Chronicles I - 1 దినవృత్తాంతములు 16 | View All

1. ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసికొని వచ్చి, దావీదు దానికొరకు వేయించియున్న గుడారము నడుమను దాని ఉంచి, దేవుని సన్నిధిని దహనబలులను సమాధానబలులను అర్పించిరి.

1. And they brought in the ark of God, and set it in the midst of the tent that David had pitched for it. And they offered burnt-offerings and peace-offerings before God.

2. దహనబలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తరువాత అతడు యెహోవా నామమున జనులను దీవించి

2. And when David had made an end of offering the burnt-offering and the peace-offerings, he blessed the people in the name of LORD.

3. పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీయులందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను ఒక భక్ష్యమును ఒక ద్రాక్షపండ్ల అడను పంచి పెట్టెను.

3. And he dealt to every one of Israel, both man and woman, to every one a loaf of bread, and a portion of flesh, and a cake of raisins.

4. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును, వందించుటకును ఆయ నకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను.

4. And he appointed certain of the Levites to minister before the ark of LORD, and to celebrate and to thank and praise LORD, the God of Israel:

5. వారిలో ఆసాపు అధిపతి, జెకర్యా అతని తరువాతివాడు, యెమీయేలు షెమరామోతు యెహీయేలు మత్తిత్యా ఏలీయాబు బెనాయా ఓబేదెదోము యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడిరి, ఆసాపు తాళములను వాయించువాడు.

5. Asaph the chief, and second to him Zechariah, Jeiel, and Shemiramoth, and Jehiel, and Mattithiah, and Eliab, and Benaiah, and Obed-edom, and Jeiel, with psalteries and with harps, and Asaph with cymbals, sounding aloud,

6. బెనాయా యహజీయేలు అను యాజ కులు ఎప్పుడును దేవుని నిబంధన మందసము ఎదుట బూరలు ఊదువారు.

6. and Benaiah and Jahaziel the priests with trumpets continually, before the ark of the covenant of God.

7. ఆ దినమందు యెహోవాను స్తుతిచేయు విచారణను ఏర్పరచి, దావీదు ఆసాపుచేతికిని వాని బంధువులచేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా

7. Then on that day David first ordained to give thanks to LORD by the hand of Asaph and his brothers.

8. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామమును ప్రకటనచేయుడిఆయన కార్యములను జనములలో తెలియజేయుడి.

8. O give thanks to LORD. Call upon his name. Make known his doings among the peoples.

9. ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడిఆయన అద్భుత క్రియలన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి.

9. Sing to him. Sing praises to him. Talk ye of all his marvelous works.

10. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి యెహోవాను వెదకువారు హృదయమునందు సంతో షించుదురు గాక.

10. Glory ye in his holy name. Let the heart of those who seek LORD rejoice.

11. యెహోవాను ఆశ్రయించుడి ఆయన బలము నాశ్రయించుడిఆయన సన్నిధి నిత్యము వెదకుడి.

11. Seek ye LORD and his strength. Seek his face evermore.

12. ఆయన దాసులగు ఇశ్రాయేలు వంశస్థులారాఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా

12. Remember his marvelous works that he has done, his wonders, and the judgments of his mouth,

13. ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకము చేసి కొనుడిఆయన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసికొనుడి.

13. O ye seed of Israel his servant, ye sons of Jacob, his chosen ones.

14. ఆయన మన దేవుడైన యెహోవా ఆయన తీర్పులు భూమియందంతట జరుగుచున్నవి.

14. He is LORD our God. His judgments are in all the earth.

15. మీ సంఖ్య కొద్దిగాను మీరు స్వల్పసంఖ్యగల జనులుగానుకనాను దేశములో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దాని నీకిచ్చెదనని

15. Remember his covenant forever, the word which he commanded to a thousand generations,

16. ఆయన అబ్రాహాముతో చేసిన నిబంధనను

16. the covenant which he made with Abraham, and his oath to Isaac,

17. ఇస్సాకుతో చేసిన ప్రమాణమును ఏర్పాటును నిత్యము జ్ఞాపకముంచుకొనుడి.

17. and confirmed the same to Jacob for a statute, to Israel for an everlasting covenant,

18. వేయితరములవరకు ఆ మాట నిలుచునని ఆయన సెల విచ్చెను.

18. saying, To thee I will give the land of Canaan, the lot of your inheritance,

19. యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్యనిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరచియున్నాడు.

19. when ye were but a few men in number, yea, very few, and sojourners in it,

20. వారు జనమునుండి జనమునకును రాజ్యమునుండిరాజ్యమునకును తిరుగులాడుచుండగా

20. and they went about from nation to nation, and from one kingdom to another people.

21. నేను అభిషేకించినవారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడుచేయవద్దనియు సెలవిచ్చి

21. He allowed no man to do them wrong. Yea, he reproved kings for their sakes,

22. ఆయన ఎవరినైనను వారికి హింసచేయనియ్యలేదు వారి నిమిత్తము రాజులను గద్దించెను.

22. Saying, Touch not my anointed ones, and do my prophets no harm.

23. సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించుడి అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి.

23. Sing to LORD, all the earth. Show forth his salvation from day to day.

24. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములనుప్రచురించుడి.

24. Declare his glory among the nations, his marvelous works among all the peoples.

25. యెహోవా మహా ఘనత వహించినవాడు ఆయన బహుగా స్తుతినొంద తగినవాడు సమస్త దేవతలకంటె ఆయన పూజ్యుడు.

25. For great is LORD, and greatly to be praised. He also is to be feared above all gods.

26. జనముల దేవతలన్నియు వట్టి విగ్రహములే యెహోవా ఆకాశవైశాల్యమును సృజించినవాడు.

26. For all the gods of the peoples are idols. But LORD made the heavens.

27. ఘనతాప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయనయొద్ద ఉన్నవి.

27. Honor and majesty are before him. Strength and gladness are in his place.

28. జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి. మహిమాబలమును యెహోవాకు చెల్లించుడి.

28. Ascribe to LORD, ye kindred of the peoples. Ascribe to LORD glory and strength.

29. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి నైవేద్యములు చేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి పరిశుద్ధాలంకారములగు ఆభరణములను ధరించుకొని ఆయన యెదుట సాగిలపడుడి.

29. Ascribe to LORD the glory due to his name. Bring an offering, and come before him. Worship LORD in holy array.

30. భూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి అప్పుడు భూలోకము కదలకుండును అప్పుడది స్థిరపరచబడును.

30. Tremble before him, all the earth. The world also is established that it cannot be moved.

31. యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి. ఆకాశములు ఆనందించునుగాక భూమి సంతోషించునుగాక

31. Let the heavens be glad, and let the earth rejoice. And let them say among the nations, LORD reigns.

32. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక పొలములును వాటియందుండు సర్వమును సంతోషించునుగాక. యెహోవా వేంచేయుచున్నాడు.

32. Let the sea roar, and the fullness of it. Let the field exult, and all that is therein.

33. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సయించును.

33. Then shall the trees of the wood sing for joy before LORD, for he comes to judge the earth.

34. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి.

34. O give thanks to LORD, for he is good, for his loving kindness is forever.

35. దేవా మా రక్షకా, మమ్మును రక్షించుము మమ్మును చేర్చుకొనుము.
అపో. కార్యములు 26:17

35. And say ye, Save us, O God of our salvation. And gather us together and deliver us from the nations, to give thanks to thy holy name, and to triumph in thy praise.

36. మేము నీ పరిశుద్ధనామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు నిన్ను స్తుతించుచు అతిశయించునట్లు అన్యజనుల వశములోనుండి మమ్మును విడిపింపుము. అని ఆయనను బతిమాలుకొనుడి. ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తోత్రము నొందునుగాక. ఈలాగున వారు పాడగా జనులందరు ఆమేన్‌ అని చెప్పి యెహోవాను స్తుతించిరి.

36. Blessed be LORD, the God of Israel, from everlasting even to everlasting. And all the people said, Amen, and praised LORD.

37. అప్పుడు మందసము ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచ్చట యెహోవా నిబంధన మందసముమీద ఆసాపును అతని సహోదరులను నియమించెను. ఓబేదె దోమును వారి సహోదరులైన అరువది ఎనిమిది మందిని

37. So he left there, before the ark of the covenant of LORD, Asaph and his brothers, to minister before the ark continually, as every day's work required,

38. యెదూతూను కుమారుడైన ఓబేదెదోమును హోసాను ద్వారపాలకులుగా నియమించెను

38. and Obed-edom with their sixty-eight brothers. And Obed-edom the son of Jeduthun and Hosah were to be porters,

39. గిబియోనులోని ఉన్నతస్థలముననున్న యెహోవా గుడారముమీదను అచ్చటి బలిపీఠముమీదను యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడియున్న ప్రకారము

39. and Zadok the priest, and his brothers the priests, before the tabernacle of LORD in the high place that was at Gibeon,

40. ఉదయాస్తమయములయందు అనుదినమున నిత్యమైన దహనబలిని ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించెను.

40. to offer burnt-offerings to LORD upon the altar of burnt-offering continually morning and evening, even according to all that is written in the law of LORD, which he commanded to Israel.

41. యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతిచేయుటకై వీరితోకూడ హేమానును యెదూతూనును పేళ్లవరుసను ఉదాహరింపబడిన మరి కొందరిని నియమించెను.

41. And with them Heman and Jeduthun, and the rest that were chosen, who were mentioned by name, to give thanks to LORD because his loving kindness is forever.

42. బూరలు ఊదుటకును తాళములను వాయించుటకును దేవునిగూర్చి పాడతగిన గీతము లను వాద్యములతో వినిపించుటకును వీరిలోనుండు హేమానును యెదూతూనును అతడు నియమించెను. మరియయెదూతూను కుమారులను అతడు ద్వార పాలకులుగా నియమించెను.

42. And with them Heman and Jeduthun with trumpets and cymbals for those who should sound aloud, and with instruments for the songs of God, and the sons of Jeduthun to be at the gate.

43. తరువాత జనులందరును తమతమ యిండ్లకు వెళ్లిపోయిరి; దావీదును తన యింటి వారిని దీవించుటకై వారియొద్దకు పోయెను.

43. And all the people departed every man to his house. And David returned to bless his house.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Chronicles I - 1 దినవృత్తాంతములు 16 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

మందసము స్థిరపరచబడిన గంభీరత. (1-6) 
దేవుని బోధలు మరియు చట్టాలు తాత్కాలికంగా అస్పష్టంగా మరియు కప్పబడి ఉండవచ్చు, అవి చివరికి అస్పష్టత నుండి బయటపడతాయి మరియు ప్రకాశవంతంగా ప్రకాశిస్తాయి. ఇది సరళమైన మరియు నిరాడంబరమైన నివాసం అయినప్పటికీ, ఈ నిర్మాణం డేవిడ్ తన కీర్తనలలో తరచుగా ఆరాధించే గుడారంగా పనిచేసింది. డేవిడ్ తన ప్రజలకు తన ఉదారతను ప్రదర్శించాడు, అతను దేవుని నుండి పొందిన దయకు అద్దం పట్టాడు. ప్రగాఢమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించేవారు దానిని ఉదారంగా మరియు విశాల హృదయంతో వ్యక్తపరచాలి.

డేవిడ్ యొక్క స్తుతి కీర్తన. (7-36) 
మన స్తుతులు దేవుణ్ణి మహిమపరచడానికి ఉపయోగపడతాయి. మన మాటలు ఇతరులను ఉద్ధరించనివ్వండి మరియు ఇతరులను బోధించనివ్వండి, ఆయనకు తెలియని వారికి ఆయన ఉనికిని గౌరవించేలా మార్గనిర్దేశం చేయండి. మనము ఆనందించుము మరియు పరమాత్మయందు మన విశ్వాసమును ఉంచుదాము. దేవుని నామాన్ని గౌరవించే వారు దానిలో గర్వించడాన్ని సమర్థిస్తారు. శాశ్వతమైన ఒడంబడిక మన ఆనందానికి మూలంగా ఉండనివ్వండి మరియు పురాతన కాలం నాటి ఆయన ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఆయన రక్షణను, క్రీస్తు ద్వారా వాగ్దానం చేయబడిన రక్షణను నిరంతరం ప్రకటించండి. ఈ వేడుక రోజురోజుకు సమర్థించబడుతోంది, ఎందుకంటే మేము ప్రతిరోజూ దాని ప్రయోజనాలను పొందుతాము మరియు అంశం తరగనిది. మన స్తుతి గీతాల మధ్య, కష్టాలను ఎదుర్కొంటున్న దేవుని సేవకుల కోసం మధ్యవర్తిత్వం వహించే మన బాధ్యతను మనం విస్మరించకూడదు.

దేవుని ఆరాధనను క్రమబద్ధీకరించడం. (37-43)
దేవునిపై భక్తి ప్రతిరోజు నిబద్ధతగా ఉండాలి. డేవిడ్ దాని నిర్మాణాన్ని స్థాపించాడు. ఓడ ఉంచబడిన యెరూషలేములో, ఆసాపు మరియు అతని తోటి ఆరాధకులు ఓడ ముందు నిరంతర సేవ చేస్తూ, స్తుతిగీతాలను అర్పించారు. ఈ ప్రదేశంలో బలిపీఠాలు లేకపోవటం వలన బలులు లేదా ధూపం వేయబడలేదు. బదులుగా, డేవిడ్ ప్రార్థనలు సువాసన ధూపం లాగా పైకి లేచాయి మరియు అతని చేతులు ఎత్తడం సాయంత్రం బలిని పోలి ఉంటుంది. ఇది ఆచార ఆరాధన నుండి ఆధ్యాత్మిక ఆరాధనకు ప్రారంభ పరివర్తనను గుర్తించింది. ఏది ఏమైనప్పటికీ, ఆచార ఆరాధన, దైవిక మూలం కాబట్టి, విస్మరించరాదని గమనించడం చాలా ముఖ్యం. కాబట్టి, గిబియోను వద్ద, బలిపీఠాల వద్ద, యాజకులు తమ బలి మరియు ధూపం దహన విధులను కొనసాగించారు. మోషే ధర్మశాస్త్రం సూచించిన విధంగా వారు ఉదయం మరియు సాయంత్రం రెండు పూటలూ తప్పు లేకుండా చేసారు. ఈ వేడుకలు క్రీస్తు మధ్యవర్తిత్వానికి ప్రతీక కాబట్టి, వాటి ఆచారం గణనీయమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. దైవికంగా నియమించబడిన పరిచారకులు ఉండడం సముచితంగా ఉండటమే కాకుండా సంఘాన్ని ప్రోత్సహిస్తుంది.



Shortcut Links
1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |