Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
4
Wednesday, September 2024
Change Date :
Previous
|
Next
Organized from Old Testament, New Testament, Psalms & Proverbs. Read and Complete Telugu Bible in One Year!
Isaiah 8
11. ఈ జనులమార్గమున నడువకూడదని యెహోవా బహు బలముగా నాతో చెప్పియున్నాడు; నన్ను గద్దించి యీ మాట సెలవిచ్చెను
12. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి వారు భయపడుదానికి భయపడకుడి దానివలన దిగులు పడకుడి.
13. సైన్యములకధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి మీరు భయపడవలసినవాడు ఆయనే, ఆయన కోసరమే దిగులుపడవలెను అప్పుడాయన మీకు పరిశుద్ధస్థలముగా నుండును.
14. అయితే ఆయన ఇశ్రాయేలుయొక్క రెండు కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును
15. అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి కాళ్లు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు.
16. ఈ ప్రమాణవాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యుల కప్పగింపుము.
17. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగుచేసి కొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురుచూచుచున్నాను ఆయనకొరకు నేను కనిపెట్టుచున్నాను.
18. ఇదిగో, నేనును, యెహోవా నాకిచ్చిన పిల్లలును, సీయోను కొండమీద నివసించు సైన్యముల కధిపతియగు యెహోవావలని సూచనలుగాను, మహత్కార్యములు గాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము.
19. వారు మిమ్మును చూచికర్ణపిశాచిగల వారియొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞులయొద్దకును వెళ్లి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవునియొద్దనే విచారింపవద్దా? సజీవులపక్షముగా చచ్చిన వారియొద్దకు వెళ్లదగునా?
20. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి; ఈ వాక్యప్రకారము వారు బోధించనియెడల వారికి అరుణోదయము కలుగదు.
21. అట్టివారు ఇబ్బందిపడుచు ఆకలిగొని దేశసంచారము చేయుదురు. ఆకలిగొనుచు వారు కోపపడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపములు పలుకుచు మీద చూతురు;
22. భూమి తట్టు తేరి చూడగా బాధలును అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును; వారు గాఢాంధకారములోనికి తోలివేయబడెదరు.
Isaiah 9
1. అయినను వేదనపొందిన దేశముమీద మబ్బు నిలువలేదు పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను అంత్యకాలమున ఆయన సముద్రప్రాంతమును, అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు.
2. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకాశించును.
3. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు కోతకాలమున మనుష్యులు సంతోషించునట్లు దోపుడుసొమ్ము పంచుకొనువారు సంతోషించునట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు.
4. మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచియున్నావు వాని మెడను కట్టుకఱ్ఱను వాని తోలువాని కొరడాలను విరిచియున్నావు.
5. యుద్ధపు సందడిచేయు యోధులందరి జోళ్లును రక్తములో పొరలింపబడిన వస్త్రములును అగ్నిలో వేయబడి దహింపబడును.
6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
7. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.
8. ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇశ్రాయేలువరకు దిగివచ్చియున్నది.
9. అది ఎఫ్రాయిముకును షోమ్రోను నివాసులకును ప్రజలకందరికి తెలియవలసియున్నది.
10. వారు ఇటికలతో కట్టినది పడిపోయెను చెక్కిన రాళ్లతో కట్టుదము రండి; రావికఱ్ణతో కట్టినది నరకబడెను, వాటికి మారుగా దేవదారు కఱ్ఱను వేయుదము రండని అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచున్నారు.
11. యెహోవా వానిమీదికి రెజీనునకు విరోధులైన వారిని హెచ్చించుచు వాని శత్రువులను రేపుచున్నాడు.
12. తూర్పున సిరియాయు పడమట ఫిలిష్తీయులును నోరు తెరచి ఇశ్రాయేలును మింగివేయవలెనని యున్నారు ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.
13. అయినను జనులు తమ్ము కొట్టినవానితట్టు తిరుగుట లేదు సైన్యములకధిపతియగు యెహోవాను వెదకరు.
14. కావున యెహోవా ఇశ్రాయేలులోనుండి తలను తోకను తాటికమ్మను రెల్లును ఒక్క దినమున కొట్టివేయును.
15. పెద్దలును ఘనులును తల; కల్లలాడు ప్రవక్తలు తోక.
16. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు వారిని వెంబడించువారు వారిచేత మింగివేయబడుదురు.
17. వారందరును భక్తిహీనులును దుర్మార్గులునై యున్నారు ప్రతి నోరు దుర్భాషలాడును కాబట్టి ప్రభువు వారి ¸యౌవనస్థులను చూచి సంతోషింపడు వారిలో తలిదండ్రులు లేనివారియందైనను వారి విధవరాండ్రయందైనను జాలిపడడు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.
18. భక్తిహీనత అగ్నివలె మండుచున్నది అది గచ్చపొదలను బలురక్కసి చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును అవి దట్టమైన పొగవలె చుట్టుకొనుచు పైకి ఎగయును.
19. సైన్యముల కధిపతియగు యెహోవా ఉగ్రతవలన దేశము కాలిపోయెను. జనులును అగ్నికి కట్టెలవలె నున్నారు వారిలో ఒకనినొకడు కరుణింపడు.
20. కుడిప్రక్కన ఉన్నదాని పట్టుకొందురు గాని ఇంకను ఆకలిగొని యుందురు; ఎడమప్రక్కన ఉన్నదాని భక్షించుదురు గాని ఇంకను తృప్తిపొందక యుందురు వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును
21. మనష్షే ఎఫ్రాయిమును ఎఫ్రాయిము మనష్షేను భక్షించును వీరిద్దరు ఏకీభవించి యూదామీద పడుదురు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.
Isaiah 10
1. విధవరాండ్రు తమకు దోపుడుసొమ్ముగా ఉండవలెననియు
2. తలిదండ్రులు లేనివారిని కొల్లపెట్టుకొనవలెననియు కోరి న్యాయవిమర్శ జరిగింపకుండ దరిద్రులను తొలగించుటకును నా ప్రజలలోని బీదల న్యాయమును తప్పించుటకును అన్యాయపు విధులను విధించువారికిని బాధకరమైన శాసనములను వ్రాయించువారికిని శ్రమ.
3. దర్శనదినమున దూరమునుండి వచ్చు ప్రళయదినమున మీరేమి చేయుదురు? సహాయమునొందుటకు ఎవరియొద్దకు పారిపోవుదురు? మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకొందురు?
4. వారు చెరపట్టబడినవారి క్రింద దాగుకొనుచున్నారు హతులైనవారి క్రింద కూలుచున్నారు ఈలాగు జరిగినను యెహోవా కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.
5. అష్షూరీయులకు శ్రమ వారు నా కోపమునకు సాధనమైన దండము నా దుడ్డుకఱ్ఱ నా ఉగ్రత వారిచేతిలో ఉన్నది.
6. భక్తిహీనులగు జనములమీదికి నేను వారిని పంపెదను దోపుడుసొమ్ము దోచుకొనుటకును కొల్లపెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులగు జనులనుగూర్చి వారి కాజ్ఞాపించెదను.
7. అయితే అతడు ఆలాగనుకొనడు అది అతని ఆలోచనకాదు; నాశనము చేయవలెననియు చాల జనములను నిర్మూలము చేయవలెననియు అతని ఆలోచన.
8. అతడిట్లనుకొనుచున్నాడు నా యధిపతులందరు మహారాజులు కారా?
9. కల్నో కర్కెమీషువలె నుండలేదా? హమాతు అర్పాదువలె నుండలేదా? షోమ్రోను దమస్కువలె నుండలేదా?
10. విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి గదా? వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహములకంటె ఎక్కువైనవి గదా?
11. షోమ్రోనునకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా అనెను.
12. కావున సీయోను కొండమీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరురాజుయొక్క హృదయగర్వమువలని ఫలమునుబట్టియు అతని కన్నుల అహంకారపు చూపులనుబట్టియు అతని శిక్షింతును.
13. అతడు నేను వివేకిని నా బాహుబలముచేతను నాబుద్ధిచేతను ఆలాగుచేసితిని నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకొంటిని మహా బలిష్ఠుడనై సింహాసనాసీనులను త్రోసివేసితిని
14. పక్షిగూటిలో ఒకడు చెయ్యివేసినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కెను. ఒకడు విడువబడిన గుడ్లను ఏరుకొనునప్పుడు రెక్కను ఆడించునదియైనను నోరు తెరచునదియైనను కిచకిచలాడునదియైనను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకొనును.
15. గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా? రంపము తనతో కోయువానిమీద పొగడుకొనునా? కోల తన్నెత్తువానిని ఆడించినట్లును దండము కఱ్ఱకానివానిని ఎత్తినట్లును ఉండును గదా?
16. ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా బలిసిన అష్షూరీయులమీదికి క్షయరోగము పంపును వారిక్రింద అగ్నిజ్వాలలుగల కొరవికట్టె రాజును.
17. ఇశ్రాయేలుయొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయునగును; అది అష్షూరుయొక్క బలురక్కసిచెట్లకును గచ్చ పొదలకును అంటుకొని ఒక్కదినమున వాటిని మింగివేయును.
18. ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోవునట్లుగా శరీర ప్రాణములతోకూడ అతని అడవికిని అతని ఫలభరితమైన పొలములకును కలిగిన మహిమను అది నాశనము చేయును.
19. అతని అడవిచెట్ల శేషము కొంచెమగును బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చును.
2 Corinthians 8
1. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అను గ్రహింపబడియున్న దేవుని కృపనుగూర్చి మీకు తెలియజేయుచున్నాము.
2. ఏలాగనగా, వారు బహు శ్రమవలన పరీక్షింపబడగా, అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను.
3. ఈ కృపవిషయములోను, పరిశుద్ధులకొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను, మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు,
4. వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యముకంటె ఎక్కువగాను తమంతట తామే యిచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను.
5. ఇదియుగాక మొదట ప్రభువునకును, దేవుని చిత్తమువలన మాకును, తమ్మును తామే అప్పగించుకొనిరి; యింతగా చేయుదురని మేమనుకొనలేదు.
6. కావున తీతు ఈ కృపను ఏలాగు పూర్వము మొదలుపెట్టెనో ఆలాగున దానిని మీలో సంపూర్ణము చేయుమని మేమతని వేడుకొంటిమి.
7. మీరు ప్రతివిషయములో, అనగా విశ్వాస మందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్తయందును మీకు మాయెడలనున్న ప్రేమయందును ఏలాగు అభివృద్ధిపొందుచున్నారో ఆలాగే మీరు ఈ కృపయందు కూడ అభివృద్ధిపొందునట్లు చూచుకొనుడి.
8. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు; ఇతరుల జాగ్రత్తను మీకు చూపుటచేత మీ ప్రేమ యెంత యథార్థమైనదో పరీక్షింపవలెనని చెప్పుచున్నాను.
9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్ర్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.
10. ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను; సంవత్సరము క్రిందటనే యీ కార్యము చేయుట యందే గాక చేయ తలపెట్టుటయందు కూడ మొదటి వారై యుండిన మీకు మేలు
11. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఏలాగు కలిగెనో, ఆలాగే మీ కలిమికొలది సంపూర్తియగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి.
12. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగియుంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే యిచ్చినది ప్రీతికరమవును.
13. ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలెనని ఇది చెప్పుటలేదు గాని
14. హెచ్చుగా కూర్చుకొనినవానికి ఎక్కువ మిగులలేదనియు తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువ కాలేదనియువ్రాయబడిన ప్రకారము అందరికి సమానముగా ఉండు నిమిత్తము,
15. ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరియొకప్పుడు వారి సమృద్ధి మీ యక్కరకును సహాయమై యుండవలెనని ఈలాగు చెప్పుచున్నాను.
Proverbs 21
27. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించినయెడల అవి మరి హేయములు.
28. కూటసాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును.
29. భక్తిహీనుడు తన ముఖమును మాడ్చుకొనును యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరచుకొనును.
30. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు.
31. యుద్ధదినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుటకద్దు గాని రక్షణ యెహోవా అధీనము.
Proverbs 22
1. గొప్ప ఐశ్వర్యముకంటె మంచి పేరును వెండి బంగారములకంటె దయయు కోరదగినవి.
2. ఐశ్వర్యవంతులును దరిద్రులును కలిసియుందురు వారందరిని కలుగజేసినవాడు యెహోవాయే.
3. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.
4. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును.
5. ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరముగా ఉండును.
6. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.