Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసు దేవా నను కొనిపోవా - Yesu Devaa Nanu Konipovaa


    • యేసు దేవా నను కొనిపోవా
    • నీ రాజ్యముకై వేచియున్నా (2)
    • శాంతి లేని లోకాన – నీ ప్రేమ కరువయ్యింది
    • శాంతి లేని లోకాన – నీ ప్రేమ కనుమరుగయ్యింది
    • నీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నాను
    • అంత వరకు నీదు శక్తినిమ్మయా
    • నీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నాను
    • అంత వరకు నన్ను నీదు సాక్షిగా నిల్పుము        ||యేసు||

    • ఎటు చూసినా అక్రమమే కనబడుతుంది
    • ఎటు తిరిగినా అన్యాయం ప్రబలి ఉంది (2)
    • నీ ప్రేమతో నను కాచి కాపాడు దేవా
    • నీ రాక వరకు నను నిలబెట్టుము దేవా (2)         ||యేసు||

    • నీ రాజ్యముకై ఈ లోకములో నీ కాడిని మోసెదను
    • నీవు ప్రేమించిన నీ బిడ్డలను నీ మందలో చేర్చెదను (2)
    • నీ ఆత్మ తోడుతో నను బ్రతికించుము
    • నీ ఆత్మ శక్తితో నను బలపరచుము
    • నీ మహిమ రాజ్యమందు నీతో కూడా వసియించుటకు
    • కడ వరకు ఈ భువిలో నమ్మకంగా బ్రతికెదను         ||యేసు||

    • Yesu Devaa Nanu Konipovaa
    • Nee Raajyamukai Vechiyunnaa (2)
    • Shaanthi Leni Lokaana – Nee Prema Karuvayyindi
    • Shaanthi Leni Lokaana – Nee Prema Kanumarugayyindi
    • Nee Raaka Kosame Ne Eduru Choosthunnaanu
    • Antha Varaku Needu Shakthinimmayaa
    • Nee Raaka Kosame Ne Eduru Choosthunnaanu
    • Antha Varaku Nannu Needu Saakshigaa Nilpumu          ||Yesu||

    • Etu Choosinaa Akramame Kanabaduthundi
    • Etu Thiriginaa Anyaayam Prabali Undi (2)
    • Nee Prematho Nanu Kaachi Kaapaadu Devaa
    • Nee Raaka Varaku Nanu Nilabettumu Devaa (2)       ||Yesu||

    • Nee Raajyamukai Ee Lokamulo Nee Kaadini Mosedanu
    • Neevu Preminchina Nee Biddalanu Nee Mandalo Cherchedanu (2)
    • Nee Aathma Thodutho Nanu Brathikinchumu
    • Nee Aathma Shakthitho Nanu Balaparachumu
    • Nee Mahima Raajyamandu Neetho Kooda Vasiyinchutaku
    • Kada Varaku Ee Bhuvilo Nammakamgaa Brathikedanu       ||Yesu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 198 times