Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
23
Saturday, November 2024
Change Date :
Previous
|
Next
Organized from Old Testament, New Testament, Psalms & Proverbs. Read and Complete Telugu Bible in One Year!
Ezekiel 45
1. మీరు చీట్లువేసి దేశమును విభాగించునప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్ఠితార్పణముగా యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. దానికి ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడల్పును ఉండవలెను, ఈ సరిహద్దులన్నిటిలోగానున్న భూమి ప్రతిష్ఠితమగును.
2. దానిలో పరిశుద్ధస్థలమునకు ఐదువందల కొలకఱ్ఱల చచ్చౌకము ఏర్పడవలెను; దానికి నలుదిశల ఏబది మూరల మైదానముండవలెను,
3. కొలువబడిన యీ స్థలము నుండి ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడుల్పునుగల యొకచోటు కొలిచివేయవలెను. అందులో మహా పరిశుద్ధస్థలముగా ఉన్న పరిశుద్ధస్థలముండును.
4. యెహోవాకు పరిచర్యచేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్యచేయుచున్న యాజకులకు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును; అది వారి యిండ్లకు నివేశమై పరిశుద్ధస్థలమునకు ప్రతిష్ఠితముగా ఉండును. మందిరములో పరిచర్య చేయుచున్న లేవీయులు ఇండ్లు కట్టుకొని నివసించునట్లు
5. ఇరువదియైదు వేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడల్పును గల యొక ప్రదేశమును వారికి స్వాస్థ్యముగా ఇరువది గదులను ఏర్పాటు చేయవలెను.
6. మరియు పట్టణమునకై అయిదువేల కొలకఱ్ఱల వెడల్పును ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియుగల యొక ప్రదేశము ఏర్పాటు చేయవలెను. అది ప్రతిష్ఠితమగు భాగమునకు సరిగా ఉండవలెను, ఇశ్రాయేలీయులకందరికి అది స్వాస్థ్యముగా ఉండును.
7. మరియు ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై యేర్పడిన ప్రదేశమునకును ఎదురుగా వాటికి పడమటగాను తూర్పుగాను, ప్రతిష్ఠితభాగమునకును పట్టణమునకై యేర్పడిన దేశమునకును ఇరుప్రక్కల అధిపతికి భూమి నేర్పాటుచేయవలెను. పడమటినుండి తూర్పు వరకు దాని కొలువగా అదియొక గోత్రస్థానమునకు సరిపడు నిడివిగలదై యుండవలెను. అధిపతి యిక నా జనులను బాధింపక వారి గోత్రములనుబట్టి భూమి అంతయు ఇశ్రాయేలీయులకు నియమించునట్లు
8. అది ఇశ్రాయేలీయులలో అతనికి భూస్వాస్థ్యముగా ఉండును.
9. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇశ్రాయేలీయుల అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును; ఆలాగు చేయుట మాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
10. ఖరా త్రాసులను ఖరా పడిని ఖరా తూమును ఒక్కటే పడియు ఒక్కటే తూమును మీరుంచుకొనవలెను.
11. తూము పందుములో పదియవ పాలు పట్టునదై యుండవలెను, పందుము మీకు పరిమాణముగా నుండవలెను.
12. తులమొకటింటికి ఇరువది చిన్నముల యెత్తును, అరవీసె యొకటింటికి ఇరువది తులముల యెత్తును, ఇరువదియైదు తులముల యెత్తును పదునైదు తులముల యెత్తును ఉండవలెను.
13. ప్రతిష్ఠితార్పణలు ఈ ప్రకారముగా చెల్లింపవలెను. నూట ఎనుబది పళ్ల గోధుమలలో మూడు పళ్లవంతునను నూట ఎనుబది పళ్లయవలలో మూడు పళ్లవంతునను చెల్లింపవలెను.
14. తైలము చెల్లించునదెట్లనగా నూట ఎనుబది పళ్ల నూనెలో పడియు ముప్పాతికవంతున చెల్లింపవలెను. తూము నూట ఎనుబది పళ్లు పట్టునదగును.
15. మరియు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై నైవేద్యమునకును దహనబలికిని సమాధాన బలికిని మంచి మేపుతగిలిన గొఱ్ఱెలలో మందకు రెండువందలలో ఒకదానిని తేవలెను.
16. ఇశ్రాయేలీయులలోని అధిపతికి చెల్లింపవలసిన యీ అర్పణము ఈ ప్రకారముగా తెచ్చుటకు దేశమునకు చేరిన జనులందరును బద్ధులైయుందురు.
17. పండుగలలోను, అమావాస్య దినములలోను, విశ్రాంతిదినములలోను, ఇశ్రాయేలీయులు కూడుకొను నియామకకాలములలోను వాడబడు దహనబలులను నైవేద్యములను పానార్పణములను సరిచూచుట అధిపతి భారము. అతడు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై పాపపరిహారార్థ బలిపశువులను నైవేద్యములను దహనబలులను సమాధాన బలిపశువులను సిధ్దపరచవలెను.
18. ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడెను తీసికొని పరిశుద్ధస్థలము నిమిత్తము పాపపరిహారార్థబలి నర్పింపవలెను.
19. ఎట్లనగా యాజకుడు పాపపరిహారార్థబలి పశురక్తము కొంచెము తీసి, మందిరపు ద్వారబంధములమీదను బలిపీఠవు చూరు నాలుగు మూలలమీదను లోపటి ఆవరణపు వాకిటి ద్వారబంధములమీదను ప్రోక్షింపవలెను.
20. తెలియక తప్పిపోయిన వారిని విడిపించునట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై నెల యేడవ దినమందు ఆలాగు చేయవలెను.
21. మొదటి నెల పదునాలుగవ దినమున పస్కాపండుగ ఆచరింపవలెను; ఏడు దినములు దాని నాచరింపవలెను. అందులో పులియని ఆహారము తినవలెను.
22. ఆ దినమున అధిపతి తనకును దేశమునకు చేరిన జనులందరికిని పాపపరిహారార్థబలిగా ఒక యెద్దును అర్పింపవలెను.
23. మరియు ఏడు దినములు అతడు నిర్దోషమైన యేడు ఎడ్లను ఏడు పొట్టేళ్ళను తీసికొని, దినమొక టింటికి ఒక యెద్దును ఒక పొట్టేలును దహనబలిగా యెహోవాకు అర్పింపవలెను; మరియు అనుదినము ఒక్కొక్క మేకపిల్లను పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను.
24. మరియు ఎద్దొకటింటికిని పొట్టేలొకటింటికిని తూము పిండిపట్టిన నైవేద్యము చేయవలెను. తూము ఒకటింటికి మూడు పళ్ల నూనె యుండవలెను.
25. మరియు ఏడవ నెల పదునైదవ దినమున పండుగ జరుగుచుండగా యాజకుడు ఏడు దినములు పండుగ ఆచరించుచు పాప పరిహారార్థబలి విషయములోను దహనబలివిషయములోను నైవేద్య విషయములోను నూనె విషయములోను ఆ ప్రకారముగానే చేయవలెను.
Ezekiel 46
1. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము, పనిచేయు ఆరు దినములు మూయబడియుండి, విశ్రాంతి దినమునను అమావాస్య దినమునను తీయబడియుండవలెను.
2. అధిపతి బయట మంటపమునకు పోవుమార్గముగా ప్రవేశించి, గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలువబడగా, యాజకులు దహనబలిపశువులను సమాధానబలిపశువులను అతనికి సిద్ధ పరచవలెను; అతడు గుమ్మముదగ్గర నిలువబడి ఆరాధనచేసిన తరువాత వెలుపలికి పోవును, అయితే సాయంకాలము కాకమునుపే గుమ్మము మూయకూడదు.
3. మరియు విశ్రాంతిదినములలోను అమావాస్యలలోను దేశజనులు ఆ తలుపుదగ్గర నిలువబడి యెహోవాకు ఆరాధన చేయవలెను.
4. విశ్రాంతిదినమున అధిపతి యెహోవాకు అర్పింపవలసిన దహనబలి యేదనగా, నిర్దోషమైన ఆరు గొఱ్ఱె పిల్లలును నిర్దోషమైన యొక పొట్టేలును.
5. పొట్టేలుతో తూమెడు పిండిగల నైవేద్యము చేయవలెను, గొఱ్ఱెపిల్లలతో కూడ శక్తికొలది నైవేద్యమును, తూము ఒకటింటికి మూడు పళ్ల నూనెయు తేవలెను.
6. అమావాస్యనాడు నిర్దోషమైన చిన్న కోడెను నిర్దోషమైన ఆరు గొఱ్ఱె పిల్లలను నిర్దోషమైన యొక పొట్టేలును అర్పింపవలెను.
7. నైవేద్యమును సిద్ధపరచవలెను, ఎద్దుతోను పొట్టేలుతోను తూమెడు పిండిని గొఱ్ఱెపిల్లలతో శక్తికొలది పిండిని అర్పింపవలెను, తూము ఒకటింటికి మూడు పళ్ల నూనె నైవేద్యము చేయవలెను.
8. అధిపతి ప్రవేశించునప్పుడు గుమ్మపు మంటపమార్గముగా ప్రవేశించి అతడు ఆ మార్గముగానే వెలుపలికి పోవలెను.
9. అయితే దేశజనులు నియామక కాలములయందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చునప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్ల వలెను, దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చినవారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. తాము వచ్చిన దారినే యెవరును తిరిగిపోక అందరును తిన్నగా వెలుపలికి పోవలెను.
10. అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించుదురు, వారు బయలు వెళ్లునప్పుడు అందరును కూడి బయలువెళ్లవలెను.
11. పండుగదినములలోను నియామక కాలములలోను ఎద్దుతోగాని పొట్టేలుతో గాని తూమెడు పిండియు, గొఱ్ఱెపిల్లలతో శక్తికొలది పిండియు, తూము ఒకటింటికి మూడుపళ్ల నూనెయు నైవేద్యముగా అర్పింపవలెను.
13. మరియు ప్రతి దినము నిర్దోషమైన యేడాది మగ గొఱ్ఱెపిల్లను దహన బలిగా అర్పింపవలెను; అనుదినము ఉదయమున దానిని అర్పింపవలెను. మరియు అనుదినము ఉదయమున దానితో నైవేద్యము చేయవలెను.
14. అది ఎట్లనగా తూమెడు గోధుమ పిండిలో ఆరవ పాలును పిండి కలుపుటకు పడి నూనెయు నుండవలెను; ఇవి ఎవరును రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు.
12. యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహనబలి నైనను స్వేచ్ఛార్పణమైన సమాధానబలినైనను అధిపతి యర్పించునప్పుడు తూర్పుతట్టు గుమ్మము తీయవలెను; విశ్రాంతి దినమున అర్పించునట్లు దహనబలిని సమాధానబలిని అర్పించి వెళ్లిపోవలెను; అతడు వెళ్లిపోయిన తరువాత గుమ్మము మూయబడవలెను.
15. గొఱ్ఱెపిల్లలను నైవేద్యమును నూనెను అనుదినము ఉదయముననే నిత్యదహనబలిగా అర్పింపవలెను.
16. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా అధిపతి తన కుమారులలో ఎవనికైనను భూమి ఇచ్చిన యెడల అది యతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారులదగును. అది వారసత్వమువలన వచ్చిన దానివంటి స్వాస్థ్యము.
17. అయితే అతడు తన పని వారిలో ఎవనికైనను భూమి ఇచ్చినయెడల విడుదల సంవత్సరమువరకే అది వాని హక్కై తరువాత అధిపతికి మరల వచ్చును; అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యమునకు మాత్రము హక్కుదారులగుదురు.
18. జనులు తమ స్వాస్థ్యము ననుభవింపకుండ అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు; నా జనులు తమ భూములను విడిచి చెదరిపోకుండునట్లు అతడు తన భూమిలోనుండి తన కుమారులకు భాగముల నియ్యవలెను.
19. పిమ్మట అతడు గుమ్మపు మధ్యగోడమార్గముగా ఉత్తర దిశ చూచుచున్న యాజకులకు ఏర్పడిన ప్రతిష్ఠితమైన గదులలోనికి నన్ను తీసికొనిరాగా అచ్చట వెనుకతట్టు పశ్చిమదిక్కున స్థలమొకటి కనబడెను.
20. ప్రతిష్ఠితములగు వస్తువులను బయటి ఆవరణములోనికి కొనివచ్చి యాజకులు జనులను ప్రతిష్ఠించుటకై వారు అపరాధపరిహారార్థ బలిపశుమాంసమును పాపపరిహారార్థ బలిపశుమాంసమును వండుచు నైవేద్యములను కాల్చుచుండు స్థలమిదియే యని నాతోచెప్పి
21. అతడు బయటి ఆవరణములోనికి నన్ను తీసికొనివచ్చి ఆవరణపు నాలుగు మూలలను నన్ను త్రిప్పగా, ఆవరణముయొక్క మూలమూలను మరియొక ఆవరణమున్నట్టు కనబడెను.
22. ఆవరణపు మూలమూలను ఆవరింపబడిన ఆవరణమొకటి కనబడెను. ఒక్కొక్కటి నలువది మూరల నిడివియు ముప్పది మూరల వెడల్పును గలిగి నాలుగును ఏకపరిమాణముగా ఉండెను.
23. మరియు ఆ నాలుగింటిలోను చుట్టు పంక్తిగానున్న అటకలుండెను, చుట్టునున్న అటకల క్రింద పొయిలుండెను.
24. ఇది వంటచేయువారి స్థలము, ఇక్కడ మందిరపరిచారకులు జనులు తెచ్చు బలిపశుమాంసమును వండుదురని ఆయన నాతో చెప్పెను.
1 Peter 3
1. అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి;
2. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతోకూడిన మీ పవిత్రప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.
3. జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక,
4. సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.
5. అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి.
6. ఆ ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడియుండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు, ఏ భయమునకు బెదరకయున్నయెడల ఆమెకు పిల్లలగుదురు.
7. అటువలెనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగక
8. తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.
9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.
10. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను.
11. అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను.
12. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది.
13. మీరు మంచి విషయములో ఆసక్తిగలవారైతే మీకు హానిచేయువాడెవడు?
14. మీరొకవేళ నీతినిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే; వారి బెదరింపునకు భయపడకుడి కలవరపడకుడి;
15. నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి;
16. అప్పుడు మీరు దేనివిషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు.
17. దేవుని చిత్త మాలాగున్నయెడల కీడుచేసి శ్రమపడుటకంటె మేలుచేసి శ్రమపడుటయే బహు మంచిది.
18. ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరవిషయములో చంపబడియు,
19. ఆత్మవిషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను.
20. దేవుని దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైనవారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపి గానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటిద్వారా రక్షణపొందిరి.
21. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది; అదేదనగా శరీరమాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.
22. ఆయన పరలోకమునకు వెళ్లి దూతలమీదను అధికారుల మీదను శక్తులమీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు.
Proverbs 28
18. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును మూర్ఖప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును.
19. తన పొలము సేద్యము చేసికొనువానికి కడుపునిండన్నము దొరకును వ్యర్థమైనవాటిని అనుసరించువారికి కలుగు పేదరికము ఇంతంతకాదు.
20. నమ్మకమైనవానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందకపోడు.
21. పక్షపాతము చూపుట మంచిది కాదు రొట్టెముక్కకొరకు ఒకడు దోషముచేయును.
22. చెడు దృష్టిగలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు.
23. నాలుకతో ఇచ్చకములాడు వానికంటె నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయపొందును.
24. తన తలిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహముకాదనుకొనువాడు నశింపజేయువానికి జతకాడు.
25. పేరాసగలవాడు కలహమును రేపును యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును.
26. తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును.
27. బీదలకిచ్చువానికి లేమి కలుగదు కన్నులు మూసికొనువానికి బహు శాపములు కలుగును.
28. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు వారు నశించునప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు.