Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
3
Friday, May 2024
Change Date :
Previous
|
Next
Organized from Old Testament, New Testament, Psalms & Proverbs. Read and Complete Telugu Bible in One Year!
Judges 1
6. అదోనీ బెజెకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలుచేతుల బొట్టన వ్రేళ్లను కోసివేసిరి.
7. అప్పుడు అదోనీ బెజెకు తమ కాళ్లు చేతుల బొట్టనవ్రేళ్లు కోయబడిన డెబ్బదిమంది రాజులు నా భోజనపు బల్లక్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చెననెను. వారు యెరూషలేమునకు అతని తోడుకొనిరాగా అతడు అక్కడ చనిపోయెను.
8. యూదావంశస్థులు యెరూషలేము మీదికి యుద్ధము చేసి దానిని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి.
9. తరువాత యూదావంశస్థులు మన్యములయందును దక్షిణదేశమందును లోయయందును నివసించిన కనానీయులతో యుద్ధము చేయుటకు పోయిరి.
10. మరియు యూదా వంశస్థులు హెబ్రోనులో నివసించిన కనానీయులమీదికి పోయి, షేషయిని అహీమానును తల్మయిని హతముచేసిరి.
11. ఆ హెబ్రోను పేరు కిర్యతర్బా. అక్కడనుండి వారు దెబీరు నివాసులమీదికి పోయిరి. పూర్వము దెబీరు పేరు కిర్యత్సేఫెరు.
12. కాలేబు కిర్యత్సేఫెరును పట్టుకొని కొల్ల బెట్టువానికి నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెండ్లి చేసెదనని చెప్పగా
13. కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె యైన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను.
14. ఆమె తన పెనిమిటి యింట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావలెనని యడిగెను
15. అందుకామె దీవెన దయచేయుము; నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు, నీటి మడుగులను కూడ నాకు దయచేయుమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను.
16. మోషే మామయైన కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడ ఖర్జూరచెట్ల పట్టణములో నుండి అరాదు దక్షిణదిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్లి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి.
17. యూదావంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో కూడ పోయి జెఫతులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలముచేసి ఆ పట్టణమునకు హోర్మా అను పేరు పెట్టిరి.
18. యూదావంశస్థులు గాజాను దాని ప్రదేశమును అష్కెలోనును దాని ప్రదేశమును ఎక్రోనును దాని ప్రదేశమును పట్టుకొనిరి.
19. యెహోవా యూదావంశస్థులకు తోడై యున్నందున వారు మన్యదేశమును స్వాధీనపరచుకొనిరి. అయితే మైదానమందు నివసించువారికి ఇనుపరథములున్నందున వారిని వెళ్లగొట్టలేకపోయిరి.
20. మోషే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోను నియ్యగా అతడు ముగ్గురు అనాకీయులను అక్కడనుండి పారదోలి దానిని స్వాధీనపరచుకొనెను.
21. యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీనీయులు వెళ్లగొట్టలేదు; యెబూసీయులు బెన్యామీనీయులతో కూడ నేటివరకు యెరూషలేములో నివసించుచున్నారు.
22. యోసేపు ఇంటివారు బేతేలుకు వెళ్లినప్పుడు యెహోవా వారికి తోడైయుండెను.
23. పూర్వము లూజనబడిన బేతేలును వేగుచూచుటకు యోసేపు ఇంటివారు దూతలను పంపగా
24. ఆ వేగులవారు ఆ పట్టణమునుండి ఒకడు వచ్చుట చూచి నీవు దయచేసి యీ పట్టణములోనికి వెళ్లు త్రోవను మాకు చూపినయెడల మేము మీకు ఉపకారము చేసెదమని చెప్పిరి.
25. అతడు పట్టణములోనికి పోవు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణమును కత్తి వాత హతము చేసిరి గాని ఆ మనుష్యుని వాని కుటుంబికుల నందరిని పోనిచ్చిరి.
26. ఆ మనుష్యుడు హిత్తీయుల దేశమునకు వెళ్లి ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అను పేరుపెట్టెను. నేటివరకు దానికదే పేరు.
27. మనష్షీయులు బేత్షెయానును దాని పల్లెలను, తయి నాకును దాని పల్లెలను, దోరునివాసులను దోరు పల్లెలను, ఇబ్లెయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను, మెగిద్దో పల్లెలను, స్వాధీనపరచుకొన లేదు; ఏలయనగా కనానీయులు ఆ దేశములో నివసింపవలెనని గట్టిపట్టు పట్టియుండిరి.
28. ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టిపనులు చేయించుకొనిరి కాని వారిని బొత్తిగా వెళ్లగొట్టలేదు.
29. ఎఫ్రాయిమీయులు గెజెరులో నివసించిన కనానీయులను వెళ్లగొట్టలేదు, గెజెరులో కనానీయులు వారి మధ్యను నివసించిరి.
30. జెబూలూనీయులు కిత్రోను నివాసులను నహలోలు నివాసులను వెళ్లగొట్టలేదు, కనానీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టిపనులు చేయువారైరి.
31. ఆషేరీయులు అక్కో నివాసులను సీదోను నివాసులను అహ్లాబు వారిని అక్జీబువారిని హెల్బావారిని అఫెకువారిని రెహోబు వారిని
32. ఆషేరీయులు దేశనివాసులైన కనానీయులను వెళ్లగొట్టక వారి మధ్య నివసించిరి. నఫ్తాలీయులు బేత్షెమెషు వారిని బేతనాతువారిని వెళ్లగొట్టలేదు గాని
33. బేత్షెమెషు నివాసులచేతను బేతనాతు నివాసులచేతను వెట్టి పనులు చేయించుకొనిరి.
34. అమోరీయులు దానీయులను పల్లపు దేశమునకు దిగనియ్యక మన్యమునకు వారిని వెళ్లగొట్టిరి.
35. అమోరీయులు అయ్యాలోను నందలి హెరెసు కొండలోను షయల్బీములోను నివసింపవలెనని గట్టి పట్టు పట్టియుండగా యోసేపు ఇంటివారు బలవంతులై వారిచేత వెట్టిపనులు చేయించుకొనిరి
36. అమోరీయుల సరిహద్దు అక్రబ్బీము మొదలుకొని హస్సెలావరకు వ్యాపించెను.
3. అప్పుడు యూదావంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో మనము కనానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతోకూడ రండి, మేమును మీతోకూడ మీ వంతులోనికి వచ్చెదమని చెప్పగా షిమ్యోనీయులు వారితో కూడ పోయిరి.
5. వారు బెజెకులో అదోనీ బెజెకును చూచి వానితో యుద్ధముచేసి కనానీయులను పెరిజ్జీయులను హతముచేసిరి.
1. యెహోషువ మృతినొందిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయునట్లు ప్రార్థనచేయగా
2. యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకిచ్చియున్నాను, వారు పోవలెనని సెలవిచ్చెను.
4. కనానీయులమీదికి యూదావంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీయులను వారి కప్పగించెను గనుక వారు బెజెకులో పదివేలమంది మనుష్యులను హతముచేసిరి.
Judges 2
1. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి యీలాగు సెలవిచ్చెను నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి, మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడును మీరను.
2. మీరు ఈ దేశనివాసులతో నిబంధన చేసికొనకూడదు; వారి బలిపీఠములను విరుగగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాటను వినలేదు.
3. మీరు చేసినపని యెట్టిది? కావున నేనుమీ యెదుటనుండి ఈ దేశనివాసులను వెళ్లగొట్టను, వారు మీ ప్రక్కలకు శూలములుగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను.
4. యెహోవా దూత ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పగా
5. జనులు ఎలుగెత్తి యేడ్చిరి; కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను. అక్కడవారు యెహోవాకు బలి అర్పించిరి.
John 4
1. యోహాను కంటె యేసు ఎక్కువమందిని శిష్యులనుగా చేసికొని వారికి బాప్తిస్మమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పడు
2. ఆయన యూదయ దేశము విడిచి గలిలయదేశమునకు తిరిగి వెళ్లెను.
3. అయినను యేసే బాప్తిస్మమియ్యలేదు గాని ఆయన శిష్యులిచ్చుచుండిరి.
4. ఆయన సమరయ మార్గమున వెళ్లవలసివచ్చెను గనుక
5. యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను.
6. అక్కడ యాకోబు బావి యుండెను గనుక యేసు ప్రయాణమువలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను; అప్పటికి ఇంచుమించు పండ్రెండు గంటలాయెను.
7. సమరయ స్త్రీ ఒకతె నీళ్ళు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసునాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను.
8. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్లియుండిరి.
9. ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు.
10. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజల మిచ్చునని ఆమెతో చెప్పెను.
11. అప్పుడా స్త్రీ అయ్యా, యీ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమియు లేదే; ఆ జీవజలము ఏలాగు నీకు దొరకును?
12. తానును తన కుమాళ్లును, పశువులును, యీబావినీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రియైన యాకోబుకంటె నీవు గొప్పవాడవా? అని ఆయనను అడిగెను.
13. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును;
14. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.
15. ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును, చేదుకొనుట కింతదూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా
16. యేసు నీవు వెళ్లి నీ పెనిమిటిని పిలుచుకొని యిక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను.
17. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతొ నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాటసరియే;
18. నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు; సత్యమే చెప్పితివనెను.
19. అప్పుడా స్త్రీ అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను.
20. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను
21. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము;
22. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది.
23. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు.
24. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.
25. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా
26. యేసు నీతో మాటలాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను.
Proverbs 11
9. భక్తిహీనుడు తన నోటి మాటచేత తన పొరుగువారికి నాశనము తెప్పించును తెలివిచేత నీతిమంతులు తప్పించుకొందురు.
10. నీతిమంతులు వర్థిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించునప్పుడు ఉత్సాహధ్వని పుట్టును.
11. యథార్థవంతుల దీవెనవలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్లద్రోయును.
12. తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకియైనవాడు మౌనముగా నుండును.
13. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును నమ్మకమైన స్వభావముగలవాడు సంగతి దాచును.
14. నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము.
15. ఎదుటివానికొరకు పూటబడినవాడు చెడిపోవును. పూటబడ నొప్పనివాడు నిర్భయముగా నుండును.
16. నెనరుగల స్త్రీ ఘనతనొందును. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు.
17. దయగలవాడు తనకే మేలు చేసికొనును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును
18. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును.