Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం - Sajeeva Saakshulugaa Mammu Nilipna Devaa Vandanam


    • సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం
    • నీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం
    • ఏమిచ్చి నీ ఋణం తీర్చగలము
    • జిహ్వా ఫలము అర్పింతుము (2)
    • మేమున్నాం నీ చిత్తములో
    • మేమున్నాం నీ సేవలో (2)       ||సజీవ||

    • తల్లి గర్భమునందు – మమ్మును రూపించి
    • శాశ్వత ప్రేమతో మేము నింపి – భువిని సమకూర్చినావు (2)
    • ఎగిసిపడే అలలెన్నో – అణచివేసి జయమిచ్చినావు
    • భీకరమైన తుఫానులోన – నెమ్మదినిచ్చి బ్రతికించావు
    • కృంగిపోము మేమెన్నడు
    • ఓటమి రాదు మాకెన్నడు (2)       ||సజీవ||

    • ఉన్నత పిలుపుకు మము పిలిచిన – నీ దివ్య సంకల్పం
    • నెరవేర్చుము మా పరిశుద్ధ దేవా – మహిమ పూర్ణుడా (2)
    • జడివానలైనా సుడిగాలులైనా – కాడిని మోస్తూ సాగెదం
    • నిందలయినా బాధలైనా – ఆనందముతో పాడెదం
    • కలత చెందము మేమెన్నడు
    • అలసట రాదు మాకెన్నడు (2)       ||సజీవ||

    • Sajeeva Saakshulugaa Mammu Nilipna Devaa Vandanam
    • Nee Chitthamandu Sthiraparachinaavu Yesu Abhivandanam
    • Emichchi Nee Runam Theerchagalamu
    • Jihvaa Phalamu Arpinthumu (2)
    • Memunnaam Nee Chitthamulo
    • Memunnaam Nee Sevalo (2)       ||Sajeeva||

    • Thalli Garbhamunandu – Mammunu Roopinchi
    • Shaashwatha Prematho Mamu Nimpi – Bhuvini Samakoorchinaavu (2)
    • Egisipade Alalenno – Anachivesi Jayamichchinaavu
    • Bheekaramaina Thuphaanulona – Nemmadinichchi Brathikinchaavu
    • Krungipomu Memennadu
    • Otami Raadu Maakennadu (2)       ||Sajeeva||

    • Unnatha Pilupuku Mamu Pilachina – Nee Divya Sankalpam
    • Neraverchumu Maa Parishuddha Devaa – Mahima Poornudaa (2)
    • Jadivaanalainaa Sudigaalulainaa- Kaadini Mosthu Saagedam
    • Nindalainaa Baadhalainaa – Aanandamutho Paadedam
    • Kalatha Chendamu Memennadu
    • Alasata Raadu Maakennadu (2)       ||Sajeeva||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 168 times