Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ప్రభుని గృహము ఆయన మహిమతో - Prabhuni Gruhamu Aayana Mahimatho


    • ప్రభుని గృహము ఆయన మహిమతో
    • పరిపూర్ణముగా నిండెను (2)

    • అపరాధములచే ప్రజలందరును
    • దేవుని మహిమను కోల్పోయిరి (2)
    • తన మహిమను మన కిచ్చుటకు (2)
    • యేసు ప్రభువే బలి యాయెన్ (2)        ||ప్రభుని||

    • కృపా సత్యములు సంపూర్ణముగా
    • మన మధ్యలో వసించెను (2)
    • తండ్రి మహిమను తన సుతునిలో (2)
    • మనమందరము చూచితిమి (2)        ||ప్రభుని||

    • ప్రభువు యింటిని నిర్మించు చుండె
    • సజీవమైన రాళ్ళతో (2)
    • ఆయన మహిమ దానియందుండ (2)
    • తన సంకల్పమై యున్నది (2)        ||ప్రభుని||

    • శాంతిరాజు యిల్లు కట్టుచున్నాడు
    • మానవ హస్తము అందుండదు (2)
    • క్రయమునిచ్చి స్థలముకొనెను (2)
    • తాను కోరిన స్థలమదే (2)        ||ప్రభుని||

    • ప్రత్యేకపరచిన ఆత్మీయ యింటికి
    • తన పునాదిని వేసెను (2)
    • రక్షణ జీవిత సాక్ష్యము ద్వారా (2)
    • ప్రభువే సర్వము చేసెను (2)        ||ప్రభుని||

    • సింహాసనముపై కూర్చున్న ప్రభువే
    • అణగ ద్రొక్కెను శత్రువును (2)
    • సంపూర్ణ జయముతో ఆర్భాటముతో (2)
    • వెలిగించెను తన యింటిని (2)        ||ప్రభుని||

    • దేవుని యిల్లు ముగించబడగా
    • పైనుండి అగ్ని దిగివచ్చున్ (2)
    • దహించబడును సర్వ మలినము (2)
    • ఇంటిని మహిమతో నింపును (2)        ||ప్రభుని||

    • Prabhuni Gruhamu Aayana Mahimatho
    • Paripoornamugaa Nindenu (2)

    • Aparaadhamulache Prajalandarunu
    • Devuni Mahimanu Kolpoyiri (2)
    • Thana Mahimanu Manakichchutaku (2)
    • Yesu Prabhuve Bali Yaayen (2)        ||Prabhuni||

    • Krupaa Sathyamulu Sampoornamugaa
    • Mana Madhyalo Vasinchenu (2)
    • Thandri Mahimanu Thana Suthunilo (2)
    • Manamandaramu Choochithimi (2)        ||Prabhuni||

    • Prabhuvu Intini Nirminchuchunde
    • Sajeevamaina Raallatho (2)
    • Aayana Mahima Daaniyandunda (2)
    • Thana Sankalpamaiyunnadi (2)        ||Prabhuni||

    • Shaanthi Raaju Illu Kattuchunnaadu
    • Maanava Hasthamu Andundadu (2)
    • Krayamunichchi Sthalamu Konenu (2)
    • Thaanu Korina Sthalamide (2)        ||Prabhuni||

    • Prathyekaparachina Aathmeeya Intiki
    • Thana Punaadini Vesenu (2)
    • Rakshana Jeevitha Aakshyamu Dwaaraa (2)
    • Prabhuve Sarvamu Chesenu (2)        ||Prabhuni||

    • Simhaasanamupai Koorchunna Prabhuve
    • Anaga Drokken Shathruvunu (2)
    • Sampoorna Jayamutho Aarbhaatamutho (2)
    • Veliginchenu Thana Intini (2)        ||Prabhuni||

    • Devuni Illu Muginchabadagaa
    • Painundi Agni Digivachchun (2)
    • Dahinchabadunu Sarva Malinamu (2)
    • Intini Mahimatho Nimpunu (2)        ||Prabhuni||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 210 times