunna bangaaru daallanu daaveedu theesikoni yerooshalemunaku cherchenu.

8. హదరెజెరుయొక్క పట్టణములైన టిబ్హతులో నుండియు, కూనులోనుండియు దావీదు బహు విస్తారమైన యిత్తడిని తీసికొని వచ్చెను. దానితో సొలొమోను ఇత్తడి సముద్రమును స్తంభములును ఇత్తడి వస్తువులను చేయించెను.

8. hadarejeruyokka pattanamulaina tib'hathulo nundiyu, koonulonundiyu daaveedu bahu visthaaramaina yitthadini theesikoni vacchenu. daanithoo solomonu itthadi samudramunu sthambhamulunu itthadi vasthuvulanu cheyinchenu.

9. దావీదు సోబారాజైన హదరెజెరుయొక్క సైన్య మంతటిని ఓడించిన వర్తమానము హమాతురాజైనతోహూకు వినబడెను.

9. daaveedu sobaaraajaina hadarejeruyokka sainya manthatini odinchina varthamaanamu hamaathuraajainathoohooku vinabadenu.

10. హదరెజెరునకును తోహూకును విరోధము కలిగియుండెను గనుక రాజైన దావీదు హదరెజెరుతో యుద్ధముచేసి అతని నోడించినందుకై దావీదుయొక్క క్షేమము తెలిసికొనుటకును, అతనితో శుభవచనములుపలుకుటకును, బంగారముతోను వెండితోను ఇత్తడితోను చేయబడిన సకల విధములైన పాత్రలనిచ్చి, తోహూ తన కుమారుడైన హదోరమును అతనియొద్దకు పంపెను.

10. hadarejerunakunu thoohookunu virodhamu kaligiyundenu ganuka raajaina daaveedu hadarejeruthoo yuddhamuchesi athani nodinchinandukai daaveeduyokka kshemamu telisikonutakunu, athanithoo shubhavachanamulupalukutakunu, bangaaramuthoonu vendithoonu itthadithoonu cheyabadina sakala vidhamulaina paatralanichi, thoohoo thana kumaarudaina hadoramunu athaniyoddhaku pampenu.

11. ఈ వస్తువులను కూడ రాజైన దావీదు తాను ఎదో మీయులయొద్దనుండియు, మోయాబీయులయొద్ద నుండియు, అమ్మోనీయులయొద్ద నుండియు, ఫిలిష్తీయుల యొద్దనుండియు, అమాలేకీయులయొద్ద నుండియు తీసికొనిన వెండి బంగారములతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించెను.

11. ee vasthuvulanu kooda raajaina daaveedu thaanu edo meeyulayoddhanundiyu, moyaabeeyulayoddha nundiyu, ammoneeyulayoddha nundiyu, philishtheeyula yoddhanundiyu, amaalekeeyulayoddha nundiyu theesikonina vendi bangaaramulathoo paatugaa yehovaaku prathishthinchenu.

12. మరియసెరూయా కుమారుడైన అబీషై ఉప్పులోయలో ఎదోమీయులలో పదునెనిమిది వేల మందిని హతము చేసెను.

12. mariyu serooyaa kumaarudaina abeeshai uppuloyalo edomeeyulalo padunenimidi vela mandhini hathamu chesenu.

13. దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచెను, ఎదోమీయులందరును అతనికి సేవకు లైరి, దావీదు పోయిన చోట్లనెల్ల యెహోవా అతని రక్షించెను.

13. daaveedu edomulo kaavali sainyamunu unchenu, edomeeyulandarunu athaniki sevaku lairi, daaveedu poyina chootlanella yehovaa athani rakshinchenu.

14. ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలీయులందరిమీదను రాజైయుండి తన జనులందరికిని నీతిన్యాయములను జరిగిం చెను.

14. ee prakaaramu daaveedu ishraayeleeyulandarimeedanu raajaiyundi thana janulandarikini neethinyaayamulanu jarigiṁ chenu.

15. సెరూయా కుమారుడైన యోవాబు సైన్యాధిపతియై యుండెను; అహీలూదు కుమారుడైన యెహోషా పాతు రాజ్యపు దస్తావేజుల మీద నుండెను;

15. serooyaa kumaarudaina yovaabu sainyaadhipathiyai yundenu; aheeloodu kumaarudaina yehoshaa paathu raajyapu dasthaavejula meeda nundenu;

16. అహీటూబు కుమారుడైన సాదోకును అబ్యాతారు కుమారుడైన అబీమెలెకును యాజకులు, షవ్షా శాస్త్రి;

16. aheetoobu kumaarudaina saadokunu abyaathaaru kumaarudaina abeemelekunu yaajakulu, shavshaa shaastri;

17. యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతియై యుండెను; మరియదావీదుయొక్క కుమారులు రాజునకు సహాయులై యుండిరి.

17. yehoyaadaa kumaarudaina benaayaa keretheeyulakunu peletheeyulakunu adhipathiyai yundenu; mariyu daaveeduyokka kumaarulu raajunaku sahaayulai yundiri.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Chronicles I - 1 దినవృత్తాంతములు 18 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

డేవిడ్ యొక్క విజయాలు.

ఈ విభాగం స్క్రిప్చర్స్‌లోని 2 సమూయేలు 8కి అనుగుణంగా ఉంటుంది. మన విమోచన నాయకుడిచే మార్గనిర్దేశం చేయబడిన మన దృఢమైన విశ్వాస పోరాటం శాశ్వతమైన విజయం మరియు ప్రశాంతతతో ముగుస్తుంది. ఇజ్రాయెల్ యొక్క సంతృప్తి, డేవిడ్ యొక్క విజయాలు మరియు ధర్మబద్ధమైన పాలన ద్వారా చిత్రీకరించబడినట్లుగా, ఖగోళ డొమైన్‌లలో విమోచించబడిన వారి కోసం ఎదురుచూస్తున్న ఆనందం యొక్క సంగ్రహావలోకనం అందిస్తుంది.



Shortcut Links
1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |