సమూయేలు (సమూయేలు)


దేవునికి మ్రొక్కుకొని అడుగబడినవాడు

Bible Results

"సమూయేలు" found in 6 books or 110 verses

1 సమూయేలు (99)

2:18 బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్యచేయు చుండెను.
2:21 యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతియై ముగ్గురు కుమాళ్లను ఇద్దరు కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి యెదుగుచుండెను.
2:26 బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయ యందును వర్ధిల్లుచుండెను.
3:1 బాలుడైన సమూయేలు ఏలీయెదుట యెహోవాకుపరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరుచుగా తటస్థించుటలేదు.
3:3 దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండు కొనియుండగాను
3:4 యెహోవా సమూయేలును పిలిచెను. అతడుచిత్తమండి నేనున్నానని చెప్పి
3:6 యెహోవా మరల సమూ యేలును పిలువగా సమూయేలు లేచి ఏలీయొద్దకు పోయిచిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితిననెను. అయితే అతడు నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకొమ్మనెను.
3:7 సమూయేలు అప్పటికి యెహో వాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంక ప్రత్యక్షము కాలేదు.
3:8 యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయిచిత్తము నీవు నన్ను పిలిచితివే; యిదిగో వచ్చితిననగా, ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచెనని గ్రహించి
3:9 నీవు పోయి, పండుకొమ్ము, ఎవరైన నిన్ను పిలిచినయెడలయెహోవా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను.
3:10 తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగాసమూయేలూ సమూ యేలూ, అని పిలువగా సమూయేలునీ దాసుడు ఆల కించుచున్నాడు ఆజ్ఞయిమ్మనెను.
3:11 అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెనుఇశ్రాయేలులో నేనొకకార్యము చేయబోవుచున్నాను; దానిని వినువారందరి చెవులు గింగురుమనును.
3:15 తరువాత సమూయేలు ఉదయమగువరకు పండుకొని, లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెనుగాని, భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పక పోయెను.
3:16 అయితే ఏలీసమూయేలూ నా కుమారుడా, అని సమూయేలును పిలువగా అతడు చిత్తము నేనిక్కడ ఉన్నాననెను.
3:18 సమూయేలు దేనిని మరుగుచేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలీ వినిసెలవిచ్చినవాడు యెహోవా; తన దృష్ఠికి అనుకూలమైనదానిని ఆయన చేయునుగాక అనెను.
3:19 సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైయున్నందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు.
3:20 కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరు తెలిసికొనిరి
3:21 మరియు షిలోహులో యెహోవా మరల దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలుమాట ఇశ్రా యేలీయులందరిలో వెల్లడియాయెను.
7:3 సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెనుమీ పూర్ణహృదయ ముతో యెహోవాయొద్దకు మీరు మళ్లుకొనినయెడల, అన్యదేవతలను అష్తారోతు దేవతలను మీ మధ్యనుండి తీసి వేసి, పట్టుదలగలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయ నను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలోనుండి మిమ్మును విడిపించును.
7:5 అంతట సమూయేలుఇశ్రాయేలీయులందరిని మిస్పాకు పిలువనంపుడి; నేను మీపక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా
7:6 వారు మిస్పాలో కూడు కొని నీళ్లుచేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండియెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీ యులకు న్యాయము తీర్చుచువచ్చెను.
7:8 మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించునట్లుగా మాకొరకు ఆయనను ప్రార్థనచేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి
7:9 సమూయేలు పాలు విడువని ఒక గొఱ్ఱెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి, ఇశ్రా యేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థనచేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను.
7:10 సమూయేలు దహనబలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయులమీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి.
7:12 అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపియింతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను.
7:13 ఈలాగున ఫిలిష్తీయులు అణపబడినవారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను.
7:15 సమూయేలు తాను బ్రదికిన దినములన్నియు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను.
8:1 సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రా యేలీయులమీద న్యాయాధిపతులుగా నియమించెను.
8:4 ఇశ్రాయేలీయుల పెద్దలందరు కూడి రామాలో సమూయేలునొద్దకు వచ్చి
8:6 మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థనచేసెను.
8:7 అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగాజనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము; వారు నిన్ను విసర్జింపలేదుగాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించి యున్నారు.
8:10 సమూయేలు తనను, రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్ని వినిపించి
8:19 అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొల్లకఆలాగున కాదు,
8:21 సమూయేలు జనులయొక్క మాటలన్నిటిని విని యెహోవా సన్ని ధిని వాటిని వివరించెను
8:22 గనుక యెహోవానీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలునకు సెలవియ్యగా సమూయేలుమీరందరు మీ మీ గ్రామములకు పొండని ఇశ్రాయేలీయులకు సెలవిచ్చెను.
9:14 వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవుచున్న సమూయేలు వారికి ఎదురుపడెను.
9:17 సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవాఇతడే నేను నీతో చెప్పిన మనిషి ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను.
9:18 సౌలు గవినియందు సమూయేలును కలిసికొనిదీర్ఘదర్శి యిల్లు ఏది? దయచేసి నాతో చెప్పుమని అడుగగా
9:19 సమూయేలు సౌలుతోనేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకుముందు వెళ్లుడి, నేడు మీరు నాతో కూడ భోజనము చేయవలెను, రేపు నీ మనస్సులో నున్న దంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్లనిచ్చెదను.
9:22 అయితే సమూయేలు సౌలును అతని పనివానిని భోజనపు సాలలోనికి తోడుకొనిపోయి, పిలువబడిన దాదాపు ముప్పది మందిలో ప్రధానస్థలమందు వారిని కూర్చుండబెట్టి
9:24 పచనకర్త జబ్బను దాని మీదనున్న దానిని తీసికొనివచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లనెనుచూడుము, మనము కలిసికొను కాలమునకై దాచియుంచ బడిన దానిని నీకు పెట్టియున్నాడు, జనులను పిలిచితినని నేను పచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీకొరకుంచవలసినదని చెప్పితిని. ఆ దినమున సౌలు సమూయేలుతో కూడభోజనముచేసెను,
9:25 పట్టణస్థులు ఉన్నతమైన స్థలముమీదనుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దెమీద మాటలాడు చుండెను.
9:26 మరునాడు తెల్లవారునప్పుడు సమూయేలుమిద్దెమీదనున్న సౌలును పిలిచి నేను నిన్ను సాగనంపుటకై లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను. తరువాత వారిద్దరు బయలుదేరి
9:27 ఊరి చివరకు వచ్చు చుండగా సమూయేలు సౌలుతోమనకంటె ముందుగా వెళ్లుమని యీ పనివానితో చెప్పుము; దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పువరకు నీవు ఇక్కడ నిలిచి యుండుమనెను; అంతట వాడు వెళ్లెను.
10:1 అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తలమీద తైలముపోసి అతని ముద్దు పెట్టుకొనియెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యముమీద అధిపతిగా నియమించియున్నాడు అని చెప్పి యీలాగు సెలవిచ్చెను
10:14 సౌలుయొక్క పినతండ్రి అతనిని అతని పనివానిని చూచిమీరిద్దరు ఎక్కడికి పోతిరని అడుగగా అతడు గార్దభములను వెదకబోతివిు; అవి కనబడక పోగా సమూయేలునొద్దకు పోతిమని చెప్పినప్పుడు
10:15 సౌలు పిన తండ్రిసమూయేలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పుమని అతనితో అనగా
10:16 సౌలుగార్దభములు దొరికినవని అతడు చెప్పెనని తన పినతండ్రితో అనెను గాని రాజ్య మునుగూర్చి సమూయేలు చెప్పిన మాటను తెలుపలేదు.
10:17 తరువాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలువనంపించి ఇశ్రాయేలీయులతో ఇట్లనెను
10:20 ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిని సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను.
10:24 అప్పుడు సమూయేలుజనులందరిలో యెహోవా ఏర్పరచినవానిని మీరు చూచి తిరా? జనులందరిలో అతనివంటివాడొకడును లేడని చెప్పగా, జనులందరు బొబ్బలు పెట్టుచురాజు చిరంజీవి యగుగాక అని కేకలువేసిరి.
10:25 తరువాత సమూయేలు రాజ్యపాలనపద్ధతిని జనులకు వినిపించి, ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను. అంతట సమూయేలు జనులందరిని వారి వారి ఇండ్లకు పంపివేసెను.
11:7 ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీయుల దేశములోని నలుదిక్కులకు దూతలచేత వాటిని పంపిసౌలుతోను సమూయేలుతోను చేరకుండువాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానము చేసెను. అందువలన యెహోవా భయము జనులమీదికి వచ్చెను గనుక యొకడైనను నిలువకుండ వారందరు వచ్చిరి.
11:12 జనులుసౌలు మనలను ఏలునా అని అడిగిన వారేరి? మేము వారిని చంపునట్లు ఆ మనుష్యులను తెప్పించుడని సమూయేలుతో అనగా
11:14 మనము గిల్గాలునకు వెళ్లి రాజ్యపరిపాలన పద్ధతిని మరల స్థాపించుకొందము రండని చెప్పి సమూయేలు జనులను పిలువగా
12:1 అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెనుఆలకించుడి; మీరు నాతో చెప్పినమాట నంగీకరించి మీమీద ఒకని రాజుగా నియమించి యున్నాను.
12:6 మరియు సమూయేలు జనులతో ఇట్లనెనుమోషేను అహరోనును నిర్ణయించి మీ పితరులను ఐగుప్తుదేశములోనుండి రప్పించినవాడు యెహోవాయే గదా
12:11 యెహోవా యెరు బ్బయలును బెదానును యెఫ్తాను సమూయేలును పంపి, నలుదిశల మీ శత్రువుల చేతిలోనుండి మిమ్మును విడిపించి నందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు.
12:18 సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరు యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి
12:19 సమూయేలుతో ఇట్లనిరిరాజును నియమించుమని మేము అడుగుటచేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసితివిు. కాబట్టి మేము మరణము కాకుండ నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము.
12:20 అంతట సమూయేలు జనులతో ఇట్లనెనుభయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయి నను యెహోవాను విసర్జింపకుండ ఆయనను అనుసరించుచు పూర్ణహృదయముతో ఆయనను సేవించుడి.
13:8 సమూయేలు చెప్పినట్టు అతడు ఏడు దినములు ఆగి, సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు, జనులు తన యొద్దనుండి చెదరిపోవుటయు చూచి
13:10 అతడు దహనబలి అర్పించి చాలిం చిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలిసికొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా
13:15 సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీనీయుల గిబియాకు వచ్చెను; సౌలు తనయొద్దనున్న జనులను లెక్క పెట్టగా వారు దాదాపు ఆరు వందలమంది యుండిరి.
15:1 ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలీయులగు తన జనులమీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను; యెహోవా మాట వినుము
15:10 అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్య క్షమై యీలాగు సెలవిచ్చెను
15:11 సౌలు నన్ను అనుసరింపక వెనుకతీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడు చున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంత యెహోవాకు మొఱ్ఱపెట్టుచుండెను.
15:12 ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకువచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయెనన్న సమాచారము వినెను.
15:14 సమూయేలుఆలాగైతే నాకు వినబడుచున్న గొఱ్ఱెల అరుపులును ఎడ్ల రంకెలును ఎక్క డివి? అని అడిగెను.
15:16 సమూయేలునీవు మాటలాడ పనిలేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా, సౌలుచెప్పుమనెను.
15:17 అందుకు సమూయేలునీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సువైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులమీద రాజుగా అభిషేకించెను.
15:21 అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొఱ్ఱెలలోను ఎడ్లలోను ముఖ్యమైనవాటిని తీసికొనివచ్చిరని సమూయేలుతో చెప్పెను.
15:22 అందుకు సమూయేలుతాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుటవలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పిం చుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము.
15:25 కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మ్రొక్కు నట్లు నాతోకూడ తిరిగి రమ్మని సమూయేలును వేడు కొనెను.
15:26 అందుకు సమూయేలునీతోకూడ నేను తిరిగి రాను; నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రా యేలీయులమీద రాజుగా ఉండకుండ యెహోవా నిన్ను విసర్జించెనని చెప్పి
15:28 అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెనునేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలోనుండి లాగివేసి నీకంటె ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి యున్నాడు.
15:31 సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్లెను. సౌలు యెహోవాకు మ్రొక్కిన తరువాత
15:32 సమూయేలు అమాలేకీ యులరాజైన అగగును నా దగ్గరకు తీసికొనిరండనిచెప్పెను. అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి - మరణశ్రమ నాకు గడచిపోయెనే అని చెప్పగా
15:33 సమూయేలునీ కత్తి స్త్రీలకు సంతులేకుండ చేసినట్లు నీ తల్లికిని స్త్రీలలో సంతులేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తునియలుగా నరికెను.
15:34 అప్పుడు సమూయేలు రామాకు వెళ్లిపోయెను, సౌలును సౌలు గిబియాలోని తన యింటికి వెళ్లెను.
15:35 సౌలు బ్రదికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్లలేదు గాని సౌలునుగూర్చి దుఃఖాక్రాంతు డాయెను. మరియు తాను సౌలును ఇశ్రాయేలీయులమీద రాజుగా నిర్ణయించి నందుకు యెహోవా పశ్చాత్తాపము పడెను.
16:1 అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెల విచ్చెనుఇశ్రాయేలీయులమీద రాజుగా ఉండకుండ నేను విసర్జించిన సౌలునుగూర్చి నీ వెంతకాలము దుఃఖిం తువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బేత్లెహేమీయుడైన యెష్షయియొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును.
16:2 సమూయేలునేనెట్లు వెళ్లుదును? నేను వెళ్లిన సంగతి సౌలు వినినయెడల అతడు నన్ను చంపుననగా యెహోవానీవు ఒక పెయ్యను తీసికొనిపోయి యెహోవాకు బలిపశువును వధించుటకై వచ్చితినని చెప్పి
16:4 సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవుచొప్పున బేత్లె హేమునకు వెళ్లెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడిసమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా
16:8 యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడుయెహోవా ఇతని కోరుకొన లేదనెను.
16:10 యెష్షయి తన యేడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలుయెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి
16:11 నీ కుమారులందరు ఇక్కడనున్నారా అని యెష్షయిని అడుగగా అతడుఇంకను కడసారివాడున్నాడు. అయితే వాడు గొఱ్ఱెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలునీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చువరకు మనము కూర్చుందమని యెష్షయితో చెప్పగా
16:13 సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల యెదుట వానికి అభిషేకము చేసెను. నాటనుండి యెహోవా ఆత్మ దావీదుమీదికి బలముగా వచ్చెను. తరువాత సమూ యేలు లేచి రామాకు వెళ్లిపోయెను.
19:18 ఆలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలో నున్న సమూయేలునొద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచట కాపురముండిరి.
19:20 దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను; వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు, సమూయేలు వారిమీద నాయకుడుగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతలమీదికి వచ్చెను గనుక వారును ప్రకటింప నారంభించిరి.
19:22 కడవరిసారి తానే రామాకు పోయి సేఖూ దగ్గరనున్న గొప్ప బావియొద్దకు వచ్చిసమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా ఒకడురామా దగ్గర నాయోతులో వారున్నా రని చెప్పెను.
19:24 మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆ నాటి రాత్రింబగళ్లు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు, పైబట్టలేనివాడై పడియుండెను. అందు వలన సౌలును ప్రవక్తలలోనున్నాడా అను సామెత పుట్టెను.
25:1 సమూయేలు మృతినొందగా ఇశ్రాయేలీయులందరు కూడుకొని అతడు చనిపోయెనని ప్రలాపించుచు, రామా లోనున్న అతని ఇంటి నివేశనములో అతని సమాధిచేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను.
28:3 సమూయేలు మృతిబొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతని పాతిపెట్టియుండిరి. మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని చిల్లంగివారిని దేశములో నుండి వెళ్లగొట్టి యుండెను.
28:11 ఆ స్త్రీనీతో మాట లాడుటకై నేనెవని రప్పింపవలెనని యడుగగా అతడుసమూయేలును రప్పింపవలెననెను.
28:14 అందుకతడుఏ రూపముగా ఉన్నాడని దాని నడిగి నందుకు అదిదుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు అతడు సమూయేలు అని తెలిసికొని సాగిలపడి నమస్కారము చేసెను.
28:15 సమూయేలునన్ను పైకిరమ్మని నీ వెందుకు తొందరపెట్టితివని సౌలు నడుగగా సౌలునేను బహు శ్రమలోనున్నాను; ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నములద్వారానైనను నా కేమియు సెలవియ్యకయున్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించితిననెను.
28:16 అందుకు సమూయేలుయెహోవా నిన్ను ఎడ బాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుటవలన ప్రయోజన మేమి?
28:20 సమూయేలు మాటలకు సౌలు బహు భయమొంది వెంటనే నేలను సాష్టాంగపడి దివా రాత్రము భోజన మేమియు చేయక యుండినందున బలహీనుడాయెను.

1 దినవృత్తాంతములు (6)

6:28 సమూయేలు కుమారులు జ్యేష్ఠుడగు వష్నియు అబీయాయు.
6:33 ఈ ప్రకారము తమ కుమారులతో కలసి కని పెట్టుచున్నవారెవరనగా, కహతీయుల కుమారులలో గాయకుడగు హేమాను; ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు
6:34 సమూయేలు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యెరోహామునకు పుట్టెను, యెరోహాము ఎలీయేలునకు పుట్టెను, ఎలీయేలు తోయ హునకు పుట్టెను,
9:22 గుమ్మములయొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరు రెండువందల పన్నిద్దరు; వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళి చొప్పున సరిచూడబడిరి; వీరు నమ్మదగినవారని దావీదును దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి.
26:28 దీర్ఘదర్శి సమూయేలును కీషు కుమారుడైన సౌలును నేరు కుమారుడైన అబ్నేరును సెరూయా కుమారుడైన యోవాబును ప్రతిష్ఠించిన సొమ్మంతయు షెలోమీతు చేతిక్రిందను వాని సహోదరుల చేతిక్రిందను ఉంచబడెను.
29:30 దీర్ఘదర్శి సమూయేలు మాటలనుబట్టియు, ప్రవక్తయగు నాతాను మాటలను బట్టియు, దీర్ఘదర్శి గాదు మాటలనుబట్టియు వ్రాయబడి యున్నది.

2 దినవృత్తాంతములు (1)

35:18 ప్రవక్త యగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలీ యులలో పస్కాపండుగ అంత ఘనముగా ఆచరింపబడి యుండలేదు. యోషీయాయు, యాజకులును, లేవీయు లును, అక్కడ నున్న యూదా ఇశ్రాయేలువారందరును, యెరూషలేము కాపురస్థులును ఆచరించిన ప్రకారము ఇశ్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను పస్కాపండు గను ఆచరించి యుండలేదు.

కీర్తనల గ్రంథము (1)

99:6 ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి ఆయన నామమునుబట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి కుత్తరమిచ్చెను.

యిర్మియా (1)

15:1 అప్పుడు యెహోవా నాకీలాగు సెలవిచ్చెను మోషేయు సమూయేలును నాయెదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు, నాసన్నిధి నుండకుండ వారిని వెళ్లగొట్టుము.

అపో. కార్యములు (2)

3:24 మరియు సమూయేలు మొదలుకొని యెందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరు ఈ దినమునుగూర్చి ప్రకటించిరి.
13:20 ఇంచుమించు నాలుగువందల ఏబది సంవత్సరములు ఇట్లు జరిగెను. అటుతరువాత ప్రవక్తయైన సమూయేలువరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయ చేసెను.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
"సమూయేలు" found in 5 lyrics.

కన్నీరే మనిషిని బాధిస్తుంది - Kanneere Manishini Baadhisthundi

కానరావే అలనాటి కన్నీటి ప్రార్ధనలు - Kaanaraave Alanaati Kanneeti Praardhanalu

దేవుడే ఇల చేరేటందుకు ఎన్నుకున్న మార్గం - Devude Ila Cheretanduku Ennukunna Maargam

యేసన్న స్వరమన్నా - నీవెపుడైనా విన్నావా

సర్వ శరీరుల దేవుడా - Sarva Shareerula Devudaa

Sermons and Devotions

Back to Top
"సమూయేలు" found in 30 contents.

కృతజ్ఞతార్పణలపండుగ
తండ్రి, కుమారా, పరిశుద్ధాత్మ అయిన త్రియేక దేవుడు తన శక్తిగల మాటతో ఈ సర్వ సృష్టిని సృష్ఠించి, ఏకరీతిగా పరిపాలిస్తూ, మానవాళికి అవసరమైన సర్వ సంపదలను సృష్ఠించి వారిని పోషిస్తూ ఆదరిస్తున్న దేవునికి మానవుడు ఏ విధంగా కృతజ్ఞతను కానపర్చుకోవాలో వివరిస్తూ నిర్గమకాండం 23:16 లో “నీవు పొలములో విత్తిన నీ వ్యవసా

ఎజ్రా గ్రంథం
అధ్యాయాలు : 10, వచనములు : 280 రచించిన తేది, కాలం : క్రీ.పూ. 457-444 సం||లో ఈ గ్రంధం వ్రాయబడింది. మూల వాక్యాలు: 3:11 “వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరముయొక్క పునాది వేయబడుట చూచి, జ

ప్రకటన గ్రంథ ధ్యానం 3వ అధ్యాయం - Revelation 3 Detailed Study
<< Previous - Revelation Chapter 2 వివరణ ప్రకటన 3:1 సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములును దేవుని యేడాత్మలును గలవాడు చెప్పు సంగతులేవనగానీ క్రియలను నేనెరుగు

రూతు గ్రంథం
అధ్యాయాలు: 4, వచనాలు:85 గ్రంథ కర్త: సమూయేలు ప్రవక్త రచించిన తేది: దాదాపు 450 నుండి 425 సం. క్రీ.పూ. మూల వాక్యము: “నివు వెళ్ళు చోటికే నేను వచ్చెదను, నివు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు;” రూతు 1:16  ఉపోద్ఘాతం: రూతు గ్రంథం బ

ఎన్నిక
ప్రతి జీవికి ఒక ఆత్మ కథ వున్నట్టుగా, ప్రతి గ్రామానికీ, ప్రతి పట్టణానికీ ఒక ఆత్మ కథ వున్నది. యేసుని జననమునకు ముందు ఒక కుగ్రామం వుంది. అది చాలా స్వల్పమైన గ్రామం కాబట్టి దానికి ఎలాంటి విలువా లేదు. అదే బెత్లెహేము. అలాంటి బెత్లేహేమును దేవాదిదేవుడు ఏర్పరచుకున్నాడు. అందులోనుండే యూదుల రాజును ఉదయింపజేసేం

దేవుని గుణాలేవి? దేవుడు ఎలా ఉంటాడు?
మేము ఈప్రశ్నకు సమాధానం జవాబు చెప్పటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, తట్టిన శుభ సమాచారం- దేవుని గురించి తెలుసుకోవడానికి ఎంతో ఉందన్నది. తొలుత దాన్ని యావత్తూ చదివి, తరువాత వెనక్కి తిరిగి వెళ్ళి, ఎన్నుకోబడిన లేఖనాలని, మరింత ఎక్కువ విశదీకరణ కోసం శోధిస్తే, అది సహాయకరమైనదని ఈ విపులీకరణని పరిశీలించేవారు చూస

క్రైస్తవ జీవితంలో పాపంపై విజయం అధిగమించటం ఎలా?
మనము పాపంను అధిగమించే ప్రయత్నాలను బలోపేతము చేయుటకు బైబిలు అనేక రకములైన వనరులను అందిస్తుంది. మనము ఈ జీవితంలో ఎప్పటికి కూడా పాపంపై విజయాన్ని సాధించలేము ( 1 యోహాను 1:8), అయినప్పటికి అది మన గురిగా వుండాలి. దేవుని సహాయముతో ఆయన వాక్యములోని సూత్రాలను అనుసరించటం ద్వారా పాపాన్ని క్రమేణా అధిగమిస్తూ క్రీస్త

దేవుని గుణాలేవి? దేవుడు ఎలా ఉంటాడు?
దేవుని గుణాలేవి? దేవుడు ఎలా ఉంటాడు?. మేము ఈప్రశ్నకు సమాధానం జవాబు చెప్పటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, తట్టిన శుభ సమాచారం- దేవుని గురించి తెలుసుకోవడానికి ఎంతో ఉందన్నది. తొలుత దాన్ని యావత్తూ చదివి, తరువాత వెనక్కి తిరిగి వెళ్ళి, ఎన్నుకోబడిన లేఖనాలని, మరింత ఎక్కువ విశదీకరణ కోసం శోధిస్తే, అది సహాయకరమైన

ఆత్మహత్య పై క్రైస్తవ దృక్పధం ఏంటి? ఆత్మహత్య గురించి బైబిలు ఏమి చెప్తుంది?
ఆత్మహత్య చేసుకున్నటువంటి అబీమెలెకు (న్యాయాధిపతులు 9:54), సౌలు (1 సమూయేలు 31:4), సౌలు ఆయుధములు మోసేవాడు (1 సమూయేలు 31:4-6), అహీతోఫెలు (2 సమూయేలు 17:23),జిమ్రి (1 రాజులు 16:18), మరియు యూదా (మత్తయి 27:5)ఆరుగురు వ్యక్తులను గురించి బైబిలు ప్రస్తావిస్తుంది.వీరిలో ఐదుగురు దుష్టులు, పాపులు (సౌలు ఆయుధములు

ఈ దినాలో కూడ దేవుడు మాట్లాడతాడా?
మనుష్యులకు వినబడగలిగేటట్లు దేవుడు మాట్లడినట్లు బైబిలు అనేక మార్లు పేర్కోంటుంది (నిర్గమకాండం 3:14; యెహోషువ 1:1; న్యాయాధిపతులు 6:18; 1 సమూయేలు 3:11; 2 సమూయేలు 2:1; యోబు 40:1; యెష్షయా 7:3; యిర్మియా 1:7; అపోస్తలుల కార్యములు 8:26; 9:15 – ఇది ఒక చిన్న ఉదాహారణకు మాత్ర మే. ఈ దినాలాలో మనుష్యులకు వినబడగలిగ

కావలెను...కావలెను...
కావలెను...కావలెను... సమూయేలు వంటి దేవుని సన్నిధిలో గడిపే బాలుడు యోసేపు వంటి తన పవిత్రతను కాపాడుకొనిన దేవుని భయము గలిగిన యోవ్వనుడు దావీదు వంటి దేవునికి 7సార్లు ప్రార్ధించే మధ్య వయస్కుడు అబ్రాహాము వంటి దేవునికి స్నేహితుడైన వృద్ధుడు కావలెను...కావలెను... కాని ఎక్కడ

ఇశ్రాయేలీయుల పతనానికి కారణాలు
(కీర్తనలు 78, 106 అధ్యాయాలు) 1 ) దేవుని శక్తిని గ్రహించక పోవటం (78:19,20) (106:7) 2 ) దేవుని యందు విశ్వాసముంచకపోవడం (78:19,20) (106:7) 3 ) చేసిన మేలులు మరచిపోవడం (78:42,43) (106:13) 4 ) బహుగా ఆశించుట - దేవుని శోధించుట (78:18) (106:14)

Telugu Bible Quiz
Bible Quiz 1. ఏ రాజు మృతినొందిన సంవత్సరమున యెషయా కు పరలోక దర్శనము కలిగెను ?2. సొలొమోను ఎవరికంటే జ్ఞానవంతుడై ఉండెను ?3. హిజ్కియాకు ఎన్ని సంవత్సరములు ఆయుష్షును యెహోవాపెంచెను?4. సత్యమును ఎదురించువారు ఎవరు ?5. దిగంబరియై జోడు లేక నడచిన వారు ఎవరు ?6. ఏ కళ్లము నొద్ద

సమూయేలు రెండవ గ్రంథము
 సౌలుకు భయపడి మొదట యూదాలో, తరువాత ఫిలిప్తీయుల దేశములో దాగుకొని జీవించిన దావీదు, సౌలు మరణము తరువాత దేవుని ఆలోచన చొప్పున యూదాకు, తదుపరి ఇశ్రాయేలు దేశమంతటికి రాజై పరిపాలన చేసిన చరిత్రే సమూయేలు రెండవ పుస్తకము. దావీదు జీవిత చరిత్ర 1 రాజుల గ్రంథము మొదటి రెండు అధ్యాయముల వరకు కనబడినప్పటికీ, దావీదు య

దినవృత్తాంతములు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము మొదలుకొని రాజులు రెండవ గ్రంథము వరకు చెప్పబడిన యూదా చరిత్ర యొక్క పలు కోణముల మరులిఖితమైయున్నది. అయినను ఇది మరొకసారిచెప్పుట కాదు. ఇశ్రాయేలు చరిత్రకు దేవుడు ఇచ్చిన ఒక వివరణ అని దీనిని చెప్పవచ్చు. రెండవ సమూయేలు, మొదటి, రెండవ రాజులు ఇశ్రాయేలీయుల సంపూర్ణ రాజకీయ చరిత్రగా కనబడుచుండగా

న్యాయాధిపతులు
యెహోషువ పుస్తకములో తేటగా చెప్పబడిన ఇశ్రాయేలీయుల పరిస్థితికి భిన్నమైన పరిస్థితిని చెప్పే పుస్తకమే ఈ “న్యాయాధిపతులు". లోబడె గుణము కల్గిన ఒక సమూహము దేవుని శక్తిని ఆనుకొని కనానును జయించుట మనము యెహోషువలో చూస్తున్నాము. న్యాయాధిపతులలో లోబడని, విగ్రహారాధన చేయు ప్రజలు దేవునికి వ్యతిరేకముగా నిలుచుట వ

రూతు
న్యాయాధిపతుల యొక్క అంధకార యుగములో కల్తీలేని ప్రేమతో, నిష్కపట భక్తికి వర్ణకాంతులు విరజిమ్ముచున్న ఒక ఆదర్శ స్త్రీ చరిత్ర రూతు గ్రంథము. ఇశ్రాయేలు ప్రజలను, ఇశ్రాయేలు దేవుని ప్రేమించడానికి తన స్వజాతితో ఉన్న సంబంధములను, ఆచారములను త్రోసివేసి బెత్లెహేముకు వచ్చిన ఒక మోయాబు స్త్రీయే ఈ పుస్తకము యొక్క కథానాయ

తెగువగల తలంపులు - Brave Thoughts
తెగువగల తలంపులు: 1 సమూయేలు 17:45 - "సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను". పరిశుద్ధగ్రంథములో బలిష్టమైన గొలియాతునకు ఎదురు వెళ్ళిన లేతైన దావీదును మనము చూస్తాము. అందరూ దావీదునకు అంత శక్తి ఉందా అని చూసారుకానీ దావీదు సర్వోన్నతుడైన దేవునివైపు చూచాడు. మనలో కూడా చాలామంది శ్

Day 21 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ఈ విషయాలేవీ నన్ను కదిలించవు (అపొ.కా. 20:24, స్వేచానువాదం). సమూయేలు గ్రంథంలో చదువుతాము - హెబ్రోనులో దావీదును అభిషేకించగానే ఫిలిష్తీయులంతా దావీదు మీదపడి దాడి చెయ్యడానికి వెదుక్కుంటూ వచ్చారు. ప్రభువు దగ్గరనుండి యోగ్యమైనది ఏదన్నా పొందామంటే వెంటనే సైతాను మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాడు.

సమూయేలు మొదటి గ్రంథము
ఇశ్రాయేలీయులులో దీర్ఘకాలము న్యాయాధిపతుల ద్వారా పరిపాలన చేసిన రాజ్యము తన స్థలమును ఖాళీ చేసి ఇచ్చే కాల మార్పునే ఈ మొదటి సమూయేలు పుస్తకము చెప్పుచున్నది. ఇశ్రాయేలీయుల రాజ్యమును గురించి చెప్పు ఆరు పుస్తకములు ఈ పుస్తకము నుండి ప్రారంభమగుచున్నవి. వీటి యొక్క విషయ సూచికలను చూద్దాము. 1 సమూయేలు - మను

ఒక చిన్న బిడ్డ
ఒక చిన్న బిడ్డ తన తల్లి స్వరాన్ని అతి తేలికగా గుర్తిస్తాడు. అలాగే తల్లి కూడా తన బిడ్డ స్వరాన్ని తెలుసుకుంటుంది. బిడ్డ; గర్భములోనే తన తల్లి స్వరాన్ని వినడం మొదలుపెట్టి, పొత్తిళ్ళలో పాడే పాటలు, ఒడిలో చెప్పే కబుర్లతో పెరిగి పెదై ఎంత సమూహంలో ఉన్నా గుర్తించగలుగుతాడు. తల్లి పరిచయం చేయడం

దేవుడిచ్చే స్నేహితులు
దేవుడిచ్చే స్నేహితులు మనలో ప్రతి ఒక్కరికి కనీసం ఒక్కరైనా మంచి స్నేహితులు గా ఉండేవారు ఖచ్చితంగా ఉంటారు. వారితో మనం అన్ని సంగతులను పంచుకుంటాం. ఈ వ్యక్తీ నా మంచి స్నేహితుడు; అని మనం అనుకుంటే, మన జీవితంలోని రహస్యాలను, భావాలను, అనుభవాలను మాట్లాడుకుంటూ ఉంటాము. ఏ సందర్భంలోనైనా తప్పును తప్పుగా చె

దేవుడు నిన్ను పిలుస్తున్నాడు
దేవుడు నిన్ను పిలుస్తున్నాడుAudio: https://youtu.be/bSxYQRPGNCs ఒక చిన్న బిడ్డ తన తల్లి స్వరాన్ని అతి తేలికగా గుర్తిస్తాడు. అలాగే తల్లి కూడా తన బిడ్డ స్వరాన్ని తెలుసుకుంటుంది. బిడ్డ; గర్భములోనే తన తల్లి స్వరాన్ని వినడం మొదలుపెట్టి, పొ

నాకు ఆధారమైనవాడు బలవంతుడు
నాకు ఆధారమైనవాడు బలవంతుడు Audio: https://youtu.be/FoiPHEm7TNE యెషయా 40:29 సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. ఎంత సంపాదించిన, ఎందరు ఉన్నా బలం లేకపోతే ఆనందించలేము.

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 27వ అనుభవం
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 27వ అనుభవం: మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా? అతడు ప్రార్థనచేయవలెను. యాకోబు 5:13 ప్రార్ధనా వీరుడైన మిషనరీ - హడ్సన్ టైలర్. ప్రార్ధనలో గొప్పతనాన్ని ప్రజలకు పరిచయం చేస్తూ "క్రీస్తు సిలువ శ్రమలను వేదనలను అనుభవించుటకు భయపడక ఆయన సేవ చేయుటకు ఎడతెగక ప్రార్ధిస్తూ,

పరిమళ వాసన
పోయిన సంపద తిరిగి వచ్చాక యోబు భక్తునికి కలిగినరెండవ కుమార్తె “కేజియా”. ఈ పేరునకు అర్ధం “పరిమళ వాసన”. ఈమె అక్కపేరు “యొమీయా” చెల్లి పేరు “కెరంహప్పుకు” వీరు చాలా అందగత్తెలని బైబిల్ గ్రంథంలో వ్రాయబడియున్నది. ఆ దేశమందంతటను అనగా ఊజు దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. (యోబు 42:15)<

భయపడకుడి | Do not be afraid
భయపడకుడి1 సమూయేలు 12:20 అంతట సమూయేలు జనులతో ఇట్లనెను భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయి నను యెహోవాను విసర్జింపకుండ ఆయనను అనుసరించుచు పూర్ణహృదయముతో ఆయనను సేవించుడి.ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి తమ రాజుగా తిరస్కరించి, బదులుగా తమకొక మానవ

నేను దాసుడను కాను
నేను దాసుడను కానుదేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; ఆది 1:27రెండవ సమూయేలు 9వ అధ్యాయం మెఫీబోషెతు ను గూర్చి వ్రాయబడింది. మెఫీబోషెతు అంటే సిగ్గుకరము లేదా నాశనకరమైన అవమానము అని అర్ధం. రాజైన సౌలు మనవడును యోనాతాను కుమారుడును యవనస్తుడైన ఈ మెఫీ

దేవుని ఉన్నతమైన పిలుపు మన జీవితాలకు విజయభేరి
దేవుని ఉన్నతమైన పిలుపు మన జీవితాలకు విజయభేరిఒక చిన్న బిడ్డ తన తల్లి స్వరాన్ని అతి తేలికగా గుర్తిస్తాడు. అలాగే  తల్లి కూడా తన బిడ్డ స్వరాన్ని తెలుసుకుంటుంది. బిడ్డ; గర్భములోనే తన తల్లి స్వరాన్ని వినడం మొదలుపెట్టి, పొత్తిళ్ళలో పాడే పాటలు, ఒడిలో చెప్పే కబుర్లతో పెర

భయపడకుడి
భయపడకుడి1 సమూయేలు 12:20 అంతట సమూయేలు జనులతో ఇట్లనెను భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయి నను యెహోవాను విసర్జింపకుండ ఆయనను అనుసరించుచు పూర్ణహృదయముతో ఆయనను సేవించుడి.ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి తమ రాజుగా తిరస్కరించి, బదులుగా తమకొక మానవ

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , యేసు , శ్రమ , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , మరియ , గిద్యోను , యాకోబు , బిలాము , కోరహు , అహరోను , ఆత్మ , అబ్రాహాము , మిర్యాము , అక్సా , సెల , అగ్ని , ప్రేమ , యెరూషలేము , సౌలు , సాతాను , హనోకు , పౌలు , ప్రార్థన , దేవ�%B , ఇశ్రాయేలు , రాహాబు , సొలొమోను , రాహేలు , యూదా , యాషారు , సీయోను , బబులోను , లోతు , స్వస్థ , ఇస్కరియోతు , జక్కయ్య , సారెపతు , సమరయ , ఇస్సాకు , అన్న , యెహోషాపాతు , ఐగుప్తు , అతల్యా , నోవహు , యోకెబెదు , ఏశావు , లేవీయులు , కోరెషు , ఆకాను , గిలాదు , ప్రార్ధన , కెజీయా , తెగులు , ఎలియాజరు , యోబు , అబ్దెయేలు , రోగము , గిల్గాలు , బేతేలు , మగ్దలేనే మరియ , వృషణాలు , అకుల , కూషు , ఏలీయా , తీతు , ఆషేరు , కనాను , మార్త , దొర్కా , సీమోను , రక్షణ , ఆసా , సబ్బు , బెసలేలు , బేతనియ , యెహోవా వశము , ఎఫ్రాయిము , యొర్దాను , ఏఫోదు , పరదైసు , కయీను , ఎలీషా , హాము , తామారు , హిజ్కియా , అంతియొకయ , ఊజు , రూతు , ఈకాబోదు , బర్జిల్లయి ,

Telugu Keyboard help