Kings I - 1 రాజులు 22 | View All

1. సిరియనులును ఇశ్రాయేలువారును మూడు సంవత్సర ములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి.

2 దినవృత్తాంతములు 18:1-34.

2. మూడవ సంవత్సరమందు యూదారాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలురాజునొద్దకు రాగా

యెహోషాపాతు ఇస్రాయేల్ రాజైన అహాబుతో వివాహం ద్వారా సంబంధం ఏర్పరచుకున్నాడు (2 దినవృత్తాంతములు 18:1). అహాబు కూతురు అతల్యా యెహోషాపాతు కొడుకు యెహోరాంను పెళ్ళాడింది. ఈ వివాహ ఫలితాలు యూదా జాతి మొత్తం పైన దుష్టప్రభావం చూపాయి. అహాబు కుటుంబం తాలూకు విషప్రభావం అతల్యా ద్వారా యూదాలో కూడా ప్రవేశించి అంతటా వ్యాపించింది. 2 రాజులు 8:16-18; 2 దినవృత్తాంతములు 22:1-3 2 దినవృత్తాంతములు 22:10 చూడండి. ఒక మంచి వ్యక్తి (యెహోషాపాతు – వ 43) తెలివితక్కువతనం వల్ల దేవుని ప్రజలకు గొప్ప కీడు వాటిల్లింది. వివాహ సంబంధాల విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే దేవుని ప్రజలకు చాలా హాని జరిగే అవకాశం ఉంది. 2 కోరింథీయులకు 6:14-18 లో ఇందుకు సంబంధించిన మంచి హెచ్చరికలున్నాయి.

3. ఇశ్రాయేలురాజు తన సేవకులను పిలిపించిరామోత్గిలాదు మనదని మీరెరుగుదురు; అయితే మనము సిరియా రాజు చేతిలోనుండి దాని తీసికొనక ఊరకున్నామని చెప్పి

“రామోత్ గిలాదు”– ద్వితీయోపదేశకాండము 4:43; యెహోషువ 21:38.

4. యుద్ధము చేయుటకు నాతోకూడ నీవు రామోత్గిలాదునకు వచ్చెదవా అని యెహోషాపాతును అడిగెను. అందుకు యెహోషాపాతునేను నీవాడనే; నా జనులు నీ జనులే నా గుఱ్ఱములును నీ గుఱ్ఱములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పెను.

యెహోషాపాతుకు దేవుడంటే భయభక్తులు ఉన్నాయి (వ 13). అయితే అతడు దుర్మార్గుడైన అహాబుతో పొత్తు పెట్టుకుని చాలా పొరపాటు చేశాడు. అందువల్ల అతనిపై దేవునికి కోపం వచ్చింది. 2 దినవృత్తాంతములు 19:1-3 చూడండి.

5. పిమ్మట యెహోషాపాతునేడు యెహోవా యొద్ద విచారణచేయుదము రండని ఇశ్రాయేలు రాజుతో అనగా

“యెహోవా”– వ 43. అతడు తన కొడుకుకు అహాబు కూతుర్నిచ్చి పెళ్ళి చేయకముందు యెహోవా ఏమంటాడో అడగలేదు. ఈ తరువాతి వచనాల్లో దేవుడు మీకాయా ద్వారా పంపిన సలహాను లెక్కచెయ్యలేదు. దేవుడు చెప్పేదాన్ని అనుసరించుదామన్న నిర్ణయం లేనప్పుడు దేవుడు ఏమంటాడో చూడ్డం వల్ల లాభమేముంది?

6. ఇశ్రాయేలురాజు దాదాపు నాలుగు వందలమంది ప్రవక్తలను పిలిపించియుద్ధము చేయుటకు రామోత్గిలాదుమీదికి పోదునా పోకుందునా అని వారి నడిగెను. అందుకుయెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక

7. పొండని వారు చెప్పిరి గాని యెహోషాపాతువిచారణ చేయుటకై వీరు తప్పయెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగెను.

ఈ ప్రవక్తల గురించి యెహోషాపాతుకు పెద్దగా నమ్మకం కుదరలేదు (ఇందులో అతడు సందేహించడం మంచిదే). మరింత నిశ్చయమైన వాక్కు కోసం చూస్తున్నాడు.

8. అందుకు ఇశ్రాయేలురాజుఇవ్లూ కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు; అతనిద్వారా మనము యెహోవాయొద్ద విచారణ చేయవచ్చును గాని, అతడు నన్నుగూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతనియందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా యెహోషాపాతురాజైన మీరు ఆలా గనవద్దనెను.

“ద్వేషం”– 1 రాజులు 18:17; 1 రాజులు 21:20 చూడండి. అహాబుకు సత్యం అక్కర్లేదు. తనకిష్టమైన సందేశమే కావాలి. మనుషులు ఆధ్యాత్మిక విషయాలలో గొప్ప ఆత్మ వంచనలో పడిపోతూ, తమ పాపాల్లో రూపుమాసిపోవడానికి సాధారణంగా దారి తీసే మార్గం ఇదే. 2 థెస్సలొనీకయులకు 2:9-12 పోల్చి చూడండి.

9. అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారములో ఒకనిని పిలిచిఇవ్లూ కుమారుడైన మీకాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించుమని సెలవిచ్చెను.

“మీకాయా”– ఇక్కడా, 2 దినవృత్తాంతములు 18:7-27 లోనూ కనిపించే ఈ సంఘటన తప్ప ఈ ప్రవక్తను గురించి మరింకెక్కడా రాసిలేదు.

10. ఇశ్రాయేలు రాజును యూదారాజగు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని, షోమ్రోను గవిని దగ్గరనున్న విశాల స్థలమందు గద్దెలమీద ఆసీనులై యుండి, ప్రవక్తలందరును వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా

11. కెనయనా కుమారుడైన సిద్కియా యినుప కొమ్ములు చేయించుకొని వచ్చివీటిచేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చు చున్నాడని చెప్పెను.

ఇవన్నీ దేవుని పేరున అబద్ధాలే. ఇలాంటివాటి విషయం మనం జాగ్రత్తగా ఉండాలి.

12. ప్రవక్తలందరును ఆ చొప్పుననే ప్రకటన చేయుచుయెహోవా రామోత్గిలాదును రాజవైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దానిమీదికి పోయి జయమొందుదువు అని చెప్పిరి.

13. మీకాయాను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా

దేవుని నిజ ప్రవక్తలు తమ స్వంత సందేశాలను కల్పిస్తారని వారనుకున్నారా?

14. మీకాయాయెహోవా నాకు సెల విచ్చునదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలు కుదుననెను.

నిజ ప్రవక్త చేయగలిగినది ఇదే.

15. అతడు రాజునొద్దకు వచ్చినప్పుడు రాజుమీకాయా, నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోత్గిలాదు మీదికి పోదుమా పోకుందుమా అని యడుగగా అతడుయెహోవా దానిని రాజవైన నీ చేతికి నప్ప గించును గనుక నీవు దానిమీదికిపోయి జయమొందుదువని రాజుతో అనెను.

మీకాయా వ్యంగ్యంగా వెక్కిరింపు మాటలు పలికాడని అహాబుకు వెంటనే అర్థమైపోయింది (వ 16).

16. అందుకు రాజునీచేత ప్రమాణము చేయించి యెహోవా నామమునుబట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసినదని నేనెన్ని మారులు నీతో చెప్పితిని అని రాజు సెలవియ్యగా

వ 8. యెహోషాపాతు అక్కడున్నాడు కాబట్టి అహాబు ఇలా అన్నాడు.

17. అతడుఇశ్రాయేలీయు లందరును కాపరిలేని గొఱ్ఱెలవలెనే కొండలమీద చెదరి యుండుట నేను చూచితిని వారికి యజమానుడు లేడు; ఎవరి యింటికి వారు సమాధానముగా వెళ్లవలసినదని యెహోవా సెలవిచ్చెను అని చెప్పెను.
మత్తయి 9:36, మార్కు 6:34

తనకు సత్యం చెప్పమని అహాబు అన్నాడు గనుక మీకాయా సూటిగా ఉన్నది ఉన్నట్టు చెప్పాడు.

18. అప్పుడు ఇశ్రా యేలురాజు యెహోషాపాతును చూచిఇతడు నన్ను గూర్చి మేలుపలుకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా

19. మీకాయా యిట్లనెనుయెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము; యెహోవా సింహాసనాసీనుడై యుండగా పరలోకసైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమపార్శ్వమునను నిలిచి యుండుట నేను చూచితిని
ప్రకటన గ్రంథం 4:2, ప్రకటన గ్రంథం 4:9-10, ప్రకటన గ్రంథం 5:1-7-13, ప్రకటన గ్రంథం 6:16, ప్రకటన గ్రంథం 7:10, ప్రకటన గ్రంథం 7:15, ప్రకటన గ్రంథం 19:4, ప్రకటన గ్రంథం 21:5

దేవుడు సర్వాధికారి. దురాత్మలు కూడా ఆయన సంకల్పం మితులలోనే పని చేయగలుగుతాయి (1 దినవృత్తాంతములు 21:1; యోబు 1:6). దేవుడు అహాబుకు విపత్తు కల్పించాలనుకున్నాడు. దాన్ని నెరవేర్చే పద్ధతి ఇదే. వ్యక్తులు సత్యాన్ని తిరస్కరించి అబద్ధాలు వినేందుకే వేగిరపడితే వారికి ఆ అబద్ధాలే వినబడేలా దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఇలా చెయ్యడంలో దేవుడు పరిపూర్ణమైన న్యాయం కనపరుస్తున్నాడు. కీర్తనల గ్రంథము 18:25-26; న్యాయాధిపతులు 9:23; 1 సమూయేలు 16:14; యెహెఙ్కేలు 14:9; 2 థెస్సలొనీకయులకు 2:11 పోల్చి చూడండి.

20. అహాబు రామోత్గిలాదుమీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవియ్యగా, ఒకడు ఈ విధముగాను మరియొకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి.

21. అంతలో ఒక ఆత్మ యెదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడినేను అతనిని ప్రేరేపించెదననగా యెహోవాఏ ప్రకారము నీవతని ప్రేరేపించుదువని అతని నడిగెను.

22. అందుకతడునేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయననీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు; పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను.

23. యెహోవా నిన్నుగూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు.

24. మీకాయా యిట్లనగా, కెనయనా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చినీతో మాటలాడుటకు యెహోవా ఆత్మ నాయొద్దనుండి ఏవైపుగా పోయెనని చెప్పి మీకాయాను చెంపమీద కొట్టెను.

25. అందుకు మీకాయా దాగుకొనుటకై నీవు ఆ యా గదులలోనికి చొరబడు నాడు అది నీకు తెలియ వచ్చునని అతనితో చెప్పెను.

సిద్కియా మీదికి రాబోయే ప్రమాదం నుంచి అతడు దాక్కుంటాడని మీకాయా సూచిస్తున్నాడు.

26. అప్పుడు ఇశ్రాయేలు రాజుమీకాయాను పట్టుకొని తీసికొని పోయి పట్టణపు అధికారియైన ఆమోనునకును రాజకుమారుడైన యోవాషు నకును అప్పగించి
హెబ్రీయులకు 11:36

27. బందీగృహములో ఉంచి, మేము క్షేమముగా తిరిగివచ్చువరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఈయుడని ఆజ్ఞ ఇచ్చెను.
హెబ్రీయులకు 11:36

“ఖైదులో”– సత్యం చెప్పినందుకు మీకాయాకు దక్కిన ఫలితం. దేవుని ప్రవక్తలకు ఇలాంటి బాధలు సాధారణమే. (2 దినవృత్తాంతములు 16:10; యిర్మియా 20:2; యిర్మియా 37:15; మత్తయి 14:3; అపో. కార్యములు 12:3-4; అపో. కార్యములు 16:22-24).

28. అప్పుడు మీకాయా ఈలాగు చెప్పెను సకలజనులారా, నా మాట ఆలకించు డని చెప్పెనురాజవైన నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చినయెడల యెహోవా నాచేత పలుకలేదు.

ద్వితీయోపదేశకాండము 18:21-22.

29. ఇశ్రాయేలు రాజును యూదారాజగు యెహోషా పాతును రామోత్గిలాదు మీదికి పోవుచుండగా

వ 3,4.

30. ఇశ్రా యేలురాజునేను మారువేషము వేసికొని యుద్ధములో ప్రవేశించెదను, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవే శించుమని యెహోషాపాతుతో చెప్పి మారువేషము వేసికొని యుద్ధమందు ప్రవేశించెను.

అహాబును మీకాయా భవిష్యద్వాక్కులు కలవర పెట్టినట్టున్నాయి. అయితే తన మారు వేషాలన్నిటినీ దేవుడు పసిగట్టగలడని అతడు గ్రహించలేదా? హెబ్రీయులకు 4:13 చూడండి.

31. సరియారాజు తన రథ ములమీద అధికారులైన ముప్పది ఇద్దరు అధిపతులను పిలి పించి అల్పులతోనైనను ఘనులతోనైనను మీరు పోట్లాడవద్దు; ఇశ్రాయేలురాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఇచ్చియుండగా

తన తెలివితక్కువ సేవకుని పట్ల దేవుడు జాలి చూపాడు.

32. రథాధిపతులు యెహోషాపాతును చూచియితడే ఇశ్రాయేలు రాజనుకొని అతనితో పోట్లాడుటకు అతని మీదికి వచ్చిరి. యెహోషాపాతు కేకలువేయగా

33. రథాధిపతులు అతడు ఇశ్రాయేలురాజు కానట్టు గురుతుపట్టి అతని తరుముట మానివేసిరి.

34. పమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఇశ్రాయేలు రాజుకు కవచపుకీలు మధ్యను తగిలెను గనుక అతడునాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసికొని పొమ్మని తన సారధితో చెప్పెను.

అహాబు దేవుని తీర్పును తప్పించుకోలేక పోయాడు. దేవుడు పంపిన సందేశం కంటే తనకిష్టమైన దాన్నే ఎంచుకున్నాడు. అందుకు ఫలితాన్ని అతడే అనుభవించవలసి వచ్చింది. గురి పెట్టకుండానే వేసిన బాణం అనుకోకుండా జరిగిన సంగతి కాదు. పరిస్థితులన్నిటి పైనా దేవుడే సర్వాధికారి. దేన్నైనా అదుపు చేయగలిగినట్టే ఎగిరి వచ్చే బాణం గతిని కూడా ఆయన అదుపు చేయగలడు.

35. నాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియనుల యెదుట అతని రథముమీద నిలువ బెట్టిరి; అస్తమయమందు అతడు మరణమాయెను; తగిలిన గాయములోనుండి అతని రక్తము కారి రథములో మడుగు గట్టెను.

36. సూర్యాస్తమయ సమయమందు దండువారందరు తమ తమ పట్టణములకును దేశములకును వెళ్లి పోవచ్చు నని ప్రచురమాయెను.

37. ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనునకు కొనిపోబడి షోమ్రోనులో పాతిపెట్టబడెను.

38. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను.

1 రాజులు 21:17-19.

39. అహాబు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానంతటినిగూర్చియు, అతడు కట్టించిన దంతపు ఇంటినిగూర్చియు, అతడు కట్టించిన పట్టణములను గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథ మందు వ్రాయబడియున్నది.

అహాబు పట్టణాలు, భవనాలు కట్టించడంలో దిట్ట. అయితే ఆధ్యాత్మిక విషయాలలో అంత గొప్ప వినాశకారి. “చరిత్ర గ్రంథం”– 1 రాజులు 14:19.

40. అహాబు తన పితరులతో కూడ నిద్రించగా అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను.

“కన్ను మూసి”– 1 రాజులు 2:10 నోట్.

41. ఆసా కుమారుడైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహాబు ఏలుబడిలో నాలుగవ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను.

2 దినవృత్తాంతములు 20:31-33.

42. యెహోషాపాతు ఏల నారంభించినప్పుడు అతడు ముప్పది యయిదేండ్లవాడై యెరూషలేములో యిరువది యైదేండ్లు ఏలెను; అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్హీకుమార్తెయై యుండెను.

43. అతడు తన తండ్రియైన ఆసాయొక్క మార్గములన్నిటి ననుసరించి, యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించుచు వచ్చెను. అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు; ఉన్నత స్థలములలో జనులు ఇంకను బలులు అర్పిం చుచు ధూపము వేయుచు నుండిరి.

“ఆసా”– 1 రాజులు 15:11-14. “ఎత్తయిన పూజా స్థలాలు”– 1 రాజులు 3:2 నోట్.

44. యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో సంధిచేసెను.

45. యెహోషాపాతు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు కనుపరచిన బలమునుగూర్చియు, అతడు యుద్థముచేసిన విధమును గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

“చరిత్ర గ్రంథం”– 1 రాజులు 14:19.

46. తన తండ్రియైన ఆసాదినములలో శేషించియుండిన పురుషగాములను అతడు దేశములోనుండి వెళ్లగొట్టెను.

1 రాజులు 14:24 నోట్.

47. ఆ కాలమందు ఎదోము దేశమునకు రాజు లేకపోయెను; ప్రధానియైన యొకడు రాజ్యపాలనము చేయుచుండెను.

48. యెహోషాపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరుదేశమునకు పోవుటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఎసోన్గెబెరునొద్ద బద్దలై పోయెను.

దుష్టుడైన అహాబుతో పొత్తు పెట్టుకున్నందుకు ఇది దేవుని శిక్ష. 2 దినవృత్తాంతములు 20:35-37 చూడండి.

49. అహాబు కుమారుడైన అహజ్యానా సేవకులను నీ సేవకులతో కూడ ఓడలమీద పోనిమ్మని యెహోషా పాతు నడుగగా యెహోషాపాతు దానికి ఒప్పలేదు.

50. పమ్మట యెహోషా పాతు తన పితరులతోకూడ నిద్రించి, తన పితరుడైన దావీదుపురమందు తన పితరులతోకూడ పాతిపెట్ట బడెను; అతని కుమారుడైన యెహోరాము అతనికి మారుగా రాజాయెను.

51. అహాబు కుమారుడైన అహజ్యా యూదారాజైన యెహోషాపాతు ఏలుబడిలో పదునేడవ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి రెండు సంవ త్సరములు ఇశ్రాయేలును ఏలెను.

52. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి,తన తలిదండ్రు లిద్దరి ప్రవర్త నను, ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యరొబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచు వచ్చెను.

1 రాజులు 12:28-33; 1 రాజులు 16:30-32; 1 రాజులు 21:25-26.

53. అతడు బయలు దేవతను పూజిం చుచు, వానికి నమస్కారము చేయుచు, తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.

“బయల్”– న్యాయాధిపతులు 2:11 దగ్గర నోట్. “కోపం”– సంఖ్యాకాండము 25:3; కీర్తనల గ్రంథము 90:7-11 దగ్గర నోట్స్.


Shortcut Links
1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |

Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.