Episode 3: విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత - యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గము సమృద్ధిని ఇస్తుంది
Audio: https://youtu.be/crMj39RFsFQ
హెబ్రీ 10:19-23 విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.
విశ్వాస జీవితములో మనం అంచలంచెలుగా ఎదిగి పరిపూర్ణ స్థితికి చేరుకోవాలంటే క్రీస్తు చూపిన మార్గంగుండా ప్రయాణం చేయ్యాలి. నిజమైన విశ్వాసి నిండు కుండలాంటివాడు. తనలో వెల్తి ఏమాత్రం కనిపించదు. మనం చేస్తున్న విశ్వాస ప్రయాణంలో అనేకమైన అవసరతలు, అనేకమైన సమస్యలు ఉంటాయి కాని స్థిరమైన విశ్వాసముగలవారు ఏమి లేకపోయినా నిండుగా, నిబ్బరంగా ఉంటారు. అపో. పౌలు నేను శ్రమలయందు అతిశయించెదనని చెప్పాడు. ప్రవక్తలు, అపోస్తలులు దేవుడు చెప్పిన వాక్యం ప్రకటించినందుకు శ్రమపెట్టబడినను, సేవలో ఆకలిదప్పులు కలిగినను వారు ఆనందముతో సేవ చేసారు.
(యోహాను 16:33) విశ్వాసి శ్రమలో ప్రేమ చూపించి నమ్మకత్వం కాపాడుకోవాలి. ఇది దేవుడు మనకు చూపిన మార్గం. లోకములో మీకు శ్రమ కాని లోకంలో ఉన్న శ్రమను నేను జయించనానని దేవుడు చెప్తున్నాడు. 1 పేతురు 2:20,21 ప్రకారం. క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను. దేవుడు మనలను ప్రత్యేకమైన వారిగా ఉండుటక పిలిచాడు. ఈ పిలుపులో నీవు కొనసాగుతు బాధపడడం కూడ పిలుపులో భాగమే. మనలను పిలిచిన యేసు ప్రభువు ఏ తప్పు చేయలేదు కాని అందరికంటే ఎక్కువ బాధలనుభవించాడు.
నా సేవా జీవితంలో కూడా నేను చేయని వాటిని, నా ద్వారా జరగనివాటిని నేను చేసానని ముద్ర వేయించుకున్నాను. దీని వలన నేను బాధపడలేదు కాని వారిపైన జాలి కలిగింది. దేవుడు నన్ను వాడుకుంటు సేవలో నన్ను హెచ్చించినప్పుడు వీరి పరిస్థితి ఎలా ఉంటుంది? మనుష్యులు చూడకుండా విన్న వాటిని ఎందుకు, ఏమిటని ఆలోచించకుండా తీర్పు తీరుస్తారు. కాని సత్యం ఎప్పుడు దాగదు హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు అన్నిటిని వెలుగులోనికి తీసుకొచ్చినప్పుడు ఎవరి క్రియల ఫలం వారికి సంపూర్ణముగా ఇవ్వబడుతుంది.
ప్రకటన 2:10 ప్రకారం విశ్వాస ప్రయాణంలో శ్రమలుంటాయి, లేమి ఉంటుంది కాని క్రీస్తు నడిచిన మార్గంలో, మనకు మాదిరిగ ఉంచిన మార్గంలో నడచుటవలన సమృద్ధి కలిగి జీవిస్తాము.