Bible Results

"కాడి" found in 17 books or 51 verses

ఆదికాండము (1)

27:40 నీవు నీకత్తిచేత బ్రదుకుదువు నీ సహోదరునికి దాసుడవగుదువు నీవు తిరుగులాడు చుండగా నీ మెడ మీదనుండి అతని కాడి విరిచివేయుదువు అని అతని కుత్తరమిచ్చెను.

లేవీయకాండము (1)

26:13 మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండ వారి దేశములోనుండి మిమ్మును రప్పించితిని; నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవచేసితిని.

సంఖ్యాకాండము (1)

19:2 యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి యేదనగా, ఇశ్రాయేలీయులు కళంకములేనిదియు మచ్చ లేనిదియు ఎప్పుడును కాడి మోయనిదియునైన యెఱ్ఱని పెయ్యను నీయొద్దకు తీసికొని రావలెనని వారితో చెప్పుము.

ద్వితీయోపదేశకాండము (2)

21:3 ఏ ఊరు ఆ శవమునకు సమీపముగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక కాడి యీడ్వని పెయ్యను తీసికొని
28:48 గనుక ఆకలి దప్పులతోను వస్త్ర హీనతతోను అన్ని లోపములతోను యెహోవా నీమీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. వారు నిన్ను నశింపజేయువరకు నీ మెడమీద ఇనుపకాడి యుంచుదురు.

1 సమూయేలు (3)

6:7 కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి, కాడిమోయని పాడి ఆవులను రెంటిని తోలితెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గరనుండి యింటికి తోలి
11:7 ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీయుల దేశములోని నలుదిక్కులకు దూతలచేత వాటిని పంపిసౌలుతోను సమూయేలుతోను చేరకుండువాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానము చేసెను. అందువలన యెహోవా భయము జనులమీదికి వచ్చెను గనుక యొకడైనను నిలువకుండ వారందరు వచ్చిరి.
14:14 యోనాతానును అతని ఆయు ధములు మోయు వాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపుగా ఇరువదిమంది పడిరి; ఒక దినమున ఒక కాడి యెడ్లు దున్ను అరయెకరము నేల పొడుగున అది జరిగెను.

1 రాజులు (6)

12:4 నీ తండ్రి బరువైన కాడిని మామీద ఉంచెను; నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మామీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసినయెడల మేము నీకు సేవచేయుదుము.
12:9 మామీద నీ తండ్రి యుంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకొనిన యీ జనులకు ప్రత్యుత్తరమిచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు?
12:10 అప్పుడు అతనితో కూడ ఎదిగిన ఆ ¸యౌవనస్థులు ఈ ఆలోచన చెప్పిరినీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను గాని నీవు దానిని చులకనగా చేయవలెనని నీతో చెప్పుకొనిన యీ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇమ్మునా తండ్రి నడుముకంటె నా చిటికెన వ్రేలు పెద్దదిగా ఉండును.
12:11 నా తండ్రి మీమీద బరువైన కాడిని పెట్టెను సరే, నేను ఆ కాడిని ఇంక బరువుగా చేయుదును; నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెనుసరే, నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును.
12:14 నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెను గాని నేను మీ కాడిని మరి బరువుగా చేయుదును, నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెను గాని నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును.
19:21 అందు కతడు అతనిని విడిచి వెళ్లి కాడి యెడ్లను తీసి, వధించి వాటిమాంసమును గొర్తినొగల చేత వంటచేసి జనులకు వడ్డిం చెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలీయా వెంబడి వెళ్లి అతనికి ఉపచారము చేయుచుండెను.

2 దినవృత్తాంతములు (6)

10:3 యరొబామును ఇశ్రాయేలువారందరును కూడి వచ్చి నీ తండ్రి మా కాడిని బరువుచేసెను;
10:4 నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మామీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులుకన చేసినయెడల మేము నిన్ను సేవింతు మని రెహబాముతో మనవిచేయగా
10:9 నీ తండ్రి మామీద ఉంచిన కాడిని చులుకన చేయుమని నన్నడిగిన యీ జనులకు ప్రత్యుత్తరమేమి ఇయ్యవలెనని మీరు యోచింతురో చెప్పుడని వారినడుగగా
10:10 అతనితో కూడ పెరిగిన యీ ¸యౌవనస్థులు అతనితో ఇట్లనిరినీ తండ్రి మా కాడిని బరువుచేసెను, నీవు దానిని చులుకన చేయుమని నీతో పలికిన యీ జనులతో నీవు చెప్పవలసినదేమనగానా చిటికెన వ్రేలు నా తండ్రియొక్క నడుముకంటె బరువుగా ఉండును;
10:11 నా తండ్రి బరువైన కాడి మీమీద మోపెను గాని నేను మీ కాడిని మరింత బరువు చేయుదును; నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెను గాని నేను కొరడాలతో మిమ్మును దండించెదనని చెప్పుము.
10:14 వారికి కఠినమైన ప్రత్యుత్తరమిచ్చెను; ఎట్లనగానా తండ్రి మీ కాడిని బరువుచేసెను, నేను దానిని మరింత బరువు చేయుదును; నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెను, నేను మిమ్మును కొరడా లతో దండించెదనని చెప్పెను.

యెషయా (5)

9:4 మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచియున్నావు వాని మెడను కట్టుకఱ్ఱను వాని తోలువాని కొరడాలను విరిచియున్నావు.
10:27 ఆ దినమున నీ భుజముమీదనుండి అతని బరువు తీసి వేయబడును. నీ మెడమీదనుండి అతని కాడి కొట్టివేయబడును నీవు బలిసినందున ఆ కాడి విరుగగొట్టబడును.
14:25 నా దేశములో అష్షూరును సంహరించెదను నా పర్వతములమీద వాని నలుగద్రొక్కెదను వాని కాడి నా జనులమీదనుండి తొలగిపోవును వాని భారము వారి భుజముమీదనుండి తొలగింప బడును.
47:6 నా జనులమీద కోపపడి నా స్వాస్థ్యము నపవిత్ర పరచి వారిని నీ చేతికి అప్పగించితిని నీవు వారియందు కనికరపడక వృద్దులమీద నీ కాడి మ్రానును మిక్కిలి బరువుగా మోపితివి.
58:6 దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము గదా?

యిర్మియా (15)

2:20 పూర్వ కాలమునుండి నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకములను తెంపివేసితినినేను సేవచేయనని చెప్పుచున్నావు; ఎత్తయిన ప్రతి కొండమీదను పచ్చని ప్రతి చెట్టుక్రిందను వేశ్యవలె క్రీడించుచున్నావు.
5:5 ఘనులైనవారియొద్దకు పోయెదను వారితో మాటలాడెదను, వారు యెహోవా మార్గమును, తమ దేవుని న్యాయవిధిని ఎరిగినవారై యుందురుగదా అని నేననుకొంటిని. అయితే ఒకడును తప్పకుండ వారు కాడిని విరిచినవారుగాను కట్లను తెంపు కొనినవారుగాను ఉన్నారు.
27:2 యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము.
27:8 ఏ జనము ఏ రాజ్యము బబులోనురాజైన నెబుకద్రెజరు నకు దాస్యము చేయనొల్లక బబులోనురాజుయొక్క కాడిని తన మెడమీద పెట్టుకొనదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనముచేయించు వరకు ఆ జనమును ఖడ్గముచేతను క్షామము చేతను తెగులుచేతను శిక్షించెదను; ఇదే యెహోవా వాక్కు.
27:11 అయితే ఏ జనులు బబులోనురాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశములో కాపురముండ నిచ్చెదను. వారు తమ భూమిని సేద్య పరచుకొందురు, నేను వారికి నెమ్మది కలుగజేతును; ఇదే యెహోవా వాక్కు.
27:12 నేను ఆ మాటలనుబట్టి యూదారాజైన సిద్కియాతో ఇట్లంటిని బబులోనురాజుయొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొని, అతనికిని అతని జనులకును దాసులైన యెడల మీరు బ్రదుకుదురు
28:2 ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను బబులోనురాజు కాడిని విరిచియున్నాను.
28:4 బబులోను రాజు కాడిని విరుగగొట్టి యెహోయాకీము కుమారుడును యూదారాజునైన యెకోన్యాను, బబులోనునకు చెరగొని పోయిన యూదులనందిరిని, యీ స్థలమునకు తిరిగి రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు.
28:10 ప్రవక్తయైన హనన్యా ప్రవక్తయైన యిర్మీయా మెడ మీదనుండి ఆ కాడిని తీసి దాని విరిచి
28:11 ప్రజలందరి యెదుట ఇట్లనెను యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు రెండు సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్రెజరు కాడిని సర్వజనముల మెడమీద నుండి తొలగించి దాని విరిచివేసెదను; అంతట ప్రవక్తయైన యిర్మీయా వెళ్లిపోయెను.
28:12 ప్రవక్తయైన హనన్యా ప్రవక్తయైన యిర్మీయా మెడ మీదనున్న కాడిని విరిచిన తరువాత యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
28:13 నీవు పోయి హనన్యాతో ఇట్లనుము యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీవు కొయ్యకాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనుపకాడిని చేయించవలెను.
28:14 ఇశ్రా యేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ జనులందరును బబులోను రాజైన నెబుకద్రెజరునకు దాసులు కావలెనని వారి మెడమీద ఇనుపకాడి యుంచితిని గనుక వారు అతనికి దాసులగుదురు, భూజంతువులను కూడ నేను అతనికి అప్పగించియున్నాను.
30:8 సెన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు నీకున్న కాడి నీ మెడనుండకుండ ఆ దినమున నేను దాని విరిచి నీ కట్లను తెంపెదను; ఇకను అన్యులు యాకోబు సంతతివారిచేత దాస్యము చేయించుకొనరు గాని
31:18 నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటుకాని కోడె దెబ్బలకు లోబడునట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను, నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన యెడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను.

విలాపవాక్యములు (2)

1:14 కాడి కట్టినట్లుగా తానే నా యపరాధములను నాకు కట్టియున్నాడు అవి పైన వేయబడినవై నా మెడమీదికెక్కెను నా బలమును ఆయన బలహీనతగా చేసియున్నాడు ప్రభువు శత్రువులచేతికి నన్ను అప్పగించియున్నాడు నేను వారియెదుట లేవలేకపోతిని.
3:27 యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు.

యెహెఙ్కేలు (1)

34:27 ఫలవృక్ష ములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు, నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసినవారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానైయున్నానని వారు తెలిసికొందురు.

హోషేయ (2)

10:11 ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసముగలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలె ఉన్నది; అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును; ఎఫ్రాయిముచేత దున్నిం చుటకు నేనొకని నియమింతును, యూదా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసికొనును.
11:4 ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి అకర్షించితిని; ఒకడు పశువులమీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి యెదుట భోజనము పెట్టితిని

నహూము (1)

1:13 వారి కాడిమ్రాను నీమీద ఇక మోపకుండ నేను దాని విరుగగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును.

మత్తయి (2)

11:29 నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
11:30 ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.

అపో. కార్యములు (1)

15:10 గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడమీద పెట్టి మీ రెందుకు దేవుని శోధించుచున్నారు?

గలతియులకు (1)

5:1 ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కు కొనకుడి.

1 తిమోతికి (1)

6:1 దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడ కుండునట్లు దాసత్వమను కాడిక్రింద ఉన్నవారందరును, తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని యెంచ వలెను.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
"కాడి" found in 13 lyrics.

ఎంత పెద్ద పోరాటమో - Entha Pedda Poraatamo

ఎందుకో నన్ను నీవు ఎన్నుకున్నావు

ఏగెదను నే చేరెదను - Egedanu Ne Cheredanu

కొడవలిని చేత పట్టి కోత కోయుము - Kodavalini Chetha Patti Kotha Koyumu

నాకెన్నో మేలులు చేసితివే - Naakenno Melulu Chesithive

నిన్ను వెంబడించెద - Ninnu Vembadincheda

పాడనా మౌనముగానే స్తుతి కీర్తన - Paadanaa Mounamugaane Sthuthi Keerthana

యవ్వన క్రైస్తవ జనమా - క్రీస్తుని ప్రేమను గనుమా

యేసయ్య పాదాలు బంగారు పాదాలు - Yesayya Paadaalu Bangaaru Paadaalu

యేసయ్య రక్తము అతి మధురము - Yesayya Rakthamu Athi Madhuramu

యేసు దేవా నను కొనిపోవా - Yesu Devaa Nanu Konipovaa

వాడుకో… యేసయ్యా…. - Vaaduko…. Yesayyaa…

సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం - Sajeeva Saakshulugaa Mammu Nilipna Devaa Vandanam

Sermons and Devotions

Back to Top
"కాడి" found in 9 contents.

నూతన సంవత్సరం
“...యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము...” హబక్కుకు 3:2. ప్రవక్త అయిన హబక్కుకు దేవునికి చేసిన ఈ శ్రేష్టమైన ప్రార్ధన ప్రతి విశ్వాసి నూతన సంవత్సర ఆరంభంలో మొట్టమొదటిగా చేయవలసిన ప్రార్ధన. డిసంబరు 31వ తా||న మధ్యరాత్రివేళ పాత సంవత్సరపు చివరి ఘడియలలోను, నూతన సంవత

జీవితానికి అర్థం ఏమిటి?
జీవితానికి ఉన్న అర్థం ఏమిటి? నేను జీవితంలో ఉద్దేశ్యాన్ని, నేరవేర్పుని మరియ సంతోషాన్ని ఎలా పొందగలను? శాస్వతమయిన ప్రాముఖ్యతని పొందే సామర్థ్యత నాకు ఉంటుందా? ఈ ముఖ్యమైన ప్రశ్నలని పరగణించడానికి అధికమంది ఎప్పుడూ ఆగలేదు. సంవత్సరాల పిమ్మట, వారు నెరవేర్చాలకున్నది వారు సాధించినప్పటికీ కూడా, వారు వెనక్కి చూ

Day 33 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు; నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబులపొదిలో మూసి పెట్టియున్నాడు (యెషయా 49:2). "నీడలో" ఎంత మంచి మాట ఇది! మనమందరం నీడలోకి ఏదో ఒక సమయంలో వెళ్ళాలి. ఎండ కళ్ళను మిరుమిట్లు గొలుపుతుంది. కళ్ళు దెబ్బ తింటాయి. ప్రకృతి వర్ణాలను, వివిధ రంగుల్ని గుర్తుపట్టే శక్తిన

నేర్చుకొనే తలంపులు - Learning Thoughts
నేర్చుకొనే తలంపులు: మత్తయి 11:29 - "మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి". దేవుడు మనకొఱకు ఒక రక్షకుని ఈ లోకమునకు పంపించెను. మనకు అన్నీ తానైయుండి మనమేదడిగినా మనకెన్నడూ లేదని చెప్పేవాడు కాడు కదా. కానీ ఆయన మనుష్యులను వారి ఇష్టము చొప్పున జరిగించువాడు కాడు గానీ ఆయన వద్దు అన్న సందర్భా

Day 103 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
అక్కడ యెహోవా హస్తము నామీదికి వచ్చి - నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము, అక్కడ నేను నీతో మాటలాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను (యెహెజ్కేలు 3:22). ప్రత్యేకంగా కొంతకాలం ఎదురుచూస్తూ గడపవలసిన అవసరం రానివాళ్ళెవరూ దేవుని కోసం గొప్ప పనులు చేసినట్టు మనం చూడం. మొదట్లో తప్పనిసరిగా అలాటి వాళ్ళు అనుకున్నవన్నీ

Day 14 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
అతడు తన సొంత గొర్రెలనన్నిటిని వెలుపలికి నడిపించును (యోహాను 10: 4). ఆయన ఈ పని చాలా అయిష్టంగా చేస్తున్నాడనుకుంటాను, ఆయన గొర్రెలమైన మనకీ ఇది కష్టాలు తెచ్చి పెట్టే విషయమే. కాని ఇది జరగక తప్పదు. మనం నిజంగా వర్థిల్లాలంటే సంతోషంగా, సౌకర్యంగా గొర్రెలదొడ్డిలోనే ఎప్పుడూ ఉండపోవడం తగదు. దొడ్డి ఖాళీ

Day 308 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నేను కెబారు నదీప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని; ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవునిగూర్చిన దర్శనములు నాకు కలిగెను.. అక్కడనే యెహోవా హస్తము అతనిమీదికి వచ్చెను (యెహెజ్కేలు 1:1,3). మనకు దేవుని వాక్యాన్ని చెరసాల వివరించినంత స్పష్టంగా మరేదీ వివరించలేదు. మనం బబులోను నదుల ఒడ్డున కూర్చుని ఉన

క్రైస్తవ్యం మతమా? నాకొద్దు!!
క్రైస్తవ్యం మతమా? నాకొద్దు!! Audio: https://youtu.be/ygH7P4dZ3nU క్రైస్తవ విశ్వాసం అంటే మతం కాదు మార్గం - అని అనేక సార్లు బోధించాను. ఈ మాట వాస్తవమే అయినప్పటికీ, మన చుట్టూ ఉన్నవారికి వివరించాలంటే చాలా కష్టం. ఫలానా వ్యక్తి, క్రైస్తవ మత

క్రైస్తవ్యం మతమా? నాకొద్దు!!
క్రైస్తవ్యం మతమా? నాకొద్దు!!క్రైస్తవ విశ్వాసం అంటే మతం కాదు మార్గం - అని అనేక సార్లు బోధించాను. ఈ మాట వాస్తవమే అయినప్పటికీ, మన చుట్టూ ఉన్నవారికి వివరించాలంటే చాలా కష్టం. ఫలానా వ్యక్తి, క్రైస్తవ మతంలో దిగాడంటా, ఆమె క్రైస్తవ మతం పుచ్చుకుందంటా అనే మాటలు మనం ఎప్పుడు వినే

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , యేసు , శ్రమ , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , మరియ , యాకోబు , గిద్యోను , బిలాము , కోరహు , అహరోను , ఆత్మ , అబ్రాహాము , మిర్యాము , అక్సా , సెల , యెరూషలేము , అగ్ని , ప్రేమ , సౌలు , సాతాను , హనోకు , ప్రార్థన , పౌలు , ఇశ్రాయేలు , దేవ�%B , రాహాబు , సొలొమోను , రాహేలు , యూదా , యాషారు , సీయోను , బబులోను , లోతు , స్వస్థ , ఇస్కరియోతు , జక్కయ్య , సారెపతు , సమరయ , ఇస్సాకు , యెహోషాపాతు , అన్న , ఐగుప్తు , అతల్యా , నోవహు , యోకెబెదు , లేవీయులు , ఏశావు , కోరెషు , ఆకాను , గిలాదు , ప్రార్ధన , కెజీయా , తెగులు , ఎలియాజరు , యోబు , అబ్దెయేలు , రోగము , గిల్గాలు , బేతేలు , మగ్దలేనే మరియ , వృషణాలు , అకుల , కూషు , ఏలీయా , తీతు , ఆషేరు , కనాను , మార్త , ఆసా , దొర్కా , సీమోను , రక్షణ , సబ్బు , బెసలేలు , బేతనియ , యెహోవా వశము , ఎఫ్రాయిము , యొర్దాను , ఏఫోదు , పరదైసు , కయీను , ఎలీషా , హాము , తామారు , హిజ్కియా , అంతియొకయ , ఊజు , రూతు , ఈకాబోదు , బర్జిల్లయి ,

Telugu Keyboard help