Kings II - 2 రాజులు 23 | View All

1. అప్పుడు రాజు యూదా పెద్దలనందరినియెరూషలేము పెద్దలనందరిని తనయొద్దకు పిలువనంపించి

1. Now the king sent them to gather all the elders of Judah and Jerusalem to him.

2. యూదావారినందరిని యెరూషలేము కాపురస్థులనందరిని, యాజకులను ప్రవక్తలను అల్పులనేమి ఘనులనేమి జనులందరిని పిలుచుకొని, యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా, యెహోవా మందిరమందు దొరకిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటిని చదివించెను.

2. The king went up to the house of the LORD with all the men of Judah, and with him all the inhabitants of Jerusalem -- the priests and the prophets and all the people, both small and great. And he read in their hearing all the words of the Book of the Covenant which had been found in the house of the LORD.

3. రాజు ఒక స్తంభముదగ్గర నిలిచియెహోవా మార్గములయందు నడచి, ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణహృదయముతోను పూర్ణాత్మ తోను గైకొని, యీ గ్రంథమందు వ్రాయబడియున్న నిబంధన సంబంధమైన మాటలన్నిటిని స్థిరపరచుదుమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరు ఆ నిబంధనకు సమ్మతించిరి.

3. Then the king stood by a pillar and made a covenant before the LORD, to follow the LORD and to keep His commandments and His testimonies and His statutes, with all [his] heart and all [his] soul, to perform the words of this covenant that were written in this book. And all the people took a stand for the covenant.

4. రాజుబయలు దేవతకును అషేరా దేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణము లన్నిటి యెహోవా ఆలయములోనుండి ఇవతలకు తీసికొని రావలెనని ప్రధానయాజకుడైన హిల్కీయాకును రెండవ వరుస యాజకులకును ద్వారపాలకులకును ఆజ్ఞ ఇయ్యగా హిల్కీయా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి, బూడిదెను బేతేలు ఊరికి పంపి వేసెను.

4. And the king commanded Hilkiah the high priest, the priests of the second order, and the doorkeepers, to bring out of the temple of the LORD all the articles that were made for Baal, for Asherah, and for all the host of heaven; and he burned them outside Jerusalem in the fields of Kidron, and carried their ashes to Bethel.

5. మరియయూదా పట్టణములయం దున్న ఉన్నతస్థలములలోను యెరూషలేము చుట్టునున్న చోట్లలోను ధూపము వేయుటకై యూదారాజులు నియమించిన అర్చకులనేమి, బయలునకును సూర్యచంద్రు లకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వేయు వారినేమి, అతడు అందరిని నిలిపి వేసెను.

5. Then he removed the idolatrous priests whom the kings of Judah had ordained to burn incense on the high places in the cities of Judah and in the places all around Jerusalem, and those who burned incense to Baal, to the sun, to the moon, to the constellations, and to all the host of heaven.

6. యెహోవా మందిరమందున్న అషేరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగుదగ్గరకు తెప్పించి, కిద్రోను వాగు ఒడ్డున దాని కాల్చి త్రొక్కి పొడుముచేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధులమీద చల్లెను.

6. And he brought out the wooden image from the house of the LORD, to the Brook Kidron outside Jerusalem, burned it at the Brook Kidron and ground [it] to ashes, and threw its ashes on the graves of the common people.

7. మరియయెహోవా మందిరమందున్న పురుషగాముల యిండ్లను పడగొట్టించెను. అచ్చట అషేరాదేవికి గుళ్లను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి.

7. Then he tore down the [ritual] booths of the perverted persons that [were] in the house of the LORD, where the women wove hangings for the wooden image.

8. యూదా పట్టణము లోనున్న యాజకులనందరిని అతడు అవతలికి వెళ్లగొట్టెను, గెబా మొదలుకొని బెయేరషెబా వరకును యాజకులు ధూపమువేసిన ఉన్నతస్థలములను అతడు అపవిత్ర పరచి, పట్టణములో ప్రవేశించువాని యెడమపార్శ్వమున పట్టణపు అధికారియైన యెహోషువ గుమ్మముదగ్గరనుండు ఉన్నతస్థలములను పడగొట్టించెను.

8. And he brought all the priests from the cities of Judah, and defiled the high places where the priests had burned incense, from Geba to Beersheba; also he broke down the high places at the gates which [were] at the entrance of the Gate of Joshua the governor of the city, which [were] to the left of the city gate.

9. అయినప్పటికి ఆ ఉన్నతస్థలములమీద నియమింపబడిన యాజకులు యెరూ షలేమందున్న యెహోవా బలిపీఠమునొద్దకు రాక తమ సహోదరులయొద్ద పులుసులేని ఆహారము భక్షించువారు.

9. Nevertheless the priests of the high places did not come up to the altar of the LORD in Jerusalem, but they ate unleavened bread among their brethren.

10. మరియు ఎవడైనను తన కుమారునేగాని కుమార్తెనేగాని మొలెకునకు అగ్నిగుండము దాటించకుండునట్లు బెన్‌ హిన్నోము అను లోయలోనున్న తోఫెతు అను ప్రదేశ మును అతడు అపవిత్రము చేసెను.

10. And he defiled Topheth, which [is] in the Valley of the Son of Hinnom, that no man might make his son or his daughter pass through the fire to Molech.

11. ఇదియుగాక అతడు యూదారాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుఱ్ఱములను మంట పములో నివసించు పరిచారకుడైన నెతన్మెలకుయొక్క గది దగ్గర యెహోవా మందిరపు ద్వారమునొద్దనుండి తీసివేసి, సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చి వేసెను.

11. Then he removed the horses that the kings of Judah had dedicated to the sun, at the entrance to the house of the LORD, by the chamber of Nathan-Melech, the officer who [was] in the court; and he burned the chariots of the sun with fire.

12. మరియయూదారాజులు చేయించిన ఆహాజు మేడగదిపైనున్న బలిపీఠములను, యెహోవా మందిరపు రెండు సాలలలో మనష్షే చేయించిన బలిపీఠములను రాజు పడ గొట్టించి ఛిన్నాభిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించెను.

12. The altars that [were] on the roof, the upper chamber of Ahaz, which the kings of Judah had made, and the altars which Manasseh had made in the two courts of the house of the LORD, the king broke down and pulverized there, and threw their dust into the Brook Kidron.

13. యెరూషలేము ఎదుట నున్న హేయమను పర్వతపు కుడిపార్శ్వమందు అష్తా రోతు అను సీదోనీయుల విగ్రహమునకును, కెమోషు అను మోయాబీయుల విగ్రహమునకును, మిల్కోము అను అమ్మోనీయుల విగ్రహమునకును ఇశ్రాయేలురాజైన సొలొ మోను కట్టించిన ఉన్నతస్థలములను రాజు అపవిత్రపరచి

13. Then the king defiled the high places that [were] east of Jerusalem, which [were] on the south of the Mount of Corruption, which Solomon king of Israel had built for Ashtoreth the abomination of the Sidonians, for Chemosh the abomination of the Moabites, and for Milcom the abomination of the people of Ammon.

14. ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి, అషేరాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరశల్యములతో నింపెను.

14. And he broke in pieces the [sacred] pillars and cut down the wooden images, and filled their places with the bones of men.

15. బేతేలులోనున్న బలిపీఠమును ఉన్నతస్థలమును, అనగా ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యరొబాము కట్టించిన ఆ ఉన్నత స్థలమును బలిపీఠమును అతడు పడగొట్టించి, ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి అషేరాదేవి ప్రతిమను కాల్చివేసెను.

15. Moreover the altar that [was] at Bethel, [and] the high place which Jeroboam the son of Nebat, who made Israel sin, had made, both that altar and the high place he broke down; and he burned the high place [and] crushed [it] to powder, and burned the wooden image.

16. యోషీయా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులలోనున్న శల్యములను తెప్పించి, దైవ జనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠముమీద కాల్చి దాని అపవిత్రపరచెను.

16. As Josiah turned, he saw the tombs that [were] there on the mountain. And he sent and took the bones out of the tombs and burned [them] on the altar, and defiled it according to the word of the LORD which the man of God proclaimed, who proclaimed these words.

17. అంతట అతడునాకు కనబడుచున్న ఆ సమాధి యెవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు అది యూదాదేశమునుండి వచ్చి నీవు, బేతేలులోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధియని చెప్పిరి.

17. Then he said, 'What gravestone [is] this that I see?' So the men of the city told him, '[It is] the tomb of the man of God who came from Judah and proclaimed these things which you have done against the altar of Bethel.'

18. అందు కతడుదానిని తప్పించుడి, యెవడును అతని శల్యములను తీయకూడదని చెప్పగా వారు అతని శల్యములను షోమ్రోను పట్టణమునుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి.

18. And he said, 'Let him alone; let no one move his bones.' So they let his bones alone, with the bones of the prophet who came from Samaria.

19. మరియఇశ్రాయేలు రాజులు షోమ్రోను పట్టణములలో ఏ ఉన్నతస్థలములలో మందిర ములను కట్టించి యెహోవాకు కోపము పుట్టించిరో ఆ మందిరములన్నిటిని యోషీయా తీసివేసి, తాను బేతేలులో చేసిన క్రియలన్నిటి ప్రకారము వాటికి చేసెను.

19. Now Josiah also took away all the shrines of the high places that [were] in the cities of Samaria, which the kings of Israel had made to provoke the LORD to anger; and he did to them according to all the deeds he had done in Bethel.

20. అచ్చట అతడు ఉన్నతస్థలములకు నియమింపబడిన యాజ కులనందరిని బలిపీఠముల మీద చంపించి వాటిమీద నరశల్య ములను కాల్పించి యెరూషలేమునకు తిరిగి వచ్చెను.

20. He executed all the priests of the high places who [were] there, on the altars, and burned men's bones on them; and he returned to Jerusalem.

21. అంతట రాజునిబంధన గ్రంథమునందు వ్రాసి యున్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగను ఆచరించుడని జనులకందరికి ఆజ్ఞా పింపగా

21. Then the king commanded all the people, saying, 'Keep the Passover to the LORD your God, as [it is] written in this Book of the Covenant.'

22. ఇశ్రాయేలీయులకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినములనుండి ఇశ్రాయేలు రాజుల యొక్కయు యూదారాజులయొక్కయు దినములన్నిటి వరకు ఎన్నడును జరుగనంత గొప్పగా ఆ సమయమందు పస్కాపండుగ ఆచరింపబడెను.

22. Such a Passover surely had never been held since the days of the judges who judged Israel, nor in all the days of the kings of Israel and the kings of Judah.

23. ఈ పండుగ రాజైన యోషీయా యేలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు యెరూషలేములో యెహోవాకు ఆచరింపబడెను.

23. But in the eighteenth year of King Josiah this Passover was held before the LORD in Jerusalem.

24. మరియు కర్ణపిశాచి గలవారిని సోదెచెప్పువారిని గృహ దేవతలను విగ్రహ ములను, యూదాదేశమందును యెరూష లేమునందును కనబడిన విగ్రహములన్నిటిని యోషీయా తీసివేసి, యెహోవామందిరమందు యాజకుడైన హిల్కీ యాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను.

24. Moreover Josiah put away those who consulted mediums and spiritists, the household gods and idols, all the abominations that were seen in the land of Judah and in Jerusalem, that he might perform the words of the law which were written in the book that Hilkiah the priest found in the house of the LORD.

25. అతనికి పూర్వమున్న రాజులలో అతనివలె పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను పూర్ణబలముతోను యెహోవావైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రముచొప్పున చేసినవాడు ఒకడును లేడు; అతని తరువాతనైనను అతనివంటివాడు ఒకడును లేడు.

25. Now before him there was no king like him, who turned to the LORD with all his heart, with all his soul, and with all his might, according to all the Law of Moses; nor after him did [any] arise like him.

26. అయినను మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమునుబట్టి ఆయన కోపాగ్ని యింకను చల్లారకుండ యూదామీద మండుచునే యుండెను.

26. Nevertheless the LORD did not turn from the fierceness of His great wrath, with which His anger was aroused against Judah, because of all the provocations with which Manasseh had provoked Him.

27. కాబట్టి యెహోవానేను ఇశ్రాయేలువారిని వెళ్లగొట్టినట్లు యూదావారిని నా సముఖమునకు దూరముగా చేసి, నేను కోరుకొనిన యెరూషలేము పట్టణమును, నా నామమును అచ్చట ఉంచుదునని నేను చెప్పియున్న మందిరమును నేను విసర్జించెదనని అనుకొనియుండెను.

27. And the LORD said, 'I will also remove Judah from My sight, as I have removed Israel, and will cast off this city Jerusalem which I have chosen, and the house of which I said, 'My name shall be there.' '

28. యోషీయా చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంత ముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

28. Now the rest of the acts of Josiah, and all that he did, [are] they not written in the book of the chronicles of the kings of Judah?

29. అతని దినముల యందు ఐగుప్తురాజైన ఫరోనెకో అష్షూరురాజుతో యుద్ధముచేయుటకై యూఫ్రటీసునది దగ్గరకు వెళ్లుచుండగా తన్ను ఎదుర్కొనవచ్చిన రాజైన యోషీయాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను.
ప్రకటన గ్రంథం 16:16

29. In his days Pharaoh Necho king of Egypt went to the aid of the king of Assyria, to the River Euphrates; and King Josiah went against him. And [Pharaoh Necho] killed him at Megiddo when he confronted him.

30. అతని సేవకులు అతని శవమును రథముమీద ఉంచి, మెగిద్దోనుండి యెరూష లేమునకు తీసికొనివచ్చి అతని సమాధియందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహో యాహాజును తీసికొని అతనికి పట్టాభిషేకముచేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగానుంచిరి.

30. Then his servants moved his body in a chariot from Megiddo, brought him to Jerusalem, and buried him in his own tomb. And the people of the land took Jehoahaz the son of Josiah, anointed him, and made him king in his father's place.

31. యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది మూడేండ్లవాడై యెరూషలేములో మూడు మాసములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన యిర్మీయా కుమార్తె యగు హమూటలు.

31. Jehoahaz [was] twenty-three years old when he became king, and he reigned three months in Jerusalem. His mother's name [was] Hamutal the daughter of Jeremiah of Libnah.

32. ఇతడు తన పితరులు చేసినదంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడత నడచెను.

32. And he did evil in the sight of the LORD, according to all that his fathers had done.

33. ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండ ఫరోనెకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతనిని బంధక ములలో ఉంచి, దేశముమీద ఏబది మణుగుల వెండిని, రెండు మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి

33. Now Pharaoh Necho put him in prison at Riblah in the land of Hamath, that he might not reign in Jerusalem; and he imposed on the land a tribute of one hundred talents of silver and a talent of gold.

34. యోషీయా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రియైన యోషీయాకు మారుగా రాజుగా నియమించి, అతనికి యెహోయాకీమను మారుపేరుపెట్టి యెహోయాహాజు ఐగుప్తుదేశమునకు కొనిపోగా అతడచ్చట మృతిబొందెను.

34. Then Pharaoh Necho made Eliakim the son of Josiah king in place of his father Josiah, and changed his name to Jehoiakim. And [Pharaoh] took Jehoahaz and went to Egypt, and he died there.

35. యెహోయాకీము ఫరో యిచ్చిన ఆజ్ఞచొప్పున దేశముమీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములను ఫరోకు చెల్లించుచువచ్చెను. దేశపు జనులయొద్దనుండి వారి వారికి నిర్ణయమైన చొప్పున వసూలుచేసి అతడు ఫరోనెకోకు చెల్లించెను.

35. So Jehoiakim gave the silver and gold to Pharaoh; but he taxed the land to give money according to the command of Pharaoh; he exacted the silver and gold from the people of the land, from every one according to his assessment, to give [it] to Pharaoh Necho.

36. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేమున పదకొండు సంవత్సర ములు ఏలెను. అతని తల్లి రూమా ఊరివా డైన పెదాయా కుమార్తెయగు జెబూదా.

36. Jehoiakim [was] twenty-five years old when he became king, and he reigned eleven years in Jerusalem. His mother's name [was] Zebudah the daughter of Pedaiah of Rumah.

37. ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడతనడిచెను.

37. And he did evil in the sight of the LORD, according to all that his fathers had done.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Kings II - 2 రాజులు 23 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

యోషీయా ధర్మశాస్త్రాన్ని చదివి, ఒడంబడికను పునరుద్ధరించాడు. (1-3) 
యెరూషలేము పతనం అనివార్యమని మరియు తన స్వంత ఆత్మను కాపాడుకోవడం అతని ప్రాథమిక బాధ్యత అని తెలియజేసేందుకు జోషియాకు దైవిక సందేశం పంపబడింది. అయినప్పటికీ, అతను తన కర్తవ్యాన్ని మనస్సాక్షిగా నెరవేర్చాడు, ఫలితాన్ని దేవునికి అప్పగించాడు. విగ్రహారాధనను త్యజించి, దేవుని పట్ల వారి భక్తిలో నీతిని మరియు నిజమైన పవిత్రతను హృదయపూర్వకంగా అనుసరించాలని అతను ప్రజలను హృదయపూర్వకంగా కోరాడు. చాలా మంది ఈ సూత్రాలకు ఉపరితలం లేదా నిష్కపటమైన పద్ధతిలో కట్టుబడి ఉన్నప్పటికీ, ఈ విధానం ఇప్పటికీ బాహ్య దుష్టత్వాన్ని అరికట్టింది మరియు వారి చర్యలకు దేవునికి జవాబుదారీగా ఉంటుంది.

అతను విగ్రహారాధనను నాశనం చేస్తాడు. (4-14) 
యూదా మరియు యెరూషలేములలో దుష్టత్వం యొక్క పరిధి నిజంగా ఆశ్చర్యపరిచింది. దేవుడు గుర్తించబడిన యూదా లేదా అతని పేరు గొప్ప గౌరవం ఉన్న ఇజ్రాయెల్‌లో ఇటువంటి అసహ్యకరమైనవి ఉంటాయని నమ్మడం కష్టంగా ఉండేది. సేలం మరియు జియోన్ యొక్క పవిత్ర ప్రదేశాలలో కూడా, అతని ఉనికి స్పష్టంగా కనిపించింది, ఈ అసహ్యకరమైన పద్ధతులు పాతుకుపోయాయి. జోషియా యొక్క పద్దెనిమిది సంవత్సరాల పాలన మరియు అతని ఆదర్శవంతమైన నాయకత్వం ఉన్నప్పటికీ, అతను దైవిక చట్టం ప్రకారం మతపరమైన ఆచారాన్ని సమర్థించాడు, విగ్రహారాధన యొక్క ఆవిష్కరణ దాని లోతైన మరియు విస్తృత స్వభావాన్ని వెల్లడించింది.
సాంప్రదాయిక చారిత్రిక వృత్తాంతాలు మరియు గ్రంథాలు రెండూ కూడా ప్రపంచంలో గమనించిన నిజమైన భక్తి లేదా నీతి యేసుక్రీస్తు యొక్క దైవిక ఆత్మ యొక్క పరివర్తన శక్తి యొక్క ఫలితమేనని ధృవీకరిస్తున్నాయి.

సంస్కరణ ఇజ్రాయెల్‌కు విస్తరించింది, పస్కాను ఆచరించారు. (15-24) 
జోషియా యొక్క ఉత్సాహం అతని ప్రభావంలో పడిపోయిన ఇజ్రాయెల్ యొక్క సుదూర నగరాలకు కూడా చేరుకుంది. యరొబాము బలిపీఠం కూల్చివేయబడుతుందని ప్రవచించిన యూదా నుండి దేవుడు పంపిన వ్యక్తి యొక్క సమాధిని అతను చాలా జాగ్రత్తగా కాపాడాడు. వారు భూమి నుండి విగ్రహారాధన యొక్క లోతైన కలుషితాన్ని నిర్మూలించిన తర్వాత, వారు తమ దృష్టిని విందు ఆచారం వైపు మళ్లించారు. ఇంతకు ముందు ఏ పాలనలోనూ ఇంత వైభవంగా పాస్ ఓవర్ జరుపుకోలేదు. దీర్ఘకాలంగా నిర్లక్ష్యం చేయబడిన ఈ సంప్రదాయం యొక్క పునరుజ్జీవనం వారి హృదయాలను పవిత్రమైన ఉల్లాసంతో నింపింది మరియు విగ్రహారాధనను ప్రక్షాళన చేయడంలో వారి ఉత్సాహానికి ప్రతిస్పందనగా, దేవుడు తన ఉనికి మరియు ఆమోదం యొక్క అసాధారణ సంకేతాలను వ్యక్తపరిచాడు. జోషీయా పాలనలో మిగిలిన కాలమంతా, మతం యొక్క ఆచారం అభివృద్ధి చెందిన పునరుజ్జీవనాన్ని అనుభవించిందని నమ్మడం సహేతుకమైనది.

జోషియా ఫారో-నెచో చేత చంపబడ్డాడు. (25-30) 
ఈ శ్లోకాలను ధ్యానించిన తర్వాత, ఓ ప్రభూ, నీ ధర్మం బలమైన పర్వతాల వలె నిలువెత్తుగా, స్పష్టంగా కనిపించే మరియు సందేహాస్పదంగా ఉన్నప్పటికీ, మీ తీర్పులు అపారమైన అగాధంలాగా, అపారమైన మరియు గ్రహణశక్తికి మించినవని మేము గుర్తించాలి. సంస్కరణను లక్ష్యంగా చేసుకున్న రాజు, అతని పట్ల దయతో, అతని రాజ్యంలో జరగబోయే విపత్తును చూడకుండా అతని ప్రభావవంతంగా విషాదకరంగా తీసివేయబడ్డాడు. అయినప్పటికీ, ఈ సంఘటన అతని ప్రజలకు కోపంతో కూడుకున్న బరువును కలిగి ఉంది, ఎందుకంటే అతని మరణం వారి వినాశనానికి తలుపుగా మారుతుంది.

యెహోయాహాజు మరియు యెహోయాకీముల దుష్ట పాలనలు. (31-37)
జోషీయా అంతరాయాన్ని అనుసరించి, కష్టాల పరంపర విప్పింది, ఒకదానిపై మరొకటి ఉప్పొంగింది, ఇరవై రెండు సంవత్సరాల వ్యవధిలో జెరూసలేం తుడిచిపెట్టుకుపోయింది. అనేక మంది దుర్మార్గులు వారి మరణాన్ని ఎదుర్కొన్నారు, మిగిలిన వారు శుద్ధి చేయబడ్డారు, మరియు సంస్కరణలో జోషియ యొక్క ప్రయత్నాలు వారి రాబోయే సంఘం మరియు దేశం యొక్క విలువైన సామర్థ్యానికి ప్రాతినిధ్యం వహించే ఎంపిక చేసిన కొద్దిమందితో పాటు నిలబడటానికి వ్యక్తులను ముందుకు తెచ్చాయి.
క్లుప్త వ్యవధిలో మరియు నిరాడంబరమైన సామర్థ్యాలతో, భక్తజనులు సంవత్సరాలుగా కష్టపడి సాధించడానికి ప్రయత్నించిన పురోగతిని విప్పడం తరచుగా సాధ్యపడుతుంది. ఏది ఏమైనప్పటికీ, అతని పునరుద్ధరణ ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన సద్గుణ కార్యం స్థిరంగా మరియు అభేద్యంగా, అన్ని మార్పులు మరియు ప్రలోభాల ద్వారా పట్టుదలతో ఉన్నందుకు మేము దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.



Shortcut Links
2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |