Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
6
Tuesday, August 2024
Change Date :
Previous
|
Next
Organized from Old Testament, New Testament, Psalms & Proverbs. Read and Complete Telugu Bible in One Year!
1 Chronicles 24
4. వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతివారిలోని పెద్దలకంటె ఎలియాజరు సంతతివారిలోని పెద్దలు అధికులుగా కనబడిరి గనుక ఎలియాజరు సంతతివారిలో పదునారుగురు తమ పితరుల యింటివారికి పెద్దలుగాను, ఈతామారు సంతతి వారిలో ఎనిమిదిమంది తమ తమ పితరుల యింటివారికి పెద్దలుగాను నియమింపబడిరి.
6. లేవీయులలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు షెమయా రాజు ఎదుటను, అధిపతుల యెదు టను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు ఎదుటను, యాజకులయెదుటను, లేవీయుల యెదుటను, పితరుల యిండ్లపెద్దలైన వారి యెదుటను వారి పేళ్లు దాఖలు చేసెను; ఒక్కొక్క పాత్రలోనుండి యొక పితరుని యింటి చీటి ఎలియాజరు పేరటను ఇంకొకటి ఈతా మారు పేరటను తీయబడెను.
7. మొదటి చీటి యెహోయారీబునకు, రెండవది యెదా యాకు,
8. మూడవది హారీమునకు, నాలుగవది శెయొరీము నకు,
9. అయిదవది మల్కీయాకు, ఆరవది మీయామినుకు,
10. ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది అబీయాకు,
11. తొమ్మిదవది యేషూవకు పదియవది షెకన్యాకు పదకొండవది ఎల్యాషీబునకు,
12. పండ్రెండవది యాకీమునకు,
13. పదుమూడవది హుప్పాకు, పదునాలుగవది యెషెబాబునకు,
14. పదునయిదవది బిల్గాకు, పదునారవది ఇమ్మేరునకు,
15. పదునేడవది హెజీరునకు, పదునెనిమిదవది హప్పి స్సేసునకు,
16. పందొమ్మిదవది పెతహయాకు ఇరువదియవది యెహెజ్కేలునకు,
17. ఇరువదియొకటవది యాకీనునకు, ఇరువది రెండవది గామూలునకు,
18. ఇరువది మూడవది దెలాయ్యాకు, ఇరువదినాలుగవది మయజ్యాకు పడెను.
19. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనునకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతిచొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవాధర్మము ఈలాగున ఏర్పాటు ఆయెను.
20. శేషించిన లేవీ సంతతివారెవరనగా అమ్రాము సంతతిలో షూబాయేలును, షూబాయేలు సంతతిలో యెహెద్యాహును,
21. రెహబ్యా యింటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇష్షీయాయును,
22. ఇస్హారీ యులలో షెలోమోతును, షెలోమోతు సంతతిలో యహతును,
23. హెబ్రోను సంతతిలో పెద్దవాడైన యెరీయా, రెండవవాడైన అమర్యా, మూడవవాడైన యహజీయేలు, నాలుగవవాడైన యెక్మెయాములును,
24. ఉజ్జీయేలు సంతతిలో మీకాయును మీకా సంతతిలో షామీరును,
25. ఇష్షీయా సంతతిలో జెకర్యాయును,
26. మెరారీ సంతతిలో మహలి, మూషి అనువారును యహజీ యాహు సంతతిలో బెనోయును.
27. యహజీయాహువలన మెరారికి కలిగిన కుమారులెవరనగా బెనో షోహము జక్కూరు ఇబ్రీ.
28. మహలికి ఎలియాజరు కలిగెను, వీనికి కుమారులు లేకపోయిరి.
29. కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు యెరహ్మెయేలు.
30. మూషి కుమారులు మహలి ఏదెరు యెరీమోతు, వీరు తమ పితరుల యిండ్లనుబట్టి లేవీ యులు.
31. వీరును తమ సహోదరులైన అహరోను సంతతివారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను సాదోకు అహీమెలెకు అను యాజకులలోను లేవీయులలోను పితరుల యిండ్ల పెద్దలయెదుటను తమలోనుండు పితరుల యింటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసికొనిరి.
2. నాదాబును అబీహుయును సంతతిలేకుండ తమ తండ్రికంటె ముందుగా చనిపోయిరి గనుక ఎలియా జరును ఈతామారును యాజకత్వము జరుపుచువచ్చిరి.
3. దావీదు ఎలియాజరు సంతతివారిలో సాదోకును ఈతామారు సంతతివారిలో అహీమెలెకును ఏర్పరచి, వారి వారి జనముయొక్క లెక్కనుబట్టి పని నియమించెను.
5. ఎలియాజరు సంతతిలోని వారును, ఈతామారు సంతతివారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులగు అధికారులై యుండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లువేసి వంతులు పంచుకొనిరి.
1. అహరోను సంతతివారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు.
1 Chronicles 25
1. మరియు దావీదును సైన్యాధిపతులును ఆసాపు హేమాను యెదూతూను అనువారి కుమారులలో కొందరిని సేవనిమిత్తమై ప్రత్యేకపరచి, సితారాలను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించునట్లుగా నియమించిరి ఈ సేవావృత్తినిబట్టి యేర్పాటైన వారి సంఖ్య యెంతయనగా
2. ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు, ఆసాపు చేతిక్రిందనుండు ఆసాపు కుమారులైన జక్కూరు యోసేపు నెతన్యా అషర్యేలా అనువారు.
3. యెదూతూను సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రియైన యెదూతూను చేతి క్రిందనుండు యెదూతూను కుమారులైన గెదల్యా జెరీ యెషయా హషబ్యా మత్తిత్యా అను ఆరుగురు.
4. హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కీ యాహు మత్తన్యా ఉజ్జీయేలు షెబూయేలు యెరీమోతు హనన్యా హనానీ ఎలీయ్యాతా గిద్దల్తీ రోమమీ్తయెజెరు యొష్బెకాషా మల్లోతి హోతీరు మహజీయోతు అనువారు.
5. వీరందరును దేవుని వాక్కువిషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమానుయొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్పచేయుటకై దేవుడు హేమానునకు పదునలుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను అను గ్రహించి యుండెను.
6. వీరందరు ఆసాపునకును యెదూ తూనునకును హేమానునకును రాజు చేసియున్న కట్టడ ప్రకారము యెహోవా యింటిలో తాళములు స్వర మండలములు సితారాలు వాయించుచు గానము చేయుచు, తమ తండ్రి చేతిక్రింద దేవుని మందిరపు సేవ జరిగించు చుండిరి.
7. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడనున్న ప్రవీణులైన పాటకుల లెక్క రెండువందల ఎనుబది యెనిమిది.
8. తాము చేయు సేవ విషయములో పిన్నయని పెద్దయని గురువని శిష్యుడని భేదము లేకుండ వంతులకొరకై చీట్లువేసిరి.
9. మొదటి చీటి ఆసాపువంశమందున్న యోసేపు పేరట పడెను, రెండవది గెదల్యా పేరట పడెను, వీడును వీని సహోదరులును కుమారులును పండ్రెండుగురు.
10. మూడవది జక్కూరు పేరట పడెను, వీడును వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
11. నాలుగవది యిజ్రీ పేరట పడెను, వీడును వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
12. అయిదవది నెతన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
13. ఆరవది బక్కీయాహు పేరటపడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
14. ఏడవది యెషర్యేలా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెం డుగురు.
15. ఎనిమిదవది యెషయా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
16. తొమ్మిదవది మత్తన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
17. పదియవది షిమీ పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
18. పదకొండవది అజరేలు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
19. పండ్రెండవది హషబ్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
20. పదుమూడవది షూబాయేలు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
21. పదునాలుగవది మత్తిత్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
22. పదునయిదవది యెరేమోతు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
23. పదునారవది హనన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
24. పదునేడవది యొష్బెకాషా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
25. పదునెనిమిదవది హనానీపేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
26. పందొమ్మిదవది మల్లోతి పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెం డుగురు.
27. ఇరువదియవది ఎలీయ్యాతా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
28. ఇరువది యొకటవది హోతీరు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
29. ఇరువది రెండవది గిద్దల్తీ పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండు గురు.
30. ఇరువది మూడవది మహజీయోతు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
31. ఇరువది నాలుగవది రోమమీ్తయెజెరు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
1 Chronicles 26
8. ఓబేదెదోము కుమారులైన వీరును వీరి కుమా రులును వీరి సహోదరులును అరువది యిద్దరు, వారు తమ పనిచేయుటలో మంచి గట్టివారు.
9. మెషెలెమ్యాకు కలిగిన కుమారులును సహోదరులును పరాక్రమశాలులు, వీరు పదునెనిమిది మంది.
10. మెరారీయులలో హోసా అనువానికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు షిమీ; వీడు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాని జ్యేష్ఠ భాగస్థునిగా చేసెను,
1. ద్వారపాలకుల విభాగమును గూర్చినది. ఆసాపుకుమారులలో కోరే కుమారుడైన మెషెలెమ్యా కోరహు సంతతివాడు.
2. మెషెలెమ్యా కుమారులు ఎవరనగా జెకర్యా జ్యేష్ఠుడు, యెదీయవేలు రెండవవాడు, జెబద్యా మూడవవాడు, యత్నీయేలు నాల్గవవాడు,
3. ఏలాము అయిదవవాడు, యెహోహనాను ఆరవవాడు, ఎల్యోయేనై యేడవవాడు.
4. దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను; వారెవరనగా షెమయా జ్యేష్ఠుడు, యెహోజా బాదు రెండవవాడు, యోవాహు మూడవవాడు, శాకారు నాల్గవవాడు, నెతనేలు అయిదవవాడు,
5. అమీ్మయేలు ఆరవవాడు, ఇశ్శాఖారు ఏడవవాడు, పెయుల్లెతై యెనిమిదవవాడు.
6. వాని కుమారుడైన షెమయాకు కుమారులు పుట్టిరి; వారు పరా క్రమ శాలులైయుండి తమ తండ్రి యింటివారికి పెద్దలైరి.
7. షెమయా కుమారులు ఒత్ని రెఫాయేలు ఓబేదు ఎల్జాబాదు బలాఢ్యులైన అతని సహోదరులు ఎలీహు సెమక్యా.
11. రెండవవాడగు హిల్కీయా, మూడవవాడగు టెబల్యాహు, నాల్గవవాడగు జెకర్యా, హోసా కుమారులును సహోదరులును అందరు కలిసి పదుముగ్గురు.
12. ఈలాగున ఏర్పాటైన తరగతులనుబట్టి యెహోవా మందిరములో వంతుల ప్రకారముగా తమసహోదరులు చేయునట్లు సేవచేయుటకు ఈ ద్వారపాలకులు, అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియ మింపబడిరి.
13. చిన్నలకేమి పెద్దలకేమి పితరుల యింటి వరుసనుబట్టి యొక్కొక్క ద్వారము నొద్ద కావలియుండుటకై వారు చీట్లువేసిరి.
14. తూర్పుతట్టు కావలి షెలెమ్యాకు పడెను, వివేకముగల ఆలోచన కర్తయైన అతని కుమారుడగు జెకర్యాకు చీటివేయగా, ఉత్తరపుతట్టు కావలి వానికి పడెను,
15. ఓబేదెదోమునకు దక్షిణపువైపు కావలియు అతని కుమారులకు అసుప్పీమను ఇంటికావలియు పడెను.
16. షుప్పీమునకును హోసాకును పడమటి తట్టున నున్న షల్లెకెతు గుమ్మమునకు ఎక్కు రాజమార్గమును కాచు టకు చీటి పడెను.
17. తూర్పున లేవీయులైన ఆరుగురును, ఉత్తరమున దినమునకు నలుగురును, దక్షిణమున దినమునకు నలుగురును, అసుప్పీము నొద్ద ఇద్దరిద్దరును,
18. బయట ద్వారమునొద్దను పడమరగా ఎక్కిపోవు రాజమార్గము నొద్దను నలుగురును, వెలుపటి త్రోవయందు ఇద్దరును ఏర్పాటైరి.
19. కోరే సంతతివారిలోను మెరారీయులలోను ద్వారము కనిపెట్టువారికి ఈలాగు వంతులాయెను.
1 Corinthians 3
1. సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు, మీతో మాటలాడవలసివచ్చెను.
2. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితినిగాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీరసంబంధులై యుండుటవలన ఇప్పుడును మీరు బలహీనులై యున్నారు కారా?
3. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా?
4. ఒకడు నేను పౌలు వాడను, మరియొకడునేను అపొల్లోవాడను, అని చెప్పునప్పుడు మీరు ప్రకృతిసంబంధులైన మనుష్యులు కారా?
5. అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభువనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి
6. నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసినవాడు దేవుడే
7. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.
8. నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును.
9. మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నారు.
10. దేవుడు నాకనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.
11. వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసు క్రీస్తే.
12. ఎవడైనను ఈ పునాదిమీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మొదలైనవాటితో కట్టినయెడల,
13. వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.
14. పునాదిమీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చుకొనును.
15. ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును.
16. మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?
17. ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైయున్నది; మీరు ఆ ఆలయమైయున్నారు.
18. ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన యెడల, జ్ఞానిఅగునట్టు వెఱ్ఱివాడు కావలెను.
19. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును;
20. మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియును అని వ్రాయబడియున్నది.
21. కాబట్టి యెవడును మనుష్యులయందు అతిశయింపకూడదు; సమస్తమును మీవి.
22. పౌలైనను అపొల్లోయైనను, కేఫాయైనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవియైనను రాబోవునవియైనను సమస్తమును మీవే.
23. మీరు క్రీస్తు వారు; క్రీస్తు దేవునివాడు.
Psalms 92
1. యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా,
2. నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
3. పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది.
4. ఎందుకనగా యెహోవా, నీ కార్యముచేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతిపనులబట్టి నేను ఉత్సహించుచున్నాను.
5. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి! నీ ఆలోచనలు అతిగంభీరములు,
6. పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు.
7. నిత్యనాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు. చెడుపనులు చేయువారందరు పుష్పించుదురు.
8. యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడవుగా నుందువు
9. నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు చెడుపనులు చేయువారందరు చెదరిపోవుదురు.
10. గురుపోతు కొమ్మువలె నీవు నా కొమ్ము పైకెత్తితివి క్రొత్త తైలముతో నేను అంటబడితిని.
11. నాకొరకు పొంచినవారి గతి నాకన్నులు ఆశతీర చూచెను నాకువిరోధముగా లేచినదుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను
12. నీతిమంతులు ఖర్జూరవృక్షమువలె మొవ్వువేయుదురు లెబానోనుమీది దేవదారు వృక్షమువలె వారు ఎదుగుదురు
13. యెహోవా మందిరములో నాటబడినవారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు.
14. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయనయందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై
15. వారు ముసలితనమందు ఇంక చిగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగా నుందురు.