Kings II - 2 రాజులు 23 | View All

1. అప్పుడు రాజు యూదా పెద్దలనందరినియెరూషలేము పెద్దలనందరిని తనయొద్దకు పిలువనంపించి

1. appuḍu raaju yoodhaa peddalanandariniyerooshalēmu peddalanandarini thanayoddhaku piluvanampin̄chi

2. యూదావారినందరిని యెరూషలేము కాపురస్థులనందరిని, యాజకులను ప్రవక్తలను అల్పులనేమి ఘనులనేమి జనులందరిని పిలుచుకొని, యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా, యెహోవా మందిరమందు దొరకిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటిని చదివించెను.

2. yoodhaavaarinandarini yerooshalēmu kaapurasthulanandarini, yaajakulanu pravakthalanu alpulanēmi ghanulanēmi janulandarini piluchukoni, yehōvaa mandiramunaku vachi vaaru vinuchuṇḍagaa, yehōvaa mandiramandu dorakina nibandhana granthamulōni maaṭalanniṭini chadhivin̄chenu.

3. రాజు ఒక స్తంభముదగ్గర నిలిచియెహోవా మార్గములయందు నడచి, ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణహృదయముతోను పూర్ణాత్మ తోను గైకొని, యీ గ్రంథమందు వ్రాయబడియున్న నిబంధన సంబంధమైన మాటలన్నిటిని స్థిరపరచుదుమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరు ఆ నిబంధనకు సమ్మతించిరి.

3. raaju oka sthambhamudaggara nilichiyehōvaa maargamulayandu naḍachi, aayana aagnalanu kaṭṭaḍalanu shaasanamulanu poorṇahrudayamuthoonu poorṇaatma thoonu gaikoni, yee granthamandu vraayabaḍiyunna nibandhana sambandhamaina maaṭalanniṭini sthiraparachudumani yehōvaa sannidhini nibandhana cheyagaa janulandaru aa nibandhanaku sammathin̄chiri.

4. రాజుబయలు దేవతకును అషేరా దేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణము లన్నిటి యెహోవా ఆలయములోనుండి ఇవతలకు తీసికొని రావలెనని ప్రధానయాజకుడైన హిల్కీయాకును రెండవ వరుస యాజకులకును ద్వారపాలకులకును ఆజ్ఞ ఇయ్యగా హిల్కీయా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి, బూడిదెను బేతేలు ఊరికి పంపి వేసెను.

4. raajubayalu dhevathakunu ashēraa dhevikini nakshatramulakunu cheyabaḍina upakaraṇamu lanniṭi yehōvaa aalayamulōnuṇḍi ivathalaku theesikoni raavalenani pradhaanayaajakuḍaina hilkeeyaakunu reṇḍava varusa yaajakulakunu dvaarapaalakulakunu aagna iyyagaa hilkeeyaa vaaṭini yerooshalēmu velupala kidrōnu polamulō kaalchivēsi, booḍidhenu bēthēlu ooriki pampi vēsenu.

5. మరియయూదా పట్టణములయం దున్న ఉన్నతస్థలములలోను యెరూషలేము చుట్టునున్న చోట్లలోను ధూపము వేయుటకై యూదారాజులు నియమించిన అర్చకులనేమి, బయలునకును సూర్యచంద్రు లకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వేయు వారినేమి, అతడు అందరిని నిలిపి వేసెను.

5. mariyu yoodhaa paṭṭaṇamulayaṁ dunna unnathasthalamulalōnu yerooshalēmu chuṭṭununna chooṭlalōnu dhoopamu vēyuṭakai yoodhaaraajulu niyamin̄china archakulanēmi, bayalunakunu sooryachandru lakunu grahamulakunu nakshatramulakunu dhoopamu vēyu vaarinēmi, athaḍu andarini nilipi vēsenu.

6. యెహోవా మందిరమందున్న అషేరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగుదగ్గరకు తెప్పించి, కిద్రోను వాగు ఒడ్డున దాని కాల్చి త్రొక్కి పొడుముచేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధులమీద చల్లెను.

6. yehōvaa mandiramandunna ashēraadhevi prathimanu yerooshalēmu velupalanunna kidrōnu vaagudaggaraku teppin̄chi, kidrōnu vaagu oḍḍuna daani kaalchi trokki poḍumuchesi aa poḍumunu saamaanya janula samaadhulameeda challenu.

7. మరియయెహోవా మందిరమందున్న పురుషగాముల యిండ్లను పడగొట్టించెను. అచ్చట అషేరాదేవికి గుళ్లను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి.

7. mariyu yehōvaa mandiramandunna purushagaamula yiṇḍlanu paḍagoṭṭin̄chenu. Acchaṭa ashēraadheviki guḷlanu allu streelu vaasamu cheyuchuṇḍiri.

8. యూదా పట్టణము లోనున్న యాజకులనందరిని అతడు అవతలికి వెళ్లగొట్టెను, గెబా మొదలుకొని బెయేరషెబా వరకును యాజకులు ధూపమువేసిన ఉన్నతస్థలములను అతడు అపవిత్ర పరచి, పట్టణములో ప్రవేశించువాని యెడమపార్శ్వమున పట్టణపు అధికారియైన యెహోషువ గుమ్మముదగ్గరనుండు ఉన్నతస్థలములను పడగొట్టించెను.

8. yoodhaa paṭṭaṇamu lōnunna yaajakulanandarini athaḍu avathaliki veḷlagoṭṭenu, gebaa modalukoni beyērshebaa varakunu yaajakulu dhoopamuvēsina unnathasthalamulanu athaḍu apavitra parachi, paṭṭaṇamulō pravēshin̄chuvaani yeḍamapaarshvamuna paṭṭaṇapu adhikaariyaina yehōshuva gummamudaggaranuṇḍu unnathasthalamulanu paḍagoṭṭin̄chenu.

9. అయినప్పటికి ఆ ఉన్నతస్థలములమీద నియమింపబడిన యాజకులు యెరూ షలేమందున్న యెహోవా బలిపీఠమునొద్దకు రాక తమ సహోదరులయొద్ద పులుసులేని ఆహారము భక్షించువారు.

9. ayinappaṭiki aa unnathasthalamulameeda niyamimpabaḍina yaajakulu yeroo shalēmandunna yehōvaa balipeeṭhamunoddhaku raaka thama sahōdarulayoddha pulusulēni aahaaramu bhakshin̄chuvaaru.

10. మరియు ఎవడైనను తన కుమారునేగాని కుమార్తెనేగాని మొలెకునకు అగ్నిగుండము దాటించకుండునట్లు బెన్‌ హిన్నోము అను లోయలోనున్న తోఫెతు అను ప్రదేశ మును అతడు అపవిత్రము చేసెను.

10. mariyu evaḍainanu thana kumaarunēgaani kumaarthenēgaani molekunaku agniguṇḍamu daaṭin̄chakuṇḍunaṭlu ben‌ hinnōmu anu lōyalōnunna thoophethu anu pradhesha munu athaḍu apavitramu chesenu.

11. ఇదియుగాక అతడు యూదారాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుఱ్ఱములను మంట పములో నివసించు పరిచారకుడైన నెతన్మెలకుయొక్క గది దగ్గర యెహోవా మందిరపు ద్వారమునొద్దనుండి తీసివేసి, సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చి వేసెను.

11. idiyugaaka athaḍu yoodhaaraajulu sooryuniki prathishṭhin̄china gurramulanu maṇṭa pamulō nivasin̄chu parichaarakuḍaina nethanmelakuyokka gadhi daggara yehōvaa mandirapu dvaaramunoddhanuṇḍi theesivēsi, sooryuniki prathishṭhimpabaḍina rathamulanu agnithoo kaalchi vēsenu.

12. మరియయూదారాజులు చేయించిన ఆహాజు మేడగదిపైనున్న బలిపీఠములను, యెహోవా మందిరపు రెండు సాలలలో మనష్షే చేయించిన బలిపీఠములను రాజు పడ గొట్టించి ఛిన్నాభిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించెను.

12. mariyu yoodhaaraajulu cheyin̄china aahaaju mēḍagadhipainunna balipeeṭhamulanu, yehōvaa mandirapu reṇḍu saalalalō manashshē cheyin̄china balipeeṭhamulanu raaju paḍa goṭṭin̄chi chinnaabhinnamulugaa cheyin̄chi aa dhooḷini kidrōnu vaagulō pōyin̄chenu.

13. యెరూషలేము ఎదుట నున్న హేయమను పర్వతపు కుడిపార్శ్వమందు అష్తా రోతు అను సీదోనీయుల విగ్రహమునకును, కెమోషు అను మోయాబీయుల విగ్రహమునకును, మిల్కోము అను అమ్మోనీయుల విగ్రహమునకును ఇశ్రాయేలురాజైన సొలొ మోను కట్టించిన ఉన్నతస్థలములను రాజు అపవిత్రపరచి

13. yerooshalēmu eduṭa nunna hēyamanu parvathapu kuḍipaarshvamandu ashthaa rōthu anu seedōneeyula vigrahamunakunu, kemōshu anu mōyaabeeyula vigrahamunakunu, milkōmu anu ammōneeyula vigrahamunakunu ishraayēluraajaina solo mōnu kaṭṭin̄china unnathasthalamulanu raaju apavitraparachi

14. ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి, అషేరాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరశల్యములతో నింపెను.

14. aa prathimalanu thunakalugaa koṭṭin̄chi, ashēraadhevi prathimanu paḍagoṭṭin̄chi vaaṭi sthaanamulanu narashalyamulathoo nimpenu.

15. బేతేలులోనున్న బలిపీఠమును ఉన్నతస్థలమును, అనగా ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యరొబాము కట్టించిన ఆ ఉన్నత స్థలమును బలిపీఠమును అతడు పడగొట్టించి, ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి అషేరాదేవి ప్రతిమను కాల్చివేసెను.

15. bēthēlulōnunna balipeeṭamunu unnathasthalamunu, anagaa ishraayēlu vaaru paapamu cheyuṭaku kaarakuḍaina nebaathu kumaaruḍagu yarobaamu kaṭṭin̄china aa unnatha sthalamunu balipeeṭamunu athaḍu paḍagoṭṭin̄chi, aa unnatha sthalamunu kaalchi poḍumu agunaṭlugaa trokkin̄chi ashēraadhevi prathimanu kaalchivēsenu.

16. యోషీయా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులలోనున్న శల్యములను తెప్పించి, దైవ జనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠముమీద కాల్చి దాని అపవిత్రపరచెను.

16. yōsheeyaa aṭu thirigi acchaṭa parvathamandunna samaadhulanu chuchi kondarini pampi samaadhulalōnunna shalyamulanu teppin̄chi, daiva januḍu yehōvaa maaṭa chaaṭin̄chi cheppina prakaaramu vaaṭini balipeeṭhamumeeda kaalchi daani apavitraparachenu.

17. అంతట అతడునాకు కనబడుచున్న ఆ సమాధి యెవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు అది యూదాదేశమునుండి వచ్చి నీవు, బేతేలులోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధియని చెప్పిరి.

17. anthaṭa athaḍunaaku kanabaḍuchunna aa samaadhi yevaridani aḍiginappuḍu paṭṭaṇapu vaaru adhi yoodhaadheshamunuṇḍi vachi neevu, bēthēlulōni balipeeṭhamunaku chesina kriyalanu mundhugaa telipina daivajanuni samaadhiyani cheppiri.

18. అందు కతడుదానిని తప్పించుడి, యెవడును అతని శల్యములను తీయకూడదని చెప్పగా వారు అతని శల్యములను షోమ్రోను పట్టణమునుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి.

18. andu kathaḍudaanini thappin̄chuḍi, yevaḍunu athani shalyamulanu theeyakooḍadani cheppagaa vaaru athani shalyamulanu shomrōnu paṭṭaṇamunuṇḍi vachina pravaktha shalyamulanu thappin̄chiri.

19. మరియఇశ్రాయేలు రాజులు షోమ్రోను పట్టణములలో ఏ ఉన్నతస్థలములలో మందిర ములను కట్టించి యెహోవాకు కోపము పుట్టించిరో ఆ మందిరములన్నిటిని యోషీయా తీసివేసి, తాను బేతేలులో చేసిన క్రియలన్నిటి ప్రకారము వాటికి చేసెను.

19. mariyu ishraayēlu raajulu shomrōnu paṭṭaṇamulalō ē unnathasthalamulalō mandira mulanu kaṭṭin̄chi yehōvaaku kōpamu puṭṭin̄chirō aa mandiramulanniṭini yōsheeyaa theesivēsi, thaanu bēthēlulō chesina kriyalanniṭi prakaaramu vaaṭiki chesenu.

20. అచ్చట అతడు ఉన్నతస్థలములకు నియమింపబడిన యాజ కులనందరిని బలిపీఠముల మీద చంపించి వాటిమీద నరశల్య ములను కాల్పించి యెరూషలేమునకు తిరిగి వచ్చెను.

20. acchaṭa athaḍu unnathasthalamulaku niyamimpabaḍina yaaja kulanandarini balipeeṭhamula meeda champin̄chi vaaṭimeeda narashalya mulanu kaalpin̄chi yerooshalēmunaku thirigi vacchenu.

21. అంతట రాజునిబంధన గ్రంథమునందు వ్రాసి యున్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగను ఆచరించుడని జనులకందరికి ఆజ్ఞా పింపగా

21. anthaṭa raajunibandhana granthamunandu vraasi yunna prakaaramugaa mee dhevuḍaina yehōvaaku paskaapaṇḍuganu aacharin̄chuḍani janulakandariki aagnaa pimpagaa

22. ఇశ్రాయేలీయులకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినములనుండి ఇశ్రాయేలు రాజుల యొక్కయు యూదారాజులయొక్కయు దినములన్నిటి వరకు ఎన్నడును జరుగనంత గొప్పగా ఆ సమయమందు పస్కాపండుగ ఆచరింపబడెను.

22. ishraayēleeyulaku nyaayamu naḍipin̄china nyaayaadhipathulunna dinamulanuṇḍi ishraayēlu raajula yokkayu yoodhaaraajulayokkayu dinamulanniṭi varaku ennaḍunu jaruganantha goppagaa aa samayamandu paskaapaṇḍuga aacharimpabaḍenu.

23. ఈ పండుగ రాజైన యోషీయా యేలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు యెరూషలేములో యెహోవాకు ఆచరింపబడెను.

23. ee paṇḍuga raajaina yōsheeyaa yēlubaḍilō padunenimidava samvatsaramandu yerooshalēmulō yehōvaaku aacharimpabaḍenu.

24. మరియు కర్ణపిశాచి గలవారిని సోదెచెప్పువారిని గృహ దేవతలను విగ్రహ ములను, యూదాదేశమందును యెరూష లేమునందును కనబడిన విగ్రహములన్నిటిని యోషీయా తీసివేసి, యెహోవామందిరమందు యాజకుడైన హిల్కీ యాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను.

24. mariyu karṇapishaachi galavaarini sōdecheppuvaarini gruha dhevathalanu vigraha mulanu, yoodhaadheshamandunu yeroosha lēmunandunu kanabaḍina vigrahamulanniṭini yōsheeyaa theesivēsi, yehōvaamandiramandu yaajakuḍaina hilkee yaaku dorikina granthamandu vraasiyunna dharmashaastra vidhulanu sthiraparachuṭakai prayatnamu chesenu.

25. అతనికి పూర్వమున్న రాజులలో అతనివలె పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను పూర్ణబలముతోను యెహోవావైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రముచొప్పున చేసినవాడు ఒకడును లేడు; అతని తరువాతనైనను అతనివంటివాడు ఒకడును లేడు.

25. athaniki poorvamunna raajulalō athanivale poorṇahrudayamuthoonu poorṇaatmathoonu poorṇabalamuthoonu yehōvaavaipu thirigi mōshē niyamin̄china dharmashaastramuchoppuna chesinavaaḍu okaḍunu lēḍu; athani tharuvaathanainanu athanivaṇṭivaaḍu okaḍunu lēḍu.

26. అయినను మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమునుబట్టి ఆయన కోపాగ్ని యింకను చల్లారకుండ యూదామీద మండుచునే యుండెను.

26. ayinanu manashshē yehōvaaku puṭṭin̄china kōpamunubaṭṭi aayana kōpaagni yiṅkanu challaarakuṇḍa yoodhaameeda maṇḍuchunē yuṇḍenu.

27. కాబట్టి యెహోవానేను ఇశ్రాయేలువారిని వెళ్లగొట్టినట్లు యూదావారిని నా సముఖమునకు దూరముగా చేసి, నేను కోరుకొనిన యెరూషలేము పట్టణమును, నా నామమును అచ్చట ఉంచుదునని నేను చెప్పియున్న మందిరమును నేను విసర్జించెదనని అనుకొనియుండెను.

27. kaabaṭṭi yehōvaanēnu ishraayēluvaarini veḷlagoṭṭinaṭlu yoodhaavaarini naa samukhamunaku dooramugaa chesi, nēnu kōrukonina yerooshalēmu paṭṭaṇamunu, naa naamamunu acchaṭa un̄chudunani nēnu cheppiyunna mandiramunu nēnu visarjin̄chedhanani anukoniyuṇḍenu.

28. యోషీయా చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంత ముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

28. yōsheeyaa chesina yithara kaaryamulanu goorchiyu, athaḍu chesina daaninanthaṭinigoorchiyu yoodhaaraajula vrutthaantha mula granthamandu vraayabaḍiyunnadhi.

29. అతని దినముల యందు ఐగుప్తురాజైన ఫరోనెకో అష్షూరురాజుతో యుద్ధముచేయుటకై యూఫ్రటీసునది దగ్గరకు వెళ్లుచుండగా తన్ను ఎదుర్కొనవచ్చిన రాజైన యోషీయాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను.
ప్రకటన గ్రంథం 16:16

29. athani dinamula yandu aigupthuraajaina pharōnekō ashshooruraajuthoo yuddhamucheyuṭakai yoophraṭeesunadhi daggaraku veḷluchuṇḍagaa thannu edurkonavachina raajaina yōsheeyaanu megiddō daggara kanugoni athani champenu.

30. అతని సేవకులు అతని శవమును రథముమీద ఉంచి, మెగిద్దోనుండి యెరూష లేమునకు తీసికొనివచ్చి అతని సమాధియందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహో యాహాజును తీసికొని అతనికి పట్టాభిషేకముచేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగానుంచిరి.

30. athani sēvakulu athani shavamunu rathamumeeda un̄chi, megiddōnuṇḍi yeroosha lēmunaku theesikonivachi athani samaadhiyandu paathipeṭṭiri. Appuḍu dheshapu janulu yōsheeyaa kumaaruḍaina yehō yaahaajunu theesikoni athaniki paṭṭaabhishēkamuchesi athani thaṇḍriki maarugaa athanini raajugaanun̄chiri.

31. యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది మూడేండ్లవాడై యెరూషలేములో మూడు మాసములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన యిర్మీయా కుమార్తె యగు హమూటలు.

31. yehōyaahaaju ēlanaarambhin̄chinappuḍu iruvadhi mooḍēṇḍlavaaḍai yerooshalēmulō mooḍu maasamulu ēlenu. Athani thalli libnaa oorivaaḍaina yirmeeyaa kumaarthe yagu hamooṭalu.

32. ఇతడు తన పితరులు చేసినదంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడత నడచెను.

32. ithaḍu thana pitharulu chesinadanthaṭi prakaaramugaa yehōvaa drushṭiki cheḍunaḍatha naḍachenu.

33. ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండ ఫరోనెకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతనిని బంధక ములలో ఉంచి, దేశముమీద ఏబది మణుగుల వెండిని, రెండు మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి

33. ithaḍu yerooshalēmulō ēlubaḍi cheyakuṇḍa pharōnekō hamaathu dheshamandunna riblaa paṭṭaṇamandu athanini bandhaka mulalō un̄chi, dheshamumeeda ēbadhi maṇugula veṇḍini, reṇḍu maṇugula baṅgaaramunu pannugaa nirṇayin̄chi

34. యోషీయా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రియైన యోషీయాకు మారుగా రాజుగా నియమించి, అతనికి యెహోయాకీమను మారుపేరుపెట్టి యెహోయాహాజు ఐగుప్తుదేశమునకు కొనిపోగా అతడచ్చట మృతిబొందెను.

34. yōsheeyaa kumaaruḍaina elyaakeemunu athani thaṇḍriyaina yōsheeyaaku maarugaa raajugaa niyamin̄chi, athaniki yehōyaakeemanu maarupērupeṭṭi yehōyaahaaju aigupthudheshamunaku konipōgaa athaḍacchaṭa mruthibondhenu.

35. యెహోయాకీము ఫరో యిచ్చిన ఆజ్ఞచొప్పున దేశముమీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములను ఫరోకు చెల్లించుచువచ్చెను. దేశపు జనులయొద్దనుండి వారి వారికి నిర్ణయమైన చొప్పున వసూలుచేసి అతడు ఫరోనెకోకు చెల్లించెను.

35. yehōyaakeemu pharō yichina aagnachoppuna dheshamumeeda pannu nirṇayin̄chi aa veṇḍi baṅgaaramulanu pharōku chellin̄chuchuvacchenu. dheshapu janulayoddhanuṇḍi vaari vaariki nirṇayamaina choppuna vasooluchesi athaḍu pharōnekōku chellin̄chenu.

36. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేమున పదకొండు సంవత్సర ములు ఏలెను. అతని తల్లి రూమా ఊరివా డైన పెదాయా కుమార్తెయగు జెబూదా.

36. yehōyaakeemu ēlanaarambhin̄chinappuḍu iruvadhi yayidheṇḍlavaaḍai yerooshalēmuna padakoṇḍu samvatsara mulu ēlenu. Athani thalli roomaa oorivaa ḍaina pedaayaa kumaartheyagu jeboodaa.

37. ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడతనడిచెను.

37. ithaḍunu thana pitharula charyalanniṭi prakaaramugaa yehōvaa drushṭiki cheḍunaḍathanaḍichenu.


Shortcut Links
2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |

Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2023. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.