Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సందేహమేల సంశయమదేల - Sandehamela Samshayamadela


    • సందేహమేల సంశయమదేల
    • ప్రభు యేసు గాయములను పరికించి చూడు
    • గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు (2)      ||సందేహమేల||

    • ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనే
    • నీ పాప శిక్షను తానే – భరియించెనే (2)
    • ప్రవహించె రక్త ధార నీ కోసమే
    • కడు ఘోర హింసనొందె నీ కోసమే (2)      ||సందేహమేల||

    • ఎందాక యేసుని నీవు – ఎరగనందువు
    • ఎందాక హృదయము బయట – నిలవమందువు (2)
    • యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా
    • యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2)      ||సందేహమేల||

    • ఈ లోక భోగములను – వీడజాలవా
    • సాతాను బంధకమందు – సంతసింతువా (2)
    • యేసయ్య సహనముతోనే చెలగాటమా
    • ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా (2)      ||సందేహమేల||

    • లోకాన ఎవ్వరు నీకై – మరణించరు
    • నీ శిక్షలను భరియింప – సహియించరు (2)
    • నీ తల్లియైన గాని నిన్ను మరచునే
    • ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా (2)      ||సందేహమేల||

    • Sandehamela Samshayamadela
    • Prabhu Yesu Gaayamulanu Parikinchi Choodu
    • Gaayaalalo Nee Vrelu Thaakinchi Choodu (2)       ||Sandehamela||

    • Aa Mulla Makutamu Neekai – Dhariyinchene
    • Nee Paapa Shikshanu Thaane – Bhariyinchene (2)
    • Pravahinche Raktha Dhaara Nee Kosame
    • Kadu Ghora Himsanonde Nee Kosame (2)       ||Sandehamela||

    • Endaaka Yesuni Neevu – Eragananduvu
    • Endaaka Hrudayamu Bayata – Nilavamanduvu (2)
    • Yesayya Prema Neeku Lokuvaayenaa
    • Yesayya Siluva Suvaartha Chulakanaayenaa (2)       ||Sandehamela||

    • Ee Loka Bhogamulanu – Veedajaalavaa
    • Saathaanu Bandhakamandu – Santhasinthuvaa (2)
    • Yesayya Sahanamuthone Chelagaatamaa
    • Eenaadu Rakshana Dinamu Grahiyinchumaa (2)       ||Sandehamela||

    • Lokaana Evvaru Neekai – Maranincharu
    • Nee Shikshalanu Bhariyimpa – Sahiyincharu (2)
    • Nee Thalliyaina Gaani Ninnu Marachune
    • Aa Prema Moorthi Ninnu Maruvajaalunaa (2)       ||Sandehamela||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 7298 times