Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Rakada Samayamlo | రాకడ సమయంలో – కడబూర శబ్ధంతో


    • రాకడ సమయంలో – కడబూర శబ్ధంతో
    • యేసుని చేరుకునే – విశ్వాసం నీకుందా? (2)
    • రావయ్య యేసయ్య – వేగరావయ్యా
    • రావయ్య యేసునాథా – వేగమెరావయ్యా (2)       ||రాకడ||

    • యేసయ్య రాకడ సమయంలో
    • ఎదురేగె రక్షణ నీకుందా? (2)
    • లోకాశలపై విజయం నీకుందా? (2)       ||రావయ్య||

    • ఇంపైన ధూపవేదికగా
    • ఏకాంత ప్రార్థన నీకుందా? (2)
    • యేసు ఆశించే దీన మనస్సుందా? (2)       ||రావయ్య||

    • దినమంతా దేవుని సన్నధిలో
    • వాక్యం కొరకు ఆకలి నీకుందా? (2)
    • యేసునాథునితో సహవాసం నీకుందా? (2)       ||రావయ్య||

    • శ్రమలోన సహనం నీకుందా?
    • స్తుతియించే నాలుక నీకుందా? (2)
    • ఆత్మలకొరకైన భారం నీకుందా? (2)       ||రావయ్య||

    • నీ పాత రోత జీవితము
    • నీ పాప హృదయం మారిందా? (2)
    • నూతన హృదయంతో ఆరాధన నీకుందా? (2)       ||రావయ్య||

    • అన్నీటికన్నా మిన్నగను
    • కన్నీటి ప్రార్థన నీకుందా? (2)
    • ఎల్లవేళలలో స్తుతియాగం నీకుందా? (2)       ||రావయ్య||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 389 times