Kings II - 2 రాజులు 8 | View All

1. ఒకనాడు ఎలీషా తాను బ్రదికించిన బిడ్డకు తల్లియైన ఆమెను పిలిచియెహోవా క్షామకాలము రప్పింప బోవు చున్నాడు; ఏడు సంవత్సరములు దేశ ములో క్షామము కలుగునని చెప్పినీవు లేచి, నీవును నీ యింటివారును ఎచ్చటనుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా

1. Eliseus spake vnto the woma, whose sonne he had restored vnto life againe, and sayde: Get the vp, & go with thine housholde, and be a straunger where thou canst: for the LORDE shall call for a derth, which shal come into the londe seuen yeare loge.

2. ఆ స్త్రీ లేచి దైవజనుని మాటచొప్పున చేసి, తన యింటివారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశమునకు పోయి యేడు సంవత్సరములు అక్కడ వాసముచేసెను.

2. The woman gat her vp, and dyd as the man of God sayde, & wente with hir housholde, and was a straunger in the londe of the Philistynes seuen yeare.

3. అయితే ఆ యేడు సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిష్తీ యుల దేశములోనుండి వచ్చి తన యింటిని గూర్చియు భూమిని గూర్చియు మనవి చేయుటకై రాజునొద్దకు పోయెను.

3. But whan the seuen yeares were ended, the woman came agayne out of the Philistynes lode, and wente forth to crye vpon the kynge for hir house and londe.

4. రాజు దైవజనుని పనివాడగు గేహజీతో మాట లాడిఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటిని నాకు తెలియజెప్పుమని ఆజ్ఞనిచ్చి యుండెను.

4. The kynge spake vnto Gehasi the seruaunt of the man of God, & sayde: Tell me all the greate actes that Eliseus hath done.

5. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రదికించిన బిడ్డ తల్లి తన యింటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవిచేయ వచ్చెను. అంతట గేహజీనా యేలినవాడవైన రాజా ఆ స్త్రీ యిదే; మరియఎలీషా తిరిగి బ్రదికించిన యీమెబిడ్డ వీడే అని చెప్పగా

5. And whyle he was tellynge the kynge how he had made one that was deed, to lyue agayne, beholde, the woman whose sonne he had caused to reuyue, came euen in the meane season, and cried vnto the kynge for hir house and londe. Then sayde Gehasi: My lorde O kynge, this same is the woma, and this is hir sonne, whom Eliseus restored vnto life agayne.

6. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి, ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటినుండి నేటివరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరల ఇమ్మని సెలవిచ్చెను.

6. And the kynge axed ye woman, and she tolde him. Then the kynge delyuered her a chamberlayne, & saide: Restore her agayne all that is hirs, and all the increase of the londe, sence the tyme that she lefte the londe vntyll now.

7. ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగియై యుండి, దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చియున్నాడని తెలిసికొని

7. And Eliseus came to Damascon, & Benadab the kynge of Syria laye sicke. And it was tolde him, and sayde: The man of God is come hither.

8. హజాయేలును పిలిచినీవు ఒక కానుకను చేత పట్టుకొని దైవజనుడైన అతనిని ఎదుర్కొన బోయిఈ రోగముపోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవాయొద్ద విచారణ చేయుమని ఆజ్ఞ ఇచ్చిపంపెను.

8. Then sayde the kynge vnto Hasael: Take giftes with the, & go mete the man of God, and axe councell at ye LORDE by him, and saye: Maye I recouer from this sicknesse?

9. కాబట్టి హజా యేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో నలువది ఒంటెల మోతంత కానుకగా తీసికొని అతనిని ఎదుర్కొన బోయి అతని ముందర నిలిచినీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదదునాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్నడుగుటకు నన్ను పంపెనని చెప్పెను.

9. Hasael wente for to mete him, and toke rewardes with him, and of all the goodes at Damasco, as moch as fortye Camels mighte beare. And whan he came, he stode before him, and sayde: Thy sonne Benadab the kynge of Syria hath sent me vnto the, sayenge: Maye I recouer from this siknes?

10. అప్పుడు ఎలీషానీవు అతని యొద్దకు పోయినిశ్చయముగా నీకు స్వస్థతకలుగవచ్చుననిచెప్పుము. అయినప్పటికిని అతనికి అవశ్యముగ మరణము సంభవించు నని యెహోవా నాకు తెలియజేసెనని పలికి

10. Eliseus sayde vnto him: Go yi waye and tell him: Thou shalt recouer. But the LORDE hath shewed me, yt he shal dye ye death.

11. హజాయేలు ముఖము చిన్నబోవునంతవరకు ఆ దైవజనుడు అతని తేరి చూచుచు కన్నీళ్లు రాల్చెను.

11. And the man of God loked earnestly, & made a troublous countenaunce, & wepte.

12. హజాయేలునా యేలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చెదవేమని అతని నడుగగా ఎలీషా యీలాగు ప్రత్యుత్తరమిచ్చెనుఇశ్రాయేలువారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు; వారి ¸యౌవనస్థు లను కత్తిచేత హతము చేయుదువు; వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు; వారి గర్భిణుల కడుపులను చింపి వేయుదువు గనుక నీవు వారికి చేయబోవు కీడును నే నెరిగియుండుటచేత కన్నీళ్లు రాల్చుచున్నాను.

12. The sayde Hasael: Wherfore wepeth my lorde? He sayde: I knowe what euell thou shalt do vnto the children of Israel. Thou shalt burne their stronge cities with fyre, and slaye their yonge men with the swerde, and kyll their yonge children, and ryppe vp their wemen with childe.

13. అందుకు హజాయేలుకుక్కవంటివాడనగు నీ దాసుడనైన నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటి వాడను అని అతనితో అనగా, ఎలీషానీవు సిరియామీద రాజవగుదువని యెహోవా నాకు బయలుపరచి యున్నాడనెను.

13. Hasael sayde: How so, is thy seruaunt a dogg, that he shulde do soch a greate thynge? Eliseus saide: The LORDE hath shewed me, yt thou shalt be kynge of Syria.

14. అతడు ఎలీషాను విడిచి వెళ్లి తన యజమానుని యొద్దకు రాగా అతడుఎలీషా నీతో చెప్పినదేమని అడుగగా అతడునిజముగా నీవు బాగుపడుదువని అతడు చెప్పెననెను.

14. And he wete his waye from Eliseus, & came to his lorde, which saide vnto him: What saieth Eliseus vnto the? He sayde: He tolde me, Thou shalt recouer.

15. అయితే మరునాడు హజాయేలు ముదుగు బట్ట తీసికొని నీటిలో ముంచి రాజు ముఖముమీద పరచగా అతడు చచ్చెను; అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజా యెను.

15. But on the nexte daye he toke ye bed couerynge, and dypte it in water, and spred it ouer him, and he dyed, & Hasael was kynge in his steade.

16. అహాబు కుమారుడును ఇశ్రాయేలువారికి రాజునైన యెహోరాము ఏలుబడిలో అయిదవ సంవత్సరమందు యెహోషాపాతు యూదారాజై యుండగా యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏల నారంభించెను.

16. In the fyfth yeare of Ioram the sonne of Achab kynge of Israel, was Ioram ye sonne of Iosaphat kynge of Iuda.

17. అతడు ఏల నారంభించినప్పుడు ముప్పది రెండేండ్లవాడై యుండి యెరూషలేమందు ఎనిమిది సంవ త్సరములు ఏలెను.

17. Two & thirtie yeare olde was he wha he was made kynge, & reigned eighte yeare at Ierusalem,

18. ఇతడు అహాబు కుమార్తెను పెండ్లి చేసికొని యుండెను గనుక అహాబు కుటుంబికులవలెనే ఇతడును ఇశ్రాయేలురాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.

18. & walked in the waye of the kynges of Israel, as the house of Achab dyd (for Achabs doughter was his wife) & he dyd yt which was euell in ye sighte of the LORDE.

19. అయినను యెహోవా సదాకాలము తన సేవకుడగు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట యిచ్చి యుండెను గనుక అతని జ్ఞాపకముచేత యూదాను నశింప జేయుటకు ఆయనకు మనస్సు లేకపోయెను.

19. Neuertheles the LORDE wolde not destroye Iuda for his seruaunt Dauids sake, as he promysed him, to geue him euer a lanterne amoge his childre.

20. ఇతని దిన ములలో ఎదోమీయులు యూదారాజునకు ఇక లోబడుట మాని అతనిమీద తిరుగుబాటు చేసి, తమమీద నొకని రాజుగా నియమించుకొనినందున

20. At ye same tyme fell ye Edomites awaye from Iuda, & made a kynge ouer them selues:

21. యెహోరాము తన రథములన్నిటిని తీసికొని పోయి జాయీరు అను స్థల మునకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టునున్న ఎదోమీయులను రథములమీది అధిపతులను హతముచేయగా జనులు తమ తమ గుడారములకు పారిపోయిరి.

21. ye cause was this, Ioram had gone thorow Seira, and all the charettes with him, & had gotten him vp by nighte, and smytten the Edomites that were aboute him, and ye rulers ouer the charettes, so that the people fled vnto their tentes:

22. అయితే నేటివరకును ఎదోమీయులు తిరుగుబాటు చేసి యూదా వారికి లోబడకయే యున్నారు. మరియు ఆ సమయ మందు లిబ్నా పట్టణమును తిరుగబడెను.

22. therfore fell the Edomites awaye from Iuda vnto this daye. At the same tyme fell Libna awaye also.

23. యెహోరాము చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన దాని నంతటినిగూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.

23. What more there is to saye of Ioram, & all yt he dyd, beholde, it is wrytten in the Cronicles of the kynges of Iuda.

24. యెహోరాము తన పితరులతో కూడ నిద్రించి తన పితరుల సమాధిలో దావీదుపురమునందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను.

24. And Ioram fell on slepe with his fathers, & was buried wt his fathers in ye cite of Dauid, & Ochosias his sonne was kynge in his steade.

25. అహాబు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన యెహోరాము ఏలు బడిలో పండ్రెండవ సంవత్సరమందు యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా యేల నారంభించెను.

25. In the twolueth yeare of Ioram the sonne of Achab kynge of Israel, was Ochosias ye sonne of Ioram kynge in Iuda.

26. అహజ్యా యేలనారంభించినప్పుడు ఇరువది రెండేండ్ల వాడై యుండి యెరూషలేములో ఒక సంవత్సరము ఏలెను. అతని తల్లిపేరు అతల్యా; ఈమె ఇశ్రాయేలు రాజైన ఒమీ కుమార్తె.

26. Two and twentye yeare olde was Ochosias whan he was made kynge, and reigned one yeare at Iurasalem. His mothers name was Atalia the doughter of Amri kynge of Israel,

27. అతడు అహాబు కుటుంబికుల ప్రవర్తనను అనుసరించుచు, వారివలెనే యెహోవా దృష్టికి చెడు తనము జరిగించెను; అతడు అహాబు ఇంటివారికి అల్లుడు.

27. & he walked in the waye of the house of Achab, & dyd that which was euell in the syght of ye LORDE, euen as dyd the house of Achab:

28. అతడు అహాబు కుమారుడైన యెహోరాముతోకూడ రామోత్గిలాదునందు సిరియా రాజైన హజాయేలుతో యుద్ధముచేయ బయలుదేరగా సిరియనులు యెహోరా మును గాయపరచిరి.

28. for he was sonne in lawe in the house of Achab. And he wente with Ioram the sonne of Achab into the battayll agaynst Hasael ye kinge of Syria vnto Ramoth in Gilead, but ye Syrians smote Ioram.

29. రాజైన యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో రామాలో యుద్ధము చేసినప్పుడు సిరియనులవలన తాను పొందిన గాయములను బాగుచేసి కొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి రాగా యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా అహాబు కుమారుడైన యెహోరాము రోగి యాయెనని తెలిసికొని అతని దర్శించుటకై యెజ్రెయేలు ఊరికి వచ్చెను.

29. Then Ioram the kinge turned backe, to be healed at Iesreel of ye woundes, wherwith the Syrians had wounded him at Ramoth, wha he foughte with Hasael kinge of Syria. And Ochosyas ye sonne of Iora kinge of Iuda, came downe to viset Ioram the sonne of Achab at Iesreel, for he laye sicke.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Kings II - 2 రాజులు 8 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఇశ్రాయేలులో కరువు, షూనేమీట్ తన భూమిని పొందుతుంది. (1-6) 
దయగల షూనేమ్ స్త్రీ ఎలీషా పట్ల చూపిన దయకు ప్రతిఫలం లభించింది, ఎందుకంటే ఆమె కరువు సమయంలో సంరక్షణ పొందింది. ప్రతికూలతను ముందుగానే ఊహించడం మరియు, ముందుగా ఊహించినప్పుడు, అది చట్టబద్ధమైన సరిహద్దుల్లో ఉంటే, మనల్ని మనం రక్షించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవడం వివేకం. కరువు గడిచిన తర్వాత, ఆమె ఫిలిష్తీయుల దేశాన్ని విడిచిపెట్టింది - ఇది ఒక ఇశ్రాయేలీయునికి చాలా అవసరం అయితే తప్ప నివసించడానికి అనుచితమైన ప్రదేశం. రాజు సహాయం అవసరం లేకుండా ఆమె తన సొంత ప్రజల మధ్య సురక్షితంగా జీవించిన సమయం ఉంది. అయితే, జీవితం తరచుగా అనూహ్యమైనది మరియు మనం ఆధారపడేవి లేదా విషయాలు మనల్ని నిరాశపరచవచ్చు, అయితే ఊహించని మూలాలు మన సహాయానికి రావచ్చు.
ఈ సందర్భంలో ప్రదర్శించినట్లుగా, అంతమయినట్లుగా చూపబడని సంఘటనలు కూడా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ సంఘటనలు రాజు గెహాజీ వృత్తాంతాన్ని ధృవీకరించిన తర్వాత దానిని విశ్వసించేలా చేశాయి. ఈ నిష్కాపట్యత ఆమె అభ్యర్థనను మన్నించడానికి మరియు ఒకటి కంటే ఎక్కువ సందర్భాలలో అద్భుతాల ద్వారా స్థిరపడిన జీవితాన్ని నిలబెట్టడానికి రాజును ఇష్టపడేలా చేసింది.

ఎలీషా బెన్‌హదాద్ మరణంతో హజాయేల్‌తో సంప్రదించాడు. (7-15) 
బాధ, మానవ దృక్పథాలపై దాని వివిధ ప్రభావాల మధ్య, తరచుగా వ్యక్తులు దేవుని పరిచారకుల గురించి తమ అభిప్రాయాలను పునఃపరిశీలించుకునేలా చేస్తుంది. వారు ఇంతకు ముందు ధిక్కరించిన మరియు అసహ్యించుకున్న వారి మార్గదర్శకత్వం మరియు ప్రార్థనల విలువను గుర్తించడానికి ఇది వారికి బోధిస్తుంది. ఎలీషా హజాయేల్ ఉద్దేశాలను అతని ప్రవర్తన నుండి మాత్రమే గుర్తించలేదు; బదులుగా, దేవుడు వాటిని అతనికి ఆవిష్కరించాడు, అతని కళ్ళ నుండి కన్నీళ్లను రేకెత్తించాడు. వైరుధ్యంగా, పెరిగిన దూరదృష్టి తీవ్ర దుఃఖానికి దారి తీస్తుంది.
సహజమైన మనస్సాక్షికి లోబడి, ఒక వ్యక్తి పాపాన్ని తీవ్రంగా ఖండించగలడు, అయితే తదనంతరం దానితో రాజీపడగలడు. సమాజంలో నిరాడంబరమైన మరియు వినయపూర్వకమైన స్థానాలను ఆక్రమించే వారు అధికారం మరియు శ్రేయస్సుతో ముడిపడి ఉన్న ఆకర్షణల తీవ్రతను గ్రహించలేరు. అటువంటి స్థానాలను పొందిన తరువాత, వారు అనివార్యంగా వారి స్వంత హృదయాలలోని ద్రోహమైన లోతులను కనుగొంటారు, వారి ప్రారంభ అనుమానాలను అధిగమిస్తారు.
దెయ్యం వ్యక్తులకు గ్యారెంటీ రికవరీ మరియు సుసంపన్నమైన భవిష్యత్తు గురించి హామీ ఇవ్వడం ద్వారా వారిని చిక్కుల్లో పడవేస్తుంది, తద్వారా వారిని తప్పుడు భద్రతా భావంలోకి నెట్టివేస్తుంది. హజాయెల్ యొక్క భయంకరమైన నివేదిక రాజుపై హాని కలిగించింది, అతను తన మరణానికి సిద్ధం కావడానికి ప్రవక్త యొక్క హెచ్చరికను పాటించే అవకాశాన్ని కోల్పోయాడు. అంతేకాకుండా, అది అన్యాయంగా ఎలీషా యొక్క విశ్వసనీయతను దెబ్బతీసింది, అతనిని అబద్ధపు ఆరోపణలకు గురి చేసింది.
తన యజమాని మరణంలో హజెల్ ప్రమేయం చుట్టూ ఉన్న పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నాయి. అతను నిజంగా దానికి సహకరించినట్లయితే, ఆ చర్య అనుకోకుండా జరిగి ఉండవచ్చు. సంబంధం లేకుండా, అతని కపటత్వం స్పష్టంగా కనిపించింది మరియు తరువాత అతను ఇశ్రాయేలును హింసించే వ్యక్తిగా రూపాంతరం చెందాడు.

యూదాలో యెహోరాము దుష్ట పాలన. (16-24) 
యెహోరామ్ దుష్టత్వం గురించి విస్తృతమైన అవలోకనం అందించబడింది. అతని తండ్రి బహుశా ప్రభువును గూర్చిన నిజమైన జ్ఞానంలో అతనికి సరైన ఉపదేశాన్ని పొందాడని నిర్ధారించుకున్నప్పటికీ, అహాబు కుమార్తెతో అతని వివాహాన్ని ఏర్పాటు చేయడం అవివేకం. విగ్రహారాధనలో స్థిరపడిన కుటుంబంతో యూనియన్‌లోకి ప్రవేశించడం అననుకూల ఫలితాలను మాత్రమే ఇచ్చే నిర్ణయం.

యూదాలో అహజ్యా దుష్ట పాలన. (25-29)
సారాంశాలు అప్పీల్‌ల ద్వారా నిర్ణయించబడవు, అయినప్పటికీ అహాబుకు సంబంధించిన పేర్లను స్వీకరించడానికి యెహోషాపాట్ వంశం యొక్క నిర్ణయం హానికరమని నిరూపించబడింది. అహాబు బంధువులతో అహజ్యా యొక్క అనుబంధం అతని నైతిక పతనానికి మరియు చివరికి పతనానికి ఉత్ప్రేరకంగా పనిచేసింది. వ్యక్తులు జీవిత భాగస్వాములను ఎంచుకున్నప్పుడు, వారు తమ సంతానం కోసం కాబోయే తల్లులను కూడా ఎంపిక చేసుకుంటున్నారని గుర్తుంచుకోవాలి. అహాబు వంశం యొక్క పతనంతో కలిసి, వారి అతిక్రమణలు వారి అత్యున్నత స్థాయికి చేరుకున్నప్పుడు, దైవిక ప్రావిడెన్స్ అహజియా మరణాన్ని నిర్దేశించింది. తప్పు చేసేవారి అతిక్రమణలలో ఇష్టపూర్వకంగా పాలుపంచుకునే వారు దాని పర్యవసానాల్లో కూడా పాలుపంచుకోవడాన్ని ఊహించాలి. ప్రపంచంలోని విపత్తులు, కష్టాలు మరియు అధోకరణాలు క్రీస్తు ద్వారా అందించబడిన విమోచనలో వాటాను తీవ్రంగా వెతకడానికి మనల్ని ప్రోత్సహిస్తాయి.



Shortcut Links
2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |