Genesis - ఆదికాండము 36 | View All

1. ఎదోమను ఏశావు వంశావళి ఇదే,

1. Now this [is] the genealogy of Esau, who is Edom.

2. ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తెయైన అనా కుమార్తెయగు అహోలీబామాను,

2. Esau took his wives from the daughters of Canaan: Adah the daughter of Elon the Hittite; Aholibamah the daughter of Anah, the daughter of Zibeon the Hivite;

3. ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియు నైన బాశెమతును పెండ్లియాడెను.

3. and Basemath, Ishmael's daughter, sister of Nebajoth.

4. ఆదా ఏశావునకు ఎలీఫజును కనెను. బాశెమతు రగూయేలును కనెను.

4. Now Adah bore Eliphaz to Esau, and Basemath bore Reuel.

5. అహోలీబామా యూషును యాలామును కోరహును కనెను. కనాను దేశములో ఏశావునకు పుట్టిన కుమారులు వీరే.

5. And Aholibamah bore Jeush, Jaalam, and Korah. These [were] the sons of Esau who were born to him in the land of Canaan.

6. ఏశావు తన భార్యలను తన కుమారులను తన కుమార్తెలను తన యింటివారినందరిని తన మందలను తన సమస్త పశువులను తాను కనాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తును తీసికొని తన తమ్ముడైన యాకోబు ఎదుటనుండి మరియొక దేశమునకు వెళ్లిపోయెను;

6. Then Esau took his wives, his sons, his daughters, and all the persons of his household, his cattle and all his animals, and all his goods which he had gained in the land of Canaan, and went to a country away from the presence of his brother Jacob.

7. వారు విస్తారమయిన సంపదగలవారు గనుక వారు కలిసి నివసింపలేక పోయిరి. వారి పశువులు విశేషమైయున్నందున వారు పరదేశులై యుండిన భూమి వారిని భరింపలేక పోయెను.

7. For their possessions were too great for them to dwell together, and the land where they were strangers could not support them because of their livestock.

8. అప్పుడు ఏశావు శేయీరు మన్యములో నివసించెను. ఏశావు అనగా ఎదోము.

8. So Esau dwelt in Mount Seir. Esau [is] Edom.

9. శేయీరు మన్యములో నివసించిన ఎదోమీయుల తండ్రియైన ఏశావు వంశావళి ఇదే,

9. And this [is] the genealogy of Esau the father of the Edomites in Mount Seir.

10. ఏశావు కుమారుల పేరులు ఇవే. ఏశావు భార్యయైన ఆదా కుమారుడగు ఎలీఫజును ఏశావు భార్యయైన బాశెమతు కుమారుడగు రగూయేలును.

10. These [were] the names of Esau's sons: Eliphaz the son of Adah the wife of Esau, and Reuel the son of Basemath the wife of Esau.

11. ఎలీఫజు కుమారులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు. తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని.

11. And the sons of Eliphaz were Teman, Omar, Zepho, Gatam, and Kenaz.

12. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్యయైన ఆదా కుమారులు.

12. Now Timna was the concubine of Eliphaz, Esau's son, and she bore Amalek to Eliphaz. These [were] the sons of Adah, Esau's wife.

13. రగూయేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ; వీరు ఏశావు భార్యయైన బాశెమతు కుమారులు.

13. These [were] the sons of Reuel: Nahath, Zerah, Shammah, and Mizzah. These were the sons of Basemath, Esau's wife.

14. ఏశావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు అనా కుమార్తెయునైన అహొలీబామా కుమారులు ఎవరనగా ఆమె ఏశావునకు కనిన యూషు యాలాము కోరహు.

14. These were the sons of Aholibamah, Esau's wife, the daughter of Anah, the daughter of Zibeon. And she bore to Esau: Jeush, Jaalam, and Korah.

15. ఏశావు కుమారులలో వీరు నాయకులు; ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు, తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు,

15. These [were] the chiefs of the sons of Esau. The sons of Eliphaz, the firstborn [son] of Esau, were Chief Teman, Chief Omar, Chief Zepho, Chief Kenaz,

16. కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఎదోము దేశమందు ఎలీఫజు నాయ కులు. వీరు ఆదా కుమారులు.

16. Chief Korah, Chief Gatam, [and] Chief Amalek. These [were] the chiefs of Eliphaz in the land of Edom. They [were] the sons of Adah.

17. వీరు ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు, నహతు నాయకుడు జెరహు నాయకుడు షమ్మా నాయకుడు మిజ్జ నాయకుడు; వీరు ఎదోము దేశమందు రగూయేలు సంతానపు నాయకులు. వీరు ఏశావు భార్యయైన బాశెమతు కుమారులు.

17. These [were] the sons of Reuel, Esau's son: Chief Nahath, Chief Zerah, Chief Shammah, and Chief Mizzah. These [were] the chiefs of Reuel in the land of Edom. These [were] the sons of Basemath, Esau's wife.

18. వీరు ఏశావు భార్యయైన అహొలీబామా కుమారులు, యూషు నాయకుడు యగ్లాము నాయకుడు కోరహు నాయకుడు; వీరు అనా కుమార్తెయు ఏశావు భార్యయునైన అహొలీ బామా పుత్రసంతానపు నాయకులు.

18. And these [were] the sons of Aholibamah, Esau's wife: Chief Jeush, Chief Jaalam, and Chief Korah. These [were] the chiefs [who descended] from Aholibamah, Esau's wife, the daughter of Anah.

19. ఎదోమను ఏశావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు.

19. These [were] the sons of Esau, who is Edom, and these [were] their chiefs.

20. ఆ దేశ నివాసులైన హోరీయుడైన శేయీరు కుమారులు, లోతాను శోబాలు సిబ్యోను అనా

20. These [were] the sons of Seir the Horite who inhabited the land: Lotan, Shobal, Zibeon, Anah,

21. దిషోను ఏసెరు దీషాను. వీరు ఎదోము దేశమందు శేయీరు పుత్రులైన హోరీయుల నాయకులు.

21. Dishon, Ezer, and Dishan. These [were] the chiefs of the Horites, the sons of Seir, in the land of Edom.

22. లోతాను కుమారులు హోరీ హేమీము; లోతాను సహోదరి తిమ్నా

22. And the sons of Lotan were Hori and Hemam. Lotan's sister [was] Timna.

23. శోబాలు కుమారులు అల్వాను మానహదు ఏబాలు షపో ఓనాము.

23. These [were] the sons of Shobal: Alvan, Manahath, Ebal, Shepho, and Onam.

24. సిబ్యోను కుమారులు అయ్యా అనా; ఆ అనా తన తండ్రియైన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణధారలు కనుగొనిన వాడు.

24. These [were] the sons of Zibeon: both Ajah and Anah. This [was the] Anah who found the water in the wilderness as he pastured the donkeys of his father Zibeon.

25. అనా సంతానము దిషోను అనా కుమార్తెయైన అహొలీబామా.

25. These [were] the children of Anah: Dishon and Aholibamah the daughter of Anah.

26. దిషోను కుమారులు హెవ్దూను ఎష్బాను ఇత్రాను కెరాను

26. These [were] the sons of Dishon: Hemdan, Eshban, Ithran, and Cheran.

27. These [were] the sons of Ezer: Bilhan, Zaavan, and Akan.

28. దీషాను కుమారులు ఊజు అరాను.

28. These [were] the sons of Dishan: Uz and Aran.

29. హోరీయుల నాయకులు, లోతాను నాయకుడు శోబాలు నాయకుడు సిబ్యోను నాయకుడు అనా నాయకుడు

29. These [were] the chiefs of the Horites: Chief Lotan, Chief Shobal, Chief Zibeon, Chief Anah,

30. దిషోను నాయకుడు ఏసెరు నాయకుడు దీషాను నాయకుడు. శేయీరు దేశమందలి వారి నాయకుల చొప్పున వీరు హోరీయుల నాయకులు.

30. Chief Dishon, Chief Ezer, and Chief Dishan. These [were] the chiefs of the Horites, according to their chiefs in the land of Seir.

31. మరియు ఏ రాజైనను ఇశ్రాయేలీయుల మీద రాజ్య పరిపాలన చేయకమునుపు, ఎదోము దేశములో రాజ్యపరిపాలన చేసినరాజు లెవరనగా

31. Now these [were] the kings who reigned in the land of Edom before any king reigned over the children of Israel:

32. బెయారు కుమారుడైన బెల ఎదోములో రాజ్యపరిపాలన చేసెను. అతని ఊరి పేరు దిన్హాబా

32. Bela the son of Beor reigned in Edom, and the name of his city [was] Dinhabah.

33. బెల చనిపోయిన తరువాత బొస్రా వాడైన జెరహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయెను.

33. And when Bela died, Jobab the son of Zerah of Bozrah reigned in his place.

34. యోబాబు చనిపోయిన తరువాత తేమనీయుల దేశస్థుడైన హుషాము అతనికి ప్రతిగా రాజాయెను.

34. When Jobab died, Husham of the land of the Temanites reigned in his place.

35. హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమందు మిద్యానును కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు అవీతు.

35. And when Husham died, Hadad the son of Bedad, who attacked Midian in the field of Moab, reigned in his place. And the name of his city [was] Avith.

36. హదదు చనిపోయిన తరువాత మశ్రేకావాడైన శమ్లా అతనికి ప్రతిగా రాజాయెను.

36. When Hadad died, Samlah of Masrekah reigned in his place.

37. శమ్లా చనిపోయిన తరువాత నదీతీర మందలి రహెబోతువాడైన షావూలు అతనికి ప్రతిగా రాజాయెను.

37. And when Samlah died, Saul of Rehoboth-[by-the-River] reigned in his place.

38. షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్‌ హానాను అతనికి ప్రతిగా రాజాయెను.

38. When Saul died, Baal-Hanan the son of Achbor reigned in his place.

39. అక్బోరు కుమారుడైన బయల్‌ హానాను చనిపోయినతరువాత హదరు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదు కుమార్తె.

39. And when Baal-Hanan the son of Achbor died, Hadar reigned in his place; and the name of his city [was] Pau. His wife's name [was] Mehetabel, the daughter of Matred, the daughter of Mezahab.

40. మరియు వారివారి వంశముల ప్రకారము వారివారి స్థలములలో వారివారి పేరుల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేరులేవనగా తిమ్నా నాయకుడు అల్వా నాయకుడు యతేతు నాయకుడు

40. And these [were] the names of the chiefs of Esau, according to their families and their places, by their names: Chief Timnah, Chief Alvah, Chief Jetheth,

41. అహొలీబామా నాయకుడు ఏలా నాయకుడు పీనోను నాయకుడు

41. Chief Aholibamah, Chief Elah, Chief Pinon,

42. కనజు నాయకుడు తేమాను నాయకుడు మిబ్సారు నాయకుడు

42. Chief Kenaz, Chief Teman, Chief Mibzar,

43. మగ్దీయేలు నాయకుడు ఈరాము నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమతమ నివాసస్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏశావు ఎదోమీయులకు మూల పురుషుడు.

43. Chief Magdiel, and Chief Iram. These [were] the chiefs of Edom, according to their dwelling places in the land of their possession. Esau [was] the father of the Edomites.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Genesis - ఆదికాండము 36 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
ఏశావు మరియు అతని వారసులు.
కథలోని ఈ భాగం దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎలా నిలబెట్టుకున్నాడు అనే దాని గురించి మాట్లాడుతుంది. ఏశావు అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు, అతను ముఖ్యమైన విషయాల గురించి పట్టించుకోడు మరియు ఆహారం గురించి మాత్రమే శ్రద్ధ చూపుతాడు. అతను తన ప్రత్యేక హక్కులను కొంత ఆహారం కోసం తన సోదరుడికి విక్రయించాడు. ఏశావు ధనవంతుడు మరియు శక్తివంతుడైనప్పటికీ, దేవుని ప్రత్యేక వ్యక్తులకు ఇంకా ఆ విషయాలు లేవు, ఎందుకంటే వారు దేవుని వాగ్దానము నిజమయ్యే వరకు వేచి ఉన్నారు. వారు ఈజిప్టులో బానిసలుగా జీవిస్తున్నారు, శేయీరు అనే ప్రదేశంలో ప్రజలకు కావలసినవన్నీ ఉన్నాయి. అయితే అది కష్టమైనప్పటికీ, దేవుడు తన వాగ్దానాన్ని తన సమయానికి నిలబెట్టుకుంటాడని దేవుని ప్రత్యేక వ్యక్తులు విశ్వసించవలసి వచ్చింది. సెయిర్‌లోని ప్రజలు వారు కోరుకున్నవన్నీ ఇప్పటికే కలిగి ఉన్నారు, అయితే దేవుని ప్రత్యేక వ్యక్తులు దేవునిపై వేచి ఉండి విశ్వసించవలసి వచ్చింది. లూకా 16:25 దేవుని పిల్లలకు చాలా ఆశలు ఉన్నాయి కానీ ప్రస్తుతం చాలా అంశాలు లేవు. కానీ ప్రస్తుతం ఏదైనా సరిగ్గా ఉండటం కంటే మనం తర్వాత గొప్పదాన్ని (ప్రత్యేకమైన భూమి వంటివి) పొందుతామని తెలుసుకోవడం ఉత్తమం.


Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |